Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

యూ ఆర్ మై డెస్టినీ - 7

అరగంట ముందు: 

కార్ల వెళ్తుండగా గాయత్రి గారు వెనక్కి తిరిగి చూసి డ్రైవ్ చేస్తున్న ఆదిత్య అని "  పెద్దోడా చిన్నోడేంటి మన వెనకాలే వచ్చినట్టు ఉన్నాడు ఇప్పుడు కనిపించట్లేదు " అని అడుగుతుంది.

' ఏం చెప్పను మమ్మీ వాడు టెన్షన్స్ వాడివి. వాడి పిల్ల ఎక్కడ దూరం అయిపోతుందో అని వాడి భయం వాడిది  , నిన్ను డైవర్ట్ చేసి వాడు దాని ప్రియా కోసం వెళ్ళాడు 'అని తన మనసులో తాను అనుకున్నాడు ఆదిత్య.

ఆదిత్య ఏదో చెప్పేలోపు గురుదీప్ మాట్లాడుతూ 
" వెనక కాదు నందు ముందు  చూడు"  అని అన్నాడు.

ప్రేమ్ కార్ వాళ్ల ముందుగా వెళుతుంది. 

ఆదిత్య కొంచెం ఆశ్చర్యపోతూ ' ఇదేంటి వీడు ప్రియ ఇంటికి వెళ్తానని చెప్పి నా ముందు వెళ్తున్నాడు ...మర్చిపోయాను ప్రియా వాళ్ళ ఇంటికి  వెళ్లే దరి కూడా ఇటువైపే ఉంది కదా'  అని అనుకున్నాడు ఆదిత్య.

అక్షయ కూడా ప్రేమ్ కారు ముందు వెళ్లడం చూసి ఇది ప్రియా వాళ్ళ ఇంటికి వెళ్లే దారి అని తను కూడా గమనించింది.

ఆదిత్య కొంచెం కారు స్లో చేశాడు ఎందుకంటే ఈ లోపల  ప్రేమ్ కార్ ముందుకు వెళ్ళిపోతుందని.

ఈ లోపల సిగ్నల్స్ పడడంతో ప్రేమ్ కార్ ముందుకు వెళ్ళిపోయింది ఆదిత్య కార్ సిగ్నల్ దగ్గర ఆగిపోయింది.

గాయత్రి తన  భర్త వైపు చూస్తూ " ప్రేమ్ కి అడ్రస్ ముందుగానే చెప్పావా నువ్వు"  అని అడుగుతారు. 

ఆయన కొంచెం ఆలోచించుకొని " లేదు నందు నేను చెప్పలేదు  " అని అంటారు. 

" అయ్యో వాడు ముందుకి వెళ్ళిపోయాడు కదండీ ఇప్పుడు ఎలాగా , అడ్రస్ వాడికి తెలియదు కదా ,మళ్లీ దారి తప్పిపోతే ఎలాగా,  ముందు వాడికి ఫోన్ చేసి కార్ ఆపమని చెప్పండి"  అని అంటారు గాయత్రి.

" ఏం పర్వాలేదులే నేను వాడికి అడ్రస్ మెసేజ్ చేస్తాను ఉండు " అని తన ఫోన్ తీసుకొని అడ్రస్ ప్రేమ్ కి మెసేజ్ చేశాడు ఆయన.

ఇంతలో గ్రీన్ సిగ్నల్ పడింది. 

ఆదిత్య కార్ ముందుకు పోనిస్తూ " అవును మమ్మీ మనం  ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నాము నైట్ సడన్గా వచ్చి రేపు మనం ఒక చోటికి వెళ్లాలి అని చెప్పావు ,ఎక్కడికి అని అడిగితే సర్ప్రైజ్ అని చెప్పావు  ఇప్పటికైనా చెప్పొచ్చు కదా "  అని అడిగాడు.

గురుదీప్ గాయత్రి వైపే చూసి"  మీ అమ్మ ఈరోజు కోసం ఎన్నో సవత్సరాలు ఎదురుచూసింది ఆది , నాకోసం అన్ని వదులుకొని వచ్చేసింది , తనకి అన్నీ ఇవ్వగలిగాను కానీ తను కోరుకున్న తన వాళ్ల ప్రేమని  మాత్రం ఇవ్వలేకపోయాను, ఇన్నాళ్ళకి తను చేసిన ప్రార్థనలు అన్నీ తీరబోతున్నాయి ఈరోజు తన వాళ్ళని కలవబోతోంది మీ అమ్మ" అని అంటారు. 

అక్షయ సంతోషంగా "  వావ్ అత్తయ్య అంటే ఈరోజు మీరు మీ ఫ్యామిలీని కలవబోతున్నారన్నమాట"  అని అంటుంది.

అక్షయకి వాళ్ళ అత్తయ్య గారిది లవ్ మ్యారేజ్ అని తెలుసు అప్పట్లో ఫ్యామిలీని ఎదిరించి మావయ్య గారితో వచ్చేసారు అని తెలుసు . ఇప్పుడు వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీని కలవ పోతున్నారు అని తెలిసి తన కూడా ఎంతో సంతోషపడింది.

