Read Dharma - Hero - 7 by Kumar Venkat in Telugu Fiction Stories | మాతృభారతి

Featured Books
  • ధర్మ- వీర - 7

    పనోడు తన ఇంటికి వెళ్లి పెళ్ళాం పిల్లలతో ఊరు వదిలి పారిపోతు ఉ...

  • ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 1

    ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ...

  • అరె ఏమైందీ? - 25

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • మనసిచ్చి చూడు - 10

                   మనసిచ్చి చూడు - 10రెస్టారెంట్లోకి అడుగు పెట్ట...

  • అరె ఏమైందీ? - 24

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

ధర్మ- వీర - 7

పనోడు తన ఇంటికి వెళ్లి పెళ్ళాం పిల్లలతో ఊరు వదిలి పారిపోతు ఉంటారు. 
ధర్మ-వీర లు ఆ పనోడు కోసం వెతుకుతూ ఊరి అవతలకి వెళ్తుంటే ఆ పనోడు వాళ్ళ కుటుంబం తో పారిపోతు కనిపిస్తారు. వెంటనే వీర అక్కడికి వెళ్లి వాడ్ని ఆపుతాడు. 

పనోడు :- "నన్నేం చేయడ్డాయా, నేను పెళ్ళాం పిల్లలతో ఊరు వదిలి పోతున్నాను."

వీర :- "చూడు మేము నిన్ను ఏదో చేయడానికి రాలేదు. నేను, శాంతి ప్రేమించుకున్నట్టు ఇంకా ఆ ఇంట్లో ఎవరికీ చెప్పావు చెప్పు చాలు."

పానోడు :- "సూర్యబాబు కు మాత్రం తెలుసు అని తెలుసు వీరబాబు. అయినా మీరు ఈ ఊరిలో ఉండటం అంత మంచిది కాదు మీరు ఈ ఊరు వదిలి వెళ్లిపోండి లేదంటే మీకే ప్రమాదం."

ధర్మ :- "ఎవరి వల్ల వీర కి ప్రమాదం రాకుండా నెను ఉన్నాను. నువ్వు చేయాలిసింది మాత్రం ఒక్కటే. సూర్య, వీర ని చంపడానికి ప్రయత్నించాడని తెలిసిన వాడు నువ్వు ఒక్కడివే. మాతో వచ్చి శివయ్య గారికి ఈ నిజం చెప్పు చాలు."

పనోడు :- " నావల్ల కాదు ధర్మబాబు, నన్ను, నా కుటుంబాన్ని సూర్యబాబు ప్రాణాలతో వదలరు. నన్ను వదిలేయండి నేను వెళ్తాను. " 

పనోడు అక్కడ్నుండి వాళ్ళ కుటుంభం తో వెళ్ళిపోతాడు. 

వీర :- "నాకెందుకో, ఏదో తప్పు జరుగుతునట్టు అనిపిస్తుంది ధర్మ"

ధర్మ :- "నేను నీకు తోడుగా ఉన్నను వీర, నిన్ను - శాంతి ని కలిపే బాధ్యత నాది."

ఆ పనోడు వాళ్ళ కుటుంభం తో పారిపోయి రంగా ఇంటికి వెళ్తాడు. రంగా మనుషులు అతన్ని బయటే ఆపేస్తారు. ఇంతలో రంగా మనిషి ఒకడు ఇంట్లో నుంచి బయిటికి వచ్చి "అన్న వాళ్ళని తీసుకెళ్లి మన పనివాళ్ళు ఇంట్లో ఉంచమన్నాడు." అని అంటాడు. రంగా వాళ్లకు ఉండటానికి చోటు ఇస్తాడు. రంగా ఆ పనివాడు ఉన్న చోటుకి వస్తాడు. 

పనోడు :- "మీ ఋణం ఈ జన్మలో తీర్చుకోలేనయ్య, ఆ సూర్యబాబు నన్ను చంపాలని చూసారు, కానీ మీరు నన్ను, నా కుటుంబాన్ని ఆదుకుని ఉండటానికి చోటు ఇచ్చారు."

రంగా :- "అసలు నిన్న చంపాల్సిన ఆ సూర్య ఎందుకు వదిలేసాడు రా?"

పనోడు :- "అయ్యా, మీ విషయం మొత్తం సూర్యబాబు కి చెప్పేసానయ్య , నా ప్రాణాలు కాపాడుకోడానికి వేరే దారి కనిపించలేదయ్యా, నన్ను క్షమించండి. మీరు వేసిన పథకం అంతా సూర్యబాబు కి తెలిసిపోయింది. మీరు వేసిన పథకం మీ మీద నే తిప్పి కొట్టాలని చుస్తునాడయ్య." 

రంగా :- "ఎవరు ఎవర్ని తిప్పి కొడతారో అది కూడా చూద్దాం. సర్య కి నిజం తెలియడానికి కారణం నేనే అని ఆ ధర్మ-వీర లకి తెలీదు కదా?"

పనోడు :- "తెలీదయ్య"

రంగా :- "అయితే ఈరోజు రాత్రే ఆ ధర్మ-వీర లలో ఒకడు చావాలి, ఆ సూర్య జైలు కి పోవాలి."

దేవపురి లో సూర్య కూడా, ఆ రోజు రాత్రే వీర ని చంపి, ఆ నింద రంగా మీదకి వేద్దాం అని పథకం వేసాడు. 

రాత్రి అవుతుంది, వీర కి తన ఫోన్ రింగ్ అవుతుంది. 

