Read The shadow is true - 22 by LRKS.Srinivasa Rao in Telugu Fiction Stories | మాతృభారతి

Featured Books
  • వైశాలి - 1

    వైశాలి అందమైన యువతి.  ఆమె ఎంత అందంగా ఉంటుందంటే ముందు ముందు న...

  • ఔను నిజం నువ్వంటే నాకిష్టం

    తెనాలి రైల్వే స్టేషన్‍       అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల...

  • ఆగంతకుడు

    క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను....

  • అచ్చిరాని అతితెలివి

    తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ...

  • ఇంటిదొంగలు

    ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసె...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

నీడ నిజం - 22

" సతి" ---మరిచి పో దగిన ఓ చారిత్రిక సత్యం‘sati -A forget table historical fact--- అన్న మకుటం తో రెండు పేజీల సుదీర్ఘ వ్యాసం రెండు వారాల ‘ ఆదివారం అనుబంధం కోసం జస్వంత్ సిద్ధం చేశాడు . very very thought provoking and logical .

మొదటి వారం –సతి పుట్టు పూర్వోత్తరాలు chrological order lo వివరించాడు . కాలం తో పాటు సతి ఆచరణలో వచ్చిన విపరీతమైన , అమానవీయ మార్పులు , ఆ కాలం నాటి స్త్రీల నిస్సహాయత , దుస్థితి కళ్ళకు కట్టినట్లు వర్ణించాడు . తన కధనానికి సాక్ష్యం గా చారిత్రిక సంఘటనలు ఉదాహరిస్తూ సతి దురాచారమని నిస్సందేహం గా తీర్మానించాడు .

కానీ- కొన్ని అనివార్య పరిస్తితులలో , సందర్భాల లో , సతి—‘జౌహర్ విధి గా ఆచరించ వలసి వచ్చింది . రాజపుత్ర కుటుంబాలలో -రాజ్యం పై ‘శత్రువుల దాడి జరిగి నప్పుడు , రాజ్యక్షేమం ప్రశ్నార్థకం అయిపోయి నప్పుడు . శత్రు మూకలకు చిక్కి మాన మర్యాదలు పోగొట్టు కోలేక అంతః పుర స్త్రీలు వీలును బట్టి జౌహర్ నో , సతి నో ఆచరించే వారు . ఇది ఏ విమర్శ కు అందని కోణం .

‘జౌహర్’ లో అగ్ని ప్రవేశం చేస్తారు . ‘సతి లో చితి పై కూర్చుంటారు . రెండు సందర్భాల లో మరణాన్ని ఆహ్వానిస్తారు . కానీ- జౌహర్ – సతి – ఆత్మహత్యలు కావు .

ఆ త్మహత్య అనే భావన లో పిరికితనముంది . పరిస్థితులను ఎదుర్కొనలేని భయం, నిస్పృహ, అశక్తత ఉన్నాయి .ఏ కో ణం లో చూసినా ఆత్మహత్య , సతి-జౌహర్ ఒకటి కాలేవు . ప్రత్యేకించి పైన చెప్పిన సందర్భాల లో సతి-జౌహర్ పై ఏ ‘ముద్రా వేయలేం . రాణి పద్మావతి అంతఃపుర స్త్రీలతో ఆచరించిన జౌహర్ చరిత్ర పుటల్లో ఉదాత్త సంఘటన గా నిలిచి పోయింది . ఆ సంఘటన విన్నవారు, చదివిన వారు వారి సాహసానికి జోహార్ చెబుతూ బాధ తో , అనిర్వచనీయ మైన భావన తో నిట్టూర్పు విడుస్తారు . పిరికితనమంటూ హేళన చేయరు . జస్వంత్ మొదటి వారం ఆర్టికల్ ను ఇలా ఓ అనుభూతి తో ముగించాడు . భాషా, భావం అభివ్యక్తీకరణ ఒక దానితో ఒకటి పోటీ పడి మనసును హత్తుకున్నాయి .

