Read The shadow is true - 29 by LRKS.Srinivasa Rao in Telugu Fiction Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

నీడ నిజం - 29

“ సాగర్ ! మీరు వయసు లో నా కన్నా చిన్నవారు . అయినా పెద్దమనసు చూపించారు . ఏమిస్తే మీ ఋణం తీరుతుంది . / రాహుల్ కళ్ళ లో పల్చటి కన్నీటి పొర .

‘ మీరు నాకు ప్రత్యేకం గా ఏమీ ఇవ్వక్కర లేదు . మీ చిన్నాన్న బారి నుండి విద్యాను కాపాడితే చాలు . “ స్పందన గా సాగర్ చిరునవ్వు .

“ అమ్మ నా ప్రాణం. ఆమె కోసం దేవుడినైనా ఎదిరిస్తాను . పదేళ్ళ వయసు లో అమ్మను దూరం చేసుకొని చాలా పోగొట్టుకొన్నాను . మళ్ళీ ఆ పొరపాటు జరగదు . “ హామీ ఇచ్చాడు రాహుల్ .

నేనూ రాహుల్ సపోర్ట్ తో నే ఇంత సాహసం చేస్తున్నాను . నాకు విద్యాగారి పట్ల కమిట్మెంట్ ఉంది . I am not totally proffessional.” జస్వంత్ భుజాలు తడుముకున్నాడు . అతడి నిజాయితీని సాగర్ గుర్తించాలని ఆరాటం . గుర్తించినట్లు సాగర్ నవ్వాడు .

‘ డైరీ చదివిన తర్వాతే నాకూ పరిస్థితి అర్థమైంది . ఈ assignment మీ వల్లే విజయవంతమవుతుంది .we need the support of an investigative journalist . “ జస్వంత్ తృప్తి గా నవ్వాడు .

Now let us come to the point . నా రొటీన్ వర్క్ నా అసిస్టెంట్ కు అప్పగించాను . Now I am free . పారా సైకాలజీ లో ఓ అద్భుతం . నా పర్యవేక్షణ లో జరగబోతుందంటే నాకెంతో గొప్పగా, గర్వం గా ఉందొ తెలుసా !?

సుదర్శనం నా నీడ లాంటి వాడు . హైదరాబాద్ లో అతడి ప్రాక్టీస్ చూసుకోవడానికి

కొడుకు ఉన్నాడు . అతడూ free . విద్యా ఆరోగ్యం, రక్షణ అతడి బాధ్యత . జస్వంత్ ! ప్లాన్ అఫ్ ది యాక్షన్ నిర్ణయించ వలసినది నువ్వే . జస్ట్ వియ్ ఫాలో యు . సాభిప్రాయం గా చూశాడు భరత్ రామ్ .

జస్వంత్ ఆలోచిస్తూ ఉండిపోయాడు . అతడి లో పరిస్థితిని సమీక్షించే మధనం జరుగుతోంది .

“ నా ఆర్టికల్ లో అజయ్ పునాదులు కదిలాయి . కోమలా దేవి కి జరిగిన కిరాతకం వెలుగు చూస్తే అతడు లోకానికే కాదు , చట్టానికి సమాధానం చెప్పుకోవాలి . అందుకే ఈ అపాయం తప్పించుకోవటానికి తన వంతు ప్రయత్నం ఇప్పటికే ప్రారంభించి ఉంటాడు . “

‘ ఎలాంటి ప్రయత్నం ? సాగర్ లో కలవరం .

“ కంగారు పడకండి . అప్పటిలా విద్యాధరిని టార్గెట్ చేయలేడు . “

“ ఎలా చెప్ప గలరు ?”

“ వంశగౌరవం కోసం ఆనాడు కోమలాదేవి ని బలి దీసుకున్నారు . ఆమె అమాయకురాలు. అనాధ; social status, చదువు, సమయస్ఫూర్తి, ఉన్న విద్యాధరిని టార్గెట్ చేస్తే ఆ వంశ గౌరవమే తుడిచి పెట్టుకు పోతుంది . ప్రాణాలు పోతాయి . పరువు పోతుంది . “

“ మరి --- అతడు చేసే చివరి ప్రయత్నం ...?

