Read Dharma - Hero - 4 by Kumar Venkat in Telugu Fiction Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ధర్మ -వీర - 4

అది మహా శివరాత్రి, అందరూ ఆ మహా శివుడి దర్శనం చేస్కుని బయట సంతోషంగా జాతర జరుపుకుంటున్నారు. సాయంత్రం 7:00 అవ్వగానే కొంతమంది సారా తీస్కుని పోదల పక్కకు వెళ్లి గ్లాస్ లో పోస్కుని తాగుతు ఉంటారు. హటాత్తుగా వాళ్ళకి పోదల పక్కన ఒక శబ్దం వినిపిస్తుంది, వాళ్లు అటు చూసి భయంతో కేకలు వేస్టు జాతర వైపు నుంచి అరుస్తూ పారిపోతారు. ఒక్కసారిగా అందరూ నిశ్శబ్దం అయ్యి వాళ్లు ఎందుకు పారిపోతున్నారు అని చూసారు. సడన్ గా ఒక పెద్ద పులి జాతర లో ఉన్న జనం మధ్యలోకి వస్తుంది. అది చూసి జనం అంతా భయంతో ఆరస్తూ పరుగులు తీస్తారు. ఒక చిన్న పాప ఆ జనం పరుగులలో పడి ఒంటరిగా కింద ఏడుస్తూ ఉంటుంది, పులి ఆ పాప ని చూసి ఆ పాప దగ్గరికి మెల్లగా నడుస్తూ వెళ్తుంది. ఆ పాప వాళ్ళ అమ్మ తనని దూరం నుంచి చూస్తూ "ఎవరైనాన కాపాడండి" అని అరుస్తుంది. ఆ పులి ఒక్కసారిగా ఆ పాప మీదకి ఎగిరింది, ఇంతలో ఒక పెద్ద బండరాయ వచ్చి పులికి తగులుతుంది, పులి దెబ్బకి ఎగిరి అవతల పడిపోతుంది. అందరూ, ఎవరు అంత పెద్ద బండరాయ విసిరింది అని తిరిగి చుస్తే ధర్మ - వీర లు చేతికి అంటిన మట్టి దులుపుకుంటూ ఉంటారు. 

వీర :- " ధర్మ వెంటనే వెళ్లి కాగాడా ని వెలిగించి తీసుకురా.. పులి ని భయపెట్టి ఇక్కడ్నుంచి అడివిలోకి పంపించేద్దాం "

ధర్మ :- "సరే వీర .. "

ధర్మ గుడి లోపలికి వెళ్లి కాగాడా వెలిగిస్తాడు, పులి వీర వైపుకి పరిగెడుతూ వస్తుంది. వెంటనే ధర్మ వీర కి నిప్పు తో వెలుగుతున్న కాగాడా ని విసిరేస్తాడు. అది పట్టుకుని వీర పులి వైపు కి చూపించి దాన్ని భయపెడదామని చూస్తాడు కానీ పులి దడవకుండా వీర వైపు చూస్తూ ముందుకు వస్తుంది. వీర ఇంక తన పని అయిపోయింది అనుకున్నాడు. వెంటనే ఒక తుపాకీ పెలిన పెద్ద శబ్దం వినిపిస్తుంది, ఆ శబ్దనికి పులి అక్కడనుండి అడివిలోకి పారిపోతుంది. అక్కడ జనం అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుని, వెనక్కి తీరిగి చుస్తే ఒక పెద్ద తుపాకీ పట్టుకుని రంగా వాళ్ళ మనుషులతో నుంచుని ఉంటాడు. అది చూసి జనాలు రంగా కి జై జై లు కొడతారు. 

తర్వాత రోజు శివ్వయ గారు, అసలు అడివి లో పులి, జాతర జరుగుతున్న చోటుకి ఎలా వచ్చింది అని వెళ్లి అడివిశాఖ అధికారులు ని కలుసి అడుగుతారు. 

ఫారెస్ట్ ఆఫీసర్ :- "చూడండి శివయ్య గారు, గుడి ఉండే చోటు అడివికి దగ్గరగా ఉంది. మన ఊరు కూడా పట్టణానికి దగ్గరగా ఏమి లేదు. ఊరు లోకి అప్పుడప్పుడు చిరుత పులులు, గుంటనక్క లు, కోతులు వచ్చేవి. నిన్న పులి వచ్చింది. దీనికి మీరేం దిగులు పడాల్సిన అవసరం లేదు."

