Read Truth - 12 by Rajani in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

నిజం - 12

నెక్స్ట్ డే మార్నింగ్ విజయ్ మొబైల్ రింగ్ అవుతోంది , లేట్ గా పడుకోవటం పైగా మందు రోజు కూడా అసలు తీరిక లేకుండా ఉండటం తో బాగా నిద్ర పట్టేసింది విజయ్ కి , తన మొబైల్ మూడు సార్లు రింగ్ అయిన తరువాత మెలుకువ వచ్చింది విజయ్ కి , పొద్దున్నే ఎవరు కాల్ చేస్తున్నారు అనుకొని మగత లోనే ఫోన్ తీసి చూసాడు స్క్రీన్ మీద వాళ్ళ అమ్మ పేరు చూడగానే ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మా అన్నాడు విజయ్ , ఏంటి అక్కడ అంత బిజీ నా ఫోన్ కూడా చేయడం లేదు నిన్న అంతా వెయిట్ చేశా నీ కాల్ కోసం అంది వాళ్ళమ్మ , నేను ఈ వూరికి రాగానే ఒక సీరియస్ కేస్ వచ్చింది ఆ పనిలో పడి నీకు కాల్ చేయడం కుదరలేదు సారీ అమ్మా అమ్మా అన్నాడు విజయ్ , అవునా ఏంటి ఆ కేస్ అని అడిగింది విజయ్ తల్లి పార్వతి , అదో పెద్ద స్టోరీ లేమ్మా ఇప్పుడెందుకు గానీ అక్క ఎలా ఉంది , డాక్టర్ చెకప్ కి వెళ్ళారా అని టాపిక్ మార్చాడు విజయ్ , ఇలాంటివి చెప్పి వాళ్ళమ్మ ను టెన్షన్ పెట్టడం ఇష్టం లేదు విజయ్ కి అసలే వాళ్ల నాన్న చనిపోయిన దగ్గర నుండి తన హెల్త్ బాగుండటం లేదు , విజయ్ వాళ్ళ అక్క గురించి అడగగానే వాళ్ళమ్మ సంతోషం గా , అది చెప్పడానికే కాల్ చేశాను నిన్ననే డాక్టర్ బేబీ జెండర్ చెప్పారు ,అక్కకి బాబు పుట్టబోతు న్నాడు మీ నాన్న మళ్ళీ మన మధ్యలోకి వస్తారు త్వరలోనే అంటూ ఆనందం లో కన్నీళ్లు వచ్చాయి పార్వతికి , నిజంగా గుడ్ న్యూస్ చెప్పావమ్మా ఇంతకీ అక్క , బావ ఎక్కడ అన్నాడు విజయ్ , ఇదుగో నా పక్కనే ఉన్నారు ఫోన్ అక్కకి స్తున్నా మాట్లాడు అని విజయ్ అక్క స్నేహ కి ఫోన్ ఇచ్చింది , అక్క , బావలకు కంగ్రాట్స్ చెప్పి కాసేపు వాళ్ళతో మాట్లాడాడు విజయ్ తరువాత వాళ్ళమ్మ మళ్ళీ ఫోన్ తీసుకుని ఇంతకీ జాబ్ లో జాయిన్ అయ్యాక గుడికి వెళ్ళావా లేదా అని అడిగింది , అది వర్క్ ఎక్కువగా ఉండి అని నసిగాడు విజయ్ , నాకు తెలుసు నువ్వు ఇలానే చేస్తావు అన్నీ మీ నాన్న పోలికలే నీకు , ఈ రోజయినా స్టేషన్ కి వెళ్ళే ముందు గుడికి వెళ్లు అంది పార్వతి , ఓకే అమ్మా నువ్వు చెప్పాక వెళ్లకుండా ఉంటానా తప్పకుండా వెళతాను బై అమ్మా అని చెప్పి , ఫోన్ లో టైం చూసుకున్నాడు 6 గంటలయింది , ఈ రోజు అయినా జాగింగ్ కి వెళ్ళాలి చాలా రోజులయింది వూరు కూడా చూసినట్టు ఉంటుంది , అనుకొని జాగింగ్ కి వెళ్ళాడు తిరిగి వచ్చే దారిలో సడెన్ గా గేట్ తీసుకొని ఒక అమ్మాయి అడ్డు వచ్చింది , ఆ అమ్మాయి హడావుడి గా వచ్చేసరికి విజయ్ కి సడెన్ గా డాష్ ఇచ్చి పడిపోతుంటే పట్టుకున్నాడు విజయ్ , వైట్ చుడీదార్ లో లూస్ హైర్ తో ఫెయిరీ టేల్స్ లో ప్రిన్సెస్ లా ఉంది ఆ అమ్మాయి , రెప్ప వేయకుండా తననే చూస్తున్నాడు విజయ్ , ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నె లేమో యదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో మైమరచిపోయా మాయలో అని మనసులోనే పాడుకుంటూ ఉన్నాడు విజయ్ , ఓయ్ ఎవరు నువ్వు వదులు అని గట్టిగా అరిచింది విద్య , తేరుకుని ఈ లోకం లోకి వచ్చాడు విజయ్ , హై నా పేరు అంటూ చేయి చాచి షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు విజయ్ , ఓయ్ నీ పేరు ఎవరికి కావాలి , ఇదేమన్నా మీ సిటీ అనుకున్నావా నీ ఇష్టం వచ్చినట్టు అమ్మాయిలకు డాష్ ఇస్తే వూరుకొడానికి అంది కోపంగా , మిస్ మీరే చూసుకోకుండా వచ్చి గుద్దారు పడిపోతూ ఉంటే పట్టుకున్నందుకు థాంక్స్ చెప్పకుండా తిరిగి నన్నే అంటున్నారు అన్నాడు విజయ్ ఫేస్ అమాయకంగా పెట్టి , తిరిగి నన్నే అంటావ అసలు నన్ను పట్టుకొడాని ఎంత ధైర్యం నీకు పైగా నీ బాతు గుడ్లతో మింగేసే టట్టు చూస్తున్నావ్ , మా నాన్న అసలే పోలీస్ ఈవ్ టీజింగ్ కేస్ పెట్టి జైల్ లో వేయిస్తా జాగ్రత్త అంది కోపంగా , ఓ మా మామ గారు పోలీస్ అన్నమాట అన్నాడు విజయ్ చిన్నగా నవ్వుకుంటూ , ఏమన్నావ్ మళ్ళీ చెప్పు అంది విద్య , నేనేమన్నా మీ నాన్న గారు పోలీస్ అన్నమాట అన్నాను అంతే అన్నాడు విజయ్ , కాదు ఇంకేదో అన్నావ్ అంది విద్య , నేను ఏదో అనాలని ఎక్స్పెక్ట్ చేస్తుంటే చెప్పండి అదే అంటాను అన్నాడు విజయ్ , చీ నీలాంటి పోకిరి తో మాట్లాడటం నాదే తప్పు, అని వెళ్ళిపోవడానికి వెనక్కి తిరిగింది విద్య , మిస్ ఇంతకీ మీ పేరు చెప్పలేదు అన్నాడు విజయ్ , ఆ mrs విజయ్ అంది విద్య వెనక్కి తిరిగి , what అన్నాడు విజయ్ షాక్ అయ్యి , నేను కాబోయే mrs విజయ్ అందుకే అలా చెప్పా , ఈ వూరికి కొత్తగా వచ్చిన S.I నా కాబోయే హస్బెండ్ , నన్నిలా మింగేసే లా చూసావు అని తెలిస్తే నీ కళ్ళు పీకి చేతిలో పెడతాడు అంది విద్య వేలు చూపించి బెదిరిస్తూ , సారీ మేడమ్ sir కి నా గురించి ఏమి చెప్పకండి ప్లీస్ అన్నాడు విజయ్ భయపడుతున్నట్టు నటిస్తూ , ఇప్పుడు దారిలో కి వచ్చాడు మనసులో అనుకొని సరే ఈ సారికి వదిలేస్తా ఇంకెప్పుడు అయినా నేను కనిపిస్తే తల దించుకుని వెళ్ళాలి సరేనా అంది వేలు చూపించి బెదిరిస్తూ , ok mrs విజయ్ చెప్తే వినాలి కదా మరి అన్నాడు నవ్వు ఆపుకుంటూ , గుడ్ అని అక్కడి నుండి వెళ్లి పోయింది విద్య , అమ్మ గుడికి వెళ్ళ మని చెప్పింది , వెళ్ళకుండానే వరం ఇచ్చాడు దేవుడు , గుడికి వెళ్ళి ఆ దేవుడికి థాంక్స్ చెప్పుకోవాలి నా బంగారాన్ని చూపించి నందుకు , నువ్వు కాబోయే mrs విజయ్ అని ఒప్పుకున్నందుకు థాంక్స్ బంగారం , అనుకొని తన క్వార్టర్స్ కి బయలుదేరాడు విజయ్. విజయ్ గురించి వాళ్ళ నాన్న చెబితే వినటం తప్ప డైరెక్ట్ గా చూడలేదు విద్య , అందుకే విజయ్ ని చూసి ఎవరో అనుకుని బెదిరించాలి అని అలా నోటికొచ్చిన అబద్దమ్ చెప్పేసింది .