" అవును తల్లి,  వాళ్ల  నా కోసం ఇన్నాళ్లుగా వెతుకుతున్నారన్న విషయం నాకు తెలియలేదు , తెలిసి ఉంటే ఏనాడో వాళ్ళతో కలిసి పోయే దాన్నేమో"  అని కొంచెం బాధగా అనింది ఆవిడ.

ఆదిత్య కూడా తన సంతోషాన్ని చూపిస్తూ " నాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది మామ్ అంటే ఇప్పుడు నేను మా అమ్మమ్మ తాతయ్యని కలవ పోతున్నాను అన్నమాట " అని అంటాడు.

గాయత్రి గారి కొంచెం డల్ అవుతారు. 

అది గమనించిన ఆదిత్య " ఏమైంది మామ్ అలా డల్ అయిపోయావు" అని అడుగుతాడు.

గురుదీప్ మాట్లాడుతూ" మీ తాతయ్య గారు 
టూ ఇయర్స్ బ్యాక్ చనిపోయారు నాన్న"  అని చెబుతాడు ఆయన గొంతు లో బాధ స్పష్టంగా తెలుస్తుంది.
గాయత్రీ కళ్ళలో కూడా బాధ తొంగి చూస్తుంది.
గాయత్రికి ఇ విషయం నిన్న నైట్ తెలుస్తుంది వాళ్ల నాన్నగారిని చివరి చూపు కూడా చూసుకోలేకపోయాను అని చాలా బాధపడతారు ఆవిడ,  నైట్ మొత్తం ఏడుస్తూనే ఉన్నారు.గురుదీప్ గారు ఆవిడని నార్మల్ చేయడానికి చాలా కష్టపడ్డారు.

వాళ్ల అత్తయ్య గారు బాధపడడం చూసిన అక్షయ గాయత్రి గారిని హగ్ చేసుకుంటుంది. " అత్తయ్య ప్లీజ్ డోంట్ క్రై , మీరు బాధపడడం నేను చూడలేను " అని అంటుంది.

ఆదిత్య కార్ కొంచెం సైడ్ కి ఆపి వాళ్ళ అమ్మ వైపు చూస్తాడు. ఆవిడ కళ్ళల్లో ఉన్న నీరు చూసి ఆదిత్యా కూడా బాధపడతాడు.

భార్య కళ్ళల్లో నీరు చూసి తట్టుకోలేక పోతారు  గురుదీప్ " నందు .. ప్లీజ్ కంట్రోల్. జరిగిపోయిన దానిని మనం మార్చలేము కదా." అని అంటారు.

అక్షయ కూడా వాళ్ళ అత్తయ్య గారి బాధను చూసి తను బాధపడుతుంది , అక్షయ బాధపడటం చూసినా గాయత్రీ గారు కడుపుతో ఉన్న పిల్లని బాధ పెట్టడం ఇష్టం లేక తనని తాను నార్మల్ చేసుకుంటూ  " నేను బాగానే ఉన్నాను తల్లి" అక్షయకి చెబుతుంది.

ఆవిడా తన గుండెల్లోనీ బాధని అదమకొంటూ కళ్ళు తుడుచుకుంటూ "  అవును జరిగిపోయినవి మనం మార్చలేము కదా,  అయినా ఈరోజు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను నా తమ్ముడిని ఇన్నాళ్ళకి కలవబోతున్నాను " అని చెబుతుంది.

గాయత్రీ నార్మల్ అవడం చూసి  గురుదీప్ కొంచెం రిలాక్స్ అవుతాడు.

కార్ ఆపిన ఆదిత్య వైపు చూసి " నువ్వేంట్రా కార్ ఆపావు,  త్వరగా పోనీ ఇన్నాళ్లుగా వాళ్ల కోసం ఎదురు చూశాను ,ఇంకా ఆగలేను నేను , మా తమ్ముడిని మా అమ్మని వెంటనే చూడాలి " అని చెబుతుంది గాయత్రి. 

వాళ్ళ అమ్మ నార్మల్ అవ్వడం చూసి ఆదిత్య  నవ్వుకుంటూ "ఒకే మా " అని అంటూ కార్ స్టార్ట్ చేస్తాడు.

గాయత్రి గారు వాళ్ళ ఫ్యామిలీని కలవబోతున్నారు అన్న సంతోషంలో  తన అమ్మ , తమ్ముడి గురించి చెబుతూ ఉంటారు. 
" నీకు తెలుసా పెద్దోడా నాకు ఒక్కడే తమ్ముడు అసలు చిన్నప్పుడు మేము ఎంత అల్లరి చేసేవాళ్లం తెలుసా , మా నాన్న గారేమో నాకు ఎప్పుడూ సపోర్ట్ ఇస్తూ ఉండేవారు , పాపం నేను తప్పు చేసిన మా తమ్ముడికి పడేవి తన్నులు , వాడికి నేనంటే ప్రాణం. కానీ అనుకోని పరిస్థితుల వల్ల , వాళ్ల అందరికీ దూరం అవ్వాల్సి వచ్చింది, మళ్లీ ఇన్నాళ్ళకి నా తమ్ముడిని చూడబోతున్నాను" అని ఎంతో సంతోషంగా చెప్తారు ఆవిడ.

