Read Dharma - Hero - 1 by Kumar Venkat in Telugu Fiction Stories | మాతృభారతి

Featured Books
  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

  • అరె ఏమైందీ? - 22

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 8

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • రామాపురం హై స్కూల్ రోడ్

    నా పేరు విజయ్ మా గ్రామం పేరు రామాపురం. నేను టెన్త్ క్లాస్ వర...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

ధర్మ -వీర - 1

Note :- ఈ కథలో ఉన్న పాత్రలు, ఊరు, అన్ని కల్పితం మాత్రమే. ఎవర్ని ఉద్దెశించి రాసింది కాదు. 
ఈ కాన్సెప్ట్ ని నాకు చెప్పింది నా ఫ్రెండ్ నాని, దాన్ని డెవలప్ చేసి నేను స్టోరీ రాస్తున్న. ఈ నవలలో నా క్రెడిట్ ఎంత ఉందొ నా స్నేహితుడు నాని కి కూడా అంతే క్రెడిట్ ఉంది. 

కథ ::

అది దేవపురి అనే ఊరు, దేశానికి స్వతంత్రం వచ్చి 32 ఏళ్ళు అయినా కూడా ఇంకా ప్రజలు కులం, మతం అనే బేదాలతో వేరుగా ఉన్న రోజులు అవి.

ఆ దేవపురి కి రక్షకుడిగా ఆ మహా శివుడు అక్కడ కాల రుద్రుడు గా పూజలు అందుకుంటున్నాడు. ప్రజలు కుల, మతాల బేదాలని వాళ్ళోలోనే కాకుండా ఆ మహా శివుడి ముందు కూడా ఆచరించేవారు. 

ఒక రోజు పక్క ఊరు జమిందార్ గారి అబ్బాయి వాళ్ళ భార్య, కూతురు ఇంకా వాళ్ళ మనుషులతో 4 కార్స్ లో ఆ మహా శివుడి దర్శనం కోసం దేవపురి వచ్చారు. 

ఒక కార్ లో నుండి ఒక చిన్న పాప తన కుక్కపిల్లతో కార్ దిగి వాళ్ళ నాన్న తో "నాన్న నేను మన చింటూ గాడ్ని కూడా గుడి లోకి తీసుకురావచ్చా?" అని అడుగుతుంది. 

అప్పుడు వాళ్ళ నాన్న "తప్పకుండ కన్నా , ఈ గుడి పెద్దలు మన కులం వాల్లే , మనల్ని వద్దు అని ఎవరు ఆపరు " అని అంటాడు.

ఆ కుటుంభం వాళ్ళ మనుషుల్ని గుడి బయట ఉండమని చెప్పి, లోపాలకి వెళ్తుంది. 

ఆ గుడిలో మొత్తం 11 బావులు ఉంటాయి . ఆ 11 బావి లో ఉన్న నీటితో స్నానం చేస్తే చేసిన పాపలన్ని పోతాయి అని ఆ ఉరి నమ్మకం, ఆ పిల్లవాడు బావిలోని నీటి ని తొడటానికి తన చేతిలో ఉన్న కుక్క పిల్లని గట్టు మీద పెడతాడు . ఆ కుక్కపిల్ల పొరపాటున బావిలో పడిపోతుంది. వెంటనే కంగారుగా ఆ పిల్లవాడు భయంతో "ఎవరైనా నా చింటూ ని కాపాడండి అని అరుస్తూ ఉంటాడు. అందరూ ఆ బావి చుట్టూ నుంచుని చూస్తు ఉంటారు కానీ ఎవరు బావి లోకి దిగడానికి ప్రయత్నం చేయరు. అప్పుడే ఎవరో వేగంగా పరిగెత్తుకుంటూ ఆ బావి లోకి దూకుతారు, మునిగిపోతున్న ఆ కుక్క పిల్లని పట్టుకుంటాడు. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు బావి లోకి తాడు వేస్తారు. ఆ తాడు పట్టుకుని అతను జాగ్రత్తగా ఆ కుక్కపిల్లతో పైకి వస్తాడు. 

పైకి వచ్చాక చుస్తే అతను ఒక 19 ఏళ్ళు ఉన్న ఒక కుర్రాడు.
  
ఆ కుర్రాడ్ని చూసి అక్కడ జనం అతన్ని గుర్తుపడతారు, అందరూ ఆ కుర్రాడి వైపు వింతగా చూస్తారు. అక్కడ ఉన్న జనం "గుడి లోపలకి వచ్చేసాడే, అపచారం జరిగింది" అని గోనుకుతూ ఉంటారు. 

ఆ చిన్న పాప ఆ కుర్రాడికి థాంక్స్ చెప్పి కుక్క పిల్లని చేతిలోకి తీసుకుంటుంది. ఆ పాప వాళ్ళ నాన్న వెంటనే ఆ కుర్రాడ్ని చంప మీద కొట్టి అత్తడ్ని అవతలకి తోసేసి "నిన్ను గుడి లోపలికి ఎవరు అనుమతించారు? నా మనుషులు వస్తుంటే వాళ్ళకంటే ముందు బావి లోకి దూకి గుడి లోపలకి రావడమే కాకుండా నా ఇంటి కుక్క ని పెట్టుకుంటావా?. నీలాంటి తక్కువ కులం వాళ్ళు ఈ గుడి దరిదపులో కూడా కనబడకూడదు. రేయ్ వచ్చి వీడ్ని బయటికి టాసయాండ్రా" అని వాళ్ళ మనుషలకి చెప్తాడు. 