విజయ్ ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యే లోపు రాఘవులు జీప్ తీసుకుని వచ్చాడు , జీప్ ఎక్కిన విజయ్ రాఘవులు గారు దగ్గర లో గుడి ఏమయినా ఉందా అని అడిగాడు , ఉంది sir ఈ వూళ్ళో గంగానమ్మ గుడి చాలా ఫేమస్ ,ప్రతి ఏటా జాతరను చాలా ఘనంగా చేస్తారు , వేరే వూళ్ళ నుండి కూడా జనం బాగా వస్తారు , 5 నిమిషాల్లో వెళ్లొచ్చు గుడికి అన్నాడు రాఘవులు డ్రైవ్ చేస్తూనే , సరే పదండి దర్శనం చేసుకుని స్టేషన్ కి వెళదాం అన్నాడు విజయ్ , 5 నిమిషాల్లో గుడికి చేరుకున్నారు విజయ్ , రాఘవులు . గుడి కి వెళ్ళగానే ప్రదిక్షణా లు చేస్తున్న విద్య ని చూసి విజయ్ మొహం లో చిరు నవ్వు మెరిసింది , ముందు నడచి వెళుతున్న రాఘవులు వెనక్కి తిరిగి ఈ వూరి గ్రామ దేవత sir ఈ గంగానమ్మ తల్లి అని విజయ్ మొహం వైపు చూసాడు విజయ్ మొహం లో ఆనందం గమనించి , మీకు ఈ గుడి బాగా నచ్చినట్టుంది sir అన్నాడు రాఘవులు , అవును రాఘవులు గారు బాగా నచ్చింది అన్నాడు విద్య ను చూస్తూ , ఈ తల్లి చాలా మహిమ కలది మీరు ఏం కోరినా జరుగుతుంది sir అన్నాడు రాఘవులు , నిజమే రాఘవులు గారు దర్శనం చేసుకోక ముందే నా మనసులో ఉన్న బంగారాన్ని నాకు చూపించింది అనుకున్నాడు మనసులో విజయ్ , గుడిలో అమ్మవారి దర్శనం చేసుకున్నారు తన మనసులో ఉన్న అమ్మాయి ని తన జీవిత భాగస్వామి గా చేయమని అమ్మవారిని కోరుకున్నాడు విజయ్ , లోపల దర్శనం చేసుకుని బయటకు రాగానే గుడి ఆవరణలో ఒక అమ్మాయి ప్రసాదం పంచుతుంది , తన దగ్గరకు వెళ్ళి ప్రసాదం తీసుకున్నారు విజయ్ , రాఘవులు . విజయ్ ప్రసాదం తీసుకుని చాలా బాగుంది అమ్మ పులిహోర ప్రసాదం అన్నాడు విజయ్ , ఇదుగో అన్నయ్య ఈ పులిహోర నీకే అని ఒక బాక్స్ ఇచ్చింది ఆ అమ్మాయి , నేను నీకు ముందే తెలుసా అని అడిగాడు విజయ్ ఆశ్చర్యం గా , తను రామారావు గారి అమ్మాయి sir , పేరు గంగ అని పరిచయం చేశాడు రాఘవులు , నాన్న సాగర్ నీ గురించి చెప్పారు అన్నయ్య , బాబు దొరికాడు కదా అందుకే గుడిలో ప్రసాదం ఇవ్వడానికి వచ్చాను , గుడి నుండి పోలీస్ స్టేషన్ కి వచ్చి నీకు ప్రసాదం ఇచ్చి థాంక్స్ చెప్పాలనుకున్నా మీరే ఇక్కడ కనిపించారు అంది గంగ, అన్నయ్య అని పిలిచి మళ్ళీ థాంక్స్ ఎందుకు చెప్పటం నిన్ను చూస్తే నా సొంత చెల్లెలు లాగా