Read Dharma - Hero - 6 by Kumar Venkat in Telugu నాటకం | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ధర్మ- వీర - 6

వీర :- "నీకు ఏప్పట్నుంచి తెల్సు?"

ధర్మ :- "నాకు మొదటినుంచి తెల్సు, కానీ ప్రాణానికి ప్రాణమైన నా దగ్గరే నిజం దాచావంటే నీ ప్రేమ ని ఎంతలా కాపాడాలని అనుకుంటున్నావో నేను అర్ధంచేసుకున్నాను. నువ్వు ఏదో ఒక కారణం చెప్పి నన్ను కలవకుండా బైటికి పని మీద పోతున్నా అని చెప్పినప్పుడు, శాంతి దగ్గరికే వెళ్తున్నావని నాకు తెలుసు. అందుకే ఎప్పుడు నిన్ను నాకంటే ముఖ్యమైన పని ఏముందిరా అని అడగలేదు."

వీర :- "నన్ను క్షమించు, నేను నికు ముందే చెప్పాల్సింది. నమ్మకం లేక కాదు, భయంతో చెప్పలేదు. కానీ ఇప్పుడు ఆ భయమే నిజమైంది."

ధర్మ :- "నా దగ్గర కూడా నిజం దాచిన నువ్వు, అజాగ్రత్తగా తెలీకుండా ఏదో తప్పు చేసావ్. మనకు కాకుండా ఈ విషయం ఇంకెవరికి తెల్సు?"

వీర కుంచెం అలోచించి ఒక్కసారిగా సమాధానం దొరికి :- "వాళ్ళ ఇంటి పనోడు, వాడే నిన్న మమ్మల్ని చూసాడు. కానీ పెద్ద ఇంటి విషయాల్లో తలదుర్చడానికి వాడికి అంత దైర్యం ఎక్కడిది. వెంటనే వాడ్ని కనిపెట్టాలి."

ధర్మ :- "ముందు నీ తలకి అయినా గయానికి మందు పూయాలి, ఇంటికి వెళ్దాం పద, ఆ తర్వాత వాడ్ని కనిపెడదాం."

వీర :- "పర్వాలేదు, నేను బాగానే ఉన్నాను."

ధర్మ :- "వీర.. నేను చెప్పేది విను, ముందు ఇంటికి వెళ్దాం. నీ పరిస్థితి అంత బాలేదు, నాకూడా దెబ్బలు తగిలాయి. రేపటి లోపు వాడ్ని పట్టుకుని ఈ విషయం ఆ ఇంట్లో ఇంకా ఎవరికీ చెప్పాడో తెల్సుకుందాం. ఆ తర్వాత శివయ్య గారి తో మా నాన్నని వెళ్లి మాట్లాడమంటాను."

వీర సరే అని ధర్మ తో వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వీళ్ళు మాట్లాడుకున్నది అంతా వీర ని చంపడానికి వచ్చిన వాళ్లలో ఒక గుండా దాక్కుని వింటాడు. వెంటనే సూర్య దగ్గరికి వెళ్తాడు. 

సూర్య :- "ఏమైంది రా, వీర పని అయిపోయినట్టే నా?"

గుండా :- "లేదు అయ్యగారు, వీర ని కస్టపడి పట్టుకొని వాడి కథ ముగించే సమయానికి ధర్మ అక్కడికి వచ్చి అంతా నాశనం చేసాడయ్య."

సూర్య :- "ఛ! ఇందుకేనా మిమ్మల్ని పంపించింది. ఇది చేయించింది ఎవరని వాళ్ళకి ఎవరికీ అనుమానం రాలేదు గా?"

గుండా :- "మాలో ఒకడు వాళ్ళకి దొరికిపోయినప్పుడు మీరే ఇదంతా చేయించారాని చెప్పేశాడయ్య."

సూర్య కోపంతో ఆ వ్యక్తి ని గట్టిగ కాలితో తంతాడు 

సూర్య :- "ఎందుకు పనికిరాని వెధవల్లారా, ఈ విషయం ఇంక ఎవరికీ తెలియకూడదు ముక్యంగా నాన్నగారికి, ఇది ఇక్కడితో వదిలేయండి ఇక నేను చూసుకుంటాను."

గుండా :- "అయ్యా, మీకు ఫోన్ చేసి మీ చెల్లెలు గురించి మాట్లాడింది ఎవరో, వాళ్లిద్దరూ మాట్లాడుకుంటుంటే విన్నానయ్యా."

