Read The shadow is true - 19 by LRKS.Srinivasa Rao in Telugu Fiction Stories | మాతృభారతి

Featured Books
  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

  • అరె ఏమైందీ? - 22

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 8

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • రామాపురం హై స్కూల్ రోడ్

    నా పేరు విజయ్ మా గ్రామం పేరు రామాపురం. నేను టెన్త్ క్లాస్ వర...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

నీడ నిజం - 19

విద్యాదరి రాజస్తాన్ నుండి హైదరాబాద్ వచ్చిందని తెలియగానే ఆమె తల్లితండ్రులు ,చెల్లెళ్ళు ఆమెను చూసేందుకు వచ్చారు. విద్యా వారితో కలిసి గ్రామానికి బయలుదేరింది. పుట్టిన ఊరు తల్లిలాంటిది. ఆ ఒడిలో లభించే ప్రశాంతత , ప్రేమ ఓ మధురానుభూతి . ఊరిలో అడుగు పెట్టిన మరుక్షణం ఆమె మనసు తేలికైంది. తల్లి ఆదరణ , తండ్రి వాత్సల్యం, చెల్లెళ్ళ స్నేహానురాగాలు----విద్యాధరి కి రోజులు క్షణా ల్లా దొర్లిపోతున్నాయి . కూతురు చెప్పిన విషయాలు సాంతం విన్నాక మాధవరావుకు అఘోరి గుర్తుకు వచ్చాడు . అతడు చెప్పిన భవిష్యవాణి ఇంతవరకు జరిగింది ‘ ప్రారంభం. కాదు కదా అనిపించింది . ! కాస్త భయం వేసింది . కానీ----తన అనుమానం కూతురుకు చెప్పలేదు . ఇదే సందేహం , భయం విద్యా లో కూడా ఉంది . తండ్రి లాగానే తనూ బయట పడలేదు .

ఒకరోజు సాయంత్రం విద్యాధరి గుడికి వెళ్ళింది . దైవదర్శనం చేసుకొని ప్రశాంతం గా ఉంటుందని గుడి వెనుక , రద్దీ లేని చోట కాసేపు కూర్చుంది . కూర్చున్న కొద్ది క్షణాల్లో ఆమె ముందు అఘోరీ నిల్చున్నాడు .

‘ తను ఇక్కడ ఉన్నట్లు ఎలా తెలిసింది ? అతడి రాకలో ఏదైనా సూచన ఉందా ? ‘ అర్థం కాలేదు విద్యాదరికి. ముందు అతడే ప్రారంభించాడు .

“ ఆనాడు సహగమనం పేరు తో కోమలాదేవికి జరిగిన అన్యాయం సరిదిద్దవా విద్యాధరీ ? అజయ్ సింహ్ పాపం పండి అతడు దోషిలా ప్రపంచం ముందు తలవంచాలి. నీకు పూర్వజన్మ స్మ్రతి కలిగింది ఇందు కోసమే .”

కొన్ని క్షణాలు అఘోరిని వింతగా చూసి విద్యా పకపక నవ్వింది. అఘోరీ ముఖం లో మాత్రం ఏ భావం లేదు.

“ నేను గత జన్మలో కోమలా దేని నే ---కాదనను. కానీ—ఆ జన్మ బంధాలు, అనుబంధాలు ఆ జన్మకే పరిమితం. అజయ్ సింహ్ కు విరోధి కోమలా దేవి. విద్యాధ రి కాదు. ఓ అసాధారణ పరిస్థితి లో పూర్వజన్మ వివరాలు తెలిశాయి.

అంతమాత్రాన ఆనాటి వ్యక్తులతో రాగద్వేషాలు పంచుకోవటం , పెంచుకోవటం శుద్ధ అవివేకం”!

క్షణం కన్నార్పకుండా విద్యాను చూశాడు అఘోరి.