వీర :- "ఎవరు?"

సూర్య :- "వీర, నేను సూర్య ని. నువ్వు నా చెల్లిని ప్రేమించిన విషయం నాకు తెలిసిన వెంటనే నీతో మాట్లాడకుండా నీ మీదకి మనుషుల్ని పంపించి తప్పు చేశాను. నీతో ఒకసారి మాట్లాడాలి. శివాలయం వెనకకు నువ్వు ఒక్కడివే రా."

వీర "సరే" అని ఫోన్ పెట్టేస్తాడు. వీర పక్కనే ధర్మ కూడా ఉంటాడు. 

వీర :- "ధర్మ, అమ్మకి ఒంట్లో బాలేదు అంట, తమ్ముడు ఫోన్ లో చెప్పాడు, నేను వెంటనే ఇంటికి వెళ్తాను. నువ్వు గ్యారేజ్ లో నే ఉండు."

ధర్మ :- "అమ్మ కి ఒంట్లో బాలేదా, నేను కూడా వస్తాను."

వీర :- "ఇప్పుడు వద్దులే ధర్మ చాలా రాత్రి అయిపోయింది. పొద్దునే అమ్మ కుంచెం కోలుకున్నాక వద్దుగాని."

ధర్మ :- "సరే, అమ్మ జాగ్రత్త." 

వీర గుడికి వెనకాల ఉన్న చెరువు వైపు వెళ్తాడు. అక్కడ సూర్య తనకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. 

సూర్య :- "వచ్చావా వీర, రావేమో అనుకున్నాను. నాకు తెల్సు నేను చేసింది తప్పు అని, దానికి బదులుగా మా ఇంట్లో మాట్లాడి శాంతి కి నీకు పెళ్లి నేను చేస్తాను."

వీర ఏమి మాట్లాడకుండా నిశ్శబ్దం గా నిలబడి చూస్తుంటాడు. 
సూర్య "అయినా నీ కోపం తీరకపోతే నీ కాళ్ళు పట్టుకుంటాను" అని వంగి తన కాలి దగ్గర ఉన్న కత్తిని తీసి వీర ని పోడవబోతాడు. వీర వెంటనే తప్పించుకుంటాడు. వీర, సూర్య చేయి పట్టుకుని తిప్పేస్తాడు, చేతిలో ఉన్న కత్తి కింద పడిపోతుంది. సూర్య, వీర ని కొట్టాలని చూస్తాడు కానీ వీర సూర్య ని కొట్టి కిందపడేసి తన చేయి వెనక్కి తిప్పి సూర్య వీపు మీద కాలు వేసి నుంచుంటాడు. 

వీర :- "నేను నీకు అంత పిచ్చోడిలా కనిపిస్తున్నాన సూర్య? నువ్వు శాంతి అన్న వి అయిపోయావ్ కాబట్టి సరిపోయింది లేదంటే నిన్ను ఇక్కడే నరికి ఈ చెరువులో పడేసి వెళ్ళిపోగలను." 

వీర, సూర్య చేయి వదిలేస్తాడు, సూర్య లేస్తుంటే, సడన్ గా ఆ చెరువులో నుండి ఒకడు కత్తితో ఎగురుతు వచ్చి సూర్య ని పొడవబోతాడు, వీర వెంటనే సూర్య ని పక్కకి తోసేసి కాపాడతాడు. ఆ నిలల్లో నుండి చాలా మంది కత్తులు, రాడ్ ల తో పైకి లేచి, సూర్య, వీర ల వైపు పరిగెడుతూ వస్తారు. 

వీర వాళ్ళని తన్ని, వాళ్ళ ఆయుధాలు లాక్కుని వాళ్ళతో ఫైట్ చేస్తూ సూర్య తో కలిసి అడివిలోకి పారిపోతారు, వీర వాళ్ళతో ఫైట్ చేయడంతో కంటే వాళ్ళనుండి సూర్య ని కాపాడటానికి ప్రయత్నం చేస్తాడు, దాని వల్ల వీర కి గాయాలు అవుతాయి. వీర ని ఒకడు కత్తితో పొడబోతుంటే, చెట్టు మీద నుండి ఒక్కసారిగా ధర్మ దూకి వాడి తల నరికేస్తాడు. ధర్మ చాలా కోపంగా ఆవేశంతో ఉగిపోతు అక్కడ ఉన్నవాళ్ళని కత్తితో నరుకుతూ ఉంటాడు. ధర్మ- వీర లు కలిసి అందర్నీ నరేకుస్తూ ఉండగా ఒకడు వీర ని చంపడానికి పయిగేత్తుకుంటూ వస్తుంటే ధర్మ అతన్ని పొడిచేస్తాడు. వీర ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసి షాక్ అయిపోతాడు. ధర్మ పొడిచింది సూర్య ని. ధర్మ కూడా ఒక్కసారిగా నిశ్శబ్దం తో స్థంభించిపోతాడు. అది చూసి అక్కడ చంపడానికి వచ్చిన వాళ్లు పారిపోతారు.

వీర చేతిలో ఉన్న కత్తి ఒక్కసారిగా కింద పడిపోతుంది. పరిగెత్తుకుంటూ వచ్చి సూర్య ని పట్టుకుంటాడు 

వీర :- "లే, సూర్య, లే, నీకేమైనా అయితే మీ చెల్లి తట్టుకోలేదు, లే సూర్య"

ధర్మ :- "నన్ను క్షమించు వీర, సూర్య చనిపోయాడు."