Read The shadow is true - 8 by LRKS.Srinivasa Rao in Telugu Fiction Stories | మాతృభారతి

Featured Books
  • అరె ఏమైందీ? - 16

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 2

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • అరె ఏమైందీ? - 15

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 1

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • ధర్మ -వీర - 5

    వీర ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు, చూసి "వీడా, వీడికి ఎ...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

నీడ నిజం - 8

రాహుల్ కోమల కు దూరంగా ఉన్నాడు. చెరువు గట్టు మీద పచార్లు చేస్తున్నాడు. గట్టు మీద నడుస్తున్న రాహుల్ కు చెరువు లో ఒక మూల ఎర్ర తామరలు కనిపెంచాయి. వాటిని చూడగానే కోయాలనిపించింది. తెలిసీ-తెలియని వయసు ,ఉరకలు వేసే ఉత్సాహం -ముందు వెనుక చూసుకోకుండా చెరువులో దిగాడు. చివరి మెట్టుపై పేరుకు పోయిన నాచు మొక్కలు రాహుల్ కాలుజారి చెరువులో పడేలా చేసాయి. అంతే భయం తో రాహుల్ పెట్టిన కేక ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది. రాహుల్ నీళ్ళలో పడిన చోట లోతు ఎక్కువ. అందుకే నేల అందక నీళ్ళపై గిలగిల కొట్టుకుంటున్నాడు.

క్షణాల్లో పరిస్థితి విషమించింది. ఎవరో ఒకరు సాహసం చేయకపోతే ఓ పసి ప్రాణం నీటి పా లవుతుంది. కోమల క్షణం ఆలస్యం చేయలేదు. మొండి ధైర్యం తో చెరువులో దూకింది.గట్టు మీద ఆడవాళ్ళు ‘జాగ్రత్త,జాగ్రత్త అని అరుస్తున్నారు.

ఎలాగో ప్రాణాలకు తెగించి కోమల రాహుల్ ను గట్టుపై పడవేసింది. రాహుల్ నెమ్మదిగా తేరుకున్నాడు. ఆ పసివాడి కళ్ళల్లో భయం, బాధ, ఉద్వేగం పోటి పడుతున్నాయి. కోమల ను అల్లుకు పోయాడు. కోమల ప్రాణాలు కుదుట పడ్డాయి. ఎప్పుడో చిన్నప్పుడు తండ్రి ప్రోద్బలం తో నేర్చుకున్న ఈత ఈ క్షణంలో రాహుల్ ప్రాణాలు కాపాడింది.

ఈ సంఘటన ఊర్లో సంచలన వార్త అయింది. విక్రం సింహ్ కుటుంబం లో కోమల స్థానం అనూహ్యం గా పెరిగి పోయింది. కృతజ్ఞతా భావం వారిని ప్రేమతోఅనురాగం తో కట్టి పడేసింది. విక్రం తల్లి దృష్టి లో కోమల దేవత. రాహుల్ కు ప్రాణం.

విక్రం సింహ్ కళ్ళలో పల్చటి కన్నీటి పొర. కోమల దేవికి ఆకాశం తలవంచిందా అనిపించింది. ఆ క్షణం లో అతడి మనసులో ఎగసిన భావ కెరటం ఎవరి ఊహకు అందనిది. ఆ ఆలోచనే అనూహ్య రీతిలో కోమల జీవన సరళి నే మార్చివేసింది.

ఈ సంఘటన తో విక్రం సింహ్ ఎమోషనల్ సైడ్ బాగా కదిలి పోయింది. అతడికి అ సమయం లో రాహుల్ క్షేమం తప్ప మరో ఆలోచన రాలేదు. సంప్రదాయం, ఆచార-వ్యవహారాలు, ఆస్తి-అంతస్తులు అన్న జటిలమైన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. తన అవసరం దృష్టి లో ఉంచుకొని యదార్ధ స్థితి అంచనా వేసాడు. కోమల దేవి అమ్మ స్థానం లో రాహుల్ ను కంటికి రెప్పలా కాపాడగలదు అన్న నమ్మకం అతడికి కలిగింది. ఆమె అంకిత భావం ఆమెను ముగ్ధుడిని చేసింది.