రెండో వారం –రూపాదేవి అజయ్ సింహ్ ల అభిప్రాయాలను హైలైట్ చేస్తూ వారితో తన ఇంటర్వ్యూ ను యధాతథం గా ప్రెజెంట్ చేశాడు . అజయ్, రూపాదేవి లో సతి పై అభిప్రాయ బేధాలు లేకపోయినా వారి ఆలోచనా సరళి లో ధ్వనించిన చిరుమార్పులు, అభ్యంతరాలు ఆసక్తికరం గా విశ్లేషించాడు .

చివర కొస మెరుపు తో సంచలనం రేపాడు . నిజానికి అది కొస మెరుపు కాదు---ఓ విస్ఫోటనం !

కొంతకాలం క్రితం నేనే కోమలనంటూ ఓ అజ్ఞాత స్త్రీ గ్రామం లో మెరుపులా కనిపించి మాయమైంది . సుడిగాలిలా గ్రామమంతా చుట్టి ఆ జన్మ జ్ఞాపకాలు వరదలా వినిపించింది . గ్రామస్తులు అదిరి పోయారు . ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ అర్థం కాలేదు . కట్టు-బొట్టు, సంప్రదాయం దక్షిణ భారతానిదే . అయినా ఆమె ఆ ప్రాంతపు గ్రామీణ భాష మాట్లాడే సరికి ఏ రాష్ట్రం యువతో అన్న విషయం తేల్చుకోలేక పోయారు .

ఈ సంఘటన లో నిజానిజాలు ఎలా ఉన్నా ఒక ప్రశ్న ఆ గ్రామస్తుల మనసులను తొలిచి వేస్తోంది . ఏదో బలమైన కారణం ఉంటే గాని పూర్వ జన్మ స్మృతి రాదు . ఏ బంధమో , తీవ్ర మానసిక వ్యధో ఆమెను కదిలించి ఉండాలి . పూర్తిగా తన నిర్ణయం తో నే సహగమనం చేసిన కోమల చివరి క్షణం లో చితి మంటల్లో ఎందుకు కేకలు పెట్టింది . ప్రాణ భయం తో నా ? మరేదైనా బలమైన కారణమా ? ఆ గ్రామ ప్రజలు ఈ ప్రశ్న ల కు స్పష్టమైన సమా ధానాలు కోరుతున్నారు .

వారికే కాదు ఈ ప్రపంచానికే సమాధానాలు కావాలి. మరి – ఈ ప్రశ్నలకు అజ్ఞాత యువతి సమాధానాలు చెప్పగలదా ?ఏమో ? అందుకు ఆమె వెలుగు లోకి రావాలి కదా ?

జస్వంత్ ఆర్టికల్ కు పాఠక లోకం నుండి అనూహ్య స్పందన వచ్చింది . ఉత్తరాలు వరదలా వచ్చి పడ్డాయి . వారి వారి మానసిక పరిధి , సంస్కారం మేరకు చురుగ్గానే స్పందించారు . ఆ స్పందనలో అభినందనలు,విమర్శలు, విసుర్లు, సూచనలు , వ్యంగ్యోక్తులు -కానీ—ఈ అందరినీ ఒకే స్థాయిలో , ఒకే రీతిలో కదిలించిన అంశం కొస మెరుపు. కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు ఓ సాగర కెరటం లా అలజడి రేపింది . ఆ సంఘటన ల వివరాలు ప్రచురించమని వేల సంఖ్యలో ఉత్తరాలు పత్రికా కార్యాలయానికి వచ్చాయి .

ఈ సందడి తో అజయ్ ‘ centre of the talk ‘ అయ్యాడు . అందరి దృష్టి అతడి పై, ఆ గ్రామం పై పడింది .

