The shadow is true book and story is written by LRKS.Srinivasa Rao in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. The shadow is true is also popular in Fiction Stories in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
నీడ నిజం - నవలలు
LRKS.Srinivasa Rao
ద్వారా
తెలుగు Fiction Stories
హిమాలయ పర్వత ప్రాంతం లో ఒక గుహాన్తర్భాగం. సాయం సంధ్యారుణ కిరణాలు గుహలో ప్రసరిస్తున్నాయి. సమస్త ప్రకృతి ప్రశాంతం గా , ప్రమోదం గా ఉంది . గుహలో ఒక మూల శిలావేదిక పై వృద్దుడొకడు పద్మాసనం లో ఉన్నాడు. అతడికి చేరువలో నేలపై ఒక నడివయసు వ్యక్తీ . కళ్ళలో దైన్యం , మొహం లో సఘన విషాదం . ఇందుకు భిన్నంగా వృద్ధుడి ముఖం లో అనంత దీప్తి, తృప్తి, కళ్ళు, జ్ఞానంతో , అనుభవం ప్రసాదించిన నిండుదనంతో జ్యోతుల్లా వెలుగు తున్నాయి. “ చిన్మయా ! మనో నిగ్రహం తో ,సాధన తో, రాగ-ద్వేషాలను జయించావు. నీలో ఈ అవ్యక్తం ఏమిటి ?” వృద్ధుడి కం
నీడ-నిజం నాంది హిమాలయ పర్వత ప్రాంతం లో ఒక గుహాన్తర్భాగం. సాయం సంధ్యారుణ కిరణాలు గుహలో ప్రసరిస్తున్నాయి. సమస్త ప్రకృతి ప్రశాంతం గా , ప్రమోదం గా ఉంది . గుహలో ఒక మూల శిలావేదిక పై వృద్దుడొకడు పద్మాసనం లో ఉన్నాడు. అతడికి చేరువలో నేలపై ఒక నడివయసు వ్యక్తీ . కళ్ళలో ...మరింత చదవండి, మొహం లో సఘన విషాదం . ఇందుకు భిన్నంగా వృద్ధుడి ముఖం లో అనంత దీప్తి, తృప్తి, కళ్ళు, జ్ఞానంతో , అనుభవం ప్రసాదించిన నిండుదనంతో జ్యోతుల్లా వెలుగు తున్నాయి. “ చిన్మయా ! మనో నిగ్రహం తో ,సాధన తో, రాగ-ద్వేషాలను జయించావు. నీలో ఈ అవ్యక్తం ఏమిటి
రోజులు గడుస్తున్నాయి . ఓ నాడు ప్రా త: కాలాన ఋషీకేశ్ లో స్నానాదులు ముగించుకుని ధ్యానం లో కూర్చొన్నాడు చిన్మయుడు . మనసు సమాధి స్థితి పొందినప్పుడు అంతఃచేతనం సహస్ర దళ కమలం గా విప్పారిన వేళ అతడిలో మెరుపు లాంటి “ సంకేత”మొకటి తళుకుమంది . ఆ సంకేతం అతడిని వైకుంఠ ...మరింత చదవండినాడు తిరుమలకు చేర్చింది . పవిత్ర వైకుంఠ ధామం చేరి , శ్రీనివాసుని ధ్యానించి , సాయం సంధ్య లో బంగారు శిఖరాల వైభవాన్ని , విమాన గోపుర పసిడి కాంతులను అవలోకించే చిన్మయానండు డికి గుదేవుడి భవిష్యవాణి తేటతెల్లమైంది. సందేహాలు సూర్యకాంతి సోకినా పొగమంచులా విడిపోయాయి.”కర్తవ్యం “ స్ఫురించింది.ఆ పవిత్ర క్షేత్రం లోనే అతడు విద్యాధరిని చూడటం తటస్థించింది .విద్యాదరి తండ్రికి భవిష్యవాణి” వివరించింది అక్కడే ! ఆ తిరుమల గిరిలోనే .అప్పుడు విద్యాధరికి పదేళ్లు. తెలిసీ తెలియని ఊహ. వయసు. చిన్మయానంద
