Read The shadow is true - 41 by LRKS.Srinivasa Rao in Telugu Fiction Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

నీడ నిజం - 41

తగిన అవకాశం కోసం ఎదురుచూస్తున్న భరత్ రామ్ , జస్వంత్ లకు విద్యాధరిని ప్రపంచానికి పరిచయం చేయటానికి శంకుస్థాపన అనువైన సంధర్భం అనిపించింది . అందుకు ఒక వేదిక కావాలి . ఆ వేదిక పై విద్యా తన పునర్జన్మ రహస్యాన్ని ప్రపంచానికి చాటాలి . అందుకు రాజకీయ వర్గాల అండదండలు అవసరం . రాజకీయ ప్రముఖులు , మనస్తత్వ నిపుణులు , మేధావులకు ఆ వేది క కేంద్ర బిందువైతే ; అశేష ప్రజానీకం ముందు విద్యా వేదిక పై నిలబడి అజయ్ ను ఎదుర్కొంటే ---ఆ వేదిక చరిత్ర సృష్టించగలదు . అజయ్ అన్నివిధాలా ఆశక్తుడ వుతాడు . అతడు ప్రజా న్యాయస్థానం ముందు తలవంచక తప్పదు . శంకుస్థాపన రోజే గ్రామం లో జాతీయ స్థాయి లో ఆ సభ జరగాలి . నిజం వెలుగు చూడాలి . కోమల శాంతించాలి . ఆలోచనకు పూర్తి రూపం రాగానే భరత్ రామ్ , జస్వంత్ ఎప్పుడు, ఎవరెవరిని కలవాలో , ఏమేం చేయాలో ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు . ఆ ప్రణాళిక ప్రకారం అడుగు ముందుకు వేశారు . అనుకున్నది సాధించడానికి

వ్యవధి చాల తక్కువ . ఇప్పుడు కావలిసింది నడక కాదు . ---ఉరుకులు ,పరుగులే

రాజకీయ దుమారం సునామీ కన్నా శక్తివంతమైనది .దాని తాకిడికి ప్రభుత్వాలే కూలిపోతాయి . తనకున్న పబ్లిక్ రిలేషన్స్ పట్టు తో అజయ్ రాజకీయ ప్రత్యర్థుల్ని జస్వంత్ కలిశాడు . వాళ్లకు మాటల గారడీ తో రంగుల చిత్రం చూపాడు . వేదికపై విద్య ను నిలబెట్టే బాధ్యత తనదని హామీ ఇచ్చాడు . అజయ్ ప్రత్యర్థులు అధికారం లో ఉన్నారు గనుక ఉత్సాహం తో చెలరేగారు .

The historical background అఫ్ ‘sati’ అన్న వ్యాసం చాలామందిని ఆలోచింప చేసింది . ఆయా కాలాల్లో కొన్ని సామాజిక పరిస్థితులు , ఆనాటి ప్రజల ఆలోచనా సరళి , ధర్మం, సంప్రదాయం ఎలా ఓ ఆచారానికి పునాది అవుతుందో చక్కటి ఉదాహరణాలతో ఆ వ్యాసం లో వివరించటం జరిగింది . మధ్య యుగం భారత దేశ చరిత్ర పై పట్టు ఉన్న ఓ history professor ఆర్టికల్ అది . ఆ professor ‘సతి ని సమర్థించలేదు . ఖండించలేదు . కాదనలేని కొన్ని వాస్తవాలు, జీర్ణించుకోలేని కొన్ని చారిత్రిక సంఘటనలు ఆ వ్యాసం లో పొందు పరచాడు .

“ విజ్ఞాన వేదిక “ శంకుస్థాపన జరిగే రోజు గ్రామంలో ఏర్పాటు కానున్న సభ . ‘సతి’ అన్న దురాచారం పై పూరించిన శంఖారావం . పారా సైకాలజీ లో ఓ అద్భుత అంశం ---పునర్జన్మ పై జరిగే చర్చ . సజీవ సాక్ష్యం గా వేదికపై నిలిచే విద్యాధరి . ఆమె అనుభవాల విశ్లేషణ . కాలగర్భంలో పడి ఆనవాలు లేకుండా మిగిలిపోయిన

ఓ రహస్యం వెలుగు చూసే అపూర్వ సంఘటన . – ఇలా ఎన్నో విశేషాల తో ప్రజల ముందుకు వస్తున్న అద్భుతం---‘విజ్ఞాన వేదిక ‘.

సభకు ప్రచారం ఈ తీరున జరిగింది . వడగళ్ళ జడి లాంటి ఈ పరిణామాలు , పరుగులు అజయ్ సింహ రూపాదేవిని

బెంబే లె త్తించాయి . వెంటనే ఆమె సాగర్ని కలిసింది . ఫొనులో మాట్లాడే సాహసం చేయలేదు అధికార పార్టీ వారు ఫోన్ టాపింగ్ చేస్తున్నారన్న అనుమానం . ఒక్కరోజు వ్యవధి లో ఆమె ఫ్లైట్ లో.

