Read Dharma - Hero - 9 by Kumar Venkat in Telugu Fiction Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ధర్మ- వీర - 9

ఇన్స్పెక్టర్ :- "శివయ్యగారు, మీకు అనుమానం ఉంది అంటున్నారు కాబట్టి మేము రంగా గారి మీద కేసు వేస్తున్నాం. కానీ ఇన్వెస్టిగేషన్ పూర్తి అయ్యేవరకు ఈ విషయం బయిటికి చెప్పద్దు. ఒకవేళ విచారణ లో ఆయనే దోషి అని తెలిస్తే మేమే యాక్షన్ తీస్కుని మీకు చెప్తాం."

శివయ్య "సరే" అని అక్కడ్నుండి వెళ్ళిపోతారు. 

ఇన్స్పెక్టర్ వెంటనే పోలీస్ జీప్ లో రంగా ఇంటికి వెళ్తారు. 

ఇన్స్పెక్టర్ రంగా ఇంట్లోకి వెళ్ళగానే, రంగా మనుషులంతా రంగా ని, ఇన్స్పెక్టర్ ని ఒంటరిగా వదిలేసి బైటికి వెళ్ళిపోతారు. 

రంగా :- "ఏమైంది? నేను చెప్పినట్టే చెప్పి ఉరిని నమ్మించావా?"

ఇన్స్పెక్టర్ :- "మీరు తీస్కోచ్చిన కీరతకమైన హంతకులని దొంగల్ని చేసి.. మిమ్మల్ని తప్పించడం కోసం సూర్య ని గొప్పోడ్ని చేసిన సరే. ఆ శివయ్య గారు వదలడం లేదు. ఇందాకే మీ మీద కేసు పెట్టి వెళ్లారు."

రంగా :- "ఆ శివయ్య కి వచ్చింది అనుమానం మాత్రమే. అది నిజం అయ్యేలోపు ఆ శివయ్య కుటుంబాన్ని ఆ ధర్మ-వీర ల ని ఈ భూమ్మిద లేకుండా చేస్తా."

ఇన్స్పెక్టర్ :- "ఏంటి నువ్వు చేసేది? ఒకసారి నువ్వు పంపించిన వాళ్ళ సేవాలు చూసావా? ధర్మ- వీర లు వాళ్ళని వెంటాడి.. వేటాడి.. తెగ నరికారు. ధర్మ - వీర ల ని ముట్టుకోడం కూడా మన వల్ల కాదు."

రంగా :- "తెలుసు, వాళ్ళని ఓడించడానికి నా దగ్గర మిగిలి ఉన్న చివరి ఆయుదాన్ని, నేను ఇక వాడే సమయం వచ్చింది."

.............................................

ధర్మ, శివయ్య ఇంటి బైట ఉంటాడు. వీర శివయ్య ఇంట్లోకి సైలెంట్ గా, లోపలికి వెళ్తాడు. వీర వెళ్తూ ఉంటే ఒక రూమ్ కిటికీ తెరిచి ఉంటుంది. వీర నిశ్శబ్దంగా కిటికీ లో చుస్తే, శాంతి వాళ్ళ అమ్మ సూర్య గురించి తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటారు. జాలిగా ఆవిడ్ని చూసి, వెంటనే శాంతి కోసం వెతుకుతాడు. ఆలా వెతుకుతూ ఉంటే, సడన్ గా ఒకరు తన చేయి పట్టుకుని లోపలికి లాగుతారు. 
వీర శాంతి ని చూసి ఒక్కసారిగా తనని గుండెలపై హత్తుకుంటాడు. శాంతి కూడా వీర ని ఏడుస్తూ గట్టిగా పట్టుకుంటుంది, మళ్ళీ ఒక్కసారిగా శాంతి వీర ని పక్కకి నెట్టేస్తుంది. 

శాంతి :- "వీర, ఇక నన్ను మర్చిపో. నన్ను చూడాలి అని మళ్ళీ ప్రయత్నించకు."

వీర :- "శాంతి, బాధలో మాట్లాడుతున్నావ్ అని తెల్సు. కానీ ఎందుకు ఎం మాట్లాడుతున్నావో నీకు అర్ధమవుతుందా?"

శాంతి :- "నాకు తెల్సు, మా అన్నాయ్య చనిపోడానికి నేనే కారణం. మన ప్రేమ వల్లే ఈరోజు మా అన్నయ్య చనిపోయాడు."

వీర :- "మీ అన్నయ్యని చంపింది నువ్వు కాదు శాంతి, దానికి మన ప్రేమకి ఏంటి సంబంధం?"

శాంతి :- "నాకు తెల్సు, మా అన్నయ్య ఆరోజు రాత్రి నిన్ను కలవడానికె వెళ్ళాడు అని. మా అన్నయ్య నీతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నేను చూసాను. నేను దేవుడ్ని ఎంతో వేడుకున్నా నువ్వు అక్కడికి రాకూడదు అని, అనుకునట్టే నువ్వు మా అన్నయ్యని కలవలేదు కానీ ఇలా..."

వీర :- "శాంతి, నేను చెప్పేది విను. మీ అన్నయ్య కి అలా జరుగుతుంది అని నువ్వు కూడా అనుకుని ఉండవు. అనవసరంగా నిన్ను నువ్వు నిందిచుకోకు."

శాంతి :- "చాలు వీర, మా అన్నయ్యని ఎలాగో పోగొట్టుకున్నాను. మా అమ్మనాన్న లని అయినా సంతోషంగా ఉండేలా చూడాలనుకుంటున్న. దయచేసి నా గురించి ఆలోచించడం ఆపేయ్. మళ్ళీ నన్ను చూడ్డానికి కానీ, కలవడానికి కానీ ప్రయత్నించకు."

