Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

యూ ఆర్ మై డెస్టినీ - 17

పంతులు గారి మాటలకు ఊర్మిళాదేవి "  ఏం మాట్లాడుతున్నారు పంతులుగారు  మళ్లీ ఒకసారి సరిగ్గా చూసి చెప్పండి, మీరు జాతకాలు సరిగ్గా చూసి ఉండరు  మళ్ళీ ఒకసారి చూసి చెప్పండి " అని అంటారు.

"  లేదమ్మా అన్నీ ఒకటికి పది సార్లు శ్రునంగా చూసిన తర్వాతే చెప్తున్నాను,  వీళ్ళ ఇద్దరి పెళ్లి జరగడం అంత మంచిది కాదు " అని అంటారు పంతులుగారు. 

"  పోనీ పరిష్కారాలు లాంటివి ఏమైనా ఉన్నాయేమో చూసి చెప్పండి పంతులుగారు"  అని అడుగుతారు గాయత్రి గారు.

"  లేదమ్మా పరిష్కార లాంటివి కూడా ఏమీ లేవు. ఈ పెళ్లి జరిగితే  ఇంట్లో పెద్ద వాళ్లకి ప్రాణగండం ఉంది " అని అంటారు.

ఆదిత్య కి అక్కడ జరుగుతున్నది అంతా చిరాకు వేసి గాయత్రి వైపు చూసి " అమ్మ ఈ కాలంలో కూడా ఈ జాతకాలు ఇవి ఏంటి ఇద్దరి మనుషులు ప్రేమించుకుంటే చాలు , వారి ఇద్దరి మనసులు కలిస్తే ఎటువంటి సమస్య ఉండదు , ఇలాంటి జాతకాలు లాంటివి అనవసరం"  అని అంటారు.

అక్షయ కూడా ఆదిత్య మాటలకు ఏకీభవిస్తూ "అవును అత్తయ్య ఇవన్నీ కూడా మీరు  నమ్మొద్దు " అని అంటుంది.

" మీరు కొంచెం సేపు ఆగుతారా "  అని గాయత్రి గారి కొంచెం కోపంగా అనడంతో వాళ్ళిద్దరూ కూడా సైలెంట్ గా ఉంటారు.

ప్రేమ్ కి ప్రియా అంటే ఎంత ఇష్టమో గాయత్రి గారికి బాగా తెలుసు. ఇప్పుడు తన కొడుకు ఇష్టపడిన అమ్మాయితోనే తన కొడుకు పెళ్లి జరుగుతుంది అని  ఎంతో సంతోషపడ్డారు అంతలోనే ఇలా జాతక దోషాలు రావడంతో ఏమి చేయాలో ఆవిడకి అర్థం కావడం లేదు.

తన కూతురు పెళ్లి చూడాలి అని ఎన్నో ఆశలు కన్నా జగదీష్ చంద్ర  ఇంకా సునంద గారికి, పంతులు గారి మాటలు  వినగానే ఎంతో బాధ కలుగుతాయి.

ప్రియా తన మనసులో ' బహుశా ఆ కృష్ణయ్య నా మొర ఆలకించినట్లు ఉన్నాడు అందుకే మా జాతకాలు కలవకుండా చేసినట్లు ఉన్నాడు'  అని అనుకుంటుంది. 

ప్రేమ్ ప్రియా వైపు చూసి " పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు నీ చిట్టి బుర్రలో,  ఈ జాతకాలు అవి కూడా నేను నమ్మను నేను నిన్ను ప్రేమిస్తున్నాను మన ఇద్దరి పెళ్లి కచ్చితంగా జరుగుతుంది అన్నది నా గట్టి నమ్మకం"  అని అంటాడు.

" నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను అయితే ఈ జాతకాలు నమ్ముతాను మన ఇద్దరి పెళ్లి మా నానమ్మ కి  గండంగా మారితే నేను ఈ పెళ్లి చేసుకోను"  గట్టిగా చెప్తుంది ప్రియా.