“ మరి--- నీకు రాహుల్ బాబును చూడాలనిపించటం లేదా ? ఆనాటి మమతానుబంధం నిన్ను కదిలించటం లేదా ? ... లేదని మొండిగా ఆత్మ వంచన

చేసుకోకు. కళ్ళలోకి సూటిగా చూస్తూ ఆమె భావాలు చదివే ప్రయత్నం చేశాడు అఘోరి. ఆమె చప్పున తల దించుకుంది.

“......మరి---ఆనాటి బంధం నిన్ను కదిలించినప్పుడు ఆ బంధం తో అల్లుకుపోయిన బాధ్యతలను ఎందుకు కాదంటున్నావు . “?

“ఎందుకంటే ----విద్యాధరి గా నా జీవితం నాకు ముఖ్యం. ......నా తల్లితండ్రులు ,నా చెల్లెళ్ళు , నా భర్త , నా ఇల్లు , నా చుట్టూ వున్నా సమాజం, నా ఉనికిని ప్రతిక్షణం గుర్తు చేసే వర్తమానం, భావికి అందమైన రూపం ఇచ్చే నా కలల

సా మ్రాజ్యం !.... ఇదే నా జీవితం ! ఇది యదార్థం .....కోమలా దేవిగా నా జీవితం చెదిరిన కల .........

గతం ఎంత గొప్పదైనా యదార్ధం కాలేదు . దయ చేసి నన్ను నన్ను గా బ్రతకనివ్వండి . నేను విద్యాధరినన్న నిజం మరిచిపోతే నాకు జీవితం శాపమవుతుంది . “ చివరి మాటలు చెబుతున్నప్పుడు ఆమె గొంతు వణికింది . అఘోరి ఆమెను సానుభూతిగా చూసి నిట్టూర్చాడు .

“ నీ వాదన తో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. కానీ.....నీ అంతరంగం లో , నీ ఆలోచనలో విడదీయరాని భాగమైన

కో మలాదేవి ఈ వాదన ఒప్పుకుంటుందా ? ...ఆలోచించు!” ఆమె నలా సందిగ్ధం లో వదిలేసి అఘోరి మెల్లగా తప్పుకున్నాడు . అతడి మాటలు ఆమెను తికమక పెట్టాయి . అతడు తన పరిస్థితిపై సానుభూతి చూపాడా ? ముందు కొత్త సమస్యలు ఉన్నాయని హెచ్చరిక చేశాడా ? అర్థం కాలేదు .

జస్వంత్ , ముందు అజయ్ ను క లవాలనుకున్నాడు. .......విలేకరి హోదా లో నే . అజయ్ మానసిక స్థితి తెలుసుకున్న తర్వాతే తన ప్రణాళిక సిద్ధం చేసుకోవచ్చు . అతడిని ఇంటర్వ్యూ చేసేవారు , వంశ చరిత్ర, కలికితురాయి లాంటి రెండు సంఘటనలు ---రెండు సహగమనాలు విశ్లేషిస్తూ , వాటిపై అజయ్ అభిప్రాయం జోడించి, కొన్ని ‘hist orical references’ తో ఒక సమగ్ర వ్యాసం ‘సండే రీడర్స్ ‘కు అందజేయాలి . .....’సతి ఒక సాంఘిక దురాచారమని ప్రభుత్వం చట్టబద్ధం గా తీర్మానించిన నేపధ్యం లో ఈ వ్యాసం పాఠ కులపై ఎలాంటి ప్రభావం

చూపిస్తుందో ! వారి”స్పందన” ఏ రీతి లో ఉంటుందో ! జస్వంత్ లో కుతూహలం ! ఉత్సాహం !

