చిట్టి తండ్రి బసవ విజయ్ ని కుర్చీలో కూర్చోమని చెప్పి లోపలికి వెళ్ళి భార్య పిల్లలను తీసుకువచ్చాడు , తను నా భార్య   అరుణ , ఇది నాకూతురు చిట్టి అని వాళ్ళను పరిచయం చేశాడు  విజయ్ కి, విజయ్ నవ్వుతూ చిట్టి ని దగ్గరకు పిలిచి రా చిట్టి ఇలా కూర్చో  , నేను మీ నాన్న ఫ్రెండ్ ని అన్నాడు ,అలా చెప్తే పాప భయపడకుండా తనతో ఫ్రీ గా మాట్లాడుతుందని , మీరు మా నాన్న ఫ్రెండ్ కాదు మా వూరికి కొత్తగా వచ్చిన పోలీస్   అని   నాకు తెలుసు , అబద్దం  చెప్పటం తప్పు కదా , పోలీస్ అయి ఉండి మీరే అబద్దం చెప్తే ఎలా అంది గడుచుగా చిట్టి వెంటనే అరుణ చిట్టీ పెద్దవాళ్ళ తో అలానేనా మాట్లాడటం  తప్పు కదా అంది మందలిస్తూ  , పర్వాలేదు   అండి     తనిలా ఫ్రీ గా మాట్లాడితే  నాకు కూడా పని easy అవుతుంది అని అరుణకు చెప్పి , చిట్టి వైపు తిరిగి  చూడు చిట్టి  ఇందాక మాట్లాడుకుంటూ  నేనూ  మీ నాన్న ఫ్రెండ్స్ అయ్యాం అందుకే అలా చెప్పా, అని ఇంతకీ నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు  అని అడిగాడు విజయ్  , 5 th class పోలీస్ uncle అంది చిట్టి ,  సడెన్ గా రోడ్డు మీద నుండి అరుపులు వినిపించాయి , అందరూ  గబ గబా పరిగెడు తున్నట్టు వెళుతున్నారు  హడావుడిగా ,వయసులో ఉన్నవాళ్లు వేగంగా పరిగెడుతున్నారు , రాఘవులు పరిగెడుతూ వచ్చి sir పక్క సందులో  కిరాణా కొట్టు     శరభయ్య         భార్య మంటల్లో చిక్కుకుందట అన్నాడు ఆయాస పడుతూ , రాజేష్   లేచి పదండి మనం కూడా వెళదాం , మీరు జీప్ తీయండి నేను అంబులెన్స్ కి కాల్ చేస్తాను  అని ఫోన్ డయల్  చేస్తూ జీప్ ఎక్కి కూర్చున్నాడు రాజేష్ . పక్క సందులేనే  ఉన్న  శరభయ్య ఇంటికి రెండు నిమిషాల్లో చేరుకున్నారు , అప్పటికే కొన ఊపిరితో ఉంది  శరభయ్య  భార్య  సుజాత ,    బాబు బాబు అని ఏదో  చెప్పటానికి     ప్రయత్నిస్తొంది , ఆ మాట విని  ఏదో అనుమానం వచ్చింది విజయ్ కి, పక్కనే  ఉన్న శరభయ్య  ఇంకెక్కడి బాబు నీ కడుపులో ఉన్న బిడ్డ ఉన్నాడో  పోయాడో తెలీదు ఈ మంటలకి అంటూ బావురుమని ఏడుస్తున్నాడు , ఓ ఈవిడ కడుపులో  బిడ్డ గురించి కలవరిస్తుందా అనుకొని , అయినా  ఈ శరభయ్య  ను చూస్తే   యాభై   ఏళ్లు ఉన్నట్టు ఉన్నట్టున్నాడు ఈ వయసులో పిల్లలేన్టి  అని  అనుమానంగా  ఉంది విజయ్ కి , అసలు ఇదంతా ఎలా జరిగింది మొదట ఎవరు  చూసారు అడిగాడు అక్కడి వాళ్ళను చూస్తూ విజయ్ , ఒకతను ముందుకు వచ్చి  sir ముందు చూసింది నేనే ,నేను  శరభయ్య    గారి    కొట్టుకు వచ్చాను  సరుకులు   తీసుకుంటుంటే లోపల నుండి అరుపులు వినబడగానే నేను , శరభయ్య గారు కలసి ఇంటి లోపలికి వెళ్ళాము లోపల సుజాత గారు మంటల్లో చిక్కుకొని ఉన్నారు , నేను వెంటనే నీళ్ళు తేవడానికి బయట ఉన్న బావి దగ్గరకు వెళ్ళాను  అప్పుడే రోడ్డు మీద ఉన్న  వాళ్ల కు ఈ విషయం చెప్పాను అని జరిగిన విషయం చెప్పాడు అతను.  