సూర్య :- "ఎవడ్రా వాడు?"

గుండా :- "వాళ్లు మీ ఇంటి పని వాడి గురించి మాట్లాడుకుంటున్నారు అయ్యా, వాడే మీ చెల్లెలుగారు ఆ వీర కలిసినప్పుడు చూసింది."

సూర్య :- "వెంటనే వెళ్లి వాడు ఎక్కడ ఉన్నా సరే, నా ముందికి ఇడ్చుకురండి." 

సూర్య దగ్గరికి ఆ పానోడిని తీసుకొచ్చి పడేస్తారు. 

సూర్య :- "ఏరా, మా ఇంట్లో పని చేస్తూ నా చెల్లెలి గురించి నాతోనే ఫోన్లో తప్పుగా మాట్లాడతావా" 
సూర్య తన ఇంటి పనోడిని కాలితో గట్టిగ తంతాడు. 

సూర్య :- "వీడిని ఊరి చివరికి తీసుకెళ్లి చంపేసి అక్కడే పాతేయండి"

పనోడు :- "అయ్యా..., మీతో ఫోన్లో మాట్లాడింది నేను కాదు అయ్యా. నేను మీ చెల్లెలిగారి గురించి కేవలో ఒకరికి మాత్రమే చెప్పాను."

సూర్య :- "ఎవరికి చెప్పావ్ రా? నాతో మాట్లాడింది ఎవరు?

పనోడు :- "రంగా, అయ్యగారు."

సూర్య :- "రంగా నా?"

పనోడు :- " అవును అయ్యాగారు, మీరు వీర గారిని చంపితే, మీ చెల్లెలుగారిని ప్రేమించినందుకు మీరే చంపేశారు అని ఊరంతా అనుకునేలా చేసి మిమ్మల్ని ఒడిద్దాం అనుకున్నాడు. "

సూర్య :- "నేను వీర ని చంపుతా అని వాడికి ఎలా తెలుసు రా?"

పనోడు :- "మీరు చంపకపోయినా, రంగానే వీర ని చంపేసి ఆ నేరం మీ మీద వేసేద్దాం అనుకున్నాడుయ్య." 

సూర్య :- "అసలు వీర ని చంపాల్సిన అవసరం వాడికి ఏంటిరా? వాడికి కావాల్సింది నేను కదా మరి వీర ని ఎందుకు చంపాలని చూస్తున్నాడు?"

పానోడు :- "రంగా ఫారెస్ట్ ఆఫీసర్ తో కలిసి పథకం వేసి శివరాత్రి రోజు పులి ని వదిలారు. ఆ పులి ని చంపి రంగా ఊరిలో దేవుడు అయిపోయి ఎలక్షన్ లో గెలుద్దాం అనుకున్నాడు. కానీ వీర, ధర్మ అక్కడికి వచ్చి రంగా పథకం అంతా చెడగొట్టారు. అంతేకాకుండా ఊరి పంచాయతీ లో ప్రజలందరికి రంగా మీద అనుమానం వాచ్చేలా మాట్లాడి ఆవుమానించారు. అందుకే ఆ వీర ని చంపి మీ మీద నేరం వేసి ఒకేసారి మీ ఇద్దరి సంగతి తెల్చేయాలనుకున్నాడు."

సూర్య :- "వాడు కాదు నా సంగతి తెల్చేది, నేనే వాడి పథకం ఉపయోగించి వాడ్ని, వీర ని ఇద్దర్ని లేపేస్తాను. వీర ని చంపి, తన పనులన్నీటికి వీర అడ్డుగా వచ్చినందుకు రంగా నే వీర ని చంపడాని ఊరి ప్రజలందరూ నమ్మేలా చేస్తాను. నువ్వు ఈ ఊరిలో కనిపించడానికి వీలు లేదు. మళ్ళీ ఈ ఊరిలో కానీ, నా కళ్ళముందు కానీ కనిపిస్తే అదే నీకు ఆఖరి క్షణం అవుతుంది. వేళ్ళు ఇక్కడ్నుండి."

పనోడు అక్కడ్నుండి లేచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్ళిపోయాడు 

సూర్య బిగ్గరగా నవ్వుతు :- "ఇక నాకు అడ్డు వచ్చే వాళ్ళని ఎవ్వరిని నేను వదలను"