“ కాళ్ళ బేరమే ! ఆనాటి సంఘటనలు బయట పెట్టవద్దని బతిమాలు కుంటాడు . అతడికి మిగిలిన ఏకైక మార్గం ఇదే . విద్యా ఎప్పటికీ అజ్ఞాతం లో ఉండి పొతే

ఆ రహస్యం వెలుగు చూడదు . సత్యం మరుగున పడి పోతుంది . ప్రజలు మరిచి పోతారు . “

“ కానీ---విద్యాను అతడు ట్రేస్ అవుట్ చేయలేడు . రాజస్థాన్ లో ఎక్కడా ఆమె ఆనవాలు లేకుండా చేశాం . అజయ్ విద్యా ను కలిసే అవకాశం లేదు . “

“ మనసుంటే మార్గం లేక పోలేదు . మీరు కావాలి .” భరత్ రామ్ సూచన . అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు . -----అయినా డైరీ బయట పడింది . ఇలాగే ఎక్కడో, ఏదో పొరపాటు తప్పక జరిగి ఉంటుంది . ఇలాంటి loop holes ను ప్రైవేటు డిటెక్టివ్స్ సులభంగా పట్టేస్తారు . “

“ ప్రైవేటు డిటెక్టివ్స్ !!!” అందరూ ఒక్కసారే ఆశ్చర్య పోయారు .

“ ఎస్. అజయ్ భార్య రూపాదేవి చాలా తెలివైంది . ఆమెను కాదని , ఆమెకు తెలియకుండా అజయ్ ముందుకు అడుగు వేయ లేడు . ఆమె చొరవ తో ఇప్పటికే

అన్వేషణ పారంభమై ఉంటుంది . ఏదో ఒక రోజు అజయ్, రూపా దేవి ఇక్కడకు వస్తారు . మిమ్మల్ని ఒప్పించే ప్రయత్నం చేస్తారు . ”

“ కానీ --- ఇప్పుడిప్పుడే విద్యా అజయ్ ను కలవ కూడదు . అందుకు చాలా ప్రిపరేషన్ కా వాలి. “

భరత్ రామ్ సూచన .

“ సో ---ఆమె ఇక్కడ ఉండటం ఏ కోణం లో చూసినా అంత క్షేమం కాదు . వేరే చోటుకు మార్చాలి . ఆమెకు పూర్తి రక్షణ రాహుల్ ఉన్న చోటే. అతడింటికి పంపితే మేలు . “

చివరి మాటతో రాహుల్ వికసించింది . జస్వంత్ సూచన అందరికీ నచ్చింది .

“ అమ్మను చూస్తే నాన్నమ్మ సంతోష పడుతుంది . ఆమె ఆశీర్వాదం అమ్మకు కొండంత బలం. “ సంబరపడి పోయాడు రాహుల్ .

“ రాహుల్ చెప్పింది నిజం . పెద్దావిడ మోరల్ సపోర్ట్ విద్యా కు అవసరం . “ అదే మాట ను భరత్ కూడా బలపరిచాడు .

“ సాగర్ ! అజయ్, రూపాదేవిని చూసి కంగారు పడకండి .” విద్యా పుట్టింటికి వెళ్లిందని చెప్పండి . ఆరోగ్యం పూర్తిగా కుదుట పడలేదని చెప్పండి . ఆమె ఎట్టి పరిస్థితి లో కూడా నిజం బయట పెట్టద ని హామీ ఇవ్వండి . వారి లాగే మీరూ పరువుకు ప్రాణం ఇచ్చే మనుషులని చెప్పండి . మీ మాట మీద నమ్మకం తో వారు ధైర్యం గా తిరిగి వెళ్లి పోవాలి . ఒకే! “ సరే నని సాగర్ తల ఊపాడు .

