Read The shadow is true - 15 by LRKS.Srinivasa Rao in Telugu Fiction Stories | మాతృభారతి

Featured Books
  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

  • అరె ఏమైందీ? - 22

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 8

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • రామాపురం హై స్కూల్ రోడ్

    నా పేరు విజయ్ మా గ్రామం పేరు రామాపురం. నేను టెన్త్ క్లాస్ వర...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

నీడ నిజం - 15

మరైతే నేను చెప్పేది జాగ్రత్తగా విను !రే పు నీ భర్తకు ఘనంగా అంత్య క్రియలు జరుగుతాయి. . ఈ ఊరి చరిత్ర లో అదొక మరిచి పోలేని అపూర్వ సంఘటన. విక్రం పుణ్యాత్ముడు . ధన్యజీవి! జీవితాన్ని ఒక సాధన గా , తపస్సు గా భావించిన మహామనీషి. అలాంటి ఉత్తముడు నీ భర్త కావడం నీ పూర్వజన్మ సుకృతం . ఆయనతో నీ జీవితం అతి స్వల్పమే అయినా అదొక అపూర్వ వరం ! అలాంటి

మ హా నుభావుడు శాశ్వతం గా తప్పుకున్నాక వైధవ్యం భరిస్తూ అసలెందుకు బ్రతకాలి ? అంతకన్నా అతడిని అనుసరిస్తూ పుణ్యస్త్రీ గా సహగమనం చేయటం ఉత్తమం కదా ?”

“ మీరు చెప్పింది అక్షరాలా నిజం.” కోమల అతడి తర్కజాలంలో పూర్తిగా పడి పోయింది . పైగా మనసును భ్రమిమ్పజేసే మంత్ర ప్రభావం !

“ ఈ పరిస్థితి లో నీకు సహగమనం ఒక్కటే ఉత్తమమైన మార్గం . ఈ ఇంటి ఇలవేల్పు ఐ శ్వ ర్యాదేవిని ఆదర్శం గా తీసుకో ! ఆమె ధైర్యం గా స్థిర చిత్తం తో , ధర్మావేశం తో ,భర్తతో పాటు చరిత్ర సృష్టించి చరితార్థురాలైంది . అదే దారిలో నువ్వూ నడిచి నీపై ఉన్న ‘దాసీ’ అన్న మచ్చ తొలగించుకో ! ఈ రాజవంశ చరిత్ర లో నీవు " " "కులం కాదు , గుణం ముఖ్యమ న్న ఆదర్శాన్ని నిరూపించినన త్యాగమూర్తి “ పన్నా” పేరు నిలబెట్టినదానివవుతావ్ . ఇక ఆలోచించకు . ఈ ప్రజలు కన్నీటి తో జయహో అంటూ నీకు వీడ్కోలు పలుకుతుంటే భర్త చితిపై కూర్చుని ఆ పుణ్యమూ ర్తి తో శాశ్వత ముక్తి పొంది మా అందరి హృదయాల్లో సజీవం గా నిలిచిపో !”

పన్నాలాల్ భావావేశానికి , అద్భుత పద ప్రయోగానికి అజయ్ నివ్వెర పడిపోయాడు . అతడి దృష్టికి పన్నాలాల్ ప్రత్యేకంగా కనిపించాడు . కొన్ని క్షణాలు నిశ్శబ్దం . కోమల వంచిన తల ఎత్త లేదు . ఆమె లో ఘర్షణ జరుగుతుందని పన్నాలాల్ గ్రహించాడు .

“ కోమలా ! మరేమీ ఆలోచించకు ! రేపు నీ అసాధారణ నిర్ణయం తో అందరినీ విస్మయ పరచు . స్థిర సంకల్పం తో, మనోబలం తో వారి అభ్యంతరాలను త్రోసి పుచ్చు . ఎవరు చెప్పినా వినకు . ఒకే ధ్యానం. ఒకే లక్ష్యం.! ...సహగమనం. ! నీ భర్తను, నిన్ను ఉత్తమ గతులకు చేర్చే ఏకైక మార్గం ! కళ్ళు తెరువు. వర్తమానం లోకి రా ! -ఇప్పటికే వేళమించింది “

కోమలాదేవి కళ్ళు తెరిచింది . పన్నాలాల్ ను చూసింది . ఆ చూపుల్లో స్వచ్చత, అనూహ్యమైన భావ లహరి, ,వెలుగు !

“వెళ్ళమ్మా ! నీ కోసం మీ అత్తగారు పాపం చూస్తుంటారు . నువ్వు కనిపించక పొతే కంగారుపడతారు . పన్నాలాల్ సూచనకు మెల్లగా లేచి, నిద్రలో నడుస్తున్నట్లు కోమల బయటకు వెళ్ళింది . అజయ్ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు .

“ అద్భుతం పన్నాలాల్ ! నీ సాధన, సమయస్ఫూర్తి అద్భుతం ! కొనగోటితో లేత తమలపాకు గిల్లినట్లు సమస్యను సున్నితంగా తేల్చివేశావ్.” అజయ్ ప్రశంశ . పన్నాలాల్ నవ్వాడు .అసలు నీ మాటల చాతుర్యం చూస్తుంటే మంత్ ప్రయోగం అవసరం లేదనిపిస్తుంది . చాలా పద్దతిగా నచ్చ చెప్పే ప్రయత్నం చేశావ్ . నిజం చెప్పాలంటే ఆమెకు—సహగమనమే ఉత్తమమైన మార్గం . మన సూచనను, సలహాను ఆమె మనస్ఫూర్తిగా అంగీకరించింది . ఆమె సహగమనానికి త్రికరణ శుద్ధిగా సిద్ధపడింది . పోనీలే ఓ స్త్రీ హత్య చేశామన్న పాపం చుట్టుకోదు .” చివరి మాట నిట్టూర్పు తో ముగిసింది .

పన్నాలాల్ అజయ్ ను ప్రసన్నంగా చూశాడు . “ అజయ్ బాబు ! ఈ ప్రయోగం ప్రారంభిం చే ముందు నేను అక్షరాలా మంత్రగాడి లాగానే వ్యవహరించాను . అహోరాత్రాలు ప్రాణాలకు తెగించి నేర్చుకున్న విద్యను ప్రయోగించే అవకాశం వచ్చిందని సంబరపడి పోయాను .

కానీ, నిన్న రాత్రి మీ మామయ్యగారు వచ్చి మీ అన్న గారు పాము కాటు తో

మరణించారని , తంతు ఆపేయమని చెప్పి హడావుడిగా వెళ్ళిపోయారు . నా గుండె గుభేల్ మంది . ఇలా మధ్యలో తంతు ఆపేస్తే క్షుద్రశక్తి నన్ను కబళిస్తుంది .

ఆ భయం తో ఏమీ తోచక ఈ మారువేషం లో మిమ్మల్ని కలిశాను . ఇక మామయ్యగారు, విజయ్ బాబు ను కలిసి ప్రయోజనం ఉండదనిపించింది .

అందుకే ఈ సాహసం చేశాను . మీరొక్కరే నా మాట వింటా రన్న నమ్మకం. మీ ముగ్గురిలో కోమలాదేవంటే మీకే చాలా విరక్తి . , కోపం.... ఆగాడు . పన్నాలాల్ .అతడి ముఖ కవళికల్లో మార్పు.

“ ఇక్కడికి వచ్చేవరకు నా ఆలోచనల్లో మార్పు రాలేదు . కానీ, ఇక్కడికి వచ్చాక ఈ ఇంట్లో అడుగు పెట్టాక దైవత్వం అంటే మొదటిసారి తెలిసొచ్చింది. ఈ మహల్ లో ఏదో అద్భుతమైన మహత్తు ఉంది . నిజం చెబుతున్నాను—మీ అన్నగారికి నమస్కరిస్తున్నప్పుడు నా గుండె లయ తప్పింది . కళ్ళలో నీళ్ళు తిరిగాయి . మీ అన్నగారి గురించి ప్రతి ఒక్కరూ గొప్పగా చెప్పేవారే . ఆయన తో తమ అనుబంధాన్ని బాధతో గుర్తు తెచ్చుకున్నవారే . ఇందరి గుండెల్లో నిలిచి పోయిన మీ అన్నగారు నాకు దేవుడిలా కనిపించారు . ఆ స్థాయికి ఒక వ్యక్తి ఎదగాలంటే ఎంత సంస్కారం, సాధన కావాలి ? దేవాలయం లాంటి ఈ ఇంటిని, ఇక్కడి మనుషులను మోసం చేసి నా క్షుద్రశక్తిని ప్రయోగించటం పాపం అనిపించింది . కానీ-తప్పదు .ఈ పని చేయక పొతే క్షుద్రశక్తికి నేను బలి పోతాను . “ పన్నాలాల్ విరక్తిగా నవ్వాడు .

“ నేనో నిజం చెప్పనా---- క్షుద్రం శక్తి లో లేదు . మన మనసులో ఉంది . ఆ మహాశక్తి ఓ కత్తి లాంటిది . కత్తి తో గొంతు కోయచ్చు . ప్రాణాల్ని నిలబెట్టవచ్చు . ...