అక్కడ ఉన్న జనంలో ఒకడు తన పక్క వాడితో "రాము , వీడికి ఈరోజు అదృష్టం అస్సలు బాగోలేదురా " అంటాడు.

ఆ పక్కనోడు "అవునురా దాము , ఎంత దైర్యం లేకపోతే గుడి లోపల అడుగు పెడతాడు." 

రాము :- "నేను చెప్పింది నీకు సరిగ్గా అర్ధం కాలేదు అనుకుంట , నేను చెప్పేది ఆ పక్క ఊరు నుంచి వచ్చిన జెమిందారి గారి పొగరుబోతు కొడుకు గురించి, లేకపోతె వాడు చేయి చేసుకుంది 'వీర' మీద అని వాడికి ఇంకా తెలీదు పాపం."

ఆ కుర్రాడ్ని జమిందారి గారి మనుషులు గుడి బయటికి తోసేస్తారు.

ఆ కుటుంభం మళ్ళీ వెనక్కి తిరిగి లోపలికి వెళ్తుంటే, సడన్గా వాళ్ళ కాళ్ళ ముందు వాళ్ళ మనుషులు గాల్లోకి ఎగిరి పడి నొప్పితో అరుస్తూ ఉంటారు. వెనక్కి తిరిగి వాళ్ళు చూస్తారు. 

దాము :- "ఏంటి రాము , వీర ఇంత పెద్ద దెబ్బ కొట్టాడు?"

రాము :- "కొట్టింది వీర కాదురా, సరిగ్గా చూడు వీర బలం వాడి వెనకాలే కనిపిస్తుంది , ఆ బలం పేరే 'ధర్మ'."

వెంటనే ధర్మ ని కొట్టడానికి వాళ్ళ మనుషులు పరిగెత్తుకుంటూ వచ్చి ధర్మ మీద పడతారు. వెంటనే వీర అడ్డు వచ్చి వాళ్లందర్నీ గాల్లోకి లేపి వాళ్ళ దుమ్ము దులిపేస్తాడు. 
ధర్మ-వీర కొట్టె దెబ్బలకి వాళ్ళ మనుషులు గుడి అవతల ఎగిరి పడతారు. 

జమిందారి గారి అబ్బాయి కోపంతో వాళ్ళని చూస్తూ ఉనిడిపోయి "అసలు ఎవర్రా మీరు?" అని అడుగుతారు. 

ధర్మ :- "చేసిన సహాయానికి కృతజ్ఞత చూపించకపోయినా పర్వాలేదు కానీ, కులం పేరుతొ అవమానం చేసావ్ చూడు , నీలాంటి నీచుడు ఈ గుడిలోకి రాకుండ ఉండాల్సింది."

అతని మనుషులు ధర్మ-వీర మీద దాడి చేయడానికి వాళ్ళ మీదకి వెళ్తారు. కానీ వాళ్ళు ఇద్దరు వాళ్ళని బంతి ల తన్ని అవతల పడేస్తారు. 

ధర్మ :- గుర్తుపెట్టుకోండి , వీర నా శా్నేహితుడు. నా ప్రాణం , మేము ఇద్దరం కులం లో వేరు అయినా, నా గొంతులో ఊపిరి ఉన్నంత వరుకు నాతోనే నా వీర కూడా గుడిలోకి వస్తాడు."

వీర :- "ధర్మ, పెద్దవాళ్ళు పెట్టిన నీయమాలు నాకోసం నువ్వు మార్చాకూడదురా."

ధర్మ :- "ఈ గుడి పెద్ద మా తాత గారు, రానున్న భవిషత్తు లో ఈ గుడి పెద్దగా నేను ఉంటాను. కిలం, మతం అనే వివిక్షత ఎక్కడ ఉన్న, గుడిలో మాత్రం నేను అస్సలు ఉండనివ్వను."

ధర్మ , వీర చేయి పట్టుకుని గుడిలోకి తీస్కుని వెళ్తాడు. అప్పుడే పూజ పూర్తియ్యి పూజారి హారతి ఇస్తూ ఉంటుంటే, ధర్మ తన చేత్తో వీర కి హారతి ఇస్తాడు. వీర గర్వంగా నవ్వుతు ఆ మహా శివుడి కి నమస్కరిస్తాడు. 

దాము :- "విళ్ళు ఇద్దరు ఇప్పుడే ఇలా ఉన్నారంటే, ఇంక పెద్ద అయ్యాక ఎలా ఉంటారో."

రాము :- "ఎలా ఉన్న వాళ్ళు ఇద్దరు వేరు వేరు కాదురా దాము , ధర్మ , వీర ఎప్పటికి ఒక్కళ్ళే . ధర్మ-వీర."


 

 

హాయ్ ఫ్రెండ్స్ , ఇది జస్ట్ ఇంట్రడక్షన్ చాప్టర్ మాత్రమే , అసలు కథ ముందు ఉంది , మీకు కచ్చితంగా ఈ స్టోరీ నచుతుంది . ప్లీజ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే క్షమించండి . థాంక్స్ అందరికి.