' నా మనవరాలు పెళ్ళికి ఒప్పుకుంది అందులో నూ నా మనవడు అంటే దానికి ఇష్టం ఉన్నట్లు అనిపిస్తుంది , దాని మనసు మారి ఈ పెళ్లి జరుగుతుంది అనే లోపు  ఇప్పుడు ఏంటి ఇలా జరుగుతుంది ఇప్పుడు కాని ఈ పెళ్లి జరగకపోతే నా మనవరాలు ఇంకెప్పుడూ పెళ్లి చేసుకోదు ఈ పెళ్లిని ఎలాగైనా జరిపించి తీరాలి,  ఎలాగో ఈ ముసలి ప్రాణం రేపో మాపో పోయేదేగా ' అని తన మనసులో  అనుకుంటారు.

" పంతులుగారు వీరిద్దరి జాతకం ప్రకారం పెద్దవారికి దోషం తప్ప ఇంకేమీ ఇతర సమస్యలు ఉండవు కదా"  అడుగుతుంది ఊర్మిళాదేవి.

పంతులు ఒకసారి నితిన్ ఇంకా అరుణ్ వైపు చూసి వెంటనే చూపు తిప్పుకుంటూ " లేదమ్మ ఇంకేమీ ఉండదు అదొక్కటే"  అని చెప్తాడు.

పంతులుగారు నితిన్ ఇంకా అరుణ్ వైపు ఒక క్షణం చూసి అతని చూపు తిప్పుకున్న ఎవరు అంతగా గమనించక పోయినా  అతని మొహం లోని తేడా ప్రేమ్ ఇంకా నిఖిల్ గమనిస్తారు.

" ఏం పర్వాలేదు పంతులు వీళ్ళ ఇద్దరి పెళ్ళికి మంచి ముహూర్తం చూడు"  అని ఊర్మిళాదేవి అంటారు.

ఆ మాట వినగానే అందరూ షాక్ అవుతారు. గాయత్రి ఇంకా జగదీష్ చంద్ర గారు వెంటనే " అమ్మ ఏం మాట్లాడుతున్నావ్ నీకైనా అర్థమవుతుందా"  అని కోపంగా అంటారు.

" ఏం పర్వాలేదు రా పెద్దవారికే కదా గండం, ఈ ఇంటికి పెద్ద దిక్కు నేనే కదా,  అందులోను నా మనవడు మనవరాలు సంతోషంగా ఉంటే ఎక్కడున్నా సరే నేను చాలా హ్యాపీగా ఉంటాను,  ఈ రకంగా అయినా మీ నాన్నగారి దగ్గరికి వెళ్లే అవకాశం తొందరగా వస్తుందేమో నాకు " అని అంటారు ఊర్మిళా దేవి గారు.

ఆ మాటలు వినగానే గాయత్రి గారు ఏడుస్తూ "అమ్మ ఇంకెప్పుడు కూడా అలా మాట్లాడద్దు ఇప్పటికే నాన్నగారికి దూరమయ్యాను నీకు నేను దూరం అవ్వలేను అమ్మ"  అని అంటారు ఊర్మిళాదేవి గారిని హగ్ చేసుకుంటూ.

" నేను ఎక్కడికి వెళ్తానే ఒకవేళ పోయిన మళ్లీ నా మనవరాలు కడుపులోనే పుడతాను చూసుకో"  అని అంటారు.

జగదీష్ చంద్ర కొంచెం కోపంగా "  అమ్మ పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దు ఈ పెళ్లి జరగడం లేదు"  అని అంటాడు.

ఆ మాట వినగానే నితిన్ ఇంకా అరుణ్ మొహాల్లో ఏదో గెలిచాము అన్న ఫీలింగ్. ఎవరికీ కనపడకుండా ఇద్దరు షేక్ అండ్ ఇచ్చుకుంటారు.
ఓ కంట వారి ఇద్దరినీ గమనిస్తున్న ప్రేమ్ ఇంకా నిఖిల్ దానిని చూస్తారు.

ప్రియా కూడా వెంటనే మాట్లాడుతూ " అవును నానమ్మ నేను ఈ పెళ్లి చేసుకోవడం లేదు,  నేను పెళ్లికి ఒప్పుకుందే నువ్వు, నాన్నగారు సంతోషంగా ఉంటారని , ఇలా ఇప్పుడు నీకు ప్రమాదం అని తెలిసాక నేను ఈ పెళ్లి ఎలా చేసుకుంటాను అనుకుంటున్నావు, నేను ఈ పెళ్లి చేసుకోను "అని గట్టిగా అంటుంది.

