Read Truth - 11 by Rajani in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
  • ధర్మ- వీర - 6

    వీర :- "నీకు ఏప్పట్నుంచి తెల్సు?"ధర్మ :- "నాకు మొదటినుంచి తె...

  • అరె ఏమైందీ? - 18

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • మనసిచ్చి చూడు - 4

    మనసిచ్చి చూడు - 04హలో ఎవరు.... ️ అవతల మాట్లాడకపోయే సరికి ఎవర...

  • నిరుపమ - 4

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • అరె ఏమైందీ? - 17

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

నిజం - 11

హాస్పిటల్ లో ఉన్న సాగర్ , మోహన్ , రామారావు మళ్ళీ బాబు ని చూడటానికి వచ్చారు . డాక్టర్ బాబు ని చెక్ చేసి అప్పుడే బయటకు వస్తూ వీళ్ళని చూసారు, బాబు ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవుతున్నడు , డోంట్ వర్రీ త్వరలోనే కోలుకుంటాడు , ఇక్కడ నర్సెస్ , డాక్టర్స్ జాగ్రత్తగా చూసుకుంటారు మీరు వెళ్ళండి , ఏదయినా అవసరం ఉంటే కాల్ చేస్తారు , రిసెప్షన్ లో మీ ఫోన్ నంబర్స్ ఇచ్చి అక్కడ ఇచ్చే ఫార్మ్స్ ఫిల్ చేయండి అన్నాడు డాక్టర్ , నేను ఇక్కడే ఉంటాను sir వద్దనకండి, బాబు ఒక్కడినే వదిలితే మరేదయినా ప్రమాదం జరుగుతుంది అని భయం గా ఉంది అని డాక్టర్ ని బ్రతిమాలాడు మోహన్ , సరే మీ ఒక్కరికీ పెర్మిషన్ ఇస్తాను పేషన్ట్ కి ఎలాంటి డిస్టబెన్స్ కలిగించద్దు , అని అక్కడి నుండి వెళ్లి పోయారు డాక్టర్ . మోహన్ సాగర్ వైపు చూసి ఇప్పటికే చాలా లేట్ అయింది సాగర్ నువ్వు నాన్న ని ఇంటికి తీసుకు వెళ్లు , నేను వచ్చే వరకు నువ్వు నాన్నకి తోడుగా ఇంటి దగ్గరే ఉండి అందరినీ జాగ్రత్తగా చూసుకో , అన్నాడు సాగర్ తో . ఇంట్లో వాళ్ల గురించి టెన్షన్ పడకు నేను చూసుకుంటా ,ఇప్పుడు ఇక్కడ ఉండొద్దు అని నేను చెప్పను , కానీ రేపు నేను వచ్చి ఇక్కడ ఉంటాను నువ్వు ఇంటికి వెళ్లాలి అన్నాడు సాగర్ . మోహన్ తిరిగి మాట్లాడే లోపు మధ్యలో రామారావు మాట్లాడుతూ సాగర్ చెప్పింది బాగానే ఉంది, ఒక్కడివే ఎన్ని రోజులు ఇక్కడే ఉంటావు , పైగా నువ్వు కూడా కనపడకుండా ఉంటే స్వప్న కోలుకోలేదు. రేపు నువ్వు వచ్చి పక్కనే ఉంటే తనకి కూడా ధైర్యం గా ఉంటుంది , బాబు కొంచం కోలుకుంటే డాక్టర్ ని అడిగి ఇంటికి తీసుకు వెళదాం ధైర్యం గా ఉండు అని కొడుకుని హత్తుకొని వీపు నిమిరాడు ఓదార్చడానికి , నేను ఇప్పుడు బాగానే ఉన్నా నాన్న , మీరు చెప్పినట్టే రేపు ఇంటికి వస్తాను అని సాగర్ కి తన కార్ కేస్ ఇచ్చి వాళ్ళను అక్కడి నుండి పంపించాడు మోహన్.

మరో వైపు పోలీస్ స్టేషన్ లో శరభయ్య చెప్పింది విని షాక్ అయ్యారు స్టేషన్ లో వాళ్లంతా , ఎవడా మరిడయ్య నీకు ఎక్కడ పరిచయం అయ్యాడు , అసలు ఆ పిల్లాడినే చంపాలని ఎందుకు అనుకున్నారు అని అడిగాడు విజయ్ .