ఈ ఆలోచన మనసులో ఒక స్పష్టమైన రూపానికి రాగానే ముందు తల్లికి చెప్పుకున్నాడు. కొడుకు ఆలోచనకు తల్లి తెల్లబోయింది. కానీ-తొందరపడి తన అభిప్రాయం చెప్పలేదు.ఆమె సమాజమనే రంగుటద్దం లో సమస్యను చూడలేదు. రాహుల్ జీవితం లో కోమల అవసరం గుర్తించి కొడుకు ప్రతిపాదనను సమీక్షించింది .కొడుకు ఆలోచన సబబే అనిపించింది. రాహుల్ ను కోమల కాపాడటం వల్లే కొడుకు మనసు లో పునర్వివాహం అన్న ఆలోచన కలిగింది. ఈ స్థితి లో కూడా అర్థం లేని ఆలోచనల తో జాప్యం చేస్తే ఇక ఈ సమస్యకు సమాధానం ఈ జన్మకు లభించదు. తల్లి నిర్ణయం విని విక్రమ్ ఏ సంబర పడితే చిన్న కొడుకులిద్దరూ నిష్చేష్టులైయ్యారు.అన్న ముందు పెదవి విప్పలేదు. తల్లి ముందు తమ అభ్యంతరం కుండ బద్దలు కొట్టినట్లుచెప్పారు.ఇంటి పనిమనిషి తో అన్నగారి వివాహం వారు జీర్ణించుకోలేని నిజం. రాహుల్ ప్రాణాలు కాపాడి నందుకు ఇలా కృతజ్ఞత తెలుపు కోవటం వారికీ అస్సలు నచ్చలేదు. వారిది అహంకారం.

ఏ సున్నితమైన భావానికైనా ద్రవించని కరుడు గట్టిన సంప్రదాయవాదం – మచ్చ లేని రాజవంశానికి పట్టిన గ్రహణం అన్నగారి వివాహం అని వారి అభిప్రాయం. మానవత్వం, విశాల దృష్టి లాంటి ఆలోచనలు ఈ ‘ఒక్క విషయం’ లో వారికి పడవు.

రాజసం . క్షత్రియులమన్న జాత్యహంకారం , తరతరాల ఘన చరిత్ర తమది అన్న భావన వారి మనసుల్ని కఠినశిలలు గా మార్చివేశాయి. కానీ-అన్నగారికి ఎదురు చెప్పే ధైర్యం లేదు. అయన మాట వారికీ సుగ్రీవాజ్ఞ. నచ్చినా, నచ్చక పోయినా ఆయనను అనుసరించటం వారి పధ్ధతి. అందుకే పెదవి కదిపి తమ అసంతృప్తి పైకి పొంగనివ్వలేదు.

ఈ సంఘటన గత శతాబ్దం ఆరవ దశకం లో జరిగింది. అంటే కధాకాలం1960. స్వాతంత్ర్యం తరువాత ఆనాటి ప్రభుత్వాలు అందించిన అభివృద్ధి ఫలాలు చాల వరకు పట్టణాలకే పరిమితమైనాయి. మారుమూల గ్రామాలకు అందినవి అంతంత మాత్రమే ప్రత్యేకించి ఎడారి రాష్ట్రం రాజస్థాన్ లో చాల గ్రామాలూ సరైన రవాణా వ్యవస్థ లేని కారణం గా బాహ్య ప్రపంచం తో పూర్తిగా కనెక్ట్ కాలేక పోయినాయి.

విద్యుత్ లేనందువల్ల రేడియో లాంటి సమాచార వ్యవస్థ తో అనుసంధానం కాలేక పోయాయి. చరిత్రకు, సంస్కృతిక విలువ ఇచ్చే నాటి గ్రామా ప్రజలు మార్పు ఒప్పుకునే పరిస్థితి లో ఏ మాత్రం లేరు. విక్రమ్ సింహ్ కుటుంబం నివసించే గ్రామం పైన వర్ణించిన గ్రామాల కోవ లోకే వస్తుంది. ఆ గ్రామం ఓ చారిత్రక అవశేషం. పాత సంప్రదాయాలు, ఆచారాలు వారి జీవన శైలిని నమ్మకాలను శాశిస్తాయి.

