Featured Books
  • వైశాలి - 1

    వైశాలి అందమైన యువతి.  ఆమె ఎంత అందంగా ఉంటుందంటే ముందు ముందు న...

  • ఔను నిజం నువ్వంటే నాకిష్టం

    తెనాలి రైల్వే స్టేషన్‍       అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల...

  • ఆగంతకుడు

    క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను....

  • అచ్చిరాని అతితెలివి

    తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ...

  • ఇంటిదొంగలు

    ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసె...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

తనువున ప్రాణమై.... - 5

ఆగమనం.....

ఇప్పుడు నేను అర్జెంటుగా వాడి దగ్గరికి వెళ్ళాలి.
నా లవ్ మేటర్ వాడికి చెప్పేయాలి.
నేను మళ్ళీ వచ్చి, ఈ లెహంగా తీసుకుంటాను.

ఇవి లేకపోయినా, ఇటువంటి డిజైన్స్ తీసుకుంటాను!! అప్పుడు అవి నాకు, బాగా సూట్ అవుతాయి!!
నీ దగ్గరే తీసుకుంటాను, సరేనా..!!
ఇప్పుడు మాత్రం నేను వెళ్ళాలి!!
బాయ్... బాయ్..!! అంటూ... ఆ సేల్స్ రెండు బుగ్గలు మళ్ళీ ఒకసారి లాగేసి, అక్కడి నుంచి కదులుతుంది.

మై సిక్స్ ఫీట్...!!
వస్తున్న, నీకోసమే వస్తున్నా..!!
ఐ లవ్ యు రా..!!
ఐ లవ్ యు మై 6 ఫీట్..!!

సేల్స్ గర్ల్ అచ్చు బొమ్మలాగా నిలబడిపోయి, వెళ్ళిపోతున్న ఆమె వైపు "పొద్దు తిరుగుడు పువ్వు, సూర్యుడు వైపు, ఎలా తిరుగుతుందో" అలా తిరిగుతు, నూరేళ్ల బెట్టి చూస్తూంది.

ఫ్లోర్ ఇన్చార్జి, మాట్లాడి వెళ్లిపోవడంతో, అతను ఎవరికో ఫోన్ చేసి ఫోన్ మాట్లాడుతున్నాడు.

ఆరడుగుల హైట్! ఫెయిర్ స్కిన్ టోన్, కోల ముఖం, సిల్కీ గా కాకుండా రఫ్ గా కాకుండా మధ్యస్థంగా ఉండి ఒత్తుగా ఉన్న హెయిర్. డైలీ జిమ్ కి వెళ్లి, వర్క్ అవుట్స్, చేస్తూ.. పెంచిన సిక్స్ ప్యాక్ బాడీ అయితే లేదుగానీ, చూడ చక్కని దేహదారుడ్యంతో... అతన్ని చూసిన ఆడపిల్లలకు ఇటువంటి ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుండు! అనే విధంగా ఉన్నాడు.

అక్క ఎక్కడున్నావ్...?? అతను ఫోన్లో అటువైపున ఉన్న తన అక్కతో మాట్లాడుతున్నాడు.

అవతల వాళ్ళ అక్క చెప్పేది వింటూ... ఇటు నుంచి దానికి తగిన విధంగా, వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది.

ఫోన్లో మాట్లాడుతూనే, తనకి ఒక అడుగు దూరంలో నిలబడి తననే గుచ్చి గుచ్చి చూస్తున్న అమ్మాయిని చూసి... ఆమె అక్కడ ఇంక దేనికోసమైనా నిలబడి ఉన్నదేమో, అన్న ఆలోచనతో... తల పక్కకు తిప్పేసి మళ్లీ వాళ్ళ అక్కతో అలా మాట్లాడుతూనే ఉన్నాడు.

హా... చెప్పాను అక్క కింద కౌంటర్ దగ్గర కలెక్ట్ చేసుకుందాము. నువ్వు త్వరగా రా అక్క!! నేను ఇక్కడే ఉంటాను.

సరే రా! ఇక్కడ కూడా అయిపోయింది. ఒక పది నిమిషాలలో అక్కడ ఉంటాను, సరేనా...!!

