Truth - 6 books and stories free download online pdf in Telugu

నిజం - 6

అన్నట్టు ఆ శరభయ్య భార్య గర్భవతా అడిగాడు విజయ్ రాఘవులు ని , అదేం లేదు sir వాడు 10 నెలలుగా ఇదే చెబుతున్నాడు , మీరు చూసారుగా తన పొట్ట ఏమి పెరిగి లేదు , అదంతా వాడి పిచ్చి వాగుడు అని మేము కూడా పట్టించుకోవటం మానేశాం , ఎవరైనా తిరిగి 10 నెలలు వచ్చాయి కదా అని అడిగితే 12 నెలలకు పురుడు వస్తుంది తను కనేది మామూలు బిడ్డ ని కాదు అని వితండ వాదం చేస్తాడు , వాడి పిచ్చి వాగుడు తో పాపం బయటకు రావడం మానేసింది ఆ సుజాత ,ఆ శరభయ్య మొదటి భార్య చనిపోయిన ఆరు నెలలకే తన కంటే 20 యేళ్లు చిన్నదయిన ఈ సుజాత ని పెళ్లి చేసుకున్నాడు అని శరభయ్య గురించి తనకు తెలినవి చెప్పాడు రాఘవులు , మాటల్లోనే శరభయ్య ఇంటికి చేరుకున్నారు , అంబులెన్స్ కూడా వచ్చింది , సుజాత బాడీ ని తీసుకొచ్చారు , ఎందుకింత పని చేసావే నీ కడుపులో ఉన్న నా బిడ్డ ను చంపేసావు అంటూ కేకలు పెట్టినట్టు గట్టిగా ఏడుస్తున్నాడు శరభయ్య , వీడు వీడి ఓవర్ యాక్షన్ అని మనసులో తిట్టుకొని శరభయ్య దగ్గరకు వచ్చి కొంచెం శాంతించి ఇంటి తాళం తీయండి , మిగిలిన ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి కదా అన్నాడు విజయ్ , ఎందుకు ఇంటి తాళం తీయటం అంత్యక్రియలు అయ్యాక వెళ్లి ఇంటిని శుద్ది చేసుకుంటా , ఇప్పుడేమి తాళం తియ్యక్కర్లేదు ఇటునుండి ఇటే తరలిద్దాం కాటికి అన్నాడు శరభయ్య , నీ పేరు శరభయ్య కాదు రా తిక్క శంకరయ్య అని పెట్టాల్సింది అని మనసులో అనుకుని ,అదేంటి మీ బంధువులు వచ్చేవరకు ఉండాలి కదా అన్నాడు విజయ్ ,ఈ కొత్త పోలిసోడేన్టి నా యనక పడ్డాడు అని మనసులో తిట్టుకొని , నా భార్య పుట్టింటికి ఫోన్ చేశా పాడి కట్టే లోపు వచ్చేస్తారు పక్కూరే వాళ్ళది అన్నాడు మొహం చిట్లించుకొని చూస్తూ , నీ మొహం చూడలేక నే చచ్చినట్టుంది నీ పెళ్ళాం అని మనసులో అనుకుని పక్కకు వచ్చి ఒక మూల నిల్చున్నాడు విజయ్. వూరి జనం అంతా తలా చేయి వేసి జరగాల్సిన పనులు చూస్తున్నారు, రాఘవులు విజయ్ దగ్గరకు వచ్చి sir ఇప్పుడేం చేద్దాం, వీడు కావాలనే తలుపులు తీయడం లేదు అన్నాడు విజయ్ కి మాత్రమే వినిపించేట్టు , నాకు అర్థం అయింది రాఘవులు గారు కానీ మన దగ్గర ప్రూఫ్ లేదు పైగా జనం అంతా ఇక్కడే ఉన్నారు , ఈ విషయం బయటకు తెలిస్తే తరువాత సిట్యుయేషన్ మన కంట్రోల్ లో ఉండదు , కాసేపు వెయిట్ చేద్దాం అని పక్కనే ఉన్న బసవ, వీరయ్య లకు కూడా కలిపి చెప్పాడు , సరే అని తల నిలువుగా వూపారు రాఘవులు , బసవ ,వీరయ్య . కోపంతో పిడికిలి బిగించారు బసవ, వీరయ్య , విజయ్ చెప్పిన మాటలు అర్థం చేసుకుని ఓపిగ్గా ఎదురు చూస్తున్నారు ఇద్దరూ. పిల్లాడిని మాయం చేసింది వీడే అని తెలియాలి ఇయ్యాల నా చేతుల్లో