‘ కొస మెరుపు రాసి జస్వంత్ అజయ్ ను బాగా కలవర పెట్టాడు. కాల గర్భం లో కలిసి ‘ఉనికి కోల్పోయిన ‘గతం విచిత్రం గా, విధి లీల అన్నట్లు వెలుగు చూసింది ముందు ముందు ఈ సంఘటన ఏ అనూహ్య పరిణామాలకు కారనమవుతుందో ? ...అజయ్ విశ్రాంతి కి దూరమైనాడు . అతడి లో మార్పు రూపా దేవి గమనించింది . కారణం అడిగింది . అజయ్ నుండి సరైన సమాధానం రాలేదు . అతడి వైఖరి ఆమె కు అర్థం కాలేదు .

ఆర్టికల్ చదివి విస్తు పోయాడు . రాహుల్ లో విస్మయం , ఉద్వేగం . అతడి లో ప్రతి స్పందనలు సునామీ అలల్లా ఉవ్వెత్తున లేచాయి . ఆ తాకిడికి అతడు తట్టు కోలేక పోయాడు .

భరత్ రామ్, సుదర్శనం ఉలిక్కి పడ్డారు . తమ గుప్పిట్లో , గుండె మూలల్లో ఒదిగి పోయిందనుకున్న సంఘటన జాతీయ స్థాయి లో అలజడి రేపింది . ఈ సంఘటన కారణం గా ఏర్పడే పరిణామాలు వారు అంచనా వేశారు . ఒళ్ళు

జలదరించింది . విద్యాధర మానసిక స్థితి ఏ భాషకు , ఊహకు అందనిది. ఆమెకు వర్త మానం దుర్భరం గా , భవిష్యత్తు అయోమయం గా అనిపించాయి .

సాగర్ కలవర పడ్డాడు . విపరీతం గా భయ పడ్డాడు . తొలగి పోతుందన్న తుఫాను మరింత శక్తివంతమై తీరాన్ని తాకినట్లు ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు .

గుట్టుగా సాగే ఇంటి వ్యవహారం ఇలా రట్టు అయినందుకు పూర్ణ తిలకం నొసలు చిట్లించి కోడల్ని గుర్రుగా చూసింది .

రాహుల్, విజయ్ సుడిగాలిలా గ్రామం చేరుకున్నారు . అజయ్ ను పలు రకాల ప్రశ్నల తో ఊపిరి సలుపు కో నివ్వ లేదు . ఆ ధాటిని అజయ్ తట్టు కోలేక పోయాడు .

ఈ సంఘటన తో రాహుల్ భావోద్వేగం వెల్లువలా పొంగింది . ఎన్నాళ్ళ మూగ బాధో కరిగి చైతన్య స్రవంతి లా అతడిని కదిలించినట్లు అజయ్ కు అనిపించింది . అతడి భావ సంచలనం , బాధ అజయ్ ను కలవర పెట్టాయి . అన్న కొడుకు ముందు దోషిలా తలవంచుకున్నాడు . రాహుల్ భావాలను , బాధను ఊరు మొత్తం పంచుకుంది . వాళ్లకు అతడి లో ఆనాడు వెర్రి ఆవేశం తో శ్మశానానికి పరుగులు తీసిన రాహుల్ బాబు కనిపించాడు .

అజయ్ సింహ్ కు మరో తాకిడి కూడా తప్ప లేదు . దేశం లో ప్రెస్, మాస్ మీడియా అతడింటికి తీర్థ ప్రజా లా రాసాగాయి . ఆ తాకిడి ని రూపా దేవి సహకారం తో తట్టుకోగలుగు తున్నాడు .

ఇంత రభస కు కారణమైన జస్వంత్ పై అజయ్ కు పీకల దాకా కోపం వచ్చింది ఈ సంఘటన కారణంగా , అజయ్, రూపాదేవి మధ్య అదో లాంటి ‘నిశ్శబ్దం ఏర్పడింది . భర్త తను చెప్పుకోలేనిది , చెప్పరానిది ఏదో దాస్తున్నాడన్న అనుమానం ఆమెను నీడలా వెంటాడుతుంది .