" అలా అనకే చిట్టి తల్లి ఈ ప్రాణం పోయే లోగా నీ పెళ్లి చూసి పోదాం అని అనుకున్నాను,  నా ఈ చివరి కోరిక తీర్చవే నీకు పుణ్యం ఉంటుంది " అని అంటారు ఊర్మిళాదేవి గారు.

" లేదు నానమ్మ నీ ప్రాణాలకి గండం అని తెలిసి కూడా నేను ఈ పెళ్లి ఎలా చేసుకుంటాను అనుకుంటున్నావు నేను చేస్తాను " అని కళాఖండిగా చెప్పేస్తుంది ప్రియా.

ప్రేమ్ ప్రియా వైపు వంగి తనకు మాత్రమే వినిపించేలాగా  "  బంగారం ఈ పంతులు గారిని గాని నువ్వు కొనేశావా ఏంటి నిజం చెప్పు , ఇలా చెప్పమని " అని కళ్ళు ఎగరేసి అడుగుతాడు.

ఆ మాటకి ప్రియా,  ప్రేమ్ వైపు కోపంగా చూసి "ఒకవేళ చెప్పిచ్చిన ఇలా ప్రాణ  గండాలు అని మాత్రం చెప్పించేదాన్ని కాదు ఎందుకంటే మా నాన్నమ్మ అంటే నాకు బాగా ఇష్టం"  అని కొంచెం కోపంగానే అంటుంది.

ప్రియా మాటలకి ప్రేమ్ ఆలోచనలో పడుతూ ' ఇది నా బంగారం ప్లాన్ కాదు , నా బంగారానికి అమ్మమ్మ అంటే చాలా ఇష్టం,  ఇలా మా పెళ్లి ఆపడం కోసం అమ్మమ్మ కి గండం అని అయితే పంతులు గారితో చెప్పించదు , ఇది నితిన్ ఇంకా అరుణ్ చేశారన్నమాట , ఓకే నేను చూసుకుంటాలే ' అనుకుంటాడు 

ప్రేమ్ ఊర్మిల దేవి వైపు చూసి " నానమ్మ నీ చివరి కోరిక నేను తీరుస్తాను కదా ఏమి భయపడకు , అలాగే నీ మనవరాలిని పెళ్లి చేసుకున్న తర్వాత సంవత్సరం తిరక్కుండానే  తాతయ్య కానీ నీ చేతిలో పెడతాము అప్పుడు మీ ఆయనతో కలిసి ఇక్కడే అందువు గాని , ఆయన కోసం నువ్వే అక్కడికి వెళ్లాల్సిన అవసరం అయితే రాదులే "  అని ఆవిడకి భరోసా ఇచ్చి .
పంతులు గారి వైపు చూసి ఒక ఈవిల్ స్మైల్ ఇస్తాడు. 

షర్ట్ చేతులు మడత పెడుతూ పంతులుగారి వైపు చూసి " పంతులు నువ్వు చెప్పేది అంతా నిజమేనా నిజంగా మా జాతకాల్లో దోషాలు అన్నాయా"  అని అడుగుతాడు .

పంతులు కండలు తిరిగిన ప్రేమ్ బాడీ వైపు చూసి భయపడుతూ గుటకలు మింగుతూ "ని..నీ.. నీజమే చెప్పానండి"  తడబడుతూ అంటాడు.

జగదీష్ చంద్ర ప్రేమ్ వైపు చూసి " వీళ్ళ కుటుంబం తరతరాలుగా మన ఇంట్లో ఏ శుభకార్యం అయినా సరే వీరి కుటుంబస్తులే మంచి ముహూర్తాలు పెడతారు ప్రేమ్ " అని చెప్తారు.

ప్రేమ్ జగదీశ్ చంద్ర వైపు చూసి " మావయ్య మిమ్మల్ని తక్కువ చేయాలని కాదు,  నాకెందుకో ఇంకొక పంతుల్ని కూడా పిలిపించి మరొకసారి మా జాతకాలు చూపించాలని నాకు అనిపిస్తుంది"  అని అంటాడు.

