Read The shadow is true - 27 by LRKS.Srinivasa Rao in Telugu Fiction Stories | మాతృభారతి

Featured Books
  • వైశాలి - 1

    వైశాలి అందమైన యువతి.  ఆమె ఎంత అందంగా ఉంటుందంటే ముందు ముందు న...

  • ఔను నిజం నువ్వంటే నాకిష్టం

    తెనాలి రైల్వే స్టేషన్‍       అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల...

  • ఆగంతకుడు

    క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను....

  • అచ్చిరాని అతితెలివి

    తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ...

  • ఇంటిదొంగలు

    ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసె...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

నీడ నిజం - 27

నాకు ఆమెను చూడాలని ఉంది . “

ఎవర్ని ?’అజయ్ కు అర్థం కాలేదు .

“పూర్వజన్మ లో మీ వదిన గారు . ఈ జన్మ లో ........... భర్త కళ్ళలోకి చూస్తూ ఆగింది .

అజయ్ మౌనం. జవాబు చెప్పలేని అశక్తత .

“ ఏం మాట్లాడరు ?”

“ ఏం మాట్లాడమంటావ్ ? ...ఏం మాట్లాడినా నీ జవాబు మౌనమేగా “ అజయ్ లో చిరు కోపం .

“ అందుకు కారణం మీరే . మీరు నా నుండి ఏదో దాస్తున్నారు . అదే నాకు నచ్చటం లేదు . “

“ నేను దాస్తున్నానా ?”

“ కాదా / మీ వదిన గారి సహగమనానికి సంబంధించి ఏదో నాకు తెలియ కూడని రహస్యం ఉంది . ఆ రహస్యం నాకు చెప్పటం లేదు . రాహుల్ కూడా ఆ రహస్యం తెలుసుకోవాలని పట్టుదలగా ఉన్నాడు . సహగమనం చేస్తూ చివరి క్షణం లో ఆమె ఎందుకు కేకలు పెట్టిందో తెలుసుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు .

“ చివరి క్షణం లో వాడిని చూసి కేకలు పెట్టింది . పెంచిన ప్రేమ ఆమెను చివరి క్షణం లో కదిలించింది .”

“ అది నిజం కాదు . రాహుల్ పట్ల తన బాధ్యత తెలిసి కూడా భర్త అకాల మరణం తో తట్టు కోలేక సహగమనం చేయాలనుకుంది . అంత కఠిన నిర్ణయం తీసుకున్నాక చివరి క్షణం లో మనసు మార్చుకోవటం సాధారణం గా జరగదు . అలా జరిగిందంటే సహగమనం పూర్తిగా ఆమె నిర్ణయం కాదు . ఎవరి ప్రోద్బలమో తప్పక ఉంది ఉంటుంది .”అంత అవసరం మా కుటుంబం లో ఎవరికుంది ? ఎవరు ఆమె చనిపోవాలని అనుకుంటారు ? కోపం తో అదుపు తప్పి మాట జారాడు .

“ మీకెందుకు అంత కోపం ? మీ కుటుంబం లో వారని ఎవరన్నారు ? సహగమనం గురించి రాహుల్ గుచ్చి గుచ్చి ఎన్నో ప్రశ్నలు అడిగాడు . అప్పుడు మీరు ఇలాగే ఉలిక్కి పడ్డారు . కంగారు తో మాటలు తడబడ్డారు . ....” అజయ్ తన లోని భావాలు దాచాలని విఫల ప్రయత్నం చేశాడు .

“ చూడండి ! ప్రతి మనిషి తప్పులు చేస్తాడు . తప్పు తెలుసుకొని సరిదిద్దు కోవటం సంస్కారం, మానవత్వం ! మీరు మనసులో మధన పడుతూ కృం గి పోవటం

కంటే జరిగిన దేమిటో నిజాయితీ గా చెప్పండి . నిజం ఒప్పుకోండి . అందువల్ల కలిగే కష్టం, నష్టం భరించడానికి మీ భార్య గా మీ వెనకే ఉంటాను ”

రూపా దేవి మాటల్లో లాలన అజయ్ ను కదిలించింది . ప్రేమ గా ఆమెను దగ్గరకు తీసుకున్నాడు .

“ నీ నుండి ఇంతవరకు ఏదీ దాచ లేదు . ఇదొక్కటే. తప్పకుండా చెబుతాను . నీకు గాక మరెవరికి చెప్పుకోను ? నువ్వు నాకు తగిన భార్యవే కాదు, మంచి స్నేహితురాలు కూడా . మా లాంటి వాళ్ళు భార్యకు చెప్పుకోలేని విషయాలు స్నేహితులకు చెప్పుకుంటారు . ఆ ఇద్దరు నీలోనే ఉన్నారు ..”

భార్య ను అభిమానం గా చూశాడు .

“మరి, సందేహం ఎందుకు ?”

“మరి కొంత సమయం కావాలి . అసలు ఈ రభస కంతా కారణం జస్వంత్ గడు . కనిపిస్తే నరికి పారేయాలి . “ కోపం తో కదిలిపోయాడు .

“ అందువల్ల సమస్య తేలిపోతుందా ? కోపం తో సాధించేది ఏమీ లేదు .”

“అందుకే వాడి జోలికి పోలేదు. అసలీ సమస్య కు కారణం జస్వంత్ కాడు . ..నేను .....రూపాదేవి అజయ్ ను క్షణం పరిశీలన గా చూసింది .

“మరి—సమాధానం మీరే కదా ? ఇక ఆలోచన ఎందుకు? ఆలస్యం ఎందుకు? “ మళ్ళీ అజయ్ మౌనం .