అప్పుడే శివయ్య కారులో తన ఇంటికి వస్తాడు. అది చూసి ఇంటి వెనక వైపు గా గోడ దూకి ధర్మ లోపలికి వెళ్తాడు. 
వీర బాధతో నిశ్శబ్దం గా శాంతి ముందు నిలబడటం చూసి, వీర చేయి పట్టుకుని "శివయ్యగారు వచ్చారు, ఇంకా ఇక్కడే ఉండటం మంచిది కాదు. పద వెళదాం" అని వీర ని బైటికి తీస్కోచస్తాడు. వీర వైపు చూస్తూ శాంతి కన్నీరు పెడుతుంది. వీర ఏమి మాట్లాడకుండా ధర్మ తో వెళ్ళిపోతాడు. 

ధర్మ వీర ని ఇంట్లో దించేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత 4 రోజులు ధర్మ కి వీర కనబడడు. ధర్మ ఇంటి నెంబర్ కి, గ్యారేజ్ నెంబర్ కి కాల్ చేసిన వీర ఏమాయడో ధర్మ కి తెలీదు. 
తర్వాత ధర్మ, రాజు ని అడిగితే, వీర రాత్రి కళ్లుపాక దగ్గరికి వెళ్ళొచ్చాడని చెప్తాడు.
సూర్య తన వల్లనే చనిపోయాడని అందుకే శాంతి దూరమైంది అని వీర బాగా తనిని తానే నిందించుకుంటూ బాధపడుతూ ఉంటాడు. 
వీర కళ్ళుపాక దగ్గర కూర్చుని బాధలో తాగుతూ ఉండగా. అక్కడికి ధర్మ వస్తాడు. 

ధర్మ :- "రేయ్ వీర, నువ్వు తాగుతున్నావ్ ఏంట్రా..?"

వీర, ధర్మ వైపు చూస్తాడు కానీ ఏమి మాట్లాడకుండా మళ్ళీ తాగుతాడు. 

ధర్మ :- "ఇక చాలు, పద ఇంటికి వెళ్దాం."

ధర్మ వీర చేయి పట్టుకుని తీసుకువెళ్తుంటే, వీర బలంగా చేయి విడిపించుకుంటాడు.

వీర :- "ఒక మనిషిని చంపేసి, ఏమి తేలినట్టు అలా ఎలా ఉన్నావ్ రా?"

ధర్మ :- రేయ్ కుంచెం చిన్నగా మాట్లాడు, అందరూ వింటారు."

ధర్మ, వీర ని పక్కకి లాగి "నేనే కాదు, నువ్వు కూడా అక్కడ కొంతమందిని చంపేసావు" అని అంటాడు.

వీర :- "నేను, నా ప్రేమ ని కాపాడడం కోసం సూర్య కి ఏమి కాకూడదు అని చంపాను."

ధర్మ :- "నేను కూడా, నా ప్రాణ స్నేహితుడు కి ఏమి కాకూడదని చంపాను రా."

వీర :- కానీ అయ్యిందే, నా ప్రేమ నాకు దూరం అయింది నీ వల్లనే. నీ వల్ల ఈ ఊరి పెద్ద కొడుకు చనిపోయాడు. ఊరి భవిష్యత్తే మారబోతుంది. కానీ నీకు ఏమి పట్టనట్టు ఊరి మీద పడి తిరుగుతున్నావు. "

ధర్మ :- "రేయ్, నీకు కుంచెం మత్తు ఎక్కువైనట్టుంది, ముందు ఇంటికి పద. రేపు మాట్లాడుకుందాం."

వీర :- "ఏంట్రా బెదిరిస్తున్నావ్, రాకపోతే నన్ను కూడా..."

ధర్మ కోపంతో వీర ని చంప మీద కొడతాడు.

ధర్మ :- "సారీ రా, కోపం లో.. సరే ముందు ఇంటికి వెళ్లి తిందాం పదా."

వీర కి కోపం వచ్చి ఒక్కసారిగా ధర్మ ని కాలితో ఛాతి మీద తంతాడు. 
 పంతం తో ఇద్దరు ఒకర్ని ఒకరు తంతూ, దెబ్బలడుకుంటారు. అక్కడ ఉన్నవాళ్లు అంతా ఆశ్చర్యంతో వెళ్ళిద్దరా కొట్టుకుంటుంది అని చూస్తారు. 

ధర్మ - వీర లు సీరియస్ గా ఒకళ్ళతో ఒకళ్ళు దెబ్బలడుకుంటూ ఉంటారు. 

చివరికి ధర్మ, వీర ని లేపి కింద పడేస్తాడు. వీర ధర్మ వైపు కోపంగా చూస్తూ పడి ఉంటాడు. ధర్మ, ఒక్కసారిగా ఆగి వీర ని లేపడానికి చేయి ఇస్తాడు. వీర ఆ చేయి ని తోసేసి "ఈరోజు నుంచి నాకు స్నేహితులు ఎవరు లేరు... ఇప్పుడు తాగి ఉన్నా కాబట్టి నీదే పైచేయి అయింది, కానీ మళ్ళీ నా జోలికి వస్తే మాత్రం ఇలాగే అవుతుంది అనుకోకు. నా గురించి నీకు బాగా తేకుసు కదా. నా కళ్ళ ముందు నుంచి పో..."

ధర్మ :- "వీర, నువ్వు నా ప్రాణం."

వీర :- "అది ఒకప్పుడు"

ధర్మ, కోపంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. ప్రాణస్నేహితులు అయినా వాళ్ళిద్దరిని విడిపోవడం చూసి అక్కడ ఉన్నవాళ్లందరు ఆశ్చర్యపోతారు. 

ఇక ధర్మ - వీర లకి పోరు మొదలైనట్టే నా?