నితిన్ పంతులు వైపు చూసి కోపంగా కళ్ళు ఎర్రవి చేసి మాట్లాడమన్నట్లు ఉంటాడు .
పంతులుగారు కొంచెం కోపంగా పైకి లేచి " అంటే ఏమిటండీ మీ ఉద్దేశం, నేను మీకు తప్పుడు సమాచారం ఇస్తున్నాననా.  తరతరాలుగా మా కుటుంబ సభ్యులు మీ కుటుంబానికి ఎన్నో శుభకార్యాలు ఇంకా మంచి దివ్యమైన ముహూర్తాలు చూసి పెట్టారు , మీరు చేసే  ప్రతి హోమాల్లో మీకు తోడు ఉన్నారు .రఘునాథ్ భూపతి గారికి మేము అన్న మా కుటుంబం అన్న ఎంత గౌరవామ్మో తెలుసా, ఇప్పుడు మీరు ఇలా మమ్మల్ని అవమానించడం సవ్యంగా లేదు, రఘునాథ్ భూపతి గారు ఇప్పుడు ఉండి ఉంటే మా మాటల మీద ఎంత నమ్మకం ఉంచేవారు తెలుసా" అని అంటాడు.

తన తండ్రి మాట వినగానే గాయత్రి గారు ప్రేమ్ వైపు చూసి " ఫ్రేమ్ , వీరు అన్నా వీళ్ళ కుటుంబం అన్న నాన్నగారికి ఎంతో గౌరవం.  విలుపెట్టే ముహూర్తాలు అన్నా వీళ్ళు చెప్పే జాతకాల లోని దోషాలు అన్న కూడా నాన్నగారు ఎంతో నమ్ముతారు నువ్వు ఇలా వాళ్ళని అనడం సవ్యం కాదు "  అని అంటారు.

" అది కాదు అమ్మ ఒకసారి చూపించడంలో తప్పు లేదు కదా"  అని అంటాడు ప్రేమ్ అసహనంగా.

ఇంతలా గోపి వచ్చి అయ్యగారు "  రామచంద్ర శాస్త్రి గారు వచ్చారండి మిమ్మల్ని కలవాలి అని అంటున్నారు" అని చెప్తాడు.

ఆ మాట వినగానే పంతులుగారు ఒకేసారి షాక్ అయ్యి "ఏంటి తాతయ్య గారు వచ్చారా " అని కంగారు పడతాడు.

ఊర్మిళాదేవి గారు వెంటనే గోపి వైపు చూసి "ఆయనని బయటే నిలబెట్టావా తొందరగా లోపలికి తీసుకురా"  అని అంటారు.

ఐదు నిమిషాల తర్వాత కర్ర సహాయంతో ఒక 87 ఏళ్ల ముసలాయన లోపలికి వస్తాడు.

ఈయన ఆ రాష్ట్రంలోనే ఎంత పేరు మోసిన శాస్త్రి గారు, ఈయన భవిష్యత్తు కూడా చెప్పగలరు . ఈయన ఎప్పుడూ అందరితో నవ్వుతూ సరదాగా ఉంటాడు , ఈయన మాటలు కూడా కొంచెం గమ్మత్తుగా అనిపిస్తూ ఉంటాయి అందరికీ ,కానీ ఆయన చెప్పే ప్రతి దాంట్లోనూ అర్థం పరమార్థం ఉంటుంది. 
ఈయన ఈ మధ్యకాలంలో ఎవరికీ కూడా జాతకాలు చూడడం కానీ ముహూర్తాలు పెట్టడం కానీ చేయడం లేదు.  ఈయన పెట్టిన ముహూర్తానికి తిరగ ఉండదు అని అందరూ అంటూ ఉంటారు. 

రఘునాథ్ భూపతి గారు ఆ కాలంలో ఎటువంటి కార్యం మొదలు పెట్టిన ముందుగా ఈయన సలహానే తీసుకునేవారు , ఈయన పెట్టిన ముహూర్త పలం వల్ల ఆయనకి సిరి సంపదలు వచ్చి పడ్డాయి అని అందరూ నమ్ముతారు. ఈయన ఎదుటి వారి మొహం చూసి వారి జాతక దోషాలు జాతక ఫలాలు అన్నీ కూడా ఇట్టే చెప్పగలరు. ఈయన చెప్పినవి చెప్పినట్లు జరుగుతాయి. 

ఆయనని చూసి జగదీష్ చంద్ర వెల్లి ఆయనకి సహాయం చేస్తూ  సోఫాలో కూర్చో పెడతాడు.

