Read The shadow is true - 32 by LRKS.Srinivasa Rao in Telugu Fiction Stories | మాతృభారతి

Featured Books
  • వైశాలి - 1

    వైశాలి అందమైన యువతి.  ఆమె ఎంత అందంగా ఉంటుందంటే ముందు ముందు న...

  • ఔను నిజం నువ్వంటే నాకిష్టం

    తెనాలి రైల్వే స్టేషన్‍       అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల...

  • ఆగంతకుడు

    క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను....

  • అచ్చిరాని అతితెలివి

    తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ...

  • ఇంటిదొంగలు

    ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసె...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

నీడ నిజం - 32

ఆ పెద్ద లోగిలి ముందు వ్యాను ఒక్క కుదుపు తో ఆగింది . అందులోంచి నలుగురు వ్యక్తులు దిగారు . అందరూ దాదాపు ఒకే వయసు వారు . బాగా చదువుకొని పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వారిలా హుందాగా, గంభీరంగా ఉన్నారు . వారెవరో, ఎందుకు వచ్చారో అజయ్ కు అర్థం కాలేదు . అయినా అజయ్ వారిని మర్యాదగా ఆహ్వానించి కూర్చోమన్నాడు . తనూ కూర్చున్నాడు .

“ నా పేరు భరత్ రామ్ . సైకియాట్రిస్ట్ . వీరు నా కొలీగ్స్ . .... దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం విద్యాదరి అనే పదేళ్ళ పాపను కౌన్సిలింగ్ చేశాను.”

వచ్చిన నలు గురి లో ఒకరు పరిచయం చేసుకున్నారు . అజయ్ మొహం లో రంగులు మారాయి .

“ విద్యాధరి ఎవరు?” భరత్ రామ్ ప్రశ్న అర్థం కాలేదు . “ ... నేను ట్రీట్ చేసిన విద్యాధరి, మీ ఊరికి వచ్చిన అజ్ఞాత స్త్రీ ఒకరేనని నా అనుమానం.ఇద్దరిలో ఒక main common symptom ఉంది .”

“ ఏమిటది “?

“ ఇద్దరూ మంటల్ని చూసి బెదరి పోయారు భయం తో కేకలు పెట్టారు .”

“ మా గ్రామానికి వచ్చిన అజ్ఞాత స్త్రీ వివరాలు మాకెవరికీ తెలియవు . ఆమెను కనీసం మీరు చూడనైనా చూడలేదు . మరి---ఆమె మంటల్ని చూసి భయం తో కేకలు పెట్టిందని మీరెలా చెప్పగలరు ?” భరత్ రామ్ అజయ్ ను వింతగా చూశాడు .

“ నేను ఇంత దూరం వచ్చి మిమ్మల్ని ఎందుకు కలిశానో ఇంకా అర్థం కాలేదా ? పూర్వజన్మ లో ఆమె మీ వదిన గారు కదా ? ఆమె సహగమనం చేస్తున్నప్పుడు చివరి క్షణం లో కేకలు పెట్టారు కదా ? జస్వంత్ ఆర్టికల్ లో చదివాను . అది చదివాక ఆ అజ్ఞాత స్త్రీ , విద్యాధర ఒకటేనని అనిపించింది . ... మీరు నా సందేహం ఒకటి తీర్చాలి . ...చితిమంటల్లో కాలిపోతూ చివరి క్షణం లో మీ వదిన గారు కేకలు పెట్టారు కదా ? భయం వల్లనా ? మరేదైన కారణం ఉందా ? మీకు తెలుసు . ...ఈ సందేహం నా దొక్కడిదే కాదు . ఆర్టికల్ చదివిన ప్రతి పాఠకుడిది .?......అజయ్ ను సాభిప్రాయం గా చూశాడు . “ అయితే ఏమంటారు “ అజయ్ లో అసహనం.

“ చెప్పానుగా నా సందేహం తీర్చండి ?” అర నిమిషం మౌనంగా ఉన్నాడు అజయ్

“..... మా అన్నగారు పాము కాటుతో అకాల మరణం చెందారు . ఆయన చనిపోవటం తో మా వదిన గారు కృంగి పోయారు . సహగమనం చేయాలనుకున్నారు .