శివయ్య :- "దిగులు పడద్దు అంటే ఎలా అండి? నిన్న పులి వళ్ళ ఎవరికైనా ఏమైనా జరిగి ఉంటే."

ఫారెస్ట్ ఆఫీసర్ :- "ఇకనుంచి ఊరు లోకి అడివి జంతువులు ఏమి రాకుండా మేము చూస్కుంటం. మీరు ఇక వెళ్ళండి."

శివయ్య కోసం ఊరంతా పంచాయతీ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. 

శివయ్య :- "ఇక ఎవరికీ ఎం ప్రమాదం ఉండదు, అన్ని విషియలు ఫారెస్ట్ ఆఫీసర్ తో మాట్లాడి వస్తున్నాను."

అప్పుడే అక్కడికి రంగా వాళ్ళ మనుషుల తో అక్కడికి వస్తాడు. 

ప్రజలు అందరు రంగా కి నమస్కారం చేస్తారు. శివయ్య రంగా వైపు అసూయ గా చూస్థాడు.  

ప్రజలు శివయ్య తో "రంగా కానీ రాకపోయి ఉంటే మన పరిస్థితి ఏమై ఉండేది అయ్యగారు, రంగా సమయానికి వచ్చి పులి ని అక్కడ్నుండి తారీమేశాడు" అని అంటారు. 

రంగా :- "అయ్యో, అవేం మాటలు అన్న, మన ఊరికి కష్టం వస్తే నాకు కష్టం వచ్చినట్టే. మిమ్మల్ని కాపాడటం నా బాధ్యత."

ఆ జనం లో నుంచి ఒక పెద్దాయన లేచి "అసలు మనల్ని కాపాడిన వారిని వదిలేసి, రంగా ని పొగుడుతారు ఏంట్రా? ధర్మ-వీర లు సమయానికి రాకపోయి ఉంటే నా మనవరాలు ఈరోజు బ్రతికుండేది కాదు." అని అంటాడు 

ఇంకొక అతను లేచి "అది నిజమే, పులిని పక్కదారి పట్టించి దాంతో పోరాడింది కూడా మన ధర్మ - వీర లే, చివరిలో రంగా గారు తుపాకీ తో దాన్ని భయపెట్టి అడివిలోకి తరీమేసారు. అదిగో మాటల్లోనే ధర్మ- వీర లు వచ్చేసారు."

ధర్మ - వీర లు అప్పుడే ధర్మ బైక్ మీద అక్కడికి వస్తారు. 

శివయ్య :- "ధర్మ, వీర, మీరిద్దరూ నిన్న చేసిన సహాయానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు." 

వీర :- "పర్వాలేదు శివయ్యగారు, మన ఊరు అంతా ఒక కుటుంభం, వాళ్ళకి ఎం జరగకుండా చూసుకోవడం కూడా సహాయం ఎలా అవుతుంది శివయ్యగారు."

ధర్మ :- "మీరేం అనుకునంటే నాకో సందేహం వచ్చింది రంగా గారు అడగచ్ఛా."

రంగా :- "చెప్పు ధర్మ."

ధర్మ :- "ఊరిలోకి పులి వచ్చినట్టు నికెలా తెలిసింది, ముందే తుపాకీ పట్టుకుని జాతర దగ్గరకి వచ్చేసారు. లేదంటే తుపాకీ ఎప్పుడు మీతోనే ఉంటుందా? నేను అయితే ఎప్పుడు చూడలేదు మిమల్ని తుపాకీ తో. "

ధర్మ మాటలు విని ఊరు జనం వారిలో వారే గోనుకుతూ మాట్లాడుకుంటుంటారు. 

