Read The shadow is true - 30 by LRKS.Srinivasa Rao in Telugu Fiction Stories | మాతృభారతి

Featured Books
  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

  • అరె ఏమైందీ? - 22

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 8

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • రామాపురం హై స్కూల్ రోడ్

    నా పేరు విజయ్ మా గ్రామం పేరు రామాపురం. నేను టెన్త్ క్లాస్ వర...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

నీడ నిజం - 30

పై కీలక సమావేశం జరుగుతున్నా సమయం లో విద్యా తన గది లో ఆలోచనలతో సతమతమవుతోంది .

“ తన ఆరోగ్యం కోసం, ఆనందం కోసం ఎందరు ఆరాటపడుతున్నారు .? మానసిక స్థాయి, , సంస్కారం పెంచుకొని సాగర్ , పుత్రికా వాత్సల్యంతో భరత్ రామ్ అంకుల్, డాక్టర్ అంకుల్ ; అనురాగం, పూర్వ జన్మ బంధం తో రాహుల్, తను తప్పక లక్ష్యం చేరుకోవాలని, కోమల కు న్యాయం జరగాలని జస్వంత్,---ఇందరి అండ దండలు తనకు తోడు నీడ గా ఉన్నప్పుడు ఎందుకు భయ పడాలి ?

అయినా తనకు స్థిమితం లేదు . మనసులో ఇంకా వెలితి . కారణం ఏమిటి ? మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న వేసుకుంది . ఎంత మధన పడినా జవాబు స్ఫురించటం లేదు .

అలసటగా కాసేపు కళ్ళు మూసుకుంది . మనసు నిగ్రహించుకోవటానికి శ్వాస మీద దృష్టి నిలిపింది . నెమ్మదిగా గుండె వేగం తగ్గింది . ఆలోచనల తాకిడి తగ్గి ప్రశాంతమైన మనసులో ఓ రూపం మెదిలింది ---అఘోరి !

“ ఇప్పుడు తను ఆ వ్యక్తి తో మాట్లాడాలి . అతడి ఆశీర్వాదం, అనునయం గా , చెప్పే మాటలు తనకు కావాలి . అతడు తన మార్గదర్శి . గురువు . “

తన మనసు లో మెదిలి న రూపం పై సర్వశక్తులు నిలిపింది . అఘోరి రూపం పెదవి కదిపింది .

“ అమ్మా ! విద్యా ! నీ ప్రతి కదలిక, ఆలోచన నేను గమనిస్తున్నాను .

నీ నిర్ణయం తో , సంకల్ప బలం తో ఎవరూ అందనంత ఎత్తుకు ఎదిగి పోయావు . ఇక జరగవలసిన మహా కార్యం ఎవరూ ఆపలేరు . నీకు అడుగడుగునా నీడలా ఉంటాను . నేను ప్రత్యక్షం గా కనిపించలేదని కంగారు పడకు . నేను నీ మూడు ఉన్నా, లేకపోయినా నా వంతు కర్తవ్యం త్రికరణ శుద్దిగా నిర్వహిస్తాను . నా అవసరం ఉన్నప్పుడు తప్పక కనిపిస్తాను . శుభం భూయాత్ !”

మెల్లమెల్లగా అఘోరి రూపం అదృశ్యమైంది . అతడి రూపం, మాటలు ఆమెకు అనంతమైన ధైర్యం, స్ఫూర్తి కలిగించాయి . తమ ప్రయత్నానికి అఘోరి రూపం లో దైవబలం తోడు కావటం విజయ సూచకం అనుకుంది విద్యా .

సాయం సంధ్య మనోహరం గా ఉంది . సప్తవర్ణాల సమ్మేళనంతో పడమటి దిక్కు హరి విల్లు లా వెలిగిపోతోంది . విశాలమైన ఆ భవనం మూడు పచ్చగా పరుచుకున్న గడ్డి మీద వాలు కుర్చీలో అజయ్. మనసులో ఆలోచనల హోరు .

--ఎంతకూ కొలిక్కి రావటం లేదు . “ విద్యాధరిని కలిసేదేలా ? ఎలా ఏం మాట్లాడాలి ? ...........అజయ్ బాబు ! ఉలిక్కిపడి చూశాడు అజయ్ . ఆ పిలుపు తనకు చాలా పరిచయమైనది . మనిషినే గుర్తుపట్టడం కష్టంగా ఉంది . అతడి మొహాన్ని గడ్డం, మీసం కప్పేశాయి . వయసు దాదాపు తనకు అటు, ఇటు గా ఉంటుంది . ఒక కాలు లేదు . కర్రల పోటీ తో నిలబడి ఉన్నాడు .