రామచంద్ర శాస్త్రి గారు ఊర్మిళాదేవి వైపు చూసి  "బాగున్నారా అమ్మ " అని అడుగుతాడు.

" బాగున్నాను శాస్త్రి గారు,  మీరు ఇప్పుడు ఈ సమయంలో ఇలా రావడానికి గల కారణం"  అని అడుగుతారు ఊర్మిళాదేవి గారు.

ఆయన చిరునవ్వు చిందిస్తూ " ఆ కృష్ణయ్య పంపాడేమోనమ్మా నన్ను,  అందుకే వచ్చానేమో , కొందరు చేస్తున్న తప్పులని సరిదిద్దడానికి వచ్చానేమో"  అని అంటారు.

ఆయన మాటలు అక్కడ ఉన్నవారికి కొంచెం గామ్మత్తుగా అనిపిస్తూ ఉంటుంది.

ఊర్మిళాదేవి గారికి ఆయన ఎప్పుడు అలాగే మాట్లాడతారు అని తెలిసి ఆయనతో " వస్తే వచ్చారు గాని సరైన సమయానికి వచ్చారు, కొంచెం మా మనవడు మనవరాల పెళ్ళికి ఒక మంచి ముహూర్తం చూడండి శాస్త్రి గారు"  అని అడుగుతారు.

" ముహూర్తం చూడాలంటే మరి వారి జాతక చక్రాలు కావాలి కదా అమ్మ " అని నవ్వుతూ అడుగుతారు.

" అవి  మీ ముందే ఉన్నాయి శాస్త్రి గారు"  అని చెప్తారు ఊర్మిళాదేవి  గారు.

శాస్త్రి గారు అవి చేతిలోకి తీసుకొని చూస్తూ ఉండగా , పంతులుగారు తడబడుతూ  " తాతయ్య గారండి నే..ను.. ఇప్పుడే.... చూశానండి.... వారి జాతకాలు అంతగా బాగోలేదు..... నేను చూశాను కదా..... ఇంకా మీరు చూడడం.... అవసరం అంటారా"  అని తడబడుతూనే చెప్తాడు.  ఆయనను వొళ్ళంతా చెమటలు పట్టేస్తూ ఉంటాయి.
పంతులు గారు భయపడుతున్న సంగతి అక్కడ అందరూ గమనిస్తూ ఉంటారు.

శాస్త్రి గారు ఆ జాతక చక్రాలు చూసిన తర్వాత తన మనవడి వైపు కోపంగా చూడడంతో " సరే అయితే....మీరు చూడండి... నేను వెళ్తాను " అని అంటాడు .

" నీకు మన  పురోహిత్యం సరితూగదు నాయనా , వెళ్ళు ఇంటికి వెళ్ళు , నువ్వు చేసిన తప్పును సరిదిద్ది ఈ కార్యాన్ని పూర్తి చేసి వస్తాను నీ దగ్గరికి , నీకు ఏది సరైనదో అక్కడ నిర్ణయిస్తాను " అని కొంచెం గట్టిగా అంటాడు.

రామచంద్ర శాస్త్రి గారి మాటలకు తల దించుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతారు పంతులుగారు. ఆయన వెళ్తూ వెళ్తూ నితిన్ ఇంకా అరుణ్ వైపు ఒకసారి చూసి  వెళ్ళిపోతాడు.

ఇప్పుడు ఏం చేద్దాం అన్నట్లు నితిన్ ఇంకా అరుణ్ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. 

రామ చంద్ర శాస్త్రి గారు ఊర్మిళాదేవి గారి వైపు చూసి రెండు చేతులు జోడించి " నన్ను క్షమించండి అమ్మ " అని అంటాడు. 

ఆయన జీవితకాలంలో ఎవరికి క్షమాపణలు చెప్పిన దాహనాలు లేవు. ఇప్పుడు ఆయన ఊర్మిళాదేవికి క్షమాపణలు చెప్పడంతో ఆశ్చర్యపోయి ఆయన రెండో చేతుల పట్టుకుని " అయ్యో శాస్త్రి గారు మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి?"  అని అడుగుతారు ఊర్మిళాదేవి గారు. 

"నా మనవడు చేసిన తప్పిదానికి అమ్మ" అని అంటారూ.