మా కుటుంబం లో అందరం వద్దని ప్రాధేయ పడ్డాము . ఊరి పెద్దలు చెప్పి చూశారు . ఆమె వినలేదు . సహగమనం చేయాలనే పట్టుబట్టారు . సహగమనానికి సిద్ధపడ్డవారు భయం, భీతి అని వెనకడుగు వేయరు . ...కేకలు పెట్టరు . ఆమె కేకలకు కారణం భయం కాదు . మా అన్న కొడుకు రాహుల్---రాహుల్ పుట్టగానే తల్లిని పోగొట్టుకున్నాడు . ఆ పసివాడి సంరక్షణ కోసమే మా అన్నగారు ఆమెను వివాహం చేసుకున్నారు . కానీ—తన బాధలో ఆమె బాధ్యతే మరిచి పోయారు . చితి పై మంటల్లో కూర్చొని మంటల్లో కాలిపోతున్న ప్పుడు రాహుల్”అమ్మా” అని గట్టిగా కేక పెట్టాడు . వాడిని చూడగానే ఆమెకు తప్పు తెలిసి వచ్చింది . వాడికి దూరమవుతున్నాను , అన్న బాధ తో నే ఆమె కేకలు పెట్టారు .

“ మీరు చెప్పింది రీజనబుల్ గానే ఉంది . కాని--- ఆర్టికల్ లో ఆమె కేకల వెనక ఏదో మిస్టరీ ఉందని జస్వంత్ రాశారు . మీ ఊరి వాళ్లకు కూడా అదే అభిప్రాయం ఉందట. “

“ అని అతడికి మా ఊరివాళ్ళు చెప్పారా ? ఇంటర్వ్యూ పేరు తో నన్ను రచ్చ కీడ్చాడు . తన పాపులారిటీ కోసం , పత్రిక ‘సర్క్యులేషన్ పెంచటం కోసం ఉన్నవి, లేనివి రాసి నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నాడు . రోజూ మీలాంటి వారి సందేహాలు తీర్చలేక చచ్చిపోతున్నాను . ...మీరు బాధ్యతగల డాక్టర్ అన్న గౌరవం తో ఇంతసేపు నేను మాట్లాడాను . ఇంతకూ మించి నేను చెప్పవలసినది ఏమీ లేదు . సెలవ్ “ పూర్తిగా అసహనం కోల్పోయిన అజయ్ ఒక్క ఉదుటున

విసురుగా లేవబోయాడు .

“ అజయ్ గారు ! కోపం తెచ్చుకోకండి . క్షణం ఆగండి . .... జస్వంత్ లా

మరొకరి లా మాకు ఎలాంటి ఉద్దేశ్యాలు లేవు . మేమంతా ఓ టీం ఆఫ్ డాక్టర్స్ . ఢిల్లీ లో ఓ పెద్ద సంస్థ లో పని చేస్తున్నాము . విద్యాదరి చాల టిపికల్ కేస్ . ఆమె పూర్వజన్మ లో మీ వదిన గారు అయుంటే మీరు చెప్పే విషయాలు ఈ కేసుకు చాలా ముఖ్యం . ఇలాంటి కేసులు ముందు ముందు వస్తే విద్యాదరి కేస్ హిస్టరీ మాకు గుడ్ రిఫరెన్స్ లా పనికొస్తుంది . ఏదైనా విద్యాధరిని తప్పక కలవాలి .....ఆమెను చూడాలని, ఆమె చెప్పే వివరాలు వినాలని ఎందరో ఆత్రుత గా చూస్తున్నారు . మరి ఆమె అజ్ఞాతం లో ఉండవలసిన అవసరం ఏమిటో అర్థం కావటం లేదు .”

“ ఆమె ఎవరో ఈ లోకానికి తెలిస్తే నా లాగే బాధపడాలి . నా అవస్థ చూస్తున్నారు గా ? ఈ తలనొప్పి తప్పించుకోవటానికే ఆమె అజ్ఞాతం లో ఉన్నారేమో “?

