Read Dharma - Hero - 5 by Kumar Venkat in Telugu Fiction Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ధర్మ -వీర - 5

వీర ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు, చూసి "వీడా, వీడికి ఎందుకు భయపడుతున్నావ్" అంటాడు. 

శాంతి :- "అయ్యో, వాడు మా ఇంట్లో పనోడు, మా ఇంట్లో వాళ్ళకి చెప్తే." 

వీర ఆ పనోడిని పిలిచి "ఇదిగో, ఈ 500 ఉంచుకో. ఇక్కడ చూసింది మాత్రం మీ పెద్దయ్యగారికి కానీ మీ చిన్నయ్య గారికి కానీ చెప్పకు" అని అంటాడు. 

ఆ పనోడు డబ్బులు తీస్కుని "కంగారు పడకండి చిన్నమ్మగారు, నేను చూసింది మీ ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికి చెప్పను" అని అంటాడు. 

ఆ పనోడు అక్కడ్నుండి వెళ్ళిపోయి, ఊరిలో ఉన్న టెలిఫోన్-బూత్ దగ్గరికి వెల్లి ఒక ఫోన్ చేస్తాడు. 

పనోడు :- "అయ్యా, మీరు వెతుకుతున్న అవకాశం మీకు దొరికింది అయ్యా, ఆ శివయ్య కూతురు శాంతి, వీర ప్రేమించుకుంటున్నారు."

అటు ఫోన్ నుంచి రంగా "శభాష్, మంచి వార్త వింపించావు, ఈ దెబ్బతో ఆ శివయ్య పని, ఈ ధర్మ-వీర ల పని పట్టేయచ్చు. ఒకే దెబ్బకి రెండు పిట్టలు."

పనోడు :- "అయ్యా మరి నా సంగతి కూడా.."

రంగా :- "హ్మ్మ్, సాయంత్రానికి డబ్బు మీ ఇంటికి వస్తుంది." 

వీర, శాంతి ని వాళ్ళ ఇంటి దగ్గర్లో దింపేసి వెళ్ళిపోతాడు. 

అప్పుడే శివయ్య ఇంట్లో ఫోన్ మొగుతుంది, సూర్య వెళ్లి ఫోన్ తిస్తాడు. 

రంగా :- "నీ చెల్లి ఇప్పుడే, ప్రేమ కలాపాలు పూర్తిచేసి ఇంటికొచ్చింది అనుకుంట."

సూర్య ఆవేశంతో :- "రేయ్.. ఎవడ్రా నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావ్."

రంగా :- "నోటికొచ్చినట్టు కాదురా, నీ చెల్లికి ఆ మెకానిక్ వీర కి జరిగే రాసాలీలలు ఈ ఊరంతా తెలుసు, ఒక్క నీకు మీ నాన్న కు తప్ప. ఎలాంటి కుటుంభం రా మీది." 

సూర్య కోపంతో ఉగిపోతు :- "రేయ్.. నువ్వు ఎక్కడున్నావో చెప్పారా, ఇప్పుడే వచ్చి నీ తల నరుకుతా." 

రంగా :- "నువ్వు మొగాడివి అయితే ముందు ఆ వీర నుంచి నీ చెల్లెల్ని కాపాడుకో రా."

ఇది విని సూర్య కోపంగా ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడే అక్కడికి వాళ్ళ నాన్న శివయ్య వస్తాడు.

శివయ్య :- "ఏమయిందిరా, ఎవరు కాల్ చేసింది?"

సూర్య :- "ఎం లేదు నాన్న, పార్టీ ఆఫీస్ నుండి. ఎలక్షన్స్ దెగ్గరకు వస్తున్నాయి కదా, ప్రచారం గురించి అడుగుతున్నారు."

శివయ్య :- "వాళ్ళకి ఎప్పుడు ఈ ఎలక్షన్స్, ప్రచారం, రాజకీయం. నువ్వు దిగులుపడకు నేను చూసుకుంటాలే."

సూర్య :- "సరే నాన్న, ఇంతకీ చెల్లి ఎక్కడ ఉంది?"

శివయ్య :- "ఇందాకే పిల్లలకి ట్యూషన్ చెప్పి వచ్చింది, పైన గదిలో ఉంది రా."

సూర్య కోపంగా శాంతి గది కి వెళ్తాడు. 

శాంతి :- "ఏమైంది అన్న, చాలా కోపంగా కనబడుతున్నావ్?"

సూర్య :- "ఇంతసేపు ఎక్కడికి వెళ్లి వస్తున్నావ్?"

శాంతి :- "పిల్లలికి ట్యూషన్ చెప్పి వస్తున్నా అన్న."

సూర్య కోపంతో శాంతి చంప మీద కొడతాడు 

సూర్య :- "నిజం చెప్పు, లేదంటే ఇక్కడే చంపి పతేస్తా"

శాంతి భయంతో వణుకుతూ :- "పిల్లలకి ట్యూషన్.."