అనిపిస్తుంది అన్నాడు విజయ్ , గంగ విజ్జి రాలేదా నీతో అడిగాడు రాఘవులు , విజ్జి ప్రదిక్షణాలు చేస్తుంది uncle , ఒక నిమిషం ఉండండి వచ్చేస్తుంది , మీకు చెప్పి నేను, విజ్జి కూడా సాగర్ తో పాటు హాస్పిటల్ కి వెళదాం అని మీ దగ్గరకు వచ్చి చెబుదాం అనుకున్నాం uncle అంది గంగ రాఘవులు తో , అయ్యో దానిలో ఏముంది అమ్మా వెళ్లి రండి అన్నాడు రాఘవులు , విజ్జి ఎవరు రాఘవులు గారు అడిగాడు విజయ్, నా కూతురు sir పేరు విద్య మేము విజ్జి అని పిలుస్తాం , విద్య , గంగ ఇద్దరూ పట్నం లో మెడిసిన్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు, చిన్నప్పటి నుండి కలసి చదువుకున్నారు , ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పాడు రాఘవులు , విజయ్ కి వెనుక నుండి నాన్న అని ఒక వాయిస్ వినపడింది , రా విజ్జి నీ గురించే చెబుతున్నా S I గారికి అని తనే sir మా అమ్మాయి విద్య అని విజయ్ వెనుక ఉన్న విద్య ను చూపించాడు రాఘవులు , విజయ్ వెనక్కి తిరిగి చూసి షాక్ అయ్యాడు నా బంగారం పేరు విజ్జి నా విజయ్ విజ్జి పేర్లు బలే కలిశాయి అనుకొని hi i am విజయ్ అని shake hand ఇవ్వడానికి , మరో వైపు విద్య షాక్ కొట్టినట్టు అలానే ఉండిపోయింది విజయ్ ని చూసి, వాళ్ల నాన్న అక్కడే ఉన్నారు కాబట్టి బాగోదు అని తేరుకొని రాని నవ్వుని మొహం మీదకు తెచ్చుకుని హెల్లో sir నా పేరు విద్య అంది , ఓ విద్య విజ్జి mrs విజ్జి విజయ్ , అన్నాడు విజయ్ మెల్లిగా మిగిలిన వాళ్ల కు వినపడకుండా, వీడికి అడ్డంగా దొరికిపోయా అనవసరం గా నోటికి వచ్చింది వాగేసా అని తనను తానే మనసులో తిట్టుకుంది విద్య , sir తమరు చెయ్యి వదిలితే మేము వెళతాం అని తన చేతిని వెనక్కి తీసుకుంది విద్య, విద్య రాఘవులు దగ్గరికి వెళ్ళి నాన్న నేను గంగ అన్నయ్యతో అని చెబుతుంటే , గంగ చెప్పింది తల్లి వెళ్లి రండి , డాక్టర్ తో మాట్లాడాక నాకు ఒక సారి కాల్ చేయండి , మాకు లేట్ అవుతుంది వెళతాం అని ఇద్దరికీ బై చెప్పి స్టేషన్ కి బయలు దేరారు రాఘవులు , విజయ్ .

విజయ్ మాత్రం అక్కడి నుండి వెళ్ళే వరకు మధ్య మధ్య లో వెనక్కు తిరిగి విజ్జి ని చూసుకుంటూ వెళ్ళాడు , మళ్లీ ఈ దర్శన భాగ్యం ఎప్పుడో అనుకుంటూ , విజయ్ తనను చూడటం గమనిస్తూనే ఉంది విద్య.