Read truth - 8 by Rajani in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

నిజం - 8

విద్యతో మాట్లాడి ఫోన్ పెట్టేసిన సాగర్ రాఘవులు కి కాల్ చేసాడు హాస్పిటల్ పేరు అడిగి వెంటనే ఆటో ఎక్కి హాస్పిటల్ కి చేరాడు , రాఘవులు తో మాట్లాడినప్పుడు చెప్పాడు S.I పేరు విజయ్ అని , హాస్పిటల్ కు చేరుకున్నాక అక్కడ వాళ్ల ఊరి పోలీస్ జీప్ కనిపించింది , అది చూసి ఇది మా వూరి పోలీస్ జీప్ వూరి పేరు ఉంది దీని మీద , అని మనసులో అనుకుంటూ హాస్పిటల్ రిసెప్షన్ దగ్గరకు వెళ్ళాడు సాగర్ ,అక్కడ రిసెప్షన్లో ఉన్న యువతి ని చూసి మేడం బయట పోలీస్ జీప్ ఉంది కదా దానిలో వచ్చిన పోలీస్ ఎక్కడ ఉన్నారు అడిగాడు polite గా , కంప్యూటర్ లోకి చూస్తూ తన వర్క్ లో బిజీ గా ఉన్న ఆ యువతి సాగర్ మాటలు వినగానే తల పైకి ఎత్తి చూసింది , కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ఒక చిన్న బాబు ని తీసుకు వచ్చారు ఆయనే కదా , అనగానే అయితే సంపత్ దొరికాడు అన్నమాట అని మనసులో అనుకుంటూ , అవును madm ఎక్కడ ఉన్నారు అడిగాడు సాగర్ . ఎమర్జెన్సీ వార్డు కు తీసుకు వెళ్లారు , స్ట్రెయిట్ గా వెళ్లి లెఫ్ట్ కి తిరగండి అక్కడే ఎమర్జెన్సీ ward ఉంటుంది అని చెప్పి తల దించుకుని మళ్ళీ తన పనిలో మునిగిపోయింది ఆ యువతి , పరుగు లాంటి నడక తో ఆమె చెప్పిన వైపు గా వెళ్ళాడు సాగర్ , ఎమర్జెన్సీ వార్డ్ అనే బోర్డు కనపడింది ,బయట ఉన్న నర్స్ ని విజయ్ గురించి అడిగాడు , ఆ sir తీసుకు వచ్చిన బాబు కి చాలా బ్లడ్ లాస్ అయింది , మా బ్లడ్ బ్యాంక్ లో AB positive blood లేదు సర్ ఆ sir నే blood ఇస్తున్నారు అంది నర్స్ , నేను లోపలికి వెళ్ళి చూడొచ్చా అడిగాడు సాగర్ , లేదు sir బాబు కండిషన్ చాలా సీరియస్ గా ఉంది , డాక్టర్ గారు చూస్తున్నారు . మీరు కాసేపు ఇక్కడే వెయిట్ చేయండి sir అని అక్కడే ఉన్న చైర్ చూపించింది nurse, ఈలోగా సాగర్ ఫోన్ రింగ్ అయింది , ఫోన్ లిఫ్ట్ చేసి హెల్లో నాన్న ఎక్కడ ఉన్నారు అని అడిగాడు సాగర్ , ఒక పదినిమషాలు లో పట్నానికి చేరుకుంటాం , ఇంతకీ నువ్వు విజయ్ sir ని కలిసావా అడిగాడు రాఘవులు ,లేదు నాన్న అని అక్కడ జరిగింది చెప్పాడు సాగర్ , రాఘవులు స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతున్నాడు , సో పక్కన ఉన్న రామారావు , మోహన్ కూడా వింటున్నారు ,సంపత్ ప్రాణాలతో ఉన్నాడని విని కాస్త ఊరట అనిపించింది ఇద్దరికీ , సరే మేము వచ్చేస్తాం , ఈలోపు విద్య వాళ్ళకి కూడా ఒకసారి కాల్ చేసి చెప్పు కంగారుపడుతూ ఉంటారు అని ఫోన్ కట్ చేశాడు రాఘవులు , సాగర్ కాల్ చేసి విద్య వాళ్ళ కి కూడా జరిగింది చెప్పాడు , డాక్టర్ తో మాట్లాడిన తర్వాత మళ్లీ ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసాడు సాగర్ . విద్య , గంగ వెళ్లి బాబు క్షేమంగా ఉన్నాడని చెప్పారు శాంతమ్మ , స్వప్న లకు , అది విన్న శాంతమ్మ , స్వప్న మనం కూడా వెళదాం హాస్పిటల్ కి అన్నారు, లేదు అమ్మా నాన్న వాళ్ళు వెళ్ళారు కదా , డాక్టర్ తో మాట్లాడి మనకు ఫోన్ చేస్తారు, కొంచెం ఓపిక పట్టండి అని సర్ది చెప్పింది గంగ , మీరిద్దరూ కూడా కాబోయే డాక్టర్స్ కదా బాబుని ఇంటికి తీసుకు రమ్మని చెప్పండి ,ఇంట్లో మీరే చూడొచ్చు అంది స్వప్న emotional అవుతూ. ఇంటికి తీసుకొచ్చాక అలానే చూసుకుంటాం అక్కా , ముందు డాక్టర్ ట్రీట్మెంట్ ఇవ్వాలికదా అని స్వప్నకి సర్ది చెప్పింది విద్య .