హైదరాబాదు వెళ్లి వచ్చింది .

“ కోమల గారి పునర్జన్మ ఈ స్థాయి లో దుమారం రేపుతుందని కలలో కూడా ఊహించలేదు . రాజకీయ జోక్యం వల్లనే ఇంత రభస జరుగుతోంది . ‘ విజ్ఞాన వేదిక’ లక్ష్యం విద్యాధరే .

తప్పక మాపై ఒత్తిడి వస్తుంది . విద్యా ఆ సభలో ఆనాటి సంగటన గురించి ఏదో ఒకటి చెప్పాలి . ఈ రోజో , రేపో, ఎవరో ఒకరు అధికార పార్టీ తరపున వస్తారు . మమ్మల్ని ఒప్పిస్తారు . విద్యా విజ్ఞానవేదిక పై కనిపించక తప్పదు . కానీ---వారి ఊహలను , అంచనాలను తలకిందులు చేస్తూ విద్యా ఆనాటి రహస్యం అవగింజంతైనా చెప్పదు . సహగమనం తన వ్యక్తిగత నిర్ణయమని ఇందులో కుట్ర-కోణం లేదని ఖచ్చితం గా చెబుతుంది . కంగారు పడకండి . నిశ్చింతగా వెళ్ళిరండి . “ రూపాదేవి సాగర్ కు మరోసారి ‘ థాంక్స్ చెప్పుకుంది . జస్వంత్ ఊహించినట్లే రూపా రెండోసారి వచ్చింది . ఇప్పుడు కూడా విద్యాాధరి ‘లైన్ క్లియర్ ‘ అయింది .

విజయ్ సింహ్ కు, రాహుల్ కు ఆహ్వానాలు అందాయి . ముసలావిడ తమ్ముడికి కూడా . అందరూ ఒకరోజు ముందుగా వస్తామని హామీ ఇచ్చారు . అజయ్ తల్లిని ప్రత్యేకం గా ,స్వయం గా వచ్చి ఆహ్వానించాడు . ఒకసారి అనుభవం అయినందువల్ల జస్వంత్ విద్యా మకాం మార్చాడు . ఆమెకు ప్రత్యేకమైన విడిది కట్టుదిట్టమైన భద్రత తో ఏర్పాటు చేశాడు .

అఘోరి ప్రో త్సాహం తో , ఆశీస్సులతోనే మందిర నిర్మాణం జరుగుతోందని రాహుల్ ద్వారా విద్యాకు తెలిసింది . అఘోరి సంకల్పం వెనక ఉన్న పరమార్థమేమిటో

ఆమె అర్థం చేసుకుంది . ఈ రూపం లో అతడు తన లక్ష్యానికి మార్గం సుగమం చేశాడు . మనసులోనే అఘోరికి ధన్యవాదాలు తెలుపుకుంది . అతడి అజ్ఞాత హస్తం తనను కాపు కాస్తుందన్న స్పృహ ఆమె మనోధై ర్యాన్ని అనూహ్యంగా పెంచింది .

శంకుస్థాపన ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి . లోపల లావాలా ఉడుకుతున్నా పైకి గంభీరం గా కనిపిస్తున్నాడు అజయ్ . కాలు వెనక్కు తీసుకోలేని పరిస్థితి . అష్ట దిగ్బంధన జరిగింది . చావో రేవో తేల్చుకోవాలి . “ చివరి మెట్టు మీద ఉన్నాం . ఒక అడుగు ముందుకు వేస్తే ఏమవుతుందో తెలీదు .

అయినా పర్వాలేదు . ఏమాత్రం భయపడకండి . !....విధిని ఎవరూ తప్పించలేరు . అల వస్తే తలవంచట మే . పరువు—ప్రతిష్ట అంటూ ఇంకా పాకులాడకండి . ధైర్యంగా పరిస్థితి ఎదుర్కోండి .పరిస్థితి అనుకూలంగా ఉన్నా, లేకపోయినా జంక వద్దు . తప్పు ఒప్పుకోవటం లో సంస్కారముంది . గౌరవముంది . అందరూ ఆశిస్తున్నట్లు విద్యాదరి వచ్చినా భయపడవద్దు . ఆమెతో ప్రశాంతం గా మాట్లాడండి . గుండె బరువు దింపు కోండి . రాకపోతే----ఏ దేవుడో మనల్ని కరుణించా డనుకోవాలి . శంకుస్థాపన ఏ గొడవ లేకుండా ప్రశాంతం గా జరిగిపోతుంది .”

రూపాదేవి మాటలు అజయ్ ను కదిలించాయి . ఆమె తనను క్షమించక పోయినా కష్టకాలం లో భార్యగా వెన్నంటే నిలిచింది . చేతి ఆసరాతో తల్లిలా ముందుకు రుపాను పొదువు కున్నాడు .

నడిపిస్తోంది . ఈ బలం, అభయం చాలు . సముద్రాలు దోర్లుకొచ్చినా ధైర్యంగా ఎదురు నిలబడవచ్చు .

******************************. కొనసాగించండి 42 లో