ఆవిడ సంతోషాన్ని చూసి అందరూ సంతోషపడతారు. 

అక్షయ వైపు చూస్తూ " నీకు తెలుసా తల్లి నిన్న నేను ఎంత సంతోషపడ్డానో , నిన్న నైట్ మా తమ్ముడు నాకు ఫోన్ చేశాడు , వాళ్లు నాకోసం ఎన్నాళ్ళగానో ఎదురుచూస్తున్నారు అంట, నిన్న నైటే వాడి దగ్గరికి వెళ్ళిపోదాం  అనిపించింది కాని ఇదిగో " అని గురుదీప్ పైపు చూపిస్తూ " ఈయన ఆపేశారు అందుకే ఈరోజు పొద్దున్న వెళ్తున్నాం"  అని చెప్తారు.

" లేడీకి  కి లేచిందే పరుగు అన్నట్లు,  ఆ అర్ధరాత్రి పూట ఎవరైనా వెళ్తారా"  అని అంటాడు గురుదీప్.

ఆయనని ఇగ్నోర్ చేస్తూ " ఏది ఏమైనా సరే ఇన్నాళ్ళకి మేమిద్దరం కలవబోతున్నాము ఇక వాడిని  నన్ను ఎవరు విరదీయలేరు మేమందరం కలిసే ఉంటాము "  అని చెప్తారు గాయత్రి.

" అందుకేనా నీ కొడుకుని వాడి కూతురికి ఇచ్చే చేద్దామా అనుకుంటున్నావు"  అని అంటారు గురుదీప్.

ఆ మాట వినగానే ఆదిత్య సడన్గా కార్ బ్రేక్ వేస్తాడు. 
ఆఫోర్స్ కి అక్షయ ముందుకి తులుతుంది .గాయత్రి వెంటనే అక్షయ నీ పట్టుకుంటుంది తనకి ఏమి కాకుండా. 

" పెద్దోడా పిచ్చిగాని పట్టిందా ఏంటి అలా సడన్ గా బ్రేక్ వేశావు , వెనకాల కడుపుతో ఉన్న పిల్ల ఉంది చూసుకోఅక్కర్లేదా " అని కొడుకుని తిట్టి. 

" తల్లి నీకేం కాలేదు కదా " అడుగుతుంది అక్షయ నీ  చూస్తూ తనకి ఏమైనా ఇబ్బంది కలిగిందేమో అని.

ఆదిత్య అలా సడన్ గా బ్రేక్ వేసే పాటికి అక్షయ ఆఫోర్స్ కి ముందుకి తులింది కానీ తనకి అంత ఇబ్బంది ఏమీ కలగలేదు .
" లేదు అత్తయ్య నేను బాగానే ఉన్నాను నాకేం కాలేదు " అని చెబుతుంది.

గురుదీప్ కొడుకు పై కోపం చూపిస్తూ"  అయినా సడన్  బ్రేక్  ఎందుకు వేశావు ,కార్ ముందు కూడా ఏమీ అడ్డు రాలేదు , అసలు అంత సడన్గా బ్రేక్ ఎందుకు వేశావు , నీ భార్య ప్రెగ్నెంట్ గా ఉంది అన్న సంగతి మర్చిపోయావా ఎంత జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో " అని తిడతాడు.

" సారీ డాడ్ అది అనుకోకుండా వేశాను " అక్షయ వైపు చూస్తూ " నీకేం కాలేదు కదా " కాన్సన్ గా అడుగుతాడు.

" ఐ యాం ఓకే ఆది గారు" అని చెప్తుంది అక్షయ. 
ఆది అంత సడన్గా బ్రెయిన్ ఎందుకు వేశాడో అక్షయకి కూడా బాగా తెలుసు. 

గాయత్రీ గారి మాట్లాడుతూ"  నీకు ఇబ్బంది లేదుగా తల్లి ఇబ్బందిగా ఉంటే చెప్పు కొంచెం సేపు ఆగి వెళ్దామా " అని అంటారు ఆవిడ.

" లేదు అత్తయ్య నేను బాగానే ఉన్నాను " అని చెప్తుంది అక్షయ మరొకసారి.

అక్షయ బాగానే ఉంది అని కన్ఫామ్ చేసుకున్నా గాయత్రి గారు తన కొడుకు వైపు కోపంగా చూస్తూ " ఇంకేంటి కార్ స్టార్ట్ చెయ్ ఇంకా,  కేర్ ఫుల్ గా డ్రైవ్ చెయ్ , ఇంకోసారి ఇలా  రాష్ డ్రైవింగ్ చేస్తే ఊరుకునేది లేదు"   అని అంటారు.

ఆదిత్య సైలెంట్ గా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు కానీ తన ఆలోచన అంతా కూడా ప్రేమ్ పైనే ఉంటుంది.

'వాడేమో పాