Read Dharma - Hero - 8 by Kumar Venkat in Telugu Fiction Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ధర్మ- వీర - 8

ధర్మ, వీర ని అక్కడ్నుండి తీస్కుని వెళ్ళిపోతాడు. 

తరువాత రోజు, పోలీసులు శివయ్య గారి ఇంటికి వస్తారు. 

శివయ్య :- "ఏమైంది, ఎందుకు ఇంతమంది పోలీసులు వచ్చారు."

పోలీస్ ఇన్స్పెక్టర్ :- "సూర్య గారు మీ కొడుకే కద?"

శివయ్య :- "అవును ఇన్స్పెక్టర్ గారు."

ఇన్స్పెక్టర్ :- "మీ అబ్బాయి సూర్యగారు చనిపోయారు, అతని శవం గుడికి దగ్గర లో ఉన్న అడవిలో దొరికింది."

అది విన్న వెంటనే శివయ్య గారి కళ్ళలో నీళ్లు వచ్చి, ఒక్కసారిగా బాధతో కుప్పకూలిపోతారు. వెంటనే శివయ్య వాళ్ళ భార్య ఏడుస్తూ వచ్చి ఆయన్ని పట్టుకుంటుంది. 
శాంతి కిందకి వస్తుంది, విషయం తెలియగానే శాంతి కూడా బాధతో క్రుంగిపోతు ఏడుస్తుంది.
శివయ్య కుటుంభం అంతా సూర్య చనిపోయిన చోటుకి పోలీసులుతో వెళ్తారు. 
శివయ్య సూర్య ని చూసి గుండె పగిలేలా అరుస్తూ బాధపడతాడు. 

శివయ్య :- "ఎవరు చేసారు ఇన్స్పెక్టర్, నా కొడుకు ని ఈ పరిస్థితి కి తీసుకొచ్చింది ఎవరు?"

ఇన్స్పెక్టర్ :- "సూర్య గారితో పాటు మేము ఇంకొన్ని శవాలని చూసాం, అవి గుడికి దగ్గర ఉన్న చెరువు నుండి ఇక్కడవరుకు చాలా మంది శవాలు పడి ఉన్నాయ్. వీళ్ళందరూ ఎవరు అని ఇన్వెస్టిగేషన్ చేస్తే, వీళ్ళందరూ పక్క రాష్ట్రానికి సంబందించిన దొంగలు, హంతకులు అని తెలిసింది. వీళ్ళకి మన బాష కూడా అర్ధంకాదు. వీళ్ళకి ఏదైనా పని అప్పచెప్పితే ఇంక కనికరం అనేది లేకుండా ఎవరు అడ్డు వచ్చిన ఆ పని ముగించే మృగాలు వీళ్ళు."

శివయ్య :- "ఇంత కిరాతకులకి ఈ చిన్న ఊరిలో పని ఏంటి?, నా కొడుకు ని ఎందుకు చంపారు?"

ఇన్స్పెక్టర్ :- "ఆలోచిస్తుంటే, ఈ దుండగులు అంతా శివాలయం లో ఉన్న బంగారం, అమ్మవారి అమూల్యమైన నగలు దొంగతనం చేయడానికి వచ్చినట్టు ఉన్నారు. వీళ్ళకి అనుకోకుండా సూర్యగారు కనిపిస్తే, సాక్ష్యం ఉండకూడదు అని సూర్య మీద దాడి చేసి ఉంటారు. ఆత్మరక్షణ కోసం వాళ్లలో కొంతమందిని చంపి దొంగతనం ఆపి , సూర్యబాబు గాయలతో చనిపోయి ఉంటారు. ఇన్వెస్టిగేషన్ పూర్తియతే గాని నిజాలు తెలీవు."

శివయ్య గారు వాళ్ళ కుటుంభం బాధతో మునిగిపోయి ఉంటారు. బాధతో అలానే సూర్య దహనశంస్కారాలు పూర్తి చేస్తారు. 

శివయ్య గారు అంతా పూర్తి అయినా తర్వాత. ఆలోచిస్తూ.. అసలు ఆ సమయం లో అక్కడ సూర్య ఎం చేసస్తున్నాడని అనుమానం వస్తుంది. వెంటనే పోలీస్స్టేషన్ కి వెళ్తాడు.

శివయ్య :- "ఇన్స్పెక్టర్ గారు, నాకు ఎందుకో అనుమానంగా ఉంది. కావాలనే ఎవరో ఆ హంతకులని మన ఊరికి తీసుకొచ్చి సూర్య చంపడానికి పథకం వేశారని."