గంగ ,విద్య ఇద్దరూ పట్నం లో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నరు అందుకే అలా అంది స్వప్న,

మరోవైపు హాస్పిటల్ లో విజయ్ బ్లడ్ ఇచ్చి బయటకు వచ్చాడు , అక్కడే ఉన్న నర్స్ విజయ్ ని చూసి ,sir మీకోసం చాలా సేపటి నుండి ఒకతను వెయిట్ చేస్తున్నాడు , ఇప్పటి వరకు ఇక్కడే కూర్చున్నాడు అని అటు ,ఇటు చూసి అదుగో ఆ కిటికీ దగ్గర నిల్చున్నాడు అని దూరంగా ఉన్న సాగర్ వైపు చూపించింది , సాగర్ రాఘవులు వాళ్ళ కోసం కిటికీ దగ్గర నిలబడి రోడ్ వైపు చూస్తున్నాడు అందుకే అతని ఫేస్ కనబడటం లేదు విజయ్ కి , ఇక్కడ నా కోసం ఎవరు వస్తారు , ఎవరీ కొత్త క్యారెక్టర్ అనుకుంటూ అతని వైపు వెళ్ళాడు విజయ్ , అప్పుడే ఇటువైపు తిరిగాడు సాగర్ , ఎవరో తెలిసిన ఫేస్ లా ఉందే అనుకుంటూ ఉండగానే అరే విజయ్ అని దగ్గరికి వచ్చాడు సాగర్ , అరే సాగర్ నువ్వేనా అన్నాడు ఆశ్చర్యపోతూ విజయ్ , ఎన్ని years అయింది రా కలసి సోషల్ మీడియా లో కూడా active గా ఉండవు అన్నాడు సాగర్ . one year బ్యాక్ డాడ్ చనిపోయారు రా అమ్మ హెల్త్ పాడయింది , నేను పోలీస్ ట్రైనింగ్ లో ఉన్నాను , అమ్మను అక్క U.S , తీసుకెళ్ళింది , నా ట్రైనింగ్ అయ్యాక పక్కన రాయవరం అనే విలేజ్ లో పోస్టింగ్ వచ్చింది, అక్కడే ఒక case లో బిజీ గా ఉన్నా , అని ఆపి ఇంతకూ నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలుసు అని అడిగాడు విజయ్ , మా వూరికి కొత్తగా వచ్చిన S. I నువ్వే అనమాట అనుకొని , నేను హైదరాబాద్ లో సాఫ్టువేర్ ఇంజినీర్ జాబ్ చేస్తున్నా , రాయవరం లో హెడ్ కానిస్టేబుల్ రాఘవరావు గారు మా నాన్న , ఇందాకే హైదరాబాద్ నుండి వచ్చా , ఆయనే చెప్పారు నువ్వు ఇక్కడ ఉన్నావని , S. I విజయ్ అంటే ఎవరో అనుకున్నా నా చిన్నప్పటి ఫ్రెండ్ అనుకోలేదు అన్నాడు సాగర్ , ఇంతకీ uncle వాళ్ళు ఎక్కడి వరకు వచ్చారు అడిగాడు , ఈ పాటికి వచ్చేయాలి అందుకే వాళ్ళ గురించే చూస్తున్నా రోడ్ వైపు అన్నాడు సాగర్ , ఇంతకీ సంపత్ కి ఏమయ్యింది , ఇప్పుడు ఎలా ఉన్నాడు అడిగాడు సాగర్ , conscious లో లేడు నేను చూసేసరికి ఎవరికీ చెప్పే టైం లేదు అందుకే డైరెక్ట్ గా హాస్పిటల్ కి తీసుకొచ్చే సా , ఇక్కడకు వచ్చి బాబు ని అడ్మిట్ చేశాకే రాఘవులు uncle కి కాల్ చేశా , అప్పటికీ బాబు కండిషన్ తెలీదు , అసలు బ్రతకడం కష్టం అన్నారు డాక్టర్ చూడగానే ,అందుకే uncle కి విషయం చెప్పకుండా రామారావు గారిని , మోహన్ ని తీసుకురమ్మని చెప్పాను , మరి ఇప్పుడు బాబు కండిషన్ ఏంట్రా నువ్వు బ్లడ్ ఇచ్చావ్ అని నర్స్ చెప్పింది అన్నాడు సాగర్ , అవున్రా లక్కీ గా నాది కూడా AB పాజిటివ్ బ్లడ్ కాబట్టి సరి పోయింది , లేదంటే ఇంకా క్రిటికల్ అయ్యేది అన్నాడు విజయ్ , అసలు బాబు ఎక్కడ దొరికాడు అసలు ఏం జరిగింది క్లియర్ గా చెప్పు అన్నాడు సాగర్ క్వశ్చన్ మార్క్ ఫేస్ వేసుకొని , uncle వాళ్ళను కూడా రానివ్వు అందరికీ కలిపే చెబుతా అన్నాడు విజయ్ నీరసంగా , నీ వాలకం చూస్తే పొద్దుటి నుండి ఏమి తిన్నట్టు గా లేవు , పైగా బ్లడ్ కూడా ఇచ్చావు నువ్వు వెళ్ళి కూర్చో , నేను వెళ్లి ఫ్రూట్ జ్యూస్ తెస్తాను అని , హాస్పిటల్ క్యాంటీన్ కి వెళ్లి ఫ్రూట్ జ్యూస్ తీసుకు వచ్చాడు సాగర్ , నన్ను చూడగానే బాగానే గుర్తు పట్టావురా అన్నాడు విజయ్ సాగర్ తో , facebook లో చూసా కదరా అలా గుర్తు పట్టా అన్నాడు సాగర్ , నేను ఈ facebook లు insta లు వాడను కదరా అన్నాడు విజయ్ , తెలుసు అకౌంట్ క్రియేట్ చేసి వదిలేస్తావు కానీ మళ్ళీ దాని ముఖం కూడా చూడవు , నువ్వు లాస్ట్ year క్రియేట్ చేసి తమ ఫోటో ఒకటి దానిలో అప్లోడ్ చేశారు కదా , అది చూసి గుర్తు పట్టా , నేను friend request కూడా పెట్టా కానీ మళ్ళీ నువ్వు facebook open చేసినట్టే లేవు కదా అన్నాడు సాగర్ , చెప్పా కదా నాన్న సడెన్ గా అలా అవడం , అమ్మ హెల్త్ , నా ట్రైనింగ్ అసలు ఖాళీ లేదురా బావ అన్నాడు విజయ్ , ఎన్ని రోజులైంది రా నువ్వు బావా అని పిలిచి అని నువ్వు కూడా నన్ను బాగానే గుర్తు పట్టావు రా అన్నాడు సాగర్, రోజులు కాదురా సంవత్సరాలు అయింది మనం కలిసి , నువ్వేమి మారలేదు రా అలానే ఉన్నావు , కాక పోతే స్టైలిష్ గా హీరో లా అయ్యావు అన్నాడు విజయ్ , నాన్న వాళ్ళ కి ఒకసారి కాల్ చేస్తా అని ఫోన్ డయల్ చేస్తుండగా బయటి నుండి కార్ వస్తున్న sound వినపడింది ,ఇద్దరూ కిటికీ వైపు చూసారు , గేట్ లో నుండి మోహన్ కార్ లోపలికి వస్తోంది , నేను వెళ్లి వాళ్లను ఇక్కడికి తీసుకొస్తాను నువ్వు ఈలోపు juice తాగు అని విజయ్ కి చెప్పి సాగర్ బయటకు వెళ్ళాడు.