“ మరి ---గ్రామానికి ఎందుకు వచ్చారు ని అడిగితే ?”

వారి గ్రామానికి వచ్చిన తర్వాతే విద్యా పూర్వ జన్మ వివరాలు తెలిసి మానసిక అలజడి పూర్తిగా తగ్గిందని చెబుతాను . డాక్టర్ సూచన తో నే అంత దూరం

రావాల్సి వచ్చిందని కూడా చెబుతాను . “

అలా వారి దృష్టి ని విద్యా పై నుండి మరల్చ గలిగా మంటే మన పని

సులువవుతుంది. అతడిని సులభం గా టార్గెట్ చేయగలం. ”

సాగర్ జస్వంత్ ను ప్రసన్నం గా చూశాడు .

“ అంకుల్ ! నేనిక నిశ్చింత గా ఉండొచ్చు . జస్వంత్ అనుకున్నది సాధిస్తారు . “

“ నా మీద మీకున్న నమ్మకానికి థాంక్స్ . “ జస్వంత్ స్పందన.

“ జస్వంత్ ! విద్యా లో దాగుడు మూతలాడుతున్న కోమల పూర్తీ స్థాయి లో బయట పడా.లంటే ఆమె తన అత్తగారిని కలవాలి . ఆ పెద్దావిడను కలిసేది విద్యా అయినా ఆమె తో మాట్లాడేది కోమల . అత్తగారి మోరల్ సపోర్ట్ , ఆశీస్సులు కోమల లక్ష్యానికి చాలా అవసరం “.భరత్ వివరణ .

“ అంకుల్ ! విద్యా కోమలా దేవి లా పదే పడే మారటం వల్ల ఆరోగ్యం దెబ్బ తినదా ?” సాగర్ స్వరం లో ఆత్రుత, కలవరం .

" నెర్వస్ సిస్టం పై కొంత ఒత్తిడి ఉంటుంది . సుదర్శనం విద్యాకు కావలిసిన మందులు ఇస్తూ ఆమె బాగోగులు చూసుకుంటాడు . అయినా ఈ ఒత్తిడి తాత్కాలికమే . తనకు న్యాయం జరిగిన మరుక్షణం కోమల శాంతించి విద్యా లో కలిసి పోయి కలలా కరిగి పోతుంది . అంతే ---అదే సమస్య కు పరిష్కారం .”

ఆ వివరణ తో సాగర్ తృప్తి పడ్డాడు . సమావేశం పూర్తి కావటం తో సుదర్శనం శెలవు తీసుకున్నాడు . జస్వంత్, రాహుల్ ప్రయాణపు ఏర్పాట్లు చూడటానికి బయటకెళ్ళారు .

“ రాహుల్, విద్యా అనుబంధాన్ని అర్థం చేసుకొని చాలా మంచి పని చేశావ్ ! నీ మారల్ సపోర్ట్ భర్త గా తనకున్డాలి . అప్పుడే తను మనసు పెట్టి. ధైర్యం గా అజయ్ ను ఎదుర్కొంటుంది . నీలో మార్పు మన ప్రయత్నానికి శుభ సూచకం . నీ పెద్ద మనసుకు , సంస్కారానికి హాట్స్ ఆఫ్ !!”

భరత్ రామ్ అభినందన తో సాగర్ సంతోష పడి పోయాడు .

“ విద్యా డైరీ, రాహుల్ ఉత్తరం నన్ను కదిలించి నాలో మార్పు తెచ్చాయి . జరగబోయేది ఒక అద్భుతం ! అందుకు తగినట్లే మన మందరం మన ప్రయత్నం లేకుండానే ఆ దారి లో ముందుకు పోతున్నాము . we are going to witness an un imaginable , rare incident .” సాగర్ మొహం లో సంభ్రమం !

*****************************

కొనసాగించండి 30 లో