చెప్తాను అని జరిగింది గుర్తు తెచ్చుకుంటున్నట్టు పైకి చూస్తూ చెప్పటం మొదలు పెట్టాడు , ఖచ్చితంగా సంవత్సరం క్రితం మిట్ట మధ్యాహ్నం , ఆ సమయం లో సాధారణం గా మా రోడ్ లో జన సంచారం అంత గా ఉండదు , అందరూ ఆ టైమ్ లో పొలాలకి , పనులకు వెళ్ళిపోతారు . నా షాప్ లో నుండే ఇంటిలో కి దారి మీరు చూసే ఉంటారు అంటుంటే , ఆ చూసాను నీ ఇల్లు , షాపు గురించి తర్వాత వివరిద్దువు గానీ ముందు ఆ మరిడయ్య గురించి చెప్పు అన్నాడు విజయ్ విసుగ్గా , ఆ అదే చెప్తున్నా , భోజనం చేద్దాం అని లేచానా ఈలోపు నా కొట్టు ముందుకి ఒక బుడ బుక్కలాడు వచ్చాడు , నాకు బేరం అవ్వలేదు డబ్బు లేదు పొమ్మన్నాను , దానికి వాడు గట్టిగా నవ్వి , నేను నీకు ఇవ్వటానికి వచ్చాను అన్నాడు ,అప్పుడు నాకు కోపం వచ్చి ముష్టి వాడివి నువ్వు నాకు ఇవ్వటం ఏమిటి అన్నాను , నా వేషం చూసి మాట్లాడకు , ఒక రెండు నిమిషాలు నేను చెప్పేది వింటే నీకే తెలుస్తుంది అన్నాడు. రెండు నిమిషాలు కాకపోతే రెండు గంటలు మాట్లాడు వింటా కానీ ఒక్క పైసా కూడా ఇవ్వను అని తెగేసి చెప్పా అన్నాడు శరభయ్య విజయ్ వైపు చూసి. గొప్ప ఘనకార్యం చేసినట్టు చెప్తున్నాడు వీడితో ఏకంగా మర్డర్ చేపించడానికే ప్లాన్ చేసాడు వాడు , ఇప్పుడు కూడా ఏదో తెలివయిన వాడిలా మాట్లాడుతున్నాడు అనుకున్నాడు విజయ్ మనసులో , సరే తర్వాత ఏమయింది చెప్పు అన్నాడు విజయ్ , స్టేషన్ లో అందరూ కూడా సీరియస్ గా వింటున్నారు .

మళ్ళీ చెప్పటం మొదలు పెట్టాడు శరభయ్య , వాడు షాప్ లోకి వచ్చి కూర్చున్నాడు , ఆ రోజు నా భార్య కూడా పుట్టింటికి వెళ్ళింది , నా ఎదురుగా కూర్చొని నా చేయి చేతిలో కి తీసుకొని కళ్ళు మూసుకొని ఏవో మంత్రాలు చదివాడు , తరువాత తనకు ఎవరో చెవిలో ఏదో చెప్తున్నట్టు గా తన చెవి దగ్గర చెయ్యి పెట్టుకుని వింటున్నట్టు గా చేసాడు , అలా వింటూనే నా గురించి అన్ని విషయాలు చెప్పాడు అని కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ చెప్పాడు శరభయ్య , సరే తర్వాత ఏం జరిగిందో చెప్పు అన్నాడు చెప్పిన విషయం అంత ముఖ్యమైంది కాదు అన్నట్టుగా , తర్వాత నీకు త్వరలోనే మంచి రోజులు వస్తాయి అందుకు కొన్ని పూజలు చేయాలి , అని చెప్పాడు మరిడయ్య , నా గురించి వివరాలు నీకు ఎలా తెలిసాయి అని అడిగాను , అందుకు అతను నవ్వి , తనకు ఆత్మలను బందించే శక్తి ఉందని చెప్పాడు , వాడి దగ్గర బందీ గా ఉన్న ఆత్మే నా గురించి చెప్పింది అన్నాడు, తను చేసే క్షుద్ర పూజల ద్వారా నా భార్య కు తప్పకుండా బిడ్డ పుడతాడని , నా ఆస్థి కి వారసుడు వస్తాడని చెప్పాడు మరిడయ్య , అని చెప్పడం ఆపి sir గొంతు ఎండిపో యింది కొంచెం మంచి నీళ్లు ఇప్పించండి అని అడిగాడు శరభయ్య , నీళ్ళు తెమ్మన్నట్టు గా తల వూపాడు పక్కనున్న కానిస్టేబుల్ చూసి విజయ్ , డబ్బు వద్దన్నాడు కదా మరి నీకే ఎందుకు సాయం చేస్తనన్నాడు అడిగాడు విజయ్, కానిస్టేబుల్ తెచ్చిన గ్లాస్ తీసుకుని గబ గబా నీళ్ళు తాగి మళ్ళీ చెప్పడం మొదలు పెట్టాడు శరభయ్య.