ఎవరేమనుకున్నా కోమలా దేవి వివాహం ఆగలేదు. విక్రం జీవితం లో కోమల నాటకీయం గా ప్రవేశించింది. ఆ ఇంటి పరిచారికే పట్టపు రాణి గా అనూహ్యం గా ఎదిగింది.

గ్రామం లో ఈ విప్లవ వివాహం విభిన్న ప్రతిస్పందనలు కలిగించింది. కూలినాలి జనం “ఠాకూర్ సాబ్ నిర్ణయానికి పొంగిపోయారు. ఛాందసవాదులు ఆశ్చర్యం తో ముక్కుపై వేలేసుకున్నారు. మనసులో ఈసడించుకున్నారు. అభ్యుదయవాదులు , యువకులు విక్రం సాహసాన్ని మనసారా అభినందించారు.

మొదటి రాత్రి సంబరానికి గదిని అందంగా అలంకరించారు. పందిరి మంచం పై కోమల ఒక మూల గువ్వలా కూర్చొని వుంది. వెన్నులో సన్నని వణుకు.

విక్రమ్ ్ గదిలో అడుగు పెట్టాడు. తెల్లటి దుస్తుల్లో మంచు శిఖరం లా మెరిసిపోతున్నాడు. . కోమల ఉలికిపాటు తో లేచి నిలుచుంది విక్రం ఆమెను ప్రసన్నం గా, ప్రశాంతం గా చూశాడు. అతడి చూపుల్లో ఆ క్షణాల్లో ఉండవలసిన సహజ కాంక్ష లేదు. సౌమ్యత ఉంది. “ కోమలా ! నీ కిది మొదటి రాత్రి. కానీ నువ్వు కోరుకున్నది అందించటానికి నా మనసు సిద్ధంగా లేదు. ...ఇలా అంటున్నందుకు ఏమీ అనుకోవద్దు. నిన్ను ఇష్టపడే వివాహం చేసుకున్నాను. నీతో ప్రశాంత జీవితం గడపాలనే నా ఆశ. రాహుల్ కు తల్లి లేని లోటు నువ్వు మాత్రమే తీర్చగలవు. ఆ పసిమనసులో అమ్మగా నువ్వే ముద్ర పడిపోయావు. ... నిన్ను భార్యగా గౌరవించటం ప్రేమను పంచటం నా బాధ్యత. కానీ..అందుకు కొంత వ్యవధి కావాలి పాత జ్ఞాపకాలు

ఇంకా మనసులో మెదులుతున్నాయి. అవి పూర్తిగా మరిచిపోవాలంటే ఈ జన్మకు సాధ్యం కాదు. కానీ ప్రయత్నించి కొంతవరకు మరిచిపోగలిగితే నీకు భర్తగా న్యాయం చేసిన వాడినవుతాను.

ఆ మాటల్లో భర్త మనసు అద్దంలా చూడగలిగింది కోమల . అతడి అభ్యంతరం లో , అభ్యర్ధనలో అర్థముందని పిం చింది . ఇందుకు తన అంగీకారం ఆ పల్లెపడుచు అతడికి వినయంగా పాదాభివందనం చేసి తెలుపుకుంది . ఆమె మౌనం లో విక్రం ఎం తో గ్రహించగలిగాడు . ఆర్తిగా దగ్గరకు తీసుకున్నాడు .

కోమలాదేవి తల్లి తెలియని తీరాలకు ప్రయాణమైంది . ఎవరెంత చెప్పినా ఆమె వినిపించుకోలేదు . తన ఉనికి వారికి క్షణక్షణం అభ్యంతరకరం . అందుకే పేగుబంధం తెన్చుకోవటానికి నిర్ణయించుకుంది . నెమ్మదిగా కోమల కొత్తజీవితానికి అలవాటు పడుతోంది . రాహుల్ ఆమె జీవితం లో భాగమై పోయాడు . భర్త అనురాగం , అత్తగారి ఆదరణ ఆమెకు దేవుడిచ్చిన వరాలు .