రంగా తడబడుతతూ "తుపాకీ ఎప్పుడు నాతోనే ఉంటుంది, ఎప్పుడు ఎం జరుగుతుందో తెలీదు కదా"

వీర :- "అయితే ఈ ఊరిలో అందర్నీ మీరు శత్రువులగా చూస్తున్నారా? అంటే తుపాకీ పట్టుకుని ఎవరు ఈ ఊరిలో తిరగరు, మీరు మాత్రం ఊరి జనం మీద నమ్మకం లేకుండా.. ఎప్పుడు ఎవరు ఎం చేస్తారో వాళ్ళని చంపేద్దాం అని తుపాకీ తో ఉండడం నిజంగా ఈ ఊరి ప్రజలకి చేసిన అవమానం." 

అది విని రంగా ఎం మాట్లాడకుండా అక్కడ్నుండి వాళ్ళ మనుషులతో వెళ్ళిపోతాడు. 

వీర :- "శివయ్య గారు, నాకెందుకో రంగా మీదే అనుమానం గా ఉంది. మీరు ఈ విషయాన్నీ ఇంతటితో వదలద్దు." 

ప్రజలు అందరూ "అవును అయ్యగారు" అని అంటారు

రంగా చాలా కోపంగా ఉంటాడు, అతని మనిషిని పిలిచి "ధర్మ -వీర లు, నా పథకం మొత్తాన్ని చెడగొట్టారు. ఈ ఊరి ప్రజలకి నా పైన నమ్మకం కలుగుతుంది అనేలోపు వాళ్లు ఎక్కడ్నుంచి వచ్చారో, వచ్చి మొత్తం నాశనం చేశారు. వాళ్లు ఉన్నంత వరుకు ఈ ఊరు నా చేతిలోకి రాదూ. వాళ్ళని ఏదో ఒకటి చేయాలి." అని అంటాడు. 
అప్పుడు వాళ్ళ మనిషి " ధర్మ, వీర కలిసి ఉన్నంత వరుకు వాళ్ళని ఎం చేయలేము అయ్యా. " 

రంగా :- " అయితే వాళ్ళని విడగొట్టాలి, అదొక్కటే మార్గం"

అప్పుడు వాళ్ళ మనిషి "అది అసాధ్యం అయ్యా, వాళ్లని విడగొట్టాలెం, చిన్నపటినుండి వాళ్లు ప్రాణస్నేహితులు" అని చెప్తాడు. 

రంగా :- "ప్రీతి బలవంతుడికి ఒక బలహీనత ఉంటుంది, వాళ్ళైద్దర్లో ఎవరో ఒకరికైనా ఏదో ఒక బలహీనత ఉండే ఉంటుంది అదేంటో కనిపెట్టండి." 

వీర, శాంతి ఊరి చివర ఉన్న వంతెన దగ్గర మాట్లాడుకుంటూ 0ఉంటారు. 

శాంతి :- " నిన్న నువ్వు పులితో ఫైట్ చేసేసరికి, మా నాన్నకి తెగ నచ్చేసావ్. ఇంట్లో కూడా నీ గురించే మాట్లాడాడు. ఇక మన పెళ్లి జరిగిపోయినట్టే. "

వీర :- "అయినా పులితో ఫైట్ చేసింది నేను మాత్రమే కాదు, అక్కడ ధర్మ కూడా ఉన్నాడు. అయినా పులితో ఫైట్ చేస్తే కానీ మీ నాన్న మన ఇద్దరికీ పెళ్లి చేయడా?."

శాంతి :- " ఏ? మన పెళ్లి కోసం నువ్వు పులితో కూడా ఫైట్ చేయలేవా? "

వీర :- "అమ్మ తల్లి, అది పులి.. పిల్లి కాదు. అయినా నీకోసం ఒక్క పులి ఏంటి పది పులులతో యుద్దానికి సిద్ధం."

అది విని శాంతి గట్టిగ వీర ని హాగ్ చేసుకుంటుంది. 

శాంతి ఒక్కసారిగా వీర ని తోసేసి, "ఎం చేస్తున్నావ్ నువ్వు అసలు? ఒక పెద్దింటి అమ్మాయితో ఇలాగేనా ప్రవర్తించేది. నిన్ను ఈ ఒక్కసారికి క్షమించేశాను, వేళ్ళు ఇక్కడ్నుండి." 

వీర :- "ఏమైంది శాంతి, హటాత్తు గా పిచ్చిపట్టినట్టు చేస్తున్నావ్?" 

శాంతి :- "వీర, ఇక మన పని అయిపోయిందిరా."