అజయ్ బాబు ! నా పాపం లో కొంత లో కొంత కడిగి వేసుకోవటానికి మంత్రప్రయోగం తో పాటు నా ఆత్మతృప్తి కోసం మంచి మాటలతో ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశాను . కానీ, రేపు ఆమె పలికేది నా మాటలే . “


ప్రాణాలు తీసే మంత్రగాడిలో పరివర్తనకు అవగింజంతైనా అవకాశం లేదు . కానీ, మనసులో ఏ మూలో ఉన్న సంస్కారం , సాధు స్వభావం పన్నాలాల్ ను విక్రం సింహ్ వ్యక్తిత్వం ముందు తల వంచేలా చేశాయి .

తె ల్ల వారింది ...

కోమలా దేవి సహగమన వార్త ఊరిలో దావానలం లా కమ్ముకుంది . అందరూ నివ్వెర పోయారు . విక్రం తల్లి కన్నీరు మున్నీరైంది . కోడలిని ఈ సాహసం మానుకోమని దీనంగా వేడుకొంది .

“కోమలా ! ఏమిటీ విపరీతం ? చెట్టంత కొడుకు నాకు తల కొరివి పెట్టవలసిన వాడు అర్థాంతరంగా దాటుకున్నందుకు కుమిలిపోనా ? ....లేక నీ మొండి ధైర్యానికి , మంకు పట్టుకు గుండె లవిశేలా ఏడవనా ? అసలు నీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది ? ఎవరు నిన్నీ సాహసానికి పురిగొల్పారు . రాహుల్ గతి ఏం కావాలి ? నా కొడుకు ఏ ఉద్దేశ్యం తో పెద్ద మనసు చేసుకొని నిన్ను పెళ్లి చేసుకున్నాడో మరిచి పోయావా ? ఎందుకు సహగమనానికి సిద్ధ పడ్డావ్ ?

నీ మరుదుల్ని చూసి భయపడ్డావా ? వారు నిన్నేమీ చేయలేరు . ఈ ఇంటి పెద్ద

కోడలిగా , రాహుల్ తల్లి గా నిన్ను గుర్తించాను . నీకు ఏ లోటు రానివ్వను . నా కడుపు లో దాచుకుంటాను . ఈ ప్రయత్నం మాను . రాహుల్ ను దగ్గరికి తీసుకో .

అభం, శుభం, తెలియని ఆ పసివాడిని నీ మూర్ఖత్వానికి బలి చేయకు . “ ఆమె కోడలిని వేడుకునే తీరు అక్కడున్న వారి గుండెల్ని కదిలించింది .

“వదినా ! మా మూర్ఖత్వానికి మమ్మలిని క్షమించు . అహంకారం తో నిన్ను అవమానించాం . దేవుడులాంటి అన్నగారు శాశ్వతం గా దూరమైనారు . ఆ భగవంతుడు కోలుకోలేని దెబ్బ తీశాడు . అమ్మకు ఈ వయసులో కడుపు కోత , మాకు ఈ శిక్ష ,అవమానం, అపనింద విధించాడు . ఇప్పుడు నువ్వు కూడా “…..ఆరాటంతో కదిలిపోయాడు . “తప్పుకున్నావంటే మమ్మల్ని ఈ ఊరు వె లివేస్తుంది . కనీసం అమ్మ కోసం, ఆ పసివాడి కోసమైనా నువ్వీ సాహసం మానుకోవాలి . నా మాట విను . అన్నగారి అంత్యక్రియలు ప్రశాంతం గా జరగనీ ! ఆయనను ఘనంగా సాగనంపి కొంతవరకైనా మా పాపం కడిగేసుకోనీ !”

అంతగా విజయ్ ప్రాధేయ పడుతుంటే అజయ్ ఆవేశం ఆపుకోలేక అక్కడినుండి విసవిసా వెళ్ళిపోయాడు . ఇంకా చెప్పవలసిన వారందరూ కోమలకు చెప్పి చూశారు . ఫలితం శూన్యం . రాహుల్ కు విషయం పూర్తిగా బోధపడక పోయినా ఏదో జరగరానిది జరగబోతోందని , బాధతో,ఆరాటంతో కదిలిపోయాడు . విజయ్ ఆర్తిగా రాహుల్ ను దగ్గరకు తీసుకున్నాడు . ఎవరో వచ్చి రాహుల్ ను దూరంగా తీసుకుపోయారు .అతడు రానని చాలా సేపు పెనుగులాడాడు . కానీ అతడిని తప్పించకపోతే అక్కడి పరిస్థితి మరీ హృదయవిదారకం గా మారేలా ఉంది . ఊరి పెద్దలు సమావేశమయ్యారు . ఇంటి చుట్టూ జనం మూగారు . అందరికీ పరిస్థితి ఆయమయం గా ఉంది . ఏ క్షణం లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ అందరినీ పట్టి కుదిపేస్తుంది .

