Read Truth - 7 by Rajani in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

  • అరె ఏమైందీ? - 22

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 8

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • రామాపురం హై స్కూల్ రోడ్

    నా పేరు విజయ్ మా గ్రామం పేరు రామాపురం. నేను టెన్త్ క్లాస్ వర...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

నిజం - 7

తల తిప్పి చూసిన రాఘవులు కి అక్కడ , తాళాన్ని రాయితో కొడుతున్న వీరయ్య కనిపించాడు , వీడు అనుకున్నంతా చేస్తున్నాడు అని మనసులో అనుకొని , ఒక్క ఉదుటున వెళ్లి వీరయ్య చెయ్యి పట్టుకుని ఆపాడు, వీరయ్య తల ఎత్తి కోపంగా చూస్తూ నన్ను ఆపకండయ్యా , మీరు ఏమి చెయ్యరు ,చేసే నన్ను ఆపుతున్నారు అన్నాడు , ఈలోపు రాఘవులు ఫోన్ రింగ్ అయ్యింది , ఫోన్ తీసి చూసిన రాఘవులు ఇదిగో విజయ్ sir కాల్ చేస్తున్నారు , అని వీరయ్య తో చెప్పి ఫోన్ లిఫ్ట్ చేశాడు రాఘవులు , హెలో విజయ్ sir ఇక్కడికెళ్ళారు మీరు , అని అడుగుతూ ఉండగానే విజయ్ మధ్యలో ఆపి, ముందు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అని ఒక సారి ఆపి , మీ పక్కన ఎవరైనా ఉంటే పక్కకు వచ్చి మాట్లాడండి అనగానే , రాఘవులు హెలో హెలో వినిపించట్లేదు sir అంటూనే నడుచుకుంటూ కొంచెం దూరం వచ్చేశాడు వీరయ్యకు , అక్కడే ఉన్న బసవన్న కు ఇద్దరికీ అనుమానం రాకుండా , sir పక్కకు వచ్చాను ఇప్పుడు చెప్పండి అని అడిగాడు రాఘవులు , మీరు మన కానిస్టేబుల్స్ కి చెప్పి శరభయ్య ను అరెస్ట్ చేయమని చెప్పండి , మీరు రామారావు గారిని ఆయన కొడుకు మోహన్ ని తీసుకుని పట్నం లో ఉన్న సంజీవయ్య హాస్పిటల్ కి వచ్చేయండి అని గబ గబా చెప్పేశాడు విజయ్ , అసలు ఏం జరిగింది sir అడిగాడు రాఘవులు , ఇప్పుడు చెప్పే టైం లేదు త్వరగా రండి అంటుంటే అప్పుడే పక్క నుండి nurse voice వినపడింది , sir మిమ్మల్ని డాక్టర్ పిలుస్తున్నారు అని , వచ్చాక వివరంగా చెప్తాను , శరభయ్యను మాత్రం అర్జెంట్ గా పట్టుకోండి వాడు పారిపోవటానికి వీల్లేదు అని ఫోన్ కట్ చేశాడు విజయ్. ఇదంతా విని ఒక్క నిమిషం షాక్ లో ఉన్న రాఘవులు వెంటనే తేరుకొని , తల పైకి ఎత్తి చూసేసరికి తన వైపే వస్తూ కనిపించారు వీరయ్య , బసవ . వీళ్ళిద్దరూ బలే తగులుకున్నారు నా ప్రాణానికి అని గొనుగ్కున్నాడు రాఘవులు , విజయ్ sir కి ఏదో విషయం తెలిసినట్లు గా ఉంది , రామారావు గారిని, మోహన్ ని అర్జెంట్ గా పట్నానికి తీసుకు రమ్మని ఫోన్ చేసి చెప్పారు , నీ సైకిలు ఇలా ఇవ్వు నేను రామారావు గారింటికి వెళతా అని వీరయ్య చేతి లో సైకిలు తీసుకుని హడావుడి గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇంకా వాళ్లకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా రాఘవులు , నోరెళ్ళబెట్టి చూసిన వీరయ్య ఇదేంది ఈయన మనల్ని మాట్టాడ్నివ్వకుండ అట్టా సర్రున ఎల్లిపోయాడు అన్నాడు బసవ తో, ఆయన హడావుడి చూస్తే అర్ధం అయితాంది కదరా ఏదో సీరియస్ విషయం అని అంతా మంచిగా జరగట మే కదా మనకు కావాలి , బాబు దొరికితే చాలు , వాడు క్షేమంగా వుండాలి ఆ గంగానమ్మ దయతో , అన్నాడు బసవ. సరే అయ్యగారోల్లు పట్నానికి ఎలితే అమ్మగరోళ్లకు తోడుగా ఉండాలి పద ఇంటికి పోదాం అన్నాడు వీరయ్య , ఇంటి దారి పట్టారు ఇద్దరూ , వీళ్ళను తప్పించుకు వెళ్లిన రాఘవులు మధ్యలో ఒక చోట ఆగి కానిస్టేబుల్ చంద్రం కి ఫోన్ చేసాడు, అటువైపు ఫోన్ లిఫ్ట్ చేశాడు చంద్రం , రాఘవులు మాట్లాడటం మొదలు పెట్టాడు హెలో చంద్రం , సుజాత మరణం గురించి అనుమానం గా ఉంది , శరభయ్య ను కస్టడీ లోకి తీసుకో , ఇంకొక ఇద్దరు కానిస్టేబుల్స్ ని తీసుకుని వెళ్లు , వాడు అసలే మొండి ఘటం , నేను , విజయ్ sir ఒక అర్జెంట్ పని మీద పట్నం వెలుతున్నాం మేము వచ్చే వరకు శరభయ్య ని స్టేషన్ లో ఉంచాల్సిన భాధ్యత నీదే , అని చెప్పి ఫోన్ పెట్టేసాడు, వెంటనే రామారావు గారి ఇంటికి వెళ్ళి , జరిగిన విషయం చెప్పాడు , అక్కడే ఉన్న గంగ , విద్య కూడా వాళ్ళతో వస్తామన్నారు , రామారావు గారు వద్దమ్మా మీరు స్వప్న ని , అమ్మని చూసుకోండి , వాళ్లిద్దరూ బాగా నీరసించి పోయారు , మీరిద్దరూ ఇక్కడ ఉండటం చాలా అవసరం , నేను అన్నయ్య వెళ్లి విషయం తెలుసుకొని మీకు విషయం తెలియ చేస్తాం ,అని అక్కడి నుండి బయలు దేరారు రామారావు ,మోహన్ ,రాఘవులు . వాళ్ళు వెళ్ళగానే గంగ పొద్దుటి నుండి అమ్మ కూడా బాగా డల్ అయిపోయింది , వదిన అయితే అసలు కళ్ళు కూడా తెరవకుండా ఏడుస్తూనే ఉంది అంది విద్యతో , ఇద్దరినీ ముందు రూమ్ లో నుండి బయటకు తీసుకు వద్దాం పద అంది విద్య గంగ తో , ఈలోగా విద్య ఫోన్ రింగ్ అయింది , విద్య ఫోన్ లిఫ్ట్ చేసి హెలో అన్నయ్యా అంది , అటువైపు నుండి ఫోన్ లో సాగర్ విజ్జి నేను ఇప్పుడే మచలీపట్నం లోని బస్టాండ్ లో దిగాను అన్నాడు విద్య తో , విద్య ముద్దు పేరు విజ్జి అనమాట అందుకే విజ్జి అని పిలిచాడు సాగర్ , గంగ ఎలా ఉంది , బాబు గురించి ఏమైనా తెలిసిందా uncle వాళ్ళ ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు , అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు సాగర్ , హెలో విజ్జి వినిపిస్తుందా లేదా అన్నాడు అటు నుండి ఏమి వినిపించక పోవడం తో , నాకు వినిపిస్తుంది రా నువ్వు గాప్ ఇస్తే మాట్లాడదాం అని చూస్తున్నా అంది విద్య , టెన్షన్ లో అలా మాట్లాడాను లే గానీ నువ్వు చెప్పు విజ్జి అన్నాడు సాగర్ , జరిగింది అంతా చెప్పింది విద్య , సాగర్ అంతా విని అలాగ నేను ఇక్కడే ఉన్నా కదా , డైరెక్ట్ గా హాస్పిటల్ కి వెళతాను , వాళ్ళు ఏ హాస్పిటల్ కి వెళ్ళారు అడిగాడు విద్యని , హాస్పిటల్ పేరు అడగలేదు రా ఒకసారి నువ్వు నాన్న కి కాల్ చేసి అడుగు , హాస్పిటల్ కి వెళ్ళగానే నాకు