Read The shadow is true - 14 by LRKS.Srinivasa Rao in Telugu Fiction Stories | మాతృభారతి

Featured Books
  • వైశాలి - 1

    వైశాలి అందమైన యువతి.  ఆమె ఎంత అందంగా ఉంటుందంటే ముందు ముందు న...

  • ఔను నిజం నువ్వంటే నాకిష్టం

    తెనాలి రైల్వే స్టేషన్‍       అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల...

  • ఆగంతకుడు

    క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను....

  • అచ్చిరాని అతితెలివి

    తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ...

  • ఇంటిదొంగలు

    ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసె...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

నీడ నిజం - 14

అజయ్ నే అనుసరిస్తూ ఆ గదిలో అడుగు పెట్టిన కోమల ఎదురుగా కుర్చీలో కూర్చున్న సాధువు లాంటి ఆగంతకుడిని చూసి కలవర పడింది . అజయ్ ను ప్రశ్నార్థకం గా చూసింది .

“ వదినా ! వీరు గొప్ప సాధువులు. ఈ కష్ట కాలం లో వీరి రాక కాస్త ఊరట కలిగిస్తుందని నేనే పిలిపించాను . అన్నయ్య కు వీరు దైవం తో సమానం . వీరి మాటంటే అన్నయ్యకు వేదం . వీరు చెప్పేది శ్రద్ధగా వినండి . మీకు వీరి మాటలు నచ్చితే , అందువల్ల మీ బాధ తొలిగి పోతుందనుకుంటే వీరు చెప్పినట్లు చేయండి . అయితే – ఇందులో బలవంతం ఏమీ లేదు .” క్లుప్తం గా ముగించాడు అజయ్ .

అనుకున్నది సాధించాలన్న లక్ష్యం తో అజయ్ కోమల తో అతి వినయం గా మాట్లాడవలసి వచ్చింది . ఇప్పటికే రెండు సార్లు ఆమెను ‘వదినా అని పిలిచాడు . అందుకే అతడి ముఖం లో చిరాకు కోపం స్పష్టంగా కనిపిస్తున్నాయి .

కోమల సాధువు వేషం లో ఉన్న పన్నాలాల్ ను పరిశీలన గా చూసింది . అతడి పెదవులపై మందహాసం, కళ్ళలో ఏదో శక్తి !

కొన్ని క్షణాలు అతి నిశ్శబ్దం గా గడిచాయి . పన్నాలాల్ కన్నార్పకుండా ఆమెనే

చూస్తున్నాడు . పెదవులపై చిరునవ్వు చెక్కు చెదరలేదు .

“ చూడమ్మా కోమలా ! సౌభాగ్యం పోగొట్టుకుని పుట్టెడు దుఖం లో ఉన్నావు . ఈ సమయం లో నిన్ను మాటలతో విసిగించటం నా అభిమతం కాదు . నీ బాధను దూరం చేయగల ఒక ఉపాయం చెబుతాను . ఆ ఉపాయం నీకు అన్ని విధాలా నచ్చితే పాటించు . పాటించక పోయినా నేనేమీ అనుకోను . కానీ నా దృష్టి లో అంతకు మించిన మార్గం నీకు మరోటి లేదు .

మంద్రస్థాయి లో అన్నాడు .

కోమల అవుననలేదు, కాదనలేదు ; మౌనం గా అతడినే చూస్తుండి పోయింది . అతడి చూపుల్లో శక్తి తన మనసు పై ప్రభావం చూపుతున్నట్లు ,అతడి మాటలు తనపై మంత్రం లా పనిచేస్తున్నట్లు ఆమెకు అనిపించింది . ముఖ్యం గా అతడి స్వరం లో ఓ వింత శక్తి ఉంది .

“ఇలా వచ్చి కూర్చో తల్లి !” మాటల్లో సౌమ్యత . కోమలా దేవి ఎదురుగా వచ్చి కూర్చుంది .” కళ్ళు మూసుకో !” కళ్ళు మూసుకుంది .

