నాకు ఆమెను చూడాలని ఉంది . “
ఎవర్ని ?’అజయ్ కు అర్థం కాలేదు .
“పూర్వజన్మ లో మీ వదిన గారు . ఈ జన్మ లో ........... భర్త కళ్ళలోకి చూస్తూ
ఆగింది .
అజయ్ మౌనం. జవాబు చెప్పలేని అశక్తత .
“ ఏం మాట్లాడరు ?”
“ ఏం మాట్లాడమంటావ్ ? ...ఏం మాట్లాడినా నీ జవాబు మౌనమేగా “ అజయ్ లో చిరు కోపం
.
“ అందుకు కారణం మీరే . మీరు నా నుండి ఏదో దాస్తున్నారు . అదే నాకు నచ్చటం లేదు
. “
“ నేను దాస్తున్నానా ?”
“ కాదా / మీ వదిన గారి సహగమనానికి
సంబంధించి ఏదో నాకు తెలియ కూడని రహస్యం ఉంది . ఆ రహస్యం నాకు చెప్పటం లేదు
. రాహుల్ కూడా ఆ రహస్యం తెలుసుకోవాలని పట్టుదలగా ఉన్నాడు . సహగమనం చేస్తూ చివరి
క్షణం లో ఆమె ఎందుకు కేకలు పెట్టిందో తెలుసుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు .
“ చివరి క్షణం లో వాడిని చూసి కేకలు పెట్టింది . పెంచిన ప్రేమ ఆమెను చివరి
క్షణం లో కదిలించింది .”
“ అది నిజం కాదు . రాహుల్ పట్ల తన బాధ్యత తెలిసి కూడా భర్త అకాల మరణం తో తట్టు కోలేక సహగమనం చేయాలనుకుంది . అంత కఠిన
నిర్ణయం తీసుకున్నాక చివరి క్షణం లో మనసు మార్చుకోవటం సాధారణం గా జరగదు . అలా
జరిగిందంటే సహగమనం పూర్తిగా ఆమె నిర్ణయం కాదు . ఎవరి ప్రోద్బలమో తప్పక ఉంది
ఉంటుంది .”అంత అవసరం మా కుటుంబం లో ఎవరికుంది ? ఎవరు ఆమె చనిపోవాలని అనుకుంటారు
? కోపం తో అదుపు తప్పి మాట జారాడు .
“ మీకెందుకు అంత కోపం ? మీ కుటుంబం లో వారని ఎవరన్నారు ? సహగమనం గురించి
రాహుల్ గుచ్చి గుచ్చి ఎన్నో ప్రశ్నలు అడిగాడు . అప్పుడు మీరు ఇలాగే ఉలిక్కి
పడ్డారు . కంగారు తో మాటలు తడబడ్డారు . ....”
అజయ్ తన లోని భావాలు దాచాలని విఫల ప్రయత్నం చేశాడు .
“ చూడండి ! ప్రతి మనిషి తప్పులు
చేస్తాడు . తప్పు తెలుసుకొని సరిదిద్దు కోవటం సంస్కారం, మానవత్వం ! మీరు
మనసులో మధన పడుతూ కృం గి పోవటం
కంటే జరిగిన దేమిటో నిజాయితీ గా చెప్పండి . నిజం ఒప్పుకోండి . అందువల్ల కలిగే
కష్టం,
నష్టం భరించడానికి మీ భార్య గా మీ వెనకే ఉంటాను ”
రూపా దేవి మాటల్లో లాలన అజయ్ ను కదిలించింది . ప్రేమ గా ఆమెను దగ్గరకు
తీసుకున్నాడు .
“ నీ నుండి ఇంతవరకు ఏదీ దాచ లేదు . ఇదొక్కటే. తప్పకుండా చెబుతాను . నీకు గాక
మరెవరికి చెప్పుకోను ? నువ్వు నాకు తగిన భార్యవే కాదు, మంచి
స్నేహితురాలు కూడా . మా లాంటి వాళ్ళు
భార్యకు చెప్పుకోలేని విషయాలు స్నేహితులకు చెప్పుకుంటారు . ఆ ఇద్దరు నీలోనే
ఉన్నారు ..”
భార్య ను అభిమానం గా చూశాడు .
“మరి,
సందేహం ఎందుకు ?”
“మరి కొంత సమయం కావాలి . అసలు ఈ రభస కంతా కారణం జస్వంత్ గడు . కనిపిస్తే నరికి
పారేయాలి . “ కోపం తో కదిలిపోయాడు .
“ అందువల్ల సమస్య తేలిపోతుందా ? కోపం తో సాధించేది ఏమీ లేదు .”
“అందుకే వాడి జోలికి పోలేదు. అసలీ సమస్య కు కారణం జస్వంత్ కాడు . ..నేను .....రూపాదేవి
అజయ్ ను క్షణం పరిశీలన గా చూసింది .
“మరి—సమాధానం మీరే కదా ? ఇక ఆలోచన ఎందుకు? ఆలస్యం ఎందుకు? “ మళ్ళీ అజయ్ మౌనం .
“ తను అజ్ఞాత యువతిని కలిస్తేనే గాని ఈయన మౌనం వీడడు .
ఆమె వస్తేనే ఈయన లో కదలిక వస్తుంది . ఏదైనా ప్రైవేటు డిటెక్టివ్ ఏజన్సీ ద్వారా, ఆమెను కలిసే ప్రయత్నం
చేయాలి “. రూపాదేవి నిశ్చయించుకుంది .