సరే అక్క ఉంటాను..!! ఫోన్ కట్ చేసి పాకెట్లో పెట్టుకుని, తన ఎదురుగా ఉన్న అమ్మాయిని చూస్తున్నాడు.

ఆ అమ్మాయి తనే!
అంతకుముందు అతన్ని చూస్తున్న అమ్మాయి!
అతను పక్కకు తిరిగేసరికి, సరిగా మొఖం కనబడక ఎదురుగా వచ్చి నిలబడి, అతన్నే చూస్తూ ఉంది.

రెండు చేతులు తన వెనక్కి పెట్టేసుకొని, అందమైన చిరునవ్వుతో, ఒక అద్భుతాన్ని చూస్తున్నట్టు... కళ్ళల్లో కాంతులు పెద్దజల్లుతూ, చిన్నపిల్లలు ఊగినట్టు "లెఫ్ట్ నుంచి రైట్ కి, రైట్ నుంచి లెఫ్ట్ కి" బాడీని తిప్పుతూ, కల్లార్పకుండా అతన్నే, మెస్మరైజింగ్ గా చూస్తుంది.

ఆమె అంతలా చూస్తుంటే ఎందుకో ఏమిటో అర్థం కాకుండా కన్ఫ్యూజ్గా ఆ అమ్మాయిని చూస్తున్నాడు. అసలు చూస్తున్నది తననే కదా అన్న చిన్న కన్ఫ్యూషన్ తో మళ్ళీ తనకి రెండు వైపులా చెక్ చేసుకున్నాడు.

ఈ పిల్ల ఎవరు? నన్నే చూస్తుంది!
నన్నే కదా చూస్తుంది!! అంటూ.. ఒక్కసారి సూటిగా ఆ అమ్మాయిని చూసి, కన్ఫర్మ్ చేసుకుంటాడు.
ఆ.. నో డౌట్! నన్నే, చూస్తుంది.
ఒకవేళ తెలిసిన వాళ్ళ అమ్మాయా??
లేకపోతే, నేను తెలిసిన అమ్మాయా??
అసలు నోరు తెరిచి మాట్లాడకుండా, అలా చూస్తుందేంటి??
సమయానికి అక్క కూడా లేదు, కనుక్కుందామంటే??
పోనీ, మనమే అడిగితే..??
ఉమ్... అడుగుదాము!!

ఎక్స్క్యూజ్ మీ (excuse me) మిస్...

ఆమె ఉగడం ఆపి అతనినే, చూస్తుంది.

మీరు ఎవరికోసమైనా, ఇక్కడ వెయిట్ చేస్తున్నారా? అతను...చాలా పొలైట్ గా, నెమ్మదిగా అడుగుతాడు.

అతని స్వరానికి ముగ్దురాలు అయిపోయి, ఆమె మరింత అందంగా నవ్వుతుంది.

హా... అవును! నీకోసమే, నిన్ను చూస్తూ వెయిట్ చేస్తున్నాను. చాలా...మైల్డ్ వాయిస్ తో, మధురంగా మాట్లాడుతుంది.

అసలు ముఖ పరిచయం కూడా లేని అమ్మాయి... మొదటి పలకరింపులోనే, "నిన్ను, నువ్వు" అంటుండే సరికి అతనికి వియర్డ్ గా అనిపిస్తుంది.

ఈ పిల్లకి కొత్త పాత అనేది, తెలియదు అనుకుంటా! బాగా కలుపుగోలు మనషెమో, అందుకే "నిన్ను, నువ్వు" అంటుంది. అసలు ఎవరబ్బా ఇంతకీ..?? పైగా నాకోసం అంటుంది. అతని ఇన్నర్ వాయిస్.

Ok, మీరు నా కోసం వెయిట్ చేస్తున్నారా? మీకు నేను తెలుసా..??(నీకు సైట్ కొడుతుంది రా బాబు)

హా... తెలుసు, చాలా బాగా తెలుసు..!!