“ ఇక మరేమీ ఆలోచిచకు ! నా ప్రతి మాట, ప్రతి అక్షరం శ్రద్ధగా ఆలకించు “.

పన్నాలాల్ కంఠంలో విచిత్రమైన మార్దవం--- మనసును, దేహాన్ని లాలించే మార్దవం.

పన్నాలాల్ మంద్రస్థాయి లో , స్పష్టంగా ఒక శ్లోకం వినిపించాడు . ఆ శ్లోకం లో పదాల కూర్పు చాలా చిత్రం గా ఉంది .

కోమల మనసుపై మంత్రం లా పని చేశాయి . కొన్ని క్షణాలు నిశ్శబ్దం. కోమల కళ్ళు తెరవలేదు . ఆమె గుండె వేగం కొద్దిగా తగ్గింది .అలసట కూడా తగ్గింది ...మనసును లాలించే ప్రశాంతత .! పన్నాలాల్ పెదవులు నెమ్మదిగా కదిలాయి .

అతడు ఆమె ఎదుట పూర్ణ పద్మాసనం లో కూర్చున్నాడు . అర్థ-నిమీలత నేత్రాలు –అరచేతులు ఒకదానిపై మరొకటి, ఒడిలో ఉన్నాయి . కదిలిన పెదవులపై మంత్రమొకటి నర్తిస్తోంది . లయబద్ధంగా , మంద్రస్థాయి లో వినిపిస్తున్న ఆ మంత్రం అ గదిలో చిరు ప్రకంపనలు సృష్టిస్తోంది . ఆ వైబ్రేషన్స్ ఆమెను ట్రాన్స్ లోకి తీసుకు వెళుతున్నాయి .

నెమ్మది,నెమ్మది గా ఆ మంత్రం శూన్యం లో కలిసి పోయింది మళ్ళీ నిశ్శబ్దం !

అజయ్ పన్నాలాల్ .ఏకాగ్రతకు, మంత్రోచ్చారణకు నివ్వెర పోయాడు .

కోమలా దేవీ !”

కోమల లో కదలిక లేదు . పిలుపుకు ప్రతిస్పందన లేదు.”కోమలా దేవీ!”

“స్వామీ” లోగొంతుక లో సమాధానం. “ ఇప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉంది కదూ ?” బాధ, భయం లాంటి భావనలు నీలో లేవు . అవునా ?”

అవును స్వామీ !” ఆమె స్వరం ఆమెకే చిత్రం గా అనిపించింది ...నూతిలోంచి మాట్లాడినట్లు, “ నేను చెప్పినట్లు చేస్తావా ?”

“చేస్తాను.”

“మాట తప్పవు కదా ?” పన్నాలాల్ స్వరం లో ధ్వనించిన అధికారం.

“తప్పను”

కోమలా దేవి ఓ విచిత్ర అనుభవానికి లోనవుతోంది . ఆమె అస్తిత్వానికి కారణమైన పంచ భౌతిక దేహం ఆమెకు దూరమైనట్లు, కేవలం ఆత్మరూపం గా మిగిలినట్లు అనిపించసాగింది . ఈ వింత అనుభవం ఆమె కెంతో హాయిగా ఉంది . ఆ స్థితి లో నుంచి బయటకు రావలనిపించటం లేదు . అదే మాట పన్నాలాల్ తో అంది .

“స్వామీ! ఏమిటిది? ... దూది పింజెలా గాలిలో తేలిపోతున్నట్లు హాయిగా ఉంది . ఇలాగే ఎప్పటికీ ఉండిపోవాలనిపిస్తుంది. వెనక్కు రావలనిపించటం లేదు.”

ఆమె సమాధానం తో పన్నాలాల్ చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వులో విజయగర్వం. పన్నాలాల్ అసాధారణ ప్రతిభ కు అజయ్ తల తిరిగి పోయింది.