సచ్చాడే నా కొడుకు అని మనసులో అనుకుంటూ కోపంతో బుసలు కొడుతున్నాడు వీరయ్య . వీడి వాలకం చూస్తే ఏదో చేసేటట్టే ఉన్నాడు అనుకొని , విజయ్ ని పిలిచి వీరయ్య వైపు చూడమన్నట్టు సైగ చేసాడు. వీరయ్య మొహం ఎర్రగా కంద గడ్డలా ఉంది కోపంతో , ఇదేంట్రా బాబు ఈ వూళ్ళో ఒక్కక్కడు ఒక్కోలా ఉన్నాడు , పూనకం వచ్చినట్టు వూగుతున్నాడుగా వీడు అనుకొని, రాఘవులు గారు వాడి ఆవేశం కట్టలు తెగక ముందే వాడిని పక్కకు తీసుకెళ్ళి నచ్చచెప్పండి అన్నాడు విజయ్ రాఘవులు తో , వీరయ్యా ఇలా రా అంటూ చేయి పట్టుకుని పక్కకు తీసుకెళ్ళాడు రాఘవయ్య , కొంచెం దూరం తీసుకువెళ్ళి చూడు వీరయ్యా ,ఆ శరభయ్య ప్రసాదం ఇచ్చాడని కారణం చూపించి మనం అతన్ని నిలదీయలేం, సాక్ష్యం కావాలి, అలా అని చేతులు కట్టుకు కూర్చుంటాం అని కాదు ,ఇక్కడ పరిస్థితి అలా వచ్చింది , ఆ శవం ఎదురుగా పెట్టుకొని ఎలా గొడవ పడదాం నువ్వే చెప్పు , ఆ శరభయ్య ఎంత దరిద్రుడు అయినా , పాపం ఆ సుజాతమ్మ ఎంత మంచిదో తెలుసు కదరా నీకు ఆవిడను ప్రశాంతంగా పంపిద్దాం , పాపం బతికి ఉన్నన్నాళ్ళు సుఖంగా లేదు ఎలాగూ ఒక పది నిమిషాలు ఓపిగ్గా ఉండరా అన్నాడు రాఘవులు వీరయ్య రియాక్షన్ ఏన్టా అని తన మొహం లోకి చూస్తూ , సరే అయ్యా మీరు చదువుకున్నోల్లు , ఏదయినా ఆలోచించే చేస్తారు , భారం మీదే అయ్యా , రామారావు గారి కుటుంబాన్ని ముందులా చూడాలయ్య అన్నాడు కళ్ళ నీళ్ళు పెట్టుకుంటు. రాఘవులు , వీరయ్య ఇద్దరూ తిరిగి శరభయ్య ఇంటి ముందుకు వచ్చి నిలబడ్డారు , పక్క వూళ్ళో ఉన్న సుజాత తల్లి , తండ్రి ,ఇద్దరు చెల్లెళ్ళు అక్కడికి వచ్చారు , రావడంతోనే అయ్యో , అయ్యో నా బిడ్డను పొట్టన పెట్టకున్నాడు, పిల్లలు కావాలి , పిల్లలు కావాలి అని పీడించి చివరకు నా కూతుర్ని ఇలా బలి తీసుకున్నాడు అంటూ బోరున ఏడ్చింది సుజాత తల్లి , తనను అలా నలుగురి లో అవమానించే సరికి కోపం పొడుచుకు వచ్చింది శరభయ్య కి , బాగుంది నువ్వనేది నా డబ్బులుతోనే నీ కూతుళ్ళు ఇద్దరికీ పెళ్లి జరిపించి ఇపుడు నన్నే అంటున్నావ్ , సుజాత ది చాలా మంచి జాతకం నాకు తప్పకుండా వారసుడిని ఇస్తుంది అని ఆశ పెట్టి నా వెనుక పడి మరీ పెళ్లి చేశావు, ఇప్పుడు అది పోయే సరికి మళ్ళీ డబ్బు గుంజటానికి కొత్త వేషం వెస్తున్నవా , పెళ్లికి ముందు ఎప్పుడయినా దానికి మంచి తిండి పెట్టావా , ఒక్కసారి అయినా బట్టలు కొనిచ్చావా , పెళ్లి కాక ముందు పీనుగు లాగా ఉంది , పెళ్లి అయ్యాకే మనిషి లా అయ్యింది అని ముగించి వూపిరి తీసుకున్నాడు గట్టిగా , సుజాత తల్లి ఏమాత్రం తగ్గకుండా పెళ్లికి ముందు కనీసం పీనుగు లాగా ఉంది , ఇప్పుడు నిజంగానే పీనుగు చేశావు కదా అంది పళ్లు నూరుతూ . వీళ్ళు ఈ గొడవను ఆపెటట్టు కనిపించడం లేదు అనుకుని ఒక పెద్దాయన ముందుకు వచ్చి , ముందు జరగాల్సింది చూడండి , కాసేపటికి చీకటి పడతుంది , కావాలంటే అంత్యక్రియలు అయ్యాక పెట్టుకోండి మీ గొడవ అనేసరికి , ఇద్దరూ నోరెత్తలేదు. గొడవ ఆగగానే పక్కకు తిరిగి విజయ్ ఉన్న వైపు చూసాడు రాఘవులు , అక్కడ విజయ్ కనపడలేదు, ఈయన ఎక్కడకు వెళ్లారు అని ఆలోచించి , ఇక్కడే ఎక్కడో ఉంటారులే అనుకొని అక్కడ జరిగే తంతు చూస్తున్నాడు రాఘవులు , కాసేపటికి అందరూ స్మశానానికి బయలుదేరారు , అందరికంటే ముందు కుండ పట్టుకొని నడుస్తున్నాడు శరభయ్య ఒక్కసారిగా తన మనసంతా భారంగా అయ్యింది , పెళ్లయిన దగ్గరి నుండి ఇది కావాలి అని ఏ రోజు అడిగింది లేదు , తన చాదస్తంతో ఎంత విసిగించినా ఏ రోజు నోరు ఎత్తలేదు , టైం కి అన్నీ అందించి చిన్న పిల్లాడిలా చూసుకునేది , ఇప్పుడు ఆ ఇంట్లో ఒక్కడినే ఎలా ఉండాలి , ఇలా తనలో తానే ఆలోచిస్తూ నడుస్తున్నాడు , ఈ నిమిషం దేవుడు కనపడితే నాకు నా భార్య తప్ప ఇంకేం వద్దు అని అడుగుతాడు అనేటట్టు ఉన్నాడు శరభయ్య ను చూస్తే , ఇదేనేమో స్మశాన వైరాగ్యం అంటే , ఎలాంటి వారైనా జీవితంలో ఒక్కసారైనా ఇలాంటిది అనుభవించక తప్పదు , మూర్కుడయిన శరభయ్య కూడా అందుకు అతీతం కాదు , జనం అంతా ఆ వీధి లో నుండి వెళ్ళాక కూడా విజయ్ దగ్గరలో ఎక్కడా కనపడలేదు రాఘవులు కి , ఇంటిపక్క ఖాళీ స్థలం లో పెట్టిన జీప్ దగ్గరకు వెళ్ళాడు, అక్కడ జీప్ లేదు , అక్కడే ఉన్న వీరయ్య, బసవ కూడా రాఘవులు దగ్గరకు వచ్చారు , కాసేపు ఓపికగా ఉండమన్నారు కదా అయ్యా ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు , మరి S.I గారెక్కడ అని అడిగాడు వీరయ్య , నేను కూడా చూడలేదు వీరయ్య sir ఎటు వెళ్ళారో, ఫోన్ చేసి చూస్తానుండు అని ఫోన్ తీసి విజయ్ నంబర్ కి కాల్ చేశాడు రాఘవులు , కానీ ఎన్ని సార్లు ఫోన్ చేసినా అటు నుండి ఎవరూ లిఫ్ట్ చేయట్లేదు , ఏం జరిగింది sir అడిగాడు పక్కనున్న బసవ ,ఫోన్ తీయట్లేదురా ఎటెల్లారో తెలియటంలేదు అన్నాడు రాఘవులు , ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు మనం ఇక్కడ ఆ విజయ్ బాబు ని ఎతుక్కుంటూ కూర్చుంటే అక్కడ ఆ శరభయ్య ఇంటికి వచ్చేస్తాడు , మనమే వెళ్లి ఆ తలుపులు పగలగొట్టి వెళదాం లోపలికి అంటూ కింద అటు ,ఇటు చూసి ఒక పెద్ద రాయిని చేతిలోకి తీసుకున్నాడు తాళం పగలగొట్టడానికి , ఇప్పుడు ఈ వీరయ్య ని ఆపడం నా వల్ల అయ్యేట్టు లేదు ఏం చేయాలి ఈ విజయ్ sir జీప్ తీసుకొని ఎటెళ్ళి నట్టు , వెళితే వెళ్ళాడు నాకు చెప్పి వెళ్లొచ్చు కదా , ఎక్కువగా చదివితే ఉన్న మతి పోతుంది అంటే ఇదేనేమో తనలో తానే అంకుంటూ కంగారు పడుతున్నాడు రాఘవులు , పక్కనుండి సడెన్ గా ట్టాంగ్ మని శబ్దం వినపడింది , ఉలిక్కి పడి తల తిప్పి చూసాడు ఆలోచనలో ఉన్న రాఘవులు , ఒక్కసారిగా ఖంగు తిన్నాడు అక్కడ జరిగేది చూసి.