ఆయన మాటలు అక్కడ ఉన్న చాలామందికి అర్థం కావు. 
ఆయన అందరి వైపు తిరిగి మాట్లాడుతూ " వీరి ఇద్దరి జాతకాలు బేషుగ ఉన్నాయి ఇటువంటి జాతకాలు కోటిలో ఒకరికి  ఉంటుంది , ఇది ఆ కృష్ణయ్య కలిపిన జంట , వీరి జాతకాల్లో ఎటువంటి దోషాలు లేవు , వీరి వివాహ బంధం చాలా బాగుంటుంది, ఈ పిల్ల జాతకం ఈ ఒక్క అబ్బాయితో తప్ప ఈ ప్రపంచంలో ఎవరితోను సరితూగదు, ఈ పిల్ల తన జీవితంలో ఎదురుకొనే ప్రతి సమస్య ప్రతి గండం ఈ పిల్లాడి తోనే ముడిపడి ఉంటుంది, ఇతను మాత్రమే ఈ పిల్లని కాపాడగలడు , వీరి ఇరువురి కలయిక చాలా గొప్పది అమ్మ "అని అంటాడు.

ఆయన చెప్పింది విని అందరూ సంతోషపడతాడు ప్రియా అయితే షాక్ అయ్యి మరి చూస్తుంది. 

ఊర్మిళాదేవి చాలా సంతోష పడిపోతూ " చాలా మంచి విషయం చెప్పారు శాస్త్రి గారు అలాగే వీరి పెళ్లికి , నిశ్చితార్థానికి ముహూర్తం చూసి పెట్టండి"  అని అడుగుతుంది.

శాస్త్రి గారి నవ్వుతూ " వీరి నిశ్చితార్థానికి ఈరోజు మొత్తం కూడా చాలా బాగుంది అమ్మ , ఈరోజు 11:50 నిమిషాలకి వీరికి నిశ్చితార్థం చేస్తే ఆ బంధాన్ని ఎవడు విడదీయలేరు  , అలాగే వీళ్ళ పెళ్లి విషయం అంటారా"  అని ఒక నిమిషం ఆగి పంచాంగం తిరగేస్తూ " వచ్చేనెల తొమ్మిదో తారీకు తెల్లవారుజాము 3:45 నిమిషాలకి పెళ్లి ముహూర్తం , అదే రోజు 12 గంటలకి సత్యనారాయణ స్వామి వ్రతం అదే రోజు రాత్రి 11 గంటలకు కార్యం పెట్టుకోవచ్చు "అని అంటారు.

ఆయన చెప్పిన మాటలకి అందరూ సంతోషపడితే ప్రియా మాత్రం 'ఈయన ఏంటి పెళ్ళికి ముహూర్తం పెట్టరా బాబు అంటే ఏకంగా ఫస్ట్ నైట్ కి కూడా ముహూర్తం పెట్టేసాడు'  అని అనుకుంటుంది తన మనసులో.

ప్రేమ్,  ప్రియ నీ చూసి తన వైపు వంగి తనకు వినిపించేలాగా "ఏంటి బంగారం మందు పెళ్లి గురించి ఆలోచించకుండా, అప్పుడే ఫస్ట్ నైట్ గురించి ఆలోచిస్తున్నావ్ "  అని కన్ను కొడతాడు.

ప్రియా ప్రేమ్ వైపు ఆశ్చర్యంగా చూసి" నేను మనసులో అనుకున్నవన్నీ  నీకు ఎలా తెలుస్తున్నాయి రా ప్రతిసారి"  అని అడుగుతుంది.

" నువ్వు శాస్త్రి గారు చెప్పినవి పూర్తిగా వినలేదు అనుకుంటా,  మనది ఆ కృష్ణయ్య కలిపిన జంట అంట విన్నావా , అందులోనూ కోటిమందిలో ఉంటుందంట మనలాంటి జాతకాలు , అందుకే నువ్వు ఏమనుకున్నా నాకు ఇట్టే తెలిసిపోతాయి " అని అంటాడు.

ప్రేమ్ తో మాట్లాడటం వేస్ట్ అని అనుకొని ఈ పెళ్లిని ఎలా ఆపాలి అని తనలో తాను ప్లాన్స్ వేసుకుంటూ ఉంటుంది ప్రియా.