సూర్య :- ఏయ్య్.. ఊరిలో వాళ్ళని చేసినట్టు నన్ను కూడా పిచోడ్ని చేద్దాం అనుకుంటున్నావా... ఆ వీర గాడితో తిరిగి రావట్లేదా నువ్వు? "

శాంతి :- "అన్న.."

సూర్య :- "నీకు, ఆ కులం తక్కువాడు తప్ప ఇంకెవరు దొరకలేదా. పోయి పోయి వాడ్ని ప్రేమించావు."

శాంతి :- "అన్నా, వీర చాలా మంచోడు.."

సూర్య :- నోరు ముయ్యవే, ఈ ఇంటి పరువు తీసింది చాలు. బుద్దిగా ఇక ఇంట్లోనే ఉండు. ఆ వీర సంగతి నేను చూసుకుంటాను.

శాంతి :- "అన్నా, వద్దన్నా.. వీర ని ఎం చేయకు అన్నా.."

సూర్య బలవంతంగా శాంతి ని రూమ్ లో వేసి తలుపుకి తాళం వేసి వెళ్ళిపోతాడు. 

ఆ తర్వాత రోజు, వీర తన బండి మీద వెళ్తుంటే. రోడ్ కి అడ్డంగా బండ రాళ్లు ఉంటాయి అది చూసి బండి ఆపుతాడు. వెంటనే కొంతమంది వీర ని చుట్టుముట్టి తన మీద దాడి చేస్తారు. 

వీర వాళ్ళతో ఫైట్ చేస్తాడు, వాళ్ళని కొడుతూ ఉండగా, ఒకడు వెనకనుంచి రాడ్ తో తల మీద కొడతాడు. వీర కి ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది, తన మోకాళ్ళ మీద పడిపోతాడు. మళ్ళీ వీర ని అందరూ చుట్టూముడతారు. ఒకడు రాడ్ తో గట్టిగ వీర మీద కొడుతుంటే, వాడి ముందు ఉన్న వాడు ఎగురుకుంటూ వచ్చి ఆ కొట్టేవాడి మీద పడతాడు. వీర వెనక్కి తిరిగి చూస్తే, ధర్మ, వీర చుట్టూ ఉన్నవాళ్ళని తన్ని అవతలకి విసిరేస్తూ ఉంటాడు. ధర్మ ని చూసాక వీర కి మళ్ళీ ప్రాణం లేచి వస్తుంది,

ధర్మ :- "నువ్వు ఇంకా రాకపోతే నీకేమైనా అవసరం వచిద్దేమో అని చూద్దాం అని వస్తున్నా, కానీ ఇలాంటి పరిస్థితి లో ఉంటావని అనుకోలేదు."

వీర :- "వెనకనుంచి దొంగ దెబ్బ తీశారు, లేదంటే ఈ పాటికి వీళ్ళని చిత్తకోట్టి వచ్చేసవాడ్ని. ఇప్పుడు నువ్వు వచ్చావు గా కలిసి వీళ్ళ పని పడదాం."

వీర కూడా లేచి వాళ్ళ ఏముఖులు విరిగేలా ఫైట్ చేస్తాడు. ధర్మ-వీర లు కలిసి వాళ్ళందరిని కొట్టి పారేస్తారు. 

అందరూ తలో ఒక వైపు పారిపోతారు. ధర్మ -వీర లు కలిసి ఒకడ్ని పట్టుకుంటారు. 

వీర :- "ఎందుకురా నన్ను చంపాలని చూసారు, అసలు ఎవర్రా మీరంతా." 

ధర్మ వాడి తల పట్టుకుని :- "అడుగుతున్నాడు గా, సమాధానం చెప్తావా? లేక మా చేతిలో చస్తావా?. ఎవరు పంపించారు మిమ్మల్ని?"

ఆ కిరాయి మనీషి భయపడుతూ :- "సూర్యబాబు గారు పంపించారండీ, మిమ్మల్ని చంపమని ఆయనే చెప్పారండి. ఎవరికీ అనుమానం రాకుండా ఒక దొంగతనం లా చేయమని చెప్పారండి."

అది విని, ధర్మ-వీర లు ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. వీర కి అంతా అర్ధమైపోతుంది. కానీ ధర్మ కి ఏమి తెలీదు కాబట్టి, ధర్మ ఇంకా గంధరగోళం లో ని ఉంటాడు. 
ధర్మ ఆ మనిషిని వదిలేస్తాడు, అతను పారిపోతాడు. 

ధర్మ అయోమయంగా వీర వైపు చూస్తాడు 

ధర్మ :- "నువ్వు శాంతి ప్రేమించుకునట్టు, సూర్య కి తెలిసిపోయింది వీర."

వీర ఒక్కసారిగా ఆశ్చర్యంతో ధర్మ వైపు చూస్తాడు, వీర శాంతి ని ప్రేమించినట్టే ధర్మ కి తెలుసు అనుకుంటాడు, కానీ శాంతి కూడా వీర ని ప్రేమిస్తునట్టు ధర్మ కి ముందే తెలుసు అని వీర కి అర్ధమైంది.