అతడు కోమలా దేవి సహగమనం జరిగిన నాటి దినపత్రిక ప్రతులు తిరగేశాడు . ఈ వార్త ఆ రోజుల్లోనే ( 1960) సంచలనం రేపింది . పోలీసు దర్యాప్తు జరిగింది . పోలీసులు ఈ కేసు విషయం లో ఎవరి మీద చర్య తీసుకోలేక పోయారు . ఊరు ఊరంతా ఒకే మాటపై నిలిచి కోమలా దేవి అంగీకారం తో నే సహగమనం జరిగినట్లు సాక్ష్యం చెప్పింది . పైగా ఆ రాజవంశం పై పోలీసులు తప్పు ఉన్నా , లేకపోయినా వేలెత్తి చూపే సాహసం చేయ లేరు . అందుకే ఏమీ చేయలేక వెనుదిరిగి వెళ్ళిపోయారు . కానీ, మనస్ఫూర్తిగా సహగమనానికి సిద్ధపడి చితి ప్రవేశం చేసిన కోమల చివరి క్షణం లో భీతితో కేకలు పెట్టడంమిస్టరీ గానే మిగిలిపోయింది . ఈ విషయం లో రకరకాల ఊహాగానాలు పత్రికలూ చేశాయి . ప్రజలు కూడా చేశారు .

మళ్ళీ ఇన్నాళ్ళకు ఆ సంఘటన ను జస్వంత్ వెలుగు లోకి తే వాలను.కుంటున్నాడు. ఈ విషయం పత్రికా కార్యాలయం లో అందరినీ ఆశ్చర్య పరిచింది .

జస్వంత్ సతికి ఓ కొత్త రూపం

ఇవ్వబోతున్నాడ న్న అంశం అందరినీ ఆలోచింప

చేసింది.

జస్వంత్ క్యాలిబెర్ , కమిట్మెంట్ , అప్రోచ్ తెలిసి న ఎడిటర్ -ఇన్-ఛీఫ్ ,అతడి ప్రయత్నాన్ని మనఃస్ఫూర్తిగా ప్రోత్సహించాడు . వివాదాస్పదమైన అంశాలను ఓ నూతన దృష్టి కోణం లో పాఠకుల ముందు ఉంచటం ఓ అరుదైన , అద్భుతమైన కళ .

“జస్వంత్ అజయ్ సింహ ను కలిసేందుకు బయలుదేరే ముందు ఎడిటర్-ఇన్-ఛీఫ్ ఓ సంచలన వార్త వినిపించాడు . అదే --- కోమలా దేవి పునర్జన్మ !

ఆ వివరాలు తెలిసినా తెలియనట్లే ఆశ్చర్యం నటించాడు. జస్వంత్. ‘ అప్పుడే ఈ వార్త ఆఫీసు చేరిందా !” అతడిలో ఆశ్చర్యం, కంగారు---totally professional !

“. జస్వంత్ ! ఇది కలా ? నిజమా? కోమలా దేవి మళ్ళీ పుట్టడమేమిటి ? ......ఈ సంఘటన నువ్వు సాక్ష్యాలతో ఋజువు చేయాలి . అలా చేస్తీ నీ ఇన్వెస్ట్ గేషన్ విలువ పెరుగుతుంది . ఆమె గత జన్మ విశేషాలు ఆనాటి ‘ మిస్టరీ ని క్లియర్ చేయవచ్చు.” ఛీఫ్ మాటల్లో వృత్తిపరమైన ఆరాటం, ఒక గొప్ప సత్యం తెలుసుకోవాలన్న కుతూహలం కనిపించాయి .

‘జరుగుతున్న సంఘటన ల ఒరవడి చూస్తుంటే కోమలా దేవి కధ ఊహించని మలుపులు తిరిగేలా ఉంది . అలా జరగక ముందే తను మేలుకోవాలి . పనిలో వేగం పెంచాలి. విద్యాధరి గా పుట్టిన కోమల తన ప్రమేయం తో నే లోకం వెలుగు చూడాలి . ‘ జస్వంత్ లో జర్నలిస్ట్ ఆరాటపడి పోయాడు .

జస్వంత్ ను ప్రశ్నార్థకం గా చూసాడు అజయ్.”జస్వంత్ ఫ్రం భారత్ టైమ్స్ .” మర్యాద పూర్వకం గా చేయి కలిపాడు .

“ కూర్చోండి” తనూ కూర్చున్నాడు అజయ్ . “ చెప్పండి ! నాతో ఏమిటి పని . “?

“ మిమ్మలిని ఇంటర్వ్యూ చేయాలి “ జస్వంత్ పెదవులపై మందహాసం.