" ఏంటి బంగారం ఈ పెళ్లి ఎలా ఆపాలి అని ప్లాన్స్ వేసుకుంటున్నావా?  పాపం నీకు తెలియకుండా నీ ఫ్రెండ్స్ ఆ పంతులు గారితో అబద్ధం చెప్పించారు ఈ పెళ్లిని ఆపాలని కానీ అది బెడిసి కొట్టింది " అని అంటాడు ప్రేమ్.

ప్రియ , ప్రేమ్ చెప్పిన దానికి అయోమయంగా చూస్తుంటే, ప్రియా తలని నితిన్ ఇంకా అరుణ్ వైపు తిప్పుతాడు ప్రేమ్. వారి ఇద్దరి మొహాలు నెత్తురు చుక్క లేనట్లు తెల్లగా పాలిపోయి షాక్ లో ఉన్నట్లు కనిపిస్తూ ఉంటాయి. 
" పాపం నీకు సహాయం చేద్దామని ఆ పంతులు గారితో అలా గండం ఉంది అని అబద్ధం చెప్పించారు,  కానీ ఆ పంతులు గారి తాతయ్య వచ్చి నేను సాల్వ్ చేయకుండానే నా ప్రాబ్లం సాల్వ్ చేశాడు.  పాపం ఇంటికి వెళ్ళాక ఆ పంతులుగాడి పరిస్థితి ఏంటో" అని అంటాడు ప్రేమ్.

ప్రేమ్ వైపు తిరిగి " వాళ్లే చేశారూ  అని నీకు ఎలా తెలుసు"  అని అడుగుతుంది.

" ఒకసారి తర్వాత నువ్వే అడిగి చూడు నేను చెప్పింది కరెక్టో కాదో నీకే తెలుస్తుంది"  అని అంటాడు ప్రేమ్.

శాస్త్రి గారు మరొకసారి క్షమించమని ఊర్మిళాదేవిని అడుగుతాడు ఊర్మిళాదేవి గారు అయినని "అయ్యో అలా అనకండి శాస్త్రి గారు మీరు పెట్టిన ముహూర్తానికి  తిరుగు ఉండదని నాకు తెలుసు, ఈరోజు మిమ్మల్ని పిలుద్దాం అని అనుకున్నాను కానీ మీరు ఈ మధ్యకాలంలో ఎవరి జాతకాలు, ముహూర్తాలు  చూడట్లేదు అని తెలిసి చాలా బాధపడ్డాను. ఆ కృష్ణయ్య మిమ్మల్ని ఈరోజు ఇలా పంపించి ఉంటాడు అందుకే  ఇంత  మంచి విషయం వినకలిగాను నా మనవడి మనవరాలు పెళ్ళి చూడగలుగుతాను " అని అంటారు.

శాస్త్రి గారు గాయత్రి గారి వైపు చూసి " అమ్మ ఇన్నాళ్లుగా నీ కుటుంబానికి దూరమై ఉన్నాము, ఇకమీదట అలా చెయ్యకు తల్లి , ఇక పైన అందరూ కలిసే ఉండండి అప్పుడే ఇరు కుటుంబాలకి చాలా మంచిది , మందు వచ్చే సమస్యలు మీరు కలిసి ఉంటేనే తీరుతాయి తల్లి " అని అంటారు.

గాయత్రి గారు "  సమస్యల ? , సమస్యలు అంటే ఎటువంటివి శాస్త్రి గారు " అని అడుగుతారు.

శాస్త్రి గారు ప్రియా ఇంకా ప్రేమ్ వైపు చూస్తారు.
వాళ్లు ఇద్దరూ ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు.
శాస్త్రి గారు వల్ల వైపు చూస్తూ " ఆ పిల్ల నీ కోడలుగా రావడం నువ్వు ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం తల్లి,  ఆ పిల్ల నీ కుటుంబానికి రక్షణగా నిలుస్తుంది , ఆ పిల్ల నీ కొడుకుని చేసుకుంటేనే , ఆ మాంగల్య బలం వల్ల , నీ కొడుకు గండం నుంచి బయటపడి సురక్షితంగా ఉండగలడు , అలాగే ఆ పిల్ల దోషాలు కూడా ఆ పిల్లోడు జాతకం తోనే ముడిపడి ఉన్నాయి." 