రాహుల్ ఉత్తరం పూర్తిగా చదివింది
విద్యావారి . . ఆ సుదీర్ఘ
లేఖ లో ప్రతి పేజీ ఒక్కో మెట్టు లా ఆమెను గతం లోకి తీసుకు వెళ్ళాయి .
పూర్వజన్మ కు,
పునర్జన్మకు మధ్య ఉలిపిరి కాగితం లా వున్న తెర
కరిగి పోయింది .
ఇప్పుడు ఆమె విద్యాధర కాదు ----ముమ్మూర్తులా కోమలా దేవి . తన ఉనికి
మరిచిపోయింది . పరిసరాలు మరిచి పోయింది . రాహుల్ ఉత్తరం ముందుంచుకొని ఏడుస్తూనే
ఉంది . “రాహుల్ బాబు “ అన్న పిలుపు ఆమె పెదవులపై
పదే పదే వెక్కిళ్ళ మధ్య కదులుతోంది . తీవ్ర మానసిక ఒత్తిడి వల్ల ఆమె
హిస్టీరిక్ అయిపోోయింద . డాక్టర్ సుదర్శనం
రావాల్సి వచ్చింది . ఆయన sedative ఇచ్చి శాంత పరిచాడు . పది నిముషాల్లోనే కళ్ళు మూత పడ్డాయి . గాఢమైన నిద్ర ఆవహించింది . రాత్రంతా సాగర్ ఆమె పక్కనే కూర్చున్నాడు .
ముందు ఉత్తరం చదివాడు . గుండె కదిలింది అమ్మ ప్రేమలో గొప్పదనం తెలిసింది .
డైరీ చదివాడు . సమస్య లో తీవ్రత అర్థమైంది . అనుమానాలు, అపోహలు తొలిగిపోయాయి .
చీకటి తెరలు తొలిగి వెలుగు రేకలు విచ్చుకున్నాయి . విద్యా ప్రశాంతం గా నిద్ర
పోతోంది . మొహం తేటగా ఉంది . మానసిక ఒత్తిడి ఆనవాలు కూడా మొహంపై లేదు . ఆమెను
అలాగే చూస్తుండి పోయాడు .
కొద్దిసేపైన తర్వాత విద్యాలో కదలిక
వచ్చింది . నెమ్మదిగా కళ్ళు తెరిచింది .
కనురెప్పలు బరువుగా ఉన్నాయి . sedative impact పూర్తిగా తొలగి పోలేదు .
తన కెదురుగా కూర్చున్న సాగర్ని ప్రశ్నార్థకం గా చూసింది . నెమ్మదిగా లేచి
కూర్చుంది .
“ రాత్రి డాక్టర్ గారు వచ్చారు . నీకు sedative ఇచ్చారు . “
సాగర్ని అయోమయంగా చూసింది . sedative ఇవ్వవలసినంత అవసరం ఏమొచ్చింది ? కళ్ళు మూసుకొని
రాత్రి సంఘటన గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేసింది . ‘రాహుల్ ఉత్తరం చదివి తను
ఎమోషనల్ అయింది . హిస్టీరిక్ అయిపొయింది .
“ సారీ సాగర్ ! రాహుల్ తన ఉత్తరం తో నన్ను బాగా disturb చేశాడు . నేను
సెంటిమెంటల్ గా కదిలిపోయాను . ఇలాంటి పరిస్టితి మళ్ళీ రాకుండా జాగ్రత్త పడతాను .
‘మీ అమ్మ కోమల---నేను కాదని’ స్పష్టం గా చెబుతాను “ ఆమె లేవబోయింది . సాగర్
వద్దని ఆపాడు .
“ కాసేపు ప్రశాంతం గా కూర్చో !... రాహుల్ ఉత్తరం చదివాను. డైరీ కూడా చదివాను.
ఆ రెండూ చదివిన తర్వాత పరిస్థితి పూర్తిగా అర్థమైంది . ఉదయమే
జస్వంత్ కు ఫోన్ చేశాను రెండు మూడు రోజుల్లో
రాహుల్ తో ఇక్కడకు వస్తున్నాడు . .. భరత్ అంకుల్ కూడా వస్తున్నారు . అందరం
కూర్చొని నీట్ గా
ప్లాన్ చేసుకుందాము . నాకు జస్వంత్ పై పూర్తిగా నమ్మకముంది . అతడు సాధించగలడు .
...విద్యా ! జస్వంత్ అన్నట్లు రాహుల్ ఇప్పుడు కూడా పదేళ్ళ పసి బాలుడే ! అమ్మ
అతడి ఊపిరి ! మీ ఇద్దరి అనుబంధం నేనే కాదు . ---ఎవరూ కాదన లేరు
. ఏ శక్తీ విడదీయ లేదు . ... నా మొండి తనం
, పట్టుదల నిన్ను చాలా బాధపెట్టాయి . ...సారీ ! “ సాగర్ మనసు నిర్మలం గా ఉంది .
మాటలు స్ఫటికం గా ఉన్నాయి .
విద్యా చిరునవ్వు తో భర్త ముందు నిలుచుంది . అతడి భుజాల పై చేతులు వేసి నుదుటి
పై ప్రేమగా ముద్దుపెట్టుకుంది .
****************************************
కొనసాగించండి 29 లో