Read The shadow is true - 38 by LRKS.Srinivasa Rao in Telugu Fiction Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

నీడ నిజం - 38

తను అజయ్ వస్తాడని ఎదురు చూస్తున్నాడు . వచ్చింది అతడి భార్య రూపాదేవి !

కారణం ఏమిటో సాగర్ కు అర్థం కాలేదు .

“ నమస్తే ! నేను రూపాదేవి---అజయ్ సింహ్ భార్యను . “ . స్వచ్చమైన ఆంగ్లం . అంతకన్నా స్వచ్చమైన చిరునవ్వు . రూపాదేవి చేతులు జోడించింది . ఆమె లో రూపం, స్వరం, వినయం, వందనం పోటీ పడుతున్నాయి .

సాగర్ మర్యాదగా కూర్చోమన్నాడు . కూర్చుంది . “ విద్యాధర బాగున్నారా ? ఆమె ఆరోగ్యం ఇప్పుడు బాగుంది కదా ?” ఆమె ప్రశ్న కు సాగర్ సమాధానం చెప్పాడు .

“ మీరు మా గ్రామం వచ్చినప్పుడు మేము లేము . పిల్లల్ని చూడటానికి జైపూర్ వెళ్లాం “

“ ఇట్సాల్ రైట్ .”

అర నిమిషం నిశ్శబ్దం . సంభాషణ ఎలా పొడిగించాలో ఎవరకీ అర్థం కాలేదు .

“ విద్యాధరి గారిని పిలుస్తారా ? “ ముందు తనే ప్రారంభించింది . “ సారీ ! ఆమె అమ్మ గారింటికి వెళ్ళింది .”

“ అయితే ఆమెను చూసే అదృష్టం లేదన్న మాట . “ నవ్వుతూ అం ది

“ మీరు ఆమెను ఎందుకు చూడాలనుకుంటు న్నారు .? ఆమె తో ఏం మాట్లాడాలి ? “ నాన్చకుండా సూటిగా అడిగాడు .

ఆమె ఇలాంటి పరిస్థతి ముందే ఊహించింది . ఇందుకు సిద్ధం గా ఉంది .

“ మీకు పాతికేళ్ళ క్రితం జరిగిన సంఘటనలన్నీ తెలుసనుకుంటాను .” తలవంచుకొని మెల్లగా అడిగింది .

“ తెలుసు. తను పూర్వజన్మ లో కోమలా దేవి అని తెలిశాక విద్యా ఆనాటి సంఘటనలు వివరం గా చెప్పింది . చెప్పిన తర్వాతే ఆమె సమస్య నుండి బయట పడింది . ఇప్పుడు ప్రశాంతం గా ఉంది .”

“ మాకూ కావాల్సింది అదే . ఇప్పుడు మిమ్మలిని కలిసింది నా భర్త తరపున క్షమాపణ చెప్పుకోవటానికి . తను చేసింది క్షమించరాని తప్పు . భగవంతుడు ఎలాగూ క్షమించడు . కనీసం కోమలాదేవి క్షమిస్తే కొంతలో కొంత మనశ్శాంతి . !” వచ్చిన కారణం ఎలాగో బయట పెట్ట గలిగింది .

“ ఇప్పుడా విషయాలు ఎందుకు లెండి ! అయినా కోమలా దేవి , విద్యా ఒకరు కారుగా ? విద్యా ( ఆమె ) మెంటల్ కమోషన్ కు కారణం తెలుసుకోవటానికి సైకియాట్రిస్ట్ సలహా తో మీ ఊరికి వచ్చాము . అక్కడికి రాగానే విద్యాకు అన్నీ గుర్తుకొచ్చాయి . చిక్కుముడి విడిపోయింది . Now she is very happy . మాకు కావాల్సింది ఇదే . కోమలాదేవి తో ఆమెకు సంబంధించిన వ్యక్తులతో మాకు ఎలాంటి concern లేదు . ..”

ఆమె అవునన లేదు , కాదనలేదు . మౌనం గా ఉండి పోయింది .

“ మీ భయం నాకు అర్థమైంది . బయట జరిగే హడావుడి చూసి మేము వెలుగు లోకి వస్తామని , మీ పరువు పోతుందని ఆలోచిస్తున్నారు . “

అవునన్నట్లు తల ఊపింది . ఆమె సిగ్గుతో కుదిన్చుకుపోతోంది . guilty conscious ఆమెను బాగా ఇబ్బంది పెడుతోంది .