విక్రం వివాహం బంధువర్గం లో ప్రకంపనలు సృష్టించింది . ముఖ్యంగా మేనమామ తేజ్ సింహ అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు . తుఫానులా వచ్చి తోబుట్టువును , మేనల్లుళ్లను తూర్పార పట్టాడు . తమ్ముడి వాగ్ధాటికి విక్రం తల్లి వణికిపోయింది .

కోమల తుఫానులో మల్లెతీగలా తల్లడిల్లిపోయింది . ఈ అనుకోని పరిణామం విక్రం తమ్ముళ్లు అజయ్, విజయ్ కి చాలా పెద్ద ఊరట. వారి ఆలోచనాతీరుకు అనుకూల పవనం .

ఇందరిలో విక్రం ఒక్కడే యోధుడిలా ఎదురు నిలిచాడు . అతడి సమాధానం కడిగిన ముత్యం లా , అతడి మనసుకు అద్దంలా అనిపించింది . మేనమామ మారు మాట్లాడలేక పోయాడు . దెబ్బతిన్న బెబ్బులిలా మౌనం గా వెళ్ళిపోయాడు .

కోమలాదేవి తనకు వివాహం అయిన క్షణం నుండి మరుదులను గమనిస్తోంది . వారి ప్రవర్తనలో చాలా తేడా కనిపించింది .ఏనాడూ వారు తనని ‘వదిన అని పిలవలేదు . ఆ సందర్భం వచ్చినప్పుడు తెలివిగా తప్పుకునేవారు . వారి వైఖరి ఆమెకు అర్థమైంది . వారు తనను ఇంటికోడలిగా అంగీకరించటం లేదు . తన ఉనికి వారికి అభ్యంతరకరంగా ఉంది .

‘ ఈ అపశ్రుతి ఏ విపరీత పరిణామానికి దారి తీస్తుందో !” కోమలకు భయం వేసింది . ఈ విషయం భర్తకు చెప్పుకోవాలంటే భయం వేసింది . విష యం చాలా సున్నితమైంది . ఏ మాత్రం పట్టు తప్పినా తన భర్తకు , ఆయన తమ్ముళ్లకు మధ్య అగాధం సృష్టించవచ్చు . తల్లికి చెప్పుకునే వీలు లేదు . ఇక తనకు అత్తగారే దిక్కు .

అదురుతున్న గుండెలతో అత్తగారికి తన పరిస్థితి చెప్పుకుంది . ఆమె అదిరిపోయింది . విక్రం నిర్ణయం అందరిలాగే వారూ జీర్ణించుకోలేకపోతున్నారు . జాత్యహంకారం వారి మనసుల్ని విషపూరితం చేసింది . మొక్కదశ లోనే దీన్ని తృంచివేయాలి.లేదంటే ముందు ముందు

చాలా అనర్ధాలు జరుగుతాయి. కోడల్ని చల్లటి మాటలతో అనుసరించి ఆమె కొడుకుల్ని నిలదీసింది.

మిరు మార రా ? పెళ్ళికి ముందు గొడవ చేశారు.అప్పుడే విక్రమ్ ఉద్దేశ్యం ఏమిటో, వాడు ఎందుకంత సాహసం చేస్తున్నాడో వివరంగా చెప్పాను.ఆ రోజు నోరు విప్పలేదు.ముభావంగా వుండిపోయారు. మీ మౌనం అంగీకారం అనుకున్నాను. సర్దుకుపోతారులే అని సరిపెట్టుకున్నాను....పెళ్ళికి జరిగి కోమలి ఈ ఇంటి కోడలు అయినాక ఇప్పుడు ఆ అమాయకురాలిని అవమానిస్తారా? ...ఈ పెళ్ళి మీకు అంతగా దశ లోనే దీన్ని తృంచివేయాలి.లేదంటే ముందు ముందు పోతే అప్పుడే పెళ్ళికి ముందే అన్నను నిలదీసి వుండొచ్చుగా ? ....భగవంతుడా ! ఇప్పుడేమి టి దారి ?”

************************************************

కొనసాగించండి 9 లో