“అయితే నా ప్రయత్నం వృధా కాలేదు తల్లీ. దేవుడు నిన్ను కరుణించాడు . నీకు సమాధి స్థితి కలిగించాడు . నువ్వు లౌకిక బాధల నుండి విముక్తి పొందావు . ఇప్పుడు నీకు కర్తవ్య బోధ చేస్తాను. నువ్వు తప్పక పాటించాలి . కష్టం-నష్టం గురించి ఆలోచించ రాదు . “ స్వరంలో అదే అధికారం.

“అలాగే స్వామీ !”.కోమల స్థిరం గా పలికింది.నిజానికి కోమలది సమాధి స్థితి కాదు. విచిత్ర మానసిక అవస్థ .

సె మీకాన్షస్ స్టేట్ . పన్నాలాల్ తన అద్భుత మంత్ర శక్తి తో , మాటల మహేంద్రజాలంతో సృస్స్టించిన ఇల్ల్యూషన్ .(హెలూసినేషన్ )

(కొన్ని నిర్దుష్టమైన శబ్దాలు మనిషి నాడీ మండలం పై అద్భుతమైన ప్రభావం చూపుతాయి . అలాంటి విలక్షణమైన శబ్దాలు కొన్ని “ఋగ్వేదం” లో ఉదహరించారు . ఈ రచయిత 1977లో TRANSDENTAL మెడిటేషన్ సాధన చేస్తున్నప్పుడు శిక్షకుడి ద్వారా పై విలువైన సమాచారం తెలుసుకున్నాడు . మరో ఆసక్తికరమైన అంశం .—తులసి, తులసీదళం నవలల రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గారు ఆ రెండు నవలలు వ్రాయడానికి ముందు క్షుద్రోపాసనపై

చాలా పరిశోధన చేశారు . ఈ సందర్భంలో దార్కాసా హు అనే ఉపాసకుడిని కలిశారు . క్షుద్రోపా సన కైనా , ముక్తి సాధన కైనా అచంచలమైన ఏకాగ్రత , సంకల్పం, సహనం చాలా అవసరం. ఈ రెండింటి లో పతాకస్థాయికి చేరుకున్నవారు ఒకేలా ఆలోచిస్తారు . పరిణితి చెందిన క్షుద్రోపాసకుడు తన విద్యను ప్రయోగానికి కాకుండా పరిహారానికి ఉపయోగిస్తాడని దార్కాసాహు యండమూరి వీరేంద్రనాథ్ గారి తో అన్నారట. )

ప్రతి క్షణం మనిషిని ప్రభావితం చేసే ప్రకృతి స్వభావం ద్వంద్వం. పగలు-రాత్రి , ఉష్ణం-శీతలం, మంచి-చెడు, ప్రేమ-ద్వేషం ,దైవత్వం-దానవత్వం, సుఖం-దుఖం..... ఇలా చెప్పుకుంటూ పొతే ఇలా ఎన్నెన్నో ! అలాగే ఈ ప్రకృతిలో పాజిటివ్ ఎనర్జీ -నెగటివ్ ఎనర్జీ కూడా ఉన్నాయి . దైవీ శక్తులు( పాజిటివ్ ఎనర్జీ ) మనలో మానవత్వం మేల్కొలిపితే ; క్షుద్రశక్తులు (నెగటివ్ ఎనర్జీ) అమానుషత్వాన్ని ప్రేరేపిస్తాయి .

ఈ రెండు విధాలైన శక్తులకు మనం కనెక్ట్ కావడానికి కొన్ని నిర్దుష్టమైన శబ్దాలు కారణమవుతాయి .వాటిని ఆయా శక్తుల బీజాక్షరాలు అంటారు . సంకల్పం తో, కఠోర సాధన తో ,సహనం తో ఈ బీజాక్షరాలను జపించాలి. అదే తపస్సు. తపస్సు.ద్వారానే ఆ శక్తుల తో సాధకుడు అనుసంధాన మవుతాడు . ఆ శక్తుల స్వరూపం , మహిమ మాటల కందవు .కేవలం అనుభవం తోనే తెలుసు కోవాలి. ఆ శక్తులను ఎప్పుడు, ఎలా ,ఎందుకు ఉపయోగించాలి అన్న అంశం ( ముఖ్యంగా క్షుద్రశక్తులు ) సాధకుడి సంస్కారం, వితరణ పై ఆధారపడి ఉంటుంది.