“ అసలు ఈ రభసకు కారణం జస్వంత్ ఆర్టికల్ . అతడు మమ్మల్ని బయటపెట్టాలని చూస్తే అతడి పై , అతడి డైలీ పై లీగల్ గా proceed అవుతాము . పైగా ఈ issue పేరుతొ మా కుటుంబం అందరి దృష్టి లో పడటం మాకేమాత్రం ఇష్టం లేదు . మీ లాగే మాకూ కొన్ని పద్ధతులు, కట్టుబాట్లు ఉన్నాయి . ఎవరికీ ఏమీ చెప్పం . ఎవరూ మమ్మలిని ఈ కారణం తో లోకం దృష్టికి తీసుకు రాలేరు . చివరకు మీ రాహుల్ వచ్చినా కోమలాదేవి ప్రమేయం తో నే సహగమనం జరిగిందని చెబుతాం . ఎప్పుడో పూర్వజన్మలో జరిగిన రహస్యాలను త్రవ్వుకోవటం, తలనొప్పి తెచ్చుకోవటం రియల్లీ foolish ! మీరు నిశ్చింతగా బయలుదేరండి .” తేల్చి చెప్పాడు సాగర్ .

ఆమె మౌనం గా లేచి, చేతులు జోడించి శెలవు తీసుకుంది .

భరత్ రామ్, జస్వంత్ ట్రైనింగ్ తో తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు సాగర్ .

అతడికి చాలా ఆనందం గా ఉంది . అజయ్ పడగ నీడలోంచి

విద్యా బయట పడింది .

అనుకున్నట్లే అఘోరి అజయ్ దేవిడీ కి వచ్చాడు . పూజ మందిరం లో కూర్చొని దాదాపు గంట పూజ చేశాడు . పక్కనే పద్మాసనం లో కూర్చున్న అజయ్ అఘోరీ ఏకాగ్రత , మంత్రోచ్చారణ గమనించి ఆశ్చర్య పోయాడు . హీరాలాల్ అఘోరీ అంత ఎత్తుకు ఎదగటం అద్భుతం .

పూజ ముగిసింది . భక్తితో తీర్థ ప్రసాదాలు అందుకున్నాడు అజయ్ . ఇద్దరూ ప్రశాంతం గా దర్బార్ హాల్లో కూర్చున్నారు . అజయ్ మౌనం వెనుక జరిగే సంఘర్షణ , జరిగింది పైకి చెప్పుకోలేని సంకోచం అఘోరీ గమనించాడు .

“ అజయ్ బాబు ! నాకు అన్ని విషయాలు తెలుసు . జరిగినదానికి మీరు చాలా బాధపడుతున్నారు . ఈ మధ్య పన్నాలాల్ మిమ్మల్ని కలిశాడట . “

అజయ్ ఇంక సందేహించలేదు . అఘోరికి రెండు చేతులెత్తి నమస్కరించబోయాడు . అఘోరి సున్నితం గా వారించాడు .

“ మీకు అభ్యంతరం లేకపోతే ------ మీ మనసు తేలికపడే మార్గం చెబుతాను . ....”

“ అంతకన్నానా ? చెప్పండి స్వామీ !” అజయ్ పూర్తిగా అఘోరికి విధేయుడై పోయాడు .

“ మీ ఇంటి ఇలవేల్పు అయిస్వర్యాదేవికి కోమలా దేవి ఎందులోనూ తక్కువ కాదు . కో మలాదేవికి గుడి కట్టించండి . ఆమెకూ మీ ఇంటి ఇలవేల్పు స్థాయి ఇవ్వండి . అప్పుడు ఈ సమాజానికి మీపై ఉన్న అనుమానాలు తొలిగిపోతాయి .

మీరు బయటపడి పోతారు . మిమ్మల్ని వేలెత్తి చూపే వారుండరు . ముందు ముందు మీరు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోనగలరు . మీ మానసిక బలం పెరుగుతుంది . “

అలాగే నని వినయం గా తల ఊపాడు అజయ్ .

“ రూపాదేవి హైదరాబాద్ వెళ్ళారు . మీకు అనుకూలంగా విద్యాధరిని ఒప్పించటానికి .....” అజయ్ కు ఇది మరో షాక్ .

ప్రయత్నించటం లో తప్పు లేదు . రూపాదేవి గారి సమర్ధత నాకు తెలుసు . ఆమె సాధించ గలరు . ఆమె తిరిగి వచ్చిన తర్వాత మీ నిర్ణయం చెప్పండి . ఆమె కాదనరు .ఆమె సహకారం తో నే గుడి నిర్మాణం నిర్విఘ్నంగా పూర్తవుతుంది .

“ శంకుస్థాపన మీ పర్యవేక్షణ లో జరగాలి . ఇది నా విన్నపం .” తేలిక పడ్డ మనసుతో వినయంగా అ ర్ధించాడు అజయ్ .

“ తప్పకుండా ! “ ఒక్క క్షణం కళ్ళుమూసుకున్నాడు . మనోనేత్రం ముందు కోమల మెదిలింది . ఆ విరాగి మనసులో ఓ బాధా వీచిక . హృదయం ఆర్ద్రమైంది .

“ ఆ తల్లి ఆతిధ్యం ఈ జన్మ లో మరిచి పోలేను . మా అమ్మలా కొసరి కొసరి వడ్డించింది . ఆ అమృతమూర్తికి స్మృతిచిహ్నం నిర్మిస్తుంటే రాకుండా ఉండగలనా ? అది నా ధర్మం .”


******************************

కొనసాగించండి 39 లో