Read The shadow is true - 26 by LRKS.Srinivasa Rao in Telugu Fiction Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

నీడ నిజం - 26

“ నీలో మళ్ళీ కోమలను చూసి నేను కంగారు పడ్డాను . “

“కంగారెందుకు “?

“......నీవు కోమల ప్రభావం లో నుంచి బయట పడేదెప్పుడు ? మనం ప్రశాంతమైన జీవితం గడిపెదేప్పుడు ? నా కేం తోచటం లేదు .”

“జస్వంత్ చెప్పింది విన్నారుగా ? నాలో కోమలకు సామాజిక న్యాయం జరగాలి .అప్పుడే తనకు ముక్తి , నాకు విముక్తి .”

“సామాజిక న్యాయమంటూ పెద్ద పెద్ద పదాలు వాడి మనల్ని భయ పెట్టి తన లక్ష్యం కోసం పావులుగా వాడుకున్టాడే మో . ?”

“ఇదే పదం భరత్ అంకుల్ అంటే?

“ఆయన మన మంచి కోరే పెద్ద మనిషి ---పైగా డాక్టర్ . ఆయన మాటకు విలువ, గౌరవం ఉన్నాయి . “

“అందుకే ఆయనను కలవండి . మీ సందేహాలు తీర్చుకోండి . సమస్య నుండి బయట పడండి . “ అని జస్వంత్ అంటున్నారు .

“ అందుకేగా అంకుల్ ను రమ్మంటు న్నాను . విద్యా ! నాకు జస్వంత్ పై అవర్షన్ లేదు . ఇంటరెస్ట్ లేదు. కానీ-రాహుల్ పై మాత్రం సానుభూతి . కానీ—అతడు నిన్ను 'అమ్మా' అని పిలవటం, నలుగురి లో నిన్ను, నీ పొజిషన్ ను disturb చేయటం నాకు నచ్చదు . అమ్మ అసలు ఒప్పుకోదు . కోమలా దేవి తో , ఆమెకు సంబంధించిన వ్యక్తుల తో పరిచయాలు పెంచుకోవటం, బాధ్యతలు పంచుకోవటం మనకు మంచిది కాదు .”

‘తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు ‘అన్న పట్టుదలతో సాగర్ వాస్తవం గుర్తించలేక పోతున్నాడు . ఇంకా భ్రమల్లో ఉన్నాడు . భరత్ రామ్ రాకతోనే భ్రమలు తొలిగి పోయేది . అంతవరకూ నోరు మూసుకోవటమే ఉత్తమం అనిపించింది విద్యాదరికి. ‘అయినా చివరి ప్రయత్నం చేస్తే తప్పేమిటి ?” ఓ ఆశ .”నా డైరీ చదివాకే జస్వంత్ నా మెంటల్ స్టేట్ అంచనా వేయగలిగారు . మీరూ చదవండి . మీకూ నా గురించి ఒక ఐడియా ఏర్పడుతుంది . జస్వంత్ స్టేట్మెంట్ లో నిజానిజాలు తెలుస్తాయి .” సాగర్ని సాభిప్రాయం గా చూసింది .

“...... చదవడానికి నాకు అభ్యంతరం లేదు . అయినా- అంత అవసరం ఏమిటి ? భరత్ అంకుల్ వస్తున్నారు కదా ? ఆయన రాక ముందే లేని పోనీ ఊహల తో , ఆలోచనలతో తల నొప్పి తెచ్చుకోవటం ఎందుకు ?”

“చివరి ఆశ కూడా ఆవిరి అయిపొయింది . అంకుల్ ఒక్కరే తన hope . ఆయన కోసం ఎదురు చూడటమే ---మరో మార్గం లేదు “ భారం గా నిట్టూర్చింది .

“ చూడండి ! మీరు నా మీద నమ్మకం తో మార్గం చెప్పమన్నారు . నాకు మీరిద్దరూ సమానమే . నాకు కావాల్సింది మీ ఇద్దరి క్షేమం . అందుకని నా నిర్ణయం లేదా సలహా ఎలాంటిదైనా మీరిద్దరూ పాజిటివ్ గా తీసుకోవాలి . “

సాగర్, విద్యా అలాగే అన్నట్లు తల ఊపారు .

“అంకుల్ ! జస్వంత్ మిమ్మలిని కలిశాడా ?”