నీ పేరేంటి అని అడిగాడు విజయ్ అతన్ని ,  నా పేరు శీను అండి అన్నాడు అతను , నువ్వు స్టేషన్ కి వచ్చి జరిగింది ఒక పేపర్ మీద స్టేట్మెంట్  రాసివ్వు అన్నాడు విజయ్ , ఈలోపు అంబులెన్స్ వచ్చింది  సుజాత ను అంబులెన్స్ లో ఎక్కించారు ,ఇంటికి తాళం వెయ్యటానికి గబ గబ వచ్చాడు  శరభయ్య  , అతని వాలకం చూస్తుంటే  అనుమానంగా ఉంది విజయ్ కి, మీరు కీస్ నాకిచ్చి వెళ్ళండి  అవతల అంబులెన్స్ వెయిట్  చేస్తోంది అన్నాడు విజయ్ , ఇంట్లో విలువయిన వస్తువులు ఉన్నాయి నా ఇంటి తాళాలు ఎవరికీ   ఇవ్వను అని విస విసా వెళ్ళిపోయాడు శరభయ్య  , నాకెందుకో  ఇతని మీద అనుమానంగా ఉంది మన కానిస్టేబుల్ ఒకతన్ని ఇతని వెనుక పంపి గమనిస్తుండమని చెప్పండి  అని మనం మళ్ళీ చిట్టి  దగ్గరకు వెళదాం పదండి , వీడి సంగతి తర్వాత చూద్దాం అని   చెప్పాడు విజయ్ రాఘవులు కి , జనం తో పాటుగా అక్కడి వచ్చిన  కానిస్టేబుల్ చంద్రం ని కూడా అంబులెన్స్  ఎక్కించాడు రాఘవులు , శరభయ్య  మీద ఓ కన్నేసుంచు అన్నాడు చెవిలో   ఎవరికీ  వినపడకుండా ,    అక్కడనుండి వెళ్ళిపోయారు రాఘవులు , విజయ్.
మన ఊరికి ఏదైనా దయ్యం వచ్చిందేమో వదినా నిన్నేమో  చిన్న పిల్లాడు మాయం అయ్యాడు , ఇప్పుడేమో అమాయకంగా ఉండే సుజాత కి ఇలా ప్రాణం మీదకి రావడం చూస్తే అనుమానంగా ఉంది అన్నది ఒకావిడ , దెయ్యం లేదు ఏమీ లేదు ఆ శరభయ్య  పిచ్చి వాగుడు తో విసుగొచ్చి ఇలా  చేసుకుని ఉండొచ్చు అంది మరో ఆవిడ, ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్పుకుపోతున్నరు వూరి జనం.
చిట్టి వాళ్ళింటికి వెళ్లారు రాఘవులు , విజయ్.
చిట్టి తో మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టాడు విజయ్ , 
చిట్టి నువ్వు నిన్న స్కూల్ కి వెళ్ళలేదా ,అడిగాడు విజయ్ , లేదు uncle నేను వెళ్లుంటే  సంపత్ తప్పిపోయేవాడు కాదు , అయినా వాడికి ఇంటికి ఎలా రావాలో బాగా తెలుసు ఎందుకు రాలేదో తెలియటం లేదు అంది మొహం డల్ గా పెట్టి , మొన్నటి రాత్రి దానికి సడన్ గా వాంతులయ్యాయి అందుకే వెళ్లలేదు , అని చెప్పింది పక్కనున్న చిట్టి తల్లి అరుణ ,  ఈలోపు  రాఘవులు ఫోన్ రింగ్ అయింది ఫోన్ తీసి చూసుకున్న రాఘవులు sir మనం శరభయ్య వెనుక పంపిన కానిస్టేబుల్  కాల్ చేస్తున్నాడు, అని ఫోన్ లిఫ్ట్ చేశాడు రాఘవులు  , hello చంద్రం చెప్పు ఏం జరిగింది అడిగాడు రాఘవులు ,సగం దూరం లో ఉండగానే  సుజాత గారి ప్రాణం పోయింది అంత్యక్రియలకు వూరికి వెనక్కు తీసుకొచ్చేస్తున్నాం  అన్నాడు ఫోన్ లో అటునుండి  చంద్రం , ఒకసారి లైన్ లో ఉండు అని పక్కకు తిరిగి , జరిగింది విజయ్ కి చెప్పాడు రాఘవులు. విజయ్ చిన్నగా నిట్టూర్చి ఒక సమస్య పూర్తవకముందే మళ్ళీ మరో సమస్య సరే , మన కానిస్టేబుల్  ని మాత్రం ఆ శరభయ్య తోనే ఉండమని చెప్పు అన్నాడు విజయ్. సరే అని ఫోన్ తీసుకొని పక్కకు వెళ్ళాడు  రాఘవులు.  