“ తను అజ్ఞాత యువతిని కలిస్తేనే గాని ఈయన మౌనం వీడడు .

ఆమె వస్తేనే ఈయన లో కదలిక వస్తుంది . ఏదైనా ప్రైవేటు డిటెక్టివ్ ఏజన్సీ ద్వారా, ఆమెను కలిసే ప్రయత్నం చేయాలి “. రూపాదేవి నిశ్చయించుకుంది .

రాహుల్ ఉత్తరం పూర్తిగా చదివింది విద్యావారి . . ఆ సుదీర్ఘ లేఖ లో ప్రతి పేజీ ఒక్కో మెట్టు లా ఆమెను గతం లోకి తీసుకు వెళ్ళాయి . పూర్వజన్మ కు, పునర్జన్మకు మధ్య ఉలిపిరి కాగితం లా వున్న తెర కరిగి పోయింది .

ఇప్పుడు ఆమె విద్యాధర కాదు ----ముమ్మూర్తులా కోమలా దేవి . తన ఉనికి మరిచిపోయింది . పరిసరాలు మరిచి పోయింది . రాహుల్ ఉత్తరం ముందుంచుకొని ఏడుస్తూనే ఉంది . “రాహుల్ బాబు “ అన్న పిలుపు ఆమె పెదవులపై పదే పదే వెక్కిళ్ళ మధ్య కదులుతోంది . తీవ్ర మానసిక ఒత్తిడి వల్ల ఆమె హిస్టీరిక్ అయిపోోయింద . డాక్టర్ సుదర్శనం రావాల్సి వచ్చింది . ఆయన sedative ఇచ్చి శాంత పరిచాడు . పది నిముషాల్లోనే కళ్ళు మూత పడ్డాయి . గాఢమైన నిద్ర ఆవహించింది . రాత్రంతా సాగర్ ఆమె పక్కనే కూర్చున్నాడు .

ముందు ఉత్తరం చదివాడు . గుండె కదిలింది అమ్మ ప్రేమలో గొప్పదనం తెలిసింది .

డైరీ చదివాడు . సమస్య లో తీవ్రత అర్థమైంది . అనుమానాలు, అపోహలు తొలిగిపోయాయి .

చీకటి తెరలు తొలిగి వెలుగు రేకలు విచ్చుకున్నాయి . విద్యా ప్రశాంతం గా నిద్ర పోతోంది . మొహం తేటగా ఉంది . మానసిక ఒత్తిడి ఆనవాలు కూడా మొహంపై లేదు . ఆమెను అలాగే చూస్తుండి పోయాడు .

కొద్దిసేపైన తర్వాత విద్యాలో కదలిక వచ్చింది . నెమ్మదిగా కళ్ళు తెరిచింది .

కనురెప్పలు బరువుగా ఉన్నాయి . sedative impact పూర్తిగా తొలగి పోలేదు .

తన కెదురుగా కూర్చున్న సాగర్ని ప్రశ్నార్థకం గా చూసింది . నెమ్మదిగా లేచి కూర్చుంది .

“ రాత్రి డాక్టర్ గారు వచ్చారు . నీకు sedative ఇచ్చారు . “

సాగర్ని అయోమయంగా చూసింది . sedative ఇవ్వవలసినంత అవసరం ఏమొచ్చింది ? కళ్ళు మూసుకొని రాత్రి సంఘటన గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేసింది . ‘రాహుల్ ఉత్తరం చదివి తను ఎమోషనల్ అయింది . హిస్టీరిక్ అయిపొయింది .

“ సారీ సాగర్ ! రాహుల్ తన ఉత్తరం తో నన్ను బాగా disturb చేశాడు . నేను సెంటిమెంటల్ గా కదిలిపోయాను . ఇలాంటి పరిస్టితి మళ్ళీ రాకుండా జాగ్రత్త పడతాను . ‘మీ అమ్మ కోమల---నేను కాదని స్పష్టం గా చెబుతాను “ ఆమె లేవబోయింది . సాగర్ వద్దని ఆపాడు .

“ కాసేపు ప్రశాంతం గా కూర్చో !... రాహుల్ ఉత్తరం చదివాను. డైరీ కూడా చదివాను. ఆ రెండూ చదివిన తర్వాత పరిస్థితి పూర్తిగా అర్థమైంది . ఉదయమే

జస్వంత్ కు ఫోన్ చేశాను రెండు మూడు రోజుల్లో రాహుల్ తో ఇక్కడకు వస్తున్నాడు . .. భరత్ అంకుల్ కూడా వస్తున్నారు . అందరం కూర్చొని నీట్ గా

ప్లాన్ చేసుకుందాము . నాకు జస్వంత్ పై పూర్తిగా నమ్మకముంది . అతడు సాధించగలడు . ...విద్యా ! జస్వంత్ అన్నట్లు రాహుల్ ఇప్పుడు కూడా పదేళ్ళ పసి బాలుడే ! అమ్మ అతడి ఊపిరి ! మీ ఇద్దరి అనుబంధం నేనే కాదు . ---ఎవరూ కాదన లేరు . ఏ శక్తీ విడదీయ లేదు . ... నా మొండి తనం , పట్టుదల నిన్ను చాలా బాధపెట్టాయి . ...సారీ ! “ సాగర్ మనసు నిర్మలం గా ఉంది . మాటలు స్ఫటికం గా ఉన్నాయి .

విద్యా చిరునవ్వు తో భర్త ముందు నిలుచుంది . అతడి భుజాల పై చేతులు వేసి నుదుటి పై ప్రేమగా ముద్దుపెట్టుకుంది .

****************************************

కొనసాగించండి 29 లో