నేను ఇదే అడిగాను sir నాకు సాయం చేస్తే నీకేంటి లాభం అని అడిగాను , దానికి వాడు అటు ఇటు చూసి ఇంట్లో ఎవరూ లేరు కదా అన్నాడు , గుస గుస లాడుతున్నట్టు , ఆ మాటకి నేను వాడిని ఎగా దిగా చూసి దొంగతనానికి వచ్చావా ఈ వేషంలో అన్నాను కోపం గా , దానికి ఆ మరిడయ్య ఇప్పుడు నేను చెప్పేది ఎవరూ వినకూడదు రహస్యం అని చెప్పాడు , ఎవరూ లేరు గానీ చెప్పి ఎడవమన్నా దానికి వాడు నీ ఇంటి వెనుక బావిలో లంకె బిందెలు ఉన్నాయి , కానీ వాటికి ఒక శక్తి కాపలా ఉంది , నీకు పిల్లలు పుట్టకుండా ఉండటానికి కూడా అదే కారణం , నాకు క్షుద్ర పూజలు వచ్చు వాటిద్వారా ఆ శక్తి ని శాంతింప చేస్తాను , కానీ ఈ పూజలు ప్రతి అమావాస్య కి చేయాలి , నేను చెప్పినట్టు చేస్తే ఆ లంకె బిందెలు దక్కుతాయి , అన్నాడు మరిడయ్య, నువ్వు చెప్పింది నేను ఎందుకు నమ్మాలి అని అడిగాను నేను , లంకె బిందెలు దొరికితే వాటిలో నాకు వాటా కావాలి , అంతే కాదు ఈ పూజల ద్వారా ఆ బావి లో ఉన్న శక్తి ని కూడా నేను వశం చేసుకోవచ్చు , కానీ నువ్వు నాతో పాటు పూజలో ఉన్నప్పుడు మాత్రం నన్ను పూర్తిగా నమ్మాలి , నువ్వు అలా నమ్ముతానంటేనే మన పని మొదలు పెడదాం , లేదంటే లేదు అన్నాడు , కానీ ఒక్కసారి పని మొదలు పెట్టాక వెనుకంజ వేయకూడదు , ఇక నిర్ణయం నీకే వదిలేస్తున్నా అన్నాడు మరిడయ్య ,

అతను ఆ నిధి దొరికాక నే కదా వాటా ఇమ్మంటున్నాడు, నాకు వచ్చే నష్టం ఏమీ లేదు అనుకొని అన్నిటికీ ఒప్పుకున్నా , ఆ రోజు నుండి వాడు ఏది చెబితే అది చేశా అని చెప్పి ఆపాడు , శరభయ్య .

వాడు ఏం చేయమన్నాడు నువ్వేం చేశావు అన్ని చెప్పు ఏది వదలకుండా అన్నాడు విజయ్ , ఆ రోజు ఏం చెప్పలేదు కానీ నా కళ్ళలోకి చూస్తూ ఏవో మంత్రాలు చదివి నా నుదిటి మీద వీభూది రాసాడు , నా చేతికి తాయత్తు కట్టాడు , నా భార్య చేతి కి కూడా కట్టమని ఒక తాయత్తు ఇచ్చాడు , వాటి వల్ల ఆ బావి లో ఉన్న శక్తి ప్రభావం మా మీద ఉండదు , మాకు త్వరలోనే పిల్లలు పుడతారు అని చెప్పాడు , మళ్ళీ అమావాస్య రోజుకి వస్తాను ఆ రోజు అర్థరాత్రి ఇంటిలో పూజ చెయ్యాలి , ఈ విషయం మూడో కంటికి తెలియకుండా చేయాలి నీ భార్యకు కూడా తెలియకూడదు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు అని చెప్పాడు శరభయ్య.

తన చేతి రిస్ట్ వాచ్ వైపు చూసుున్నాడు విజయ్ అర్థరాత్రి రెండు అయింది , సెల్ నుండి బయటకు వచ్చాడు విజయ్ తన సీట్లో కూర్చుని రాఘవులు గారు వాడి దగ్గర మిగిలిన విషయాలు రేపు అడుగుదాం , ఆ మరిడయ్య ఎవడో తెలుసుకోవాలి , స్కెచ్ వేయడానికి ఒక ఆర్టిస్టు కావాలి ఫోన్ చేసి వీలయినంత త్వరగా రమ్మని చెప్పండి , క్లూస్ టీమ్ కి ఫోన్ చేసి శరభయ్య ఇంట్లో అన్నిటి మీద ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేయమని చెప్పండి అన్నాడు విజయ్ రాఘవులు తో, ok sir ఉదయాన్నే కాల్ చేస్తా అన్నాడు రాఘవులు.