‘ సహగమనం ఓ ప్రాచీన విధివిధానం . ముఖ్యంగా రాజపుత్రు లలో తరతరాలుగా వస్తున్న ఆచారం . పురాణకాలం లో కూడా సహగమనం ఉంది . కానీ--- ఆ

సమాజం ప్రతి స్త్రీని తన భర్తతో సహగమనం చేయమని ఆంక్ష పెట్టలేదు . సహగమనం చేయటం , చేయక పోవటం వ్యక్తిగత సమస్య గానే ఆనాటి సమాజం భావించింది . ఏ స్త్రీ ని కూడా బలవంతంగా ,చనిపోయిన భర్త తో పాటు నిప్పుల్లో తోయా లనుకునే ఆలోచన, అమానుషం , అనాగరికం .అది అహంకారానికి కరుడు గట్టిన సంప్రదాయ వాదానికి పరాకాష్ట . కానీ, తనకు తానుగా , భర్త వియోగం భరించలేక , బ్రతికే కోరిక లేక సహగమనం చేస్తానం టే వద్దని వారించటం ధర్మం కాదు . ఆమె సతీత్వాన్ని గౌరవించక తప్పదు . “ పై అభిప్రాయం ఊరి పెద్దలు అక్కడ సమావేశమైన వారికి వివరించారు . వారి అభిప్రాయం ఎవరూ కాదనలేక పోయారు . ఆనాటి యువతలో కొందరికి ‘ సతి’ పై అభిప్రాయ బేధాలు, అభ్యంతరాలు ఉన్నా, పెదవి కదిపే సాహసం చేయలేక పోయారు. సమాజం లో వర్ణ వ్యవస్థ మూలాలు , ప్రాచీన విధి విధానాలు బలం గా ఉన్న ఆ రోజులలో ప్రతిఘటన కు శిక్ష సమాజం నుండి వెలివేయటమే .

కానీ అక్కడి పరిస్థితి సతికి అనుకూలం గా లేదు . మహల్ చుట్టూ చేరిన జనం లో –అన్ని వర్గాల వారికి సహగమనం ఏదో విధం గా ఆగిపోవాలనే ఉంది . వారా క్షణంలో ఆచారాలకు అతీతంగా రాహుల్ ను దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తున్నారు . ఆ పసివాడికి కోమల సంరక్షణ అవసరం . ఆమెకు అత్తగారి రక్షణ ఉంది . విజయ్ లో మార్పు వచ్చింది . అన్నిటి కన్నా ముఖ్యమైంది---

ఆమెపై వెల్లువలా పొంగే ఊరి ప్రజల సానుభూతి . ఆమెకు బలమైన సామాజిక రక్షణ ఉంది . చివరి ప్రయత్నం గా ఆ ఊరిలో వయోవృద్ధుడు, ఆచార వ్యవహారాలు క్షుణ్ణం గా తెలిసిన వాడు , పైగా విక్రం కు గురువులాంటి వాడు బాలకిషన్ త్రివేది కోమలకు నచ్చజెప్పాలని ముందుకు వచ్చాడు .

“ కోమలా ! మీ ఇద్దరి వివాహం నా చేతులతో జరిపించాను . సమాజం నన్ను వేలివేస్తుంది అని తెలిసినా భయపడ లేదు . విక్రం నా ప్రియ శిష్యుడు . ఏది మంచో, ఏది కాదో అతడికి బాగా తెలుసు . ...నిండైన మనిషి ! నిన్ను వివాహం చేసుకోవాలన్న అతడి నిర్ణయం లో తప్పు లేదు . రాహుల్ కు తల్లి ప్రేమ అందించాలని ఈ నిర్ణయం తీసుకున్నాడు . ఎవరూ చేయలేని సాహసం చేశాడు .

కనుక ఎవరికీ భయపడకు ! సహగమనం అన్న అలోచన తప్పు . విక్రం పై ప్రేమ , గౌరవం ఉంటే ఈ ప్రయత్నం మానుకో ! కేవలం నీ దృష్టి తో ఆలోచించకు . వేళ

మించి పోతోంది . విక్రం అంత్య క్రియలు ప్రశాంతం గా జరగనీ".

ఎవరి మాట వినకపోయినా ఆ పెద్దమనిషి మాట వింటుందని అందరి ఆశ.

కోమల నిర్ణయం కోసం అందరూ ఊపిరి బిగపట్టి చూస్తున్నారు . అజయ్ , పన్నాలాల్ కళ్ళలో కలవరం. విక్రం తల్లి, విజయ్ లో ఆరాటం .

****************************************. కొనసాగించండి 16 లో