“కలిశాడు. విద్యాదరి డైరీ చూపించాడు . “

“కోమల, విద్యా వేరు కారు అన్నారు . ఒకరు సమస్య మరొకరు సమాధానం అన్నాడు . నిజమేనా ?”

“డైరీ నువ్వు చదివావా ?”

“లేదు అంకుల్ ! మీరు వస్తున్నారు కదా !”

“చదివుంటే జస్వంత్ అభిప్రాయం తో ఏకీభవించే వాడివి .”

విద్యా సాగర్ను చూసింది . తలవంచుకున్నాడు .

“నువ్వు నాకు ఫోన్ చేసినప్పుడు విద్యా నాకేం చెప్పలేదు . ఇక్కడకు రమ్మంది . నీ ముందు కోమల సమస్య పై మాట్లాడే ఉద్దేశ్యం ఆమెకు లేదు . నువ్వు కంగారు పడతావ్ . అందుకే ఆరోజు రాత్రే తనకు ఫోన్ చేశాను . పావుగంట సేపు మాట్లాడాను . పరిస్థితి అర్థమైంది . ఆ తర్వాతే జస్వంత్ కలిశాడు . మా ఇద్దరి అభిప్రాయం ఒకటే . కోమల సామాజిక న్యాయం కోరుకుంటుంది . ఆమె మళ్ళీ పుట్టింది ఇందుకే . పెంచిన ప్రేమ కూడా ఆమెను కదిలించింది .”

“తను మళ్ళీ ఇక్కడకు రావలసిన అవసరం ఉందని జస్వంత్ అన్నాడు . ......కోమల కేసులో జర్నలిస్ట్ అవసరం ఏమిటి ?”

“ఇంకా నీకు అర్థం కాలేదా ? జస్వంత్ investigative jarnalist .సాహసం, సమయస్ఫూర్తి అతడి ప్లస్ పాయింట్స్ . నేను, సుదర్శనం డాక్టర్లం . రాహుల్ లెక్చరర్ . మాది soft nature . అజయ్ లాంటి అహంభావి ని ఎదిరించే ధైర్యం, ప్లానింగ్ మాకు లేవు . జస్వంత్ వృత్తే అది . అతడే మన టీం లీడర్ . నిజానికి—అతడికి డైరీ దొరకటం ఒక మిరాకిల్ ! తను కోమల issue ను challenge గా తీసుకున్నాడు . అది మనకు అనుకూల పవనం. జస్వంత్ కూడా రాహుల్ తోడు లేందే అడుగు ముందుకు వేయలేడు . పరిస్థితులు అనుకూలించక ఏ సందర్భంలో నైనా అజయ్ wild గా react అయితే అతడిని ఆపగల వ్యక్తి రాహుల్ ఒక్కడే . ఇద్దరి జోక్యంతోనే విద్యా సమస్యకు పరిష్కారం” తేల్చి చెప్పాడు భరత్ రామ్ .

సాగర్ లో సంచలనం అతడి కళ్ళలో కనిపించింది .

“ ఇంతకన్నా వేరే దారి లేదా ?”బేలగా చూశాడు సాగర్ .

“ లేదు గనుకే ఇంత సాహసం చేయవలసి వస్తుంది . this is right time . విద్యా సమస్య ప్రారంభ దశ లో ఉంది . ఇప్పుడే మనం ఏమైనా చేయగలం. రోజులు గడిచే కొద్దీ పరిస్థితి అదుపు తప్పుతుంది . Mental stress భరించలేక తను పిచ్చిది కావచ్చు . ఆత్మహత్యా ప్రయత్నం చేయవచ్చు “

సాగర్ ఉలిక్కి పడ్డాడు . భరత్ రామ్ ను అయోమయం గా చూశాడు .

“భయపడకు ! పరిస్థితి అంత దూరం రానివ్వం. అందరూ సమిష్టి గా సమస్యను ఎదుర్కొంటాం. విద్యా కు ఏమీ కాదు . “ సాగర్ భుజం తట్టాడు భరత్ రామ్.

“ విద్యా ! నీలో కోమలకు ఇప్పటికే సంకేతం అంది ఉంటుంది . ఈ రోజు నుండీ ప్రశాంతం గా నిద్ర పోతావు . నిద్ర పోయే ముందు కళ్ళు మూసుకొని కోమలను తలుచు కో ! అలాగే ఏ ఆలోచన లేకుండా పావుగంట ధ్యానం లో గడుపు.

.... నిద్ర పో ! Have sound sleep .

***************************************

కొనసాగించండి 27 లో