తనేం తప్పుగా ఆలోచించడం లేదు కదా. సాగర్ తల్లి ఎందుకు ఎప్పుడూ తనకు వ్యతిరేకంగా ఆలోచిస్తుంది . సాగర్ వైఖరి ఆమెకు అసలు నచ్చలేదు .తల్లి పై ప్రేమ ,"అనవసరం గా అమ్మని అనకు . ఆమె చెప్పిందని ఈ పని మానుకోలేదు . వేరే కొత్త వెంచర్ ప్లాన్ చేసాము . పేపర్ ...మరింత చదవండిజరుగుతున్నప్పుడు పెద్దగా నాకు పని ఉండదని ఎజ్ద్ హోం ప్రాజెక్ట్ టేకప్ చేశాను . ఈ లోపలే మన న్యూ వెంచర్ బ్యాంకు లోన్ శాంక్షన్ అయింది . పని ప్రారంభించాము . అందుకే ఎజ్ద్ హోం ప్రాజెక్ట్ వాలంటరీ ఆర్గనైజేషన్ కు అప్పగించాను .అప్పుడప్పుడు సూపెర్వైస్ చేస్తే చాలు . .... ఈ విషయాలన్నీ నీకు తెలుసు . తెలిసి కూడా ఎందుకంత ఎమోషనల్ గా నన్ను అరుస్తావ్?”అతడు చెప్పిన కారణం విద్యాధరిని సమాధాన పరచ లేకపోయింది . ఆమె అసహనం గా
.ఒకసారి సిటీ లో ఉగ్రవాదం పై ఒక సదస్సు జరిగింది. రెండు మతాలకు వేదిక లాంటి ఆ నగరం లో ప్రజల మధ్య సమన్వయం, అవగాహన పెంచే లక్ష్యం తో ఒక ఎన్.జీ.ఓ ఆ సదస్సు నిర్వహించింది . అప్పట్లో విధ్యాదరి ఓ పాపులర్ డైలీ లో ఓకే ప్రత్యెక కాలం నిర్వహించేది . ...మరింత చదవండిదిన పత్రిక తరపున సదస్సుకి ఆహ్వానింప బడింది . సదస్సుకు ముఖ్య అతిథి సాగర్. ఆ ఎం.జీ.ఓ మహారాజ పోషకుడు. అ సందర్భం లో విద్యాధరిని చూడడం , మాట్లాడటం జరిగింది . ఎందఱో ఉగ్రవాదం పై విభిన్న కోణాల్లో మాట్లాడారు . విద్యాధరి కూడా మాట్లాడింది . అందరితో పోలిస్తే ఆమె భావాల్లో సమస్య పై మరింత స్పష్టత, ఇరు మతాల వారికీ అనుకూలమైన ఆలోచనలు , అభిప్రాయాలూ ఉన్నాయి. ఆమె భావాలూ సదస్సులో చాల మందికి నచ్చాయి . నిజం చెప్పాలంటే
అఘోరి వెంటనే మాట్లాడలేదు. మౌనం గాఉండి పోయాడు. “ మీ నవీన విజ్ఞానం కార్యాకారణాల పై ఆధార పడుతుంది. ప్రతి విషయానికి మీకు కారణం కావాలి. కారణానికి అందని విషయం మీ దృష్టిలో అభూత కల్పన. ప్రతి చిన్న విషయాన్ని తర్కించి, నిజానిజాలు నిగ్గు తేల్చే మీరు ఈ అనంత సృష్టికి ఒక మహత్తరమైన ...మరింత చదవండిఉందని ఎందుకు ఒప్పుకోరు. ఈ మహా విశ్వం లో అనంత కాలం నుండి వాటి వాటి నిర్దిష్ట కక్ష్యల్లో క్రమం తప్పకుండా పరిభ్రమించే కోటానుకోట్ల గ్రహ నక్షత్రాలు , మరణించే వరకు లయ తప్పని గతిలో స్పందిచే మానవ హృదయం. వీచే గాలి వికసించే పుష్పాలు వీటన్నిటికి ఏ కారణం లేదా అన్నింటి కన్నా మీ నవీన విజ్ఞానాని కన్నా అద్భుతమైనది మనసు. ------అంత అద్భుతమైన మనసును భగవంతుడు మానవ శరీరం లో అమర్చాడు. ఈ అనంత విశ్వం లోనే మానవుడిది అత్యుత్తమమైన సృష్టి.