“ ఆమె మీ వదిన గారి ప్రతి రూపం కదా ? ఆమెను ఒకసారి కలిసి మాట్లాడాలనిపించటం లేదా ? “

“ ఆమెను కలవాలో, లేదో అన్నది నా వ్యక్తిగత విషయం . ...”

“ ఓకే . మీ వ్యక్తిగత విషయాల్లో మేమూ జోక్యం చేసుకోం . ... మీరు నిన్నటి పేపర్ చూశారా . “

“ లేదు . ఏం ?”

“ వాయిస్ అఫ్ విమెన్” అని ఢిల్లీలో ఒక స్వచ్చంద సేవా సంస్థ ఉంది . ఆడవారి హక్కుల కోసం పోరాడుతుంది . ఆ సంస్థ కార్యదర్శి దీప్తి కులకర్ణి---చాలా dynamic . ఆమె మాలాగే జస్వంత్ ఆర్టికల్ కు రెస్పాండ్ అయింది . ‘సతి పేరు తో కోమలకు అన్యాయం జరిగిందని ఆమె అనుమానం . ‘సతి నేరం, సాంఘిక దురాచారం కనుక కోమలాదేవి మిస్టరీ వెలుగు లోకి తేవాలని ఆమె పట్టుదల . అందుకు అజ్ఞాత స్త్రీ సజీవ సాక్షి . ఆమె పేరు తో ఒక open letter పత్రిక లో ప్రకటించింది . విద్యాధరిని వెలుగు లోకి రమ్మని , ఎవరికీ భయపడ వద్దని , ఆనాడు జరిగిన సంఘటనలు , సతి వివరాలు చెప్పి తనకు సహకరించమని open letter లో ప్రోత్సహించింది . “

“ ఆ ఉత్తరానికి స్పందనగా ఆమె వెలుగు లోకి వస్తే కోమలా దేవి కేసును మళ్ళీ open చేస్తారు . విద్యాధరి చెప్పిన వివరాలతో కులకర్ణి కోర్టు లో ‘పిల్ ( public interest లిటిగేషన్ ) వేస్తుంది . మాకు చెప్పినా, చెప్పక పోయినా ఆనాడు ఏం జరిగిందో కోర్టుకు మీరు చెప్పాలి .”

మీ కుటుంబ సభ్యులందరూ అందుకు బాధ్యులవుతారు . “ నలుగురిలో ఒకరన్నారు. అజయ్ అ వ్యక్తిని మింగేసేలా చూశాడు .

“ దీప్తి కులకర్ణి కోర్టు మెట్లు ఎక్కితే చాలు . ఆ అజ్ఞాత యువతికి చట్టం రక్షణ కల్పిస్తుంది . ఆమెకు ప్రజల సానుభూతి ఉంది . చట్టం, సమాజం రక్షణ తో ఆమె వెలుగు లోకి వస్తుంది . నిర్భయం గా ఆనాడు ఏం జరిగిందో కోర్టు లో చెబుతుంది .” మరొకరు వివరించారు .

అజయ్ లో ఆవేశం పొంగింది . స్వరం పెరిగింది .

“ మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదు .ఇది బెదిరింపా ? హెచ్చరికా ? సూచనా ? అసలు మీ ఉద్దేశ్యమేమిటి ?”

“మిమ్మల్ని బెదిరించవలసిన అవసరం మాకు లేదు . ఇలా జరగవచ్చన్న సూచన చేస్తున్నాం . సహగమనం పేరు తో ఏ అవాంఛనీయ సంఘటనలు జరగనప్పుడు మీరెందుకు భయ పడాలి . ?”

´ఆ అవసరమే లేదు . కోర్టు లోనే కాదు , మరెక్కడైనా ఆమె చెప్పినా ప్రమాదం లేదు---నష్టం లేదు . “ మేకపోతు గాంభీర్యం తో ముగించాడు అజయ్ . మనసులో మాత్రం విద్యాధరిని వీలైనంత త్వరలో కలవాలని ఆరాటపడి పోయాడు . అతడినలా తొందర చేసే ఉద్దేశ్యం తో నే భరత్ రామ్ అజయ్ ను కలిశాడు . త్వరగా విద్యాధరి సమస్యలోంచి బయట పడాలి .

******************************

కొనసాగించండి 33లో