ఆయన అలా చెపుతూ ఉంటే ఊర్మిళాదేవి గారు జగదీష్ చంద్ర , సునంద , గాయత్రి ఇంకా గుర్దీప్  వాళ్ల పిల్లలు వైపే చూస్తూ ఉన్నారు . ప్రేమ్ ఇంకా ప్రియా చాలా సంతోషుంగ మాట్లాడుతూ కనిపించారు.

శాస్త్రి గారు మట్లాడుతూ "ఇ కుటుంబానికి ముందు రాబోయే సమస్యలు అన్నీ కూడా ఆ పిల్ల వల్లే తీరుతాయి, అలాగే ఆ పిల్లాడు మాత్రమే ఆ పిల్లని సురక్షితంగా ఉంచగలడు " అని సాలోచనగా చెప్తాడు.

శాస్త్రి గారు జగదీష్ చంద్ర వైపు చూసి "చంద్ర ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోను జరిగితీరాలి ఎవరు ఏమి చెప్పినా ఈ పెళ్లిని మాత్రం ఆపద్దు. నీ కూతురి జాతకం ప్రకారం దగ్గరలో ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది ,  నీ కూతురు అందులో నుంచి బయటపడాలి అంటే ఈ పెళ్లి జరిగి తీరాలి, అలాగే నీ కూతురికి  ఉన్న సమస్యలు అన్నీ కూడా ఆ పిల్లాడి వల్లే నయమవుతాయి"  అని చెప్తారు.

ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది అని వినగానే ఊర్మిళాదేవి ఇంకా అందరూ కొంచెం కంగారు పడతారు. శాస్త్రి గారు వారి కంగారు గమనించి " కంగారు పడకండి అన్ని సమస్యలకు ఈ పెళ్లి మార్గం చూపిస్తుంది"  అని చెప్తారా.

శాస్త్రి గారు మాటలకి వాళ్లు కొంచెం ఆలోచనలో పడతారు.

గాయత్రి గారు ఏదో మాట్లాడే లోగా శాస్త్రి గారే మాట్లాడుతూ "  నీ భర్త త్వరలోనే నడవగలుగుతాడు తల్లి అది కూడా ఆ పిల్ల వల్లే " అని అంటాడు. 

తన భర్త నడవ గాలుగుతాడు అని తెలుసుకోగానే గాయత్రి గారు చాలా సంతోషపడతాడు 
" అలాగే ఇకపైన ఈ కుటుంబం విడిగా ఉండకూడదు"  అని శాస్త్రి గారు కొంచెం గట్టిగానే చెప్తారు.

" అవునక్కా ఇకమీదట అందరం కలిసే ఉందాం"  అని అడుగుతాడు జగదీష్ చంద్ర గాయత్రి గారిని బతిమాలతు .

ఊర్మిళాదేవి గారు కూడా గుర్దీప్ వైపు చూస్తూ " ఒప్పుకోండి అల్లుడుగారు, ఈ ముసలితనంలో నా కూతురికి  దూరంగా ఉండాలని నేను అనుకోవడం లేదు,  నా ఈ కోరిక తీర్చండి" అని అడుగుతారు.

గాయత్రి గారు ఏదో ఆలోచిస్తుంటే శాస్త్రిగారు మళ్ళీ మాట్లాడుతూ " ఆలోచించకు తల్లి ఇది నీ కుటుంబ శ్రేయస్సు కోసమే నేను చెప్తున్నాను మీరు ఇకమీదట ఈ ఇంట్లోనే నీ తమ్ముడితో కలిసి ఉండాలి"  అని అంటారు.

ఆయన మాటలకు గాయత్రి గారు తన భర్త వైపు చూస్తారు ఆయన కూడా సరే అన్నట్లు తలకాయ ఉపడంతో " సరే శాస్త్రి గారు " అని అంటారు.

అది వినగానే ఊర్మిళాదేవి ఇంకా జగదీష్ చంద్ర చాలా సంతోష పడిపోతారు వాళ్ళు ఎలాగైనా సరే గాయత్రి గారిని వారి కుటుంబాన్ని, వారి దగ్గరే ఉంచుకుందాం అని అనుకుంటారు ఇలా శాస్త్రి గారి వల్ల ఆ కోరిక నెరవేరడంతో ఎంతో సంతోషపడతారు..


కొనసాగుతుంది....

***
తపుళ్లు ఏమైనా రాసి ఉంటే క్షమించగలరు.