విషయం కనుక్కొని చెప్పు అంది విద్య , సరే విజ్జి గంగ ను చూసుకో కొంచెం అని ఫోన్ కట్ చేశాడు సాగర్ , వీడికి వయసు తో పాటే గంగ మీద పిచ్చి కూడా పెరుగుతూ వచ్చింది ఏమైనా అంటే అది పిచ్చి కాదు ప్రేమ అంటాడు అని మనసులోనే అనుకుంది , ఏంటి విజ్జి సాగర్ చేశాడా ఫోన్ అంది గంగ, అవును గంగా పొద్దుట అమ్మ ఫోన్ చేసి సంపత్ కనిపించట్లేదు అని చెప్పింది అన్నయ్య కి , ఇప్పుడే మచలీపట్నం బస్టాండ్ కి వచ్చానని ఫోన్ చేశాడు , డైరెక్ట్ గా హాస్పిటల్ కి వెళ్తా అన్నాడు అంది విద్య , అయితే అక్కడ ఏం జరిగిందో మనకు త్వరగానే తెలుస్తుంది కదా అంది గంగ ఆశగా , అవును గంగ పద ఆంటీ దగ్గరకు వెళదాం అని ఇద్దరూ శాంతమ్మ గదిలో కి వెళ్లారు , ముందు శాంతమ్మ ను తరువాత స్వప్నను నచ్చ చెప్పి హాల్లో కి తీసుకువచ్చారు , బాబు దొరికేసినట్టే అని నచ్చచెప్పి , బాబు వస్తే వాడిని చూసుకోడానికి ఓపిక ఉండాలి కదా , నేను గంగా రేపటి నుండి కాలేజ్ కి వెళ్ళిపోతాం , బాబుని మీరిద్దరూ జాగ్రత్త గా చూసుకోవాలి , ఇలా నీరసంగా ఉంటే ఎలా చెప్పండి అంది విద్య , శాంతమ్మని ,స్వప్నను మార్చి ,మార్చి చూస్తూ . నిజంగానా విజ్జి మన సంపత్ బాబు దొరికాడా అడిగారు శాంతమ్మ , స్వప్న ఒకేసారి , అవును మీరిద్దరూ కొంచెం అన్నం తినండి అని ఇద్దరికీ తినిపించారు , గంగ , విద్య చేరికొక ప్లేట్ తీసుకొని , అన్నయ్య , నాన్న రావడానికి కొంచెం టైం పడుతుంది నిద్ర లేక మొహాలు చూడండి ఎలా పీక్కుపోయాయో పదండి కాసేపు పడుకుందురు గానీ అని ఇద్దరినీ రూం లోకి తీసుకెళ్ళి పడుకోబెట్టి , హాల్లో కి వచ్చారు విద్య , గంగ అప్పటివరకు గుమ్మం దగ్గరే ఉండి ఇదంతా చూస్తున్న వీరయ్య లోపలికి వచ్చాడు, అక్కడే కింద కూర్చుని పొద్దున నుండి జరిగినవి అంటే , విజయ్ చిట్టి తో మాట్లాడటం , శరభయ్య ఇంటికి వెళ్ళడం అక్కడి నుండి విజయ్ మాయం అవ్వటం అన్నీ పూసగుచ్చినట్టు చెప్పాడు వాళ్ళిద్దరికీ , ఇద్దరూ ఆశ్చర్యపోతూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు , గంగ విద్య ఇద్దరూ , అసలు ఏం జరుగుతుందీ మన వూళ్ళో అంది గంగ విద్య తో , ఇదంతా వింటుంటే ఆ కొత్త S.I చాలా తెలివైనవాడు లాగా ఉన్నాడు , నాన్న కూడా చాలా గొప్పగా చెప్పారు అతని గురించి , అతనే ఈ మిస్టరీ ని చేదిస్తాడు , చూద్దాం ఏం జరుగుతుందో అంది విద్య , ఈ లోపు రెండు ప్లేట్ల లో అన్నం తెచ్చి విద్యకి , గంగకి ఇచ్చింది పనిమనిషి రత్నం , మీరు కూడా కొంచెం ఎంగిలి పడండమ్మా పొద్దుటి నుండి మీరు కూడా ఏమీ తినలేదు అంది రత్నం . నీకు , వీరయ్య కు కూడా అన్నం పెట్టుకురా రత్నం మీరిద్దరూ కూడా తినలేదు అని నాకు తెలుసు అంది గంగ , రత్నం రెండు నిమిషాలలో అన్నం ప్లేట్ లు తెచ్చింది , ఆరోజు జరిగిన విషయాలు మాట్లాడుకుంటూ , బాబు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ భోజనం ముగించారు నలుగురూ.