‘కోమలా దేవి పునర్జన్మ తో సంబంధం ఉన్న స్త్రీ గ్రామానికి ఎందుకు వచ్చినట్లు ?

ఆమె ఏ ప్రాంతం మనిషి ? ఆమె కట్టు-బొట్టు ఎలా ఉన్నాయి ? ఆమె తో కదా వచ్చిన వ్యక్తులు ఎవరు ? “ అన్నీ సమాధానం లేని ప్రశ్నలే !

అజయ్ పై వివరాల కోసం రహస్యం గా వాకబు చేయించాడు . ఆమె రాజస్థానీ కాదు . అమెది దక్షిణ దేశపు సంప్రదాయం, కానీ, ఆమె స్వచ్చమైన ., ఆ ప్రాంతపు గ్రామీణ రాజస్థానీ మాట్లాడింది . అందువల్లే దక్షిణ భారత దేశం లో ఆమె ఏ రాష్ట్రానికి చెందినదో ఎవరూ చెప్ప లేక పోయారు .

ఈ వివరాలు అజయ్ తో పాటు రాహుల్ కూడా సేకరించాడు . ఇద్దరి తపన ఆ అపరిచిత స్త్రీ మూర్తిని చూడాలనే . ఒకరిలో కుతూహలం, కలవరం, భయం ! మరొకరి లో మమత, మరువలేని బంధం.

అజయ్ రహస్య ప్రయత్నాలు రూపాదేవి దృష్టికి వచ్చాయి . భార్యగా తనకు కూడా తెలియని ‘చీకటి కోణం భర్త గతం లో ఉందన్న ఆలోచన ఆమెను కృంగదీసింది .

తన ప్రయత్నాలలో బాగా విసిగి పోయిన రాహుల్ వేరే దా రి లేక , చివరి యత్నం గా జస్వంత్ ను కలవాలనుకున్నాడు .

ఏ ఆధారం లేనిదే జస్వంత్ కేవలం గ్రామస్తుల కధనం పై ఆధారపడి కొస మెరుపు

పేరుతొ సంచలనం సృష్టించ లేడు . తమ ఊరికి రాక ముందు , అజయ్ చిన్నాన్నను కలవక ముందు అతడికి అ అజ్ఞాత యువతి వివరాలు తప్పక తెలిసి ఉండాలి . concrete evidence తో నే ఇక్కడకు వచ్చాడు .

అతడి లక్ష్యం ఇంటర్వ్యూ కాదు. కొస మెరుపు ను లోకానికి తెలియజేయటం ....

అతడు investigative journalist .సతి పేరు తో ఆర్టికల్ రాయటం ఇన్వెస్ట్ గేషన్ లో మొదటి మెట్టు . సహగమనం వెనుక ఉన్న మిస్టరీ ని ఛేదించటం రెండో మెట్టు . అతడి లక్ష్యం కూడా అదే . తన సహకారం తోడైతేనే అతడి పరిశోధన పరుగులు తీయగలదు . తన అంచనా కరెక్ట్ అయితే జస్వంత్ తన కోసం ఎదురు చూస్తూ

ఉం టాడు . గ్రామం లో వాకబు చేసేటప్పుడు . ప్రతి ఒక్కరు అమ్మ(కోమల) జీవితం లో తన స్థానం గురించి ఎమోషనల్ గా చెప్పి ఉంటారు . తామిద్దరి మమతానుబంధం గురించి అతఘ ఏమిడికి స్పష్టమైన అవగాహన తప్పక ఉందడి ఉంటుంది . “ ఇలా సాగాయి రాహుల్ ఆలోచనలు . మనసుండాలే గాని మార్గం వెదకటం కష్టమే కాదు !

******************************

కొనసాగించండి 23 లో