అవును చిట్టి స్కూల్ కి వెళ్ళలేదని మీరు వాళ్ళింట్లో చెప్పలేదా అడిగాడు విజయ్ చిట్టి పేరెంట్స్ ని ,  చిట్టి కి సడెన్ బాగా వాంతులయ్యాయి భయంతో పిల్లని   పట్నం లో ఉన్న  హాస్పిటల్ కి తీసుకెళ్లాము , ఎదురింటి మస్తాన్  ని పిలిచి తన ఆటో లో వెళ్ళిపోయాం , అందరూ పడుకొని ఉంటారని ఎవ్వరినీ లేపలేదు. బదులిచ్చాడు   చిట్టి తండ్రి బసవ , వాంతులు ఎందుకయ్యాయి అంత సడెన్ గా అడిగాడు విజయ్ , డాక్టర్ గారు ఫుడ్ పాయిజన్ అన్నారు , కానీ మేము ఇంట్లో వండినవే తిన్నది , మేము కూడా అదే తిన్నాం , కానీ పిల్లకు ఒక్కదానికే ఎందుకు అలా అయ్యిందో ఇప్పటికీ అర్థం కావట్లేదు అంది చిట్టి తల్లి అరుణ. విజయ్  కొంచెం ఆలోచించి చిట్టి నీకు ఆరోజు  బయటవాళ్ళు  ఎవరైనా  చాక్లేట్  లాంటిది ఏదైనా తినడానికి  ఇచ్చారా  అడిగాడు అనుమానంగా,  లేదు uncle అంది  చిట్టి , ఒకసారి  జాగ్రత్తగా ఆలోచించు  మార్నింగ్ నుండి ఈవెనింగ్ వరకు ఏం తిన్నవో , నీ ఫ్రెండ్స్ గానీ లేదంటే నీకు తెలిసిన వాళ్ళు గానీ నీకు తికడానికి ఏమైనా ఇచ్చారా  గుర్తు చేసుకుని చెప్పు అని అడిగాడు       విజయ్ , చిట్టి గడ్డం మీద వేలు పెట్టుకుని పైకి చూస్తూ ఉంది గుర్తు చేసుకుంటున్నట్టు , పొద్దున్న అమ్మ ఇడ్లీ పెట్టింది , లంచ్ లో పప్పుఅన్నం తిన్నాను , సాయంత్రం  ఏదో గుర్తు వచ్చినట్టు ఆ శరభయ్య  తాత రోజూ లాగానే నాకు  సంపత్ కి  ప్రసాదం పెట్టాడు  తర్వాత  ఇంటికి వచ్చి  అమ్మ ఇచ్చిన అని చెబుతుంటే  , విజయ్ మధ్యలో ఆపి ఏంటి శరభయ్య నీకు , సంపత్ కి ప్రసాదం ఇచ్చాడా , రోజూ  అందరికీ ఇస్తాడా , లేదా మీ ఇద్దరికే  ఇస్తాడా అడిగాడు విజయ్ , అక్కడే ఉన్న  చిట్టి తల్లి , తండ్రులు  ఇంకా రాఘవులు కూడా  అలానే చూస్తున్నారు  చిట్టి ని నిర్ఘాంతపోయి , లేదు uncle  ఈ మధ్య అయితే ఎవరికీ  ఇవ్వడం నేను చూడలేదు , కానీ  చాలా రోజుల ముందు  వెరేవాళ్లకు   కూడా  ఇవ్వడం చూసాను అంది చిట్టి , మరి ఇంట్లో ఎందుకు చెప్పలేదు చిట్టి ఈ సంగతి అని అరుణ అడిగింది చిట్టిని , నేను చెప్పా అమ్మ నీకు అంది చిట్టి అమాయకంగా  , నాకు ఎప్పుడు చెప్పావే  అంది అరుణ విస్తుపోయి , అదే అమ్మా  అప్పుడు ఊళ్ళో సంబరాలు జరిగాయి కదా  , అప్పుడు చెప్పా కదా శరభయ్య తాత  పిల్లలికి బూందీ మిఠాయి ప్రసాదం ఇస్తున్నాడు రోజూ అని , నువ్వేమో  ప్రసాదం తింటే  మంచిదే  తీసుకోవచ్చని కూడా చెప్పావ్  అని చిట్టి అనగానే , అరుణ  కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ  సంబరాలు ఆషాడం  లో జరిగాయి అంటే ఆరు నెలలు అయ్యింది , సంబరాలు  జరిగినప్పుడు  వూళ్ళో అందరూ ప్రసాదం పంచుతారు sir వాడు అలానే ఇచ్చాడు  అనుకున్నా అంది అరుణ , కళ్ళలో నీళ్ళు తిరిగాయి అరుణకు ,  విజయ్  సడెన్ గా లేచి రాఘవులు గారు వెంటనే ఆ శరభయ్య ఇంటికి వెళదాం జీప్ తీయండి అన్నాడు వేగంగా నడుస్తూ ,విజయ్ ని అనుసరించాడు  రాఘవులు , అక్కడే వున్న వీరయ్య,  బసవ  కూడా  వెనుకే   సైకల్ మీద వెళ్లారు.