హో... తెలుసా!! ఐ యాం సారీ!! మీరు ఎవరు నాకు తెలియదండి!! మిమ్మల్ని ఇంతకుముందు ఎక్కడ చూడలేదు!! మీరు, ఎందుకు ఇక్కడ.... అంటూ, నెక్స్ట్ ఎలా అడగాలో, అర్థం కాక ఆగిపోతాడు.

హేయ్.. ఇట్స్ ఓకే..!! డోంట్ కన్ఫ్యూజ్..!!
నేను నీకు ఇంతకుముందు తెలియదు!!
నువ్వు, అసలు కన్ఫ్యూజ్ అవ్వకు!!
ఇంతకుముందు, నువ్వు ఎప్పుడు నన్ను చూడలేదు!!
జస్ట్ ఇప్పుడే, నేను కూడా నిన్ను చూశాను!!
అదిగో, అక్కడ అద్దం ఉంది చూడు...

అదిగో అది.. ఆ గోడకి ఫిట్ చేసి, ఉంది చూడు.. అంటూ వాళ్లకి కాస్త దూరంలో, ఉన్న అద్దం వైపు, ఆమె చెయ్యి చాపి చూపుడువేలుతో, చూపిస్తుంది.

అతను అయోమయంగా, ఆమె చూపిస్తున్న.. అద్దం వైపు చూసి మళ్లీ తిరిగి ఆమెను అలాగే చూస్తున్నాడు.

ఆమె అంతే అందంగా నవ్వుతూ, అతని హైట్ కి, తలంత పైకి ఎత్తి మరి మాట్లాడుతుంది.(మన పాప ఎత్తు 5.1"కదా, అతనేమో ఆరడుగులు)

చూసావు కదా!! దానిలోనే, ఇంతకుముందే ఐదు నిమిషాలు.. ఉహూ... కాదు, కాదు ఏడు నిమిషాల క్రితం. ఫస్ట్ టైం నిన్ను చూసాను.

ఐ థింక్..!! అది మ్యాజిక్ మిర్రర్ లేదా లవర్స్ మిర్రర్ అనుకుంటా!! నిన్ను ఇలా చూడగానే, అలా నువ్వు నా గుండెల్లోకి వచ్చేసావు. నువ్వు నాకు భలే నచ్చేసావు తెలుసా!! అసలు నువ్వు భలే అందంగా ఉన్నావోయ్!!
నీలో ఏదో..దో.. మా......

హలో మిస్..!? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒకే ఒక్క నిమిషం.... ఆగుతారా...!! అని, రెండు చేతులు స్టాప్ బోర్డ్ లాగా చూపిస్తూ, ఆమె మాటలకి బ్రేక్ వేస్తాడు.

ఉఫ్..ఫ్... అంటూ, ఊపిరి వదిలి అసహనంగా ఆమెను చూస్తున్నాడు.

ఆమె నోరు తెరిచింది మొదలు.. ఒక సెకండ్ కూడా బ్రేక్ ఇవ్వకుండా, మాట్లాడుతూనే ఉంది. అతను మధ్యలో బ్రేక్ వేద్దామని పొలైట్ గా... అతని ఒక చెయ్యి చూపించిన, చేతి ఫింగర్స్ ముడిచి రిక్వెస్ట్ చేస్తున్నట్టు చూపిస్తూ, ఆపడానికి ప్రయత్నించినా కూడా... అసలు పట్టించుకుంటేనేగా, తన ఫ్లోలో తను చెబుతూనే ఉంది.

అసలు ఏంటండీ మీరు మీ ఫ్లోలో మీరు మాట్లాడేస్తున్నారు ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ తో పనిలేదా మీకు అసలు ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా..!!


@@@@@@@@@

మీ పయనం కొనసాగించండి....
తదుపరి భాగంలో... కథానాయకుడుకి, తన ప్రేమను వ్యక్తపరుస్తున్న, కథానాయక!!

నచ్చిన వారితోపాటు, చదువుతున్న ప్రతి ఒక్కరు మీ రేటింగ్స్, సమీక్షలను అందజేస్తే... మాకు మరింత ప్రోత్సాహకంగా ఉంటుంది.

మళ్లీ కలుద్దాం.
థాంక్యూ సో మచ్.
వర్ణ.