నన్ను మరిచి పోయారా అజయ్ బాబు ?’

“ నువ్వూ పన్నాలాల్ ?” అవునన్నట్లు తల ఊపాడు ఆ వ్యక్తి . ప్రయత్నం మీద క్రింద కూర్చున్నాడు . అజయ్ కు మతిపోయినట్లు అయింది . ఏమిటీ విచిత్రం ? ‘ నాటకం లో పాత్రల్లాగా ఆనాటి వ్యక్తులు ఇలా వస్తున్నారేంటి ?’” ఇన్నేళ్ళ తర్వాత ఇలా నన్ను చూస్తే చాలా ఆశ్చర్యం గా ఉంది కదూ ?” అజయ్ అవునన లేదు, కాదనలేదు . ముభావం గా ఉండిపోయాడు

ఏమిటీ విచిత్రం ? కోమలాదేవి మళ్ళీ పుట్టడమేమిటీ ? ఆమె వివరాలు తెలుసా ?”

“ తెలుసుకొని ఏం చేస్తావ్ ? మళ్ళీ చేతబడి ప్రయోగిస్తావా ? అజయ్ మాటల్లో వ్యంగ్యం .

పన్నాలాల్ నవ్వాడు .

“ ఒకసారి ప్రయోగించినందుకే ఇంత రభస అయింది . మళ్ళీ తెలివి తక్కువగా అదే తప్పు చేస్తే ఈసారి నా ఆనవాలు కూడా మిగలదు .”

“ మరెందుకొచ్చావ్ ? ఆనాటి నీ పనికి కిరాయి వసూలు కొచ్చావా ?”

“ ఆ రోజే వద్దనుకొని వెళ్ళిపోయాను . ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు కావాలనుకోవటం లో అర్థం లేదు .”

“ మరెందుకొచ్చావ్ ? అజయ్ లో అసహనం .

“ నేను రావటం మీకు ఇష్టం లేదా ?” వస్తే ఆ రహస్యం బయటపడుతుందని మీ భయం . ...ప్రాణం పోయినా చెప్పను . చెబితే ఇద్దరూ గల్లంతై పోతాం . కానీ, కోమలా దేవి మళ్ళీ పుట్టి మన కొంప ముంచేలా ఉంది . మన పాపం పండే మళ్ళీ పుట్టిందేమో !”

“ మనం బలవంతం గా ఆమెను మంటల్లో తోయలేదు . సహగమనం చేయాలనుకోవటం ఆమె నిర్ణయం . “

“ అందుకు ఆమెను సిద్ధం చేసింది మనం....మన స్వార్థం కోసం...”

“ కావచ్చు ! ఆమెను ఆపాలని అమ్మ ప్రయత్నం చేసింది . తమ్ముడు వద్దన్నాడు . ఊరి వాళ్ళంతా చెప్పి చూశారు . ఎవరి మాటా వినలేదు . సహగమనం పవిత్ర కార్యం కనుక ఎవరూ కాదనలేక పోయారు. ఆమె చివరి క్షణం లో రాహుల్ ను చూసి అతడికి దూరం అవుతున్నానని బాధతో కేకలు పెట్టింది . “

“ ఆమె రాహుల్ బాబు కోసమే మళ్ళీ పుట్టింది అంటారా ? ఆమె దృష్టి మనపై లేదా ?”

“ఏమో ! ఆమె మనసులో ఏముందో

మనకెలా తెలుస్తుంది ? అసలెందుకు ఈ ఊరు వచ్చింది ? వచ్చిన మనిషి నన్ను కలవక ఎందుకు వెళ్ళిపోయింది ? ఆమె ఎవరో తెలుసుకోవాలని అందరూ ప్రయత్నిస్తూంటే అజ్ఞాతం లో ఎందుకు ఉండి పోయింది ?..అన్నీ సమాధానం లేని ప్రశ్నలే !”

పన్నాలాల్ భారం గా నిట్టూర్చాడు .

“ నా కెందుకో ఆమె పునర్జన్మకు ఏదో బలమైన కారణం ఉందని పిస్తుంది ఏది నమ్మినా, నమ్మక పోయినా విధి ని నమ్మాలి .”

****************************************

కొనసాగించండి 31 లో