ఇన్స్పెక్టర్ :- "ఇలా మీరు ఇన్వెస్టిగేషన్ పూర్తిచేయకముందే ఒక నిర్ణయానికి రావడం మంచిది కాదు శివయ్యగారు. అయినా అలాంటి మనుషుల్ని తీసుకొచ్చి సూర్య ని చంపడానికి ఎవరు ప్రయత్నిస్తారు?"

శివయ్య :- "నాకు తెల్సు ఈ పని చేసింది ఎవరో, రంగా."

ఇన్స్పెక్టర్ :- "ఆయనికి దీనికి ఏంటి సంబంధం శివయ్యగారు, మీరు ఆవేశం తో ఆలోచిస్తున్నారు."

శివయ్య :- "ఈ ఊరిలో ఎవరికీ కూడా బాష రాని పక్క రాష్ట్రం దొంగలతో పరిచేయం ఉండే పరపతి ఎవరికీ లేదు. ఇది ఆ రంగా పనే. అనుమానం ఉన్నవాళ్ళ మీద మీరు కేసు వేస్తారా లేదా నన్ను మీ పైన ఆఫీసర్ ని కలవమంటారా?"

........................................

ధర్మ - వీర లు భయం తో ఏవోవో ఆలోచిస్తూ వీర ఇంట్లో కూర్చుని ఉంటారు. 

వీర :- "నాకెందుకో భయం గా ఉంది ధర్మ, ఈ పాటికి పోలీసులు కి నిజం తెలిసిపోయి ఉంటుంది. వాళ్ళు మనకోసం వచ్చేలోపే నేను వెళ్లి లొంగిపోతా."

ధర్మ :- "నీకేమైనా పిచ్చా, సూర్య చనిపోయింది నా వల్ల, నేను అసలు నీ వెనక రాకుండా ఉండాల్సింది."

వీర :- "అప్పుడు సూర్య తో పాటు నేను కూడా చనిపోయి ఉండేవాడిని."

ధర్మ :- "నువ్వు కుంచెంసేపు ఎం మాట్లాడకు రా వీర, అసలు మీ మీద దాడి చేసిన వాళ్లు ఎవరో అర్ధంకావట్లేదు. పోలీస్లు విచారణ కోసం రమ్మని పిలిచేవరుకు ఇక్కడే ఉందాం."

ఇంతలో వాళ్లు ఉన్న రూమ్ తలుపులు సడన్ గా తెరుచుకొని రాజు వస్తాడు. పోలీసులు అనుకుని భయపడి ఒక్కసారిగా వీర తమ్ముడు రాజు ని చూసి ఊపిరి తిస్కుంటారు.

రాజు :- "అన్న, సూర్యబాబు ని చంపేసారంట. ఊరంతా ఇప్పుడు శివయ్య గారి ఇంటిదగ్గరే ఉంది."

వీర ధర్మ వైపు మెల్లగా భయంతో చూసి మళ్ళీ రాజు వైపు చూసి :- "ఎవరు చంపారు అని పోలీసులు కనిపెట్టారా."

రాజు :- "ఎవరో కొంతమంది దొంగలు పక్క రాష్ట్రం నుండి మన గుడిలో దొంగతనం చేయడానికి వచ్చినవాళ్లతో పోరాడి సూర్యబాబు చనిపోయాడని ఊరంతా అనుకుంటుంది."

అది విన్నాక ధర్మ-వీర లు ఇద్దరికి మనుసు కుంచెం తేలిక అవుతుంది. కానీ సూర్య చనిపోయినందుకు శాంతి ఎంతలా బాధపడుతుందో అని వీర దిగులు పడుతూనే ఉన్నాడు. 

వీర, ధర్మ ని తీస్కుని శివయ్య వాళ్ళ ఇంటికి వెళ్తారు. కానీ అక్కడ ఎవరు ఉండరు. బయట ఒక ముసలితాత కనిపిస్తే వీర శివయ్య గురించి అడుగుతాడు. తాత "శివయ్య ఊరిలో వాళ్ళని తీస్కుని పోలీసుస్టేషన్ కి వెళ్ళాడు." అని చెప్తాడు.

వీర :- "రేయ్ ధర్మ, నువ్వు ఇక్కడే ఉండి ఎవరైనా వస్తున్నారేమో చూడు, నేను లోపలికి వెళ్లి శాంతి ని కలిసి వస్తాను."

ధర్మ :- "రేయ్, ఎం మాట్లాడుతున్నావ్ రా. ఈ సమయంలో ఆ ఇంట్లోకి వెళ్లడం. అది కూడా మనం వెళ్లడం అనేది చాలా ప్రమాదం."

వీర :- "తను, మన వల్లే ఈరోజు బాధలో ఉంది. వెళ్లి తనకి ధైర్యం చెప్పడానికి నేను తప్ప ఎవరు లేరు. నేను వెళ్తున్నా...