“నన్నా ? ఎందుకు? నేటి రాజకీయాలపై నా అభిప్రాయం కావాలా ? అధికార పక్షం లోటుపాట్లు ఎత్తి చూపాలా ? “ చివరి మాటల్లో కాస్త వ్యంగ్యం . !

రెండూ కావు.. మళ్ళీ మంద హాసం .

“ మరి?’ అజయ్ కళ్ళల్లో కుతూహలం.

“ సతి పై మీ అభిప్రాయం “ ?

“ సతి పై నా ?’ .... అదో దురాచారం ...చట్టరీత్యా నేరం. అలాంటి సతిపై నా అభిప్రాయమా ? చరిత్ర పుటల్లో మరుగున పడిపోయిన ఆ ఆచారం పై ఇప్పుడు చర్చ ఎందుకు ? అందువల్ల ప్రయోజనం ఏమిటి ? “

మీ రన్నది నిజమే . కాలదోషం పట్టిన ఆచారం పై చర్చ అనవసరం . అందువల్ల ప్రయోజనం శూన్యం . కానీ—సతి ,భారతీయ సంస్కృతి పై ఓ మచ్చలా మిగిలి పోయింది . సతి గతం లో స్త్రీల పై సమాజం విధించిన మరణ శాసనం .

సతి కారణం గా భారతీయ సంస్కృతి కి గ్రహణం పట్టింది. అందువల్లే సతిని అన్ని కోణాల్లో చర్చించి , ఆనాటి సామాజిక పరిస్థితులు ,చారిత్రిక సంఘటనల ఆధారం గా

ఓ సమగ్ర వ్యాసం ఈ తరం పాఠకులకు –ముఖ్యం గా యువతకు అందజేయటం నా లక్ష్యం . అపోహలతో , దురభిప్రాయాల తో మసకబారిన భారతీయ సంస్కృతి విలువలు వెలుగు లోకి రావాలి . సతిని ఒక కారణం గా చూపుతూ, దురుద్దేశం తో

హైందవ జాతిని కించపరిచే వారికి ,పాఠకులకు ఇది గుణపాఠం కావాలి . సతి మరిచి పో దగని ఒక చారిత్రిక సంఘటన . ---సత్యం. ---సతిని సమర్ధించినా .... ఖండించినా ప్రయోజనం లేదు . “

“ మీ లక్ష్యం బాగుంది . మరి---- ఇందులో నా ప్రమేయం ఏమిటి ? “ అర్థం కానట్లు చూశాడు .

“ మీ కుటుంబానికి, సతి కి ఓ విడదీయరాని బంధం ఉంది . మీ కుటుంబ స్త్రీలు ఇద్దరు వారి భర్తల తో పాటు సహగమనం చేశారు . ఆ రెండు చాలా ఉదాత్తమైన సంఘటనలు . భర్తల ఎడబాటు భరించలేక , మోడులా బ్రతికే కోరిక లేక వారు ఆ సాహసం చేశారు . వారి ధైర్యం, భర్తల పై అనురాగం . సతీత్వం చాలా గొప్పవి .

అంత గొప్ప రాజవంశానికి ప్రతినిధి అయిన మీ అభిప్రాయం సతి పై ఏ తీరులో ఉంటుందో నేను తెలుసుకోవాలి . సతిని సమీక్షించే విభిన్న కోణాల్లో ఈ అంశం కూడా చాలా ముఖ్యమైంది . మీరు సహకరిస్తే.....” సాభిప్రాయం గా చూశాడు . “ అజయ్ లాంటి మొండివాళ్ళతో , ఆవేశ పరుల తో చాలా జాగ్రత్త గా మాట్లాడాలి . శృతి మించితే అసలుకే మోసం వస్తుంది . ఎలాగైనా అతడు వెలుగు లోకి రావాలి.

లోకం దృష్టి అతడిపై పడాలి . అప్పుడే తను అనుకున్నది సాధిస్తాడు .


***************************************

కొనసాగించండి 20 లో