ఒక్కటి మాత్రం ఒప్పుకోక తప్పదు---మనమో స్పాట్ లైట్ లో ఉన్నాము. మనచుట్టూ ఆవరించిన చీకటి లో ఎన్నో రహస్యాలు , అద్భుతాలు ఉన్నాయి . నవీన విజ్ఞానం సాధనాల సాయం తో వాటిని తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ మన ప్రాచీనులు , మహాజ్ఞానులు కేవలం పరిశీలన తో ,ధ్యానం తో అంతర్ముఖులై ఈ ప్రకృతి అతీత శక్తుల మూ లం తెలుసుకోగలిగారు . దివ్య ఖురాన్ , బైబిల్, భగవద్గీత, వేదాలు, ఉపనిషత్తులు, ఇలాంటి మరెన్నో ప్రాచీన గ్రంధాల్లోని symbolic expressions , statements అధ్యయనం చేస్తే మనిషి ఉనికి, ఈ విశ్వాన్ని నియన్త్రించే మహాశక్తి గురించి కొంత అవగాహన కలగవచ్చు. భారతీయ దర్శన శాస్త్రం-వేదాలు, ఉపనిషత్తులు ( వీటి లోని ప్రక్షిప్తాలను -interpretations-minahaayiste) అనాదిగా మనిషిని సవాలు చేస్తున్న ‘నేను ఎవరిని ‘? అన్న ప్రశ్న కు సమాధానం మనో విశ్లేషణ ద్వారా విశదపరచాయి .

కారణం మనసు ఓ మహాద్భుత శక్తి. పరిశోధనకైనా , పరిశీలనకైనా , ధ్యానానికైనా ఆధారం మానవ మనసు, ,మేధస్సు. మనిషి . మనిషి అస్తిత్వానికీ మూలం మనసే ! ..... పన్నాలాల్ షుగర్ కోటెడ్ పిల్ల్స్ లా తన మంత్రాంగం మృదువైన పదజాలం తో వివరించసాగాడు .

“ చూడమ్మా కోమలా దేవీ ! విక్రం తో నీ వివాహం మూడునాళ్ళ ముచ్చటే అయింది . ఇప్పుడు నీవు ఎవరి కోసం జీవించాలి ? “ ఠాకూర్ సాహబ్ నన్ను వివాహం చేసుకుంది రాహుల్ కోసమే కదా ? అని నీవు అంటావు. నాకు తెలుసు .కానీ—ఆ పసివాడికి రక్ష గా మెరుపు లాంటి చిన్నాన్నలు ఉన్నారు . నాన్నమ్మ ప్రేమ,ఆదరణ ఉన్నాయి .ఎటొచ్చీ నీకే బ్రతుకు భవిష్యత్తు లేవు . పుట్టెడు దిగులుతో , దైన్యం తో బ్రతుకు భారం మోసే కంటే వేరే ఆలోచన చేయ వచ్చు కదా

పుణ్యాత్ముడు . ధన్యజీవి! జీవితాన్ని ఒక సాధన గా , తపస్సు గా భావించిన మహామనీషి ఉత్తముడు నీ భర్త కావడం నీ పూర్వజన్మ సుకృతం . ఆయనతో నీ జీవితం అతి స్వల్పమే అయినా అదొక అపూర్వ వరం ! అలాంటి ? ఏమంటావ్ ?” ప్రశ్నార్థకం గా ఆగాడు .

“అవును స్వామీ “. కోమల ట్రాన్స్ లో ఉండే సమాధానం ఇచ్చింది.

*************************************************. కొనసాగించండి 15