Read Truth - 30 by Rajani in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

నిజం - 30

గంగ, సాగర్ అక్కడకు వస్తూ వుండటం చూసిన భద్రం అదిగో గంగమ్మ వాళ్ళు వస్తున్నారు అంటూ వాల్లవైపు చూస్తూ ఉన్నాడు.
విజ్జి : అదేంటి బాబాయ్ వాళ్ళ వైపు అలా చూస్తూ ఉన్నారు.
వాళ్ళని అలా చూస్తుంటే అచ్చం పార్వతీ పరమేశ్వరుల లాగా వున్నారు అని సాలోచనగా అనేసి , అయ్యో నోట్లోంచి అలా వచ్చేసింది ఏమి అనుకోకండి అన్నాడు భద్రం.
విజ్జి : పర్లేదు బాబాయ్ మాకు కూడా అలానే అనిపించింది మీరు పైకి అన్నారు మేము అనలేదు అంతే.
భద్రం ఆశ్చర్యపోతూ అంటే గంగమ్మ , సాగర్ బాబు అని మాట పూర్తి చేయకుండా ఆపేశాడు
విజ్జి : అవును గానీ అప్పుడే తాతయ్య ,బామ్మ ల దగ్గర ఈ విషయం అనకండి బాబాయ్ ప్లీజ్.
అయ్యో నేనేం అనను కానీ సాగర్ బాబు అంటే అమ్మగారికి ,అయ్యగారికి కూడా మంచి అభిప్రాయం ఉంది ఈ విషయం తెలిసాక వాళ్ళు కూడా ఆనంద పడతారు అన్నాడు భద్రం.
ఈ సాగర్ గాడి లైన్ బాగానే క్లియర్ అవుతుంది నా పరిస్థితి ఏంటో నా దేవి నన్ను ఎప్పుడు కరుణిస్తుంది అని మనసులో అనుకున్నాడు విజయ్ విజ్జిని చూస్తూ.
అక్కడకు వచ్చిన గంగ , సాగర్ వాళ్ళతో కూర్చొని కబుర్లలో పడ్డారు మళ్ళీ .
విజయ్ అక్కడి నుంచి లేచి నేను ఒక కాల్ మాట్లాడి వస్తాను అంటూ ఫోన్ చేతిలోకి తీసుకొని చెరువు దగ్గరికి బయలుదేరాడు , ముందుకు నడుస్తూ తనను ఎవరో చూస్తున్నట్టు అనిపించింది వెనక్కి తిరిగి చూసిన విజయ్ కి విజ్జి తనవైపే చూస్తూ కనిపించింది .
విజయ్ తన వైపు చూడగానే వెంటనే మొహం తిప్పేసుకుంది విజ్జి .
నా మీద ఇష్టం వున్నా సరే బయటపడదు రాక్షసి అనుకుంటూ నవ్వుకొని ముందుకు వెళ్ళిపోయాడు విజయ్.
చీ అనవసరంగా బుక్ అయ్యాను ఇప్పుడు వాడి వైపు చూడక పోతే ఏం అని తనను తానే మనసులో తిట్టుకుంది విజ్జి.
విజయ్ ఒక నంబర్ కు కాల్ చేసి హలో మామయ్య అన్నాడు సీరియస్ గా.
ఎన్ని రోజులయ్యింది రా మామయ్య అని నన్ను పిలిచి, ఎప్పుడు చూసినా డ్యూటీలో వున్నా అంటూ సర్ అని పిలుస్తూ ఉంటావ్ అన్నాడు ఫోన్ లిఫ్ట్ చేసిన డిసిపి పద్మనాభం.
ముందు నన్ను ఈ వూరికి ఎందుకు పంపారో చెప్పండి మామయ్య అన్నాడు విజయ్ గంభీరంగా .
అదేంటీ కొత్తగా అడుగుతున్నావు నీకు అక్కడకు వెళ్లకు ముందే చెప్పాగా అర్జెంట్ రిక్వైర్మెంట్స్ అని అన్నాడు పద్మనాభం తడబడుతూ.
విజయ్ : మీ మాటల్లో తడబాటే చెబుతుంది మామయ్యా అది అబద్ధం అని , ఇప్పటికయినా నిజం చెప్పండి , నా దగ్గర ఏం దాస్తున్నారు .
ఒకసారి నిట్టూర్చిన పద్మనాభం నీ దగ్గర ఏ విషయం దాచి పెట్టాలని నేను అనుకోలేదు కానీ ఆ వూరిలో పరిస్థితుల గురించి తెలీకుండా నీకు అప్పుడే ఏమీ చెప్పొద్దని మీ అమ్మ అన్నది రా అందుకే నీకు ఏమీ చెప్పలేదు అన్నాడు పద్మనాభం.
సరే ఇప్పుడైనా ఏం జరిగిందో చెప్పండి అన్నాడు విజయ్ .
సరే అని జరిగింది చెప్పడం మొదలు పెట్టాడు పద్మనాభం .
పద్మనాభం : మీ నాన్న నేను ఒకే సారి పోలీస్ ట్రైనింగ్ లో జాయిన్ అయ్యి మంచి స్నేహితులం అయ్యాం నా ద్వారా నా చెల్లి తో పరిచయం అయ్యాక వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు. మీ నాన్న మా ఫ్యామిలీ కి కూడా బాగా నచ్చాడు , మీ నాన్న డ్యూటీ లో జాయిన్ అయిన కొన్ని రోజులకు మీ అమ్మని తీసుకొని తన వూరికి వెళ్ళాడు , అక్కడ వాడికీ వాళ్ళ నాన్న కి అయిన గొడవతో మళ్లీ ఆ వూరికి వెళ్లనని పంతం పట్టాడు మీ నాన్న , మేమంతా వాడికి నచ్చ చెప్పటానికి చాలా ప్రయత్నించాం కానీ మీ నాన్న వినలేదు , మా నాన్నకి నా కంటే ఆయన వూరికి ఇచ్చిన మాట ముఖ్యమైంది నా సంతోషం తో ఆయనకి పని లేదు ఆయన పరువే ఆయనకి ముఖ్యం అయ్యింది అంటూ భాధ పడ్డాడు , కొన్ని రోజుల తర్వాత వాడే మారతాడులే అనుకొని మేమే దగ్గరుండి పెళ్లి చేశాం .
తర్వాత ఎవరి డ్యూటీ లో వాళ్ళం బిజీ అయిపోయాం.
మీ నాన్న చనిపోయే ముందు తన ఫ్యామిలీ తో మిమ్మల్ని కలపాలని మాట తీసుకున్నాడు , తన వాళ్ళకి దూరంగా వుండి తనలో తను ఎంత బాధ పడ్డాడో ఆరోజే తన మాటల్లో తెలిసింది . నీకు ఇదంతా చెబుదామనుకున్నాను కానీ మీ అమ్మ చెప్పొద్దని అంది అందుకే నీకు అబద్ధం చెప్పి పంపాను సారీ రా అన్నాడు పద్మనాభం భాధగా.
విజయ్ : కానీ అమ్మ నాకు ఇదంతా చెప్పొద్దని ఎందుకు అంది , ఆ వూరికి వెళ్లిన నాకు ఎప్పటికయినా నిజం తెలుస్తుంది కదా మామయ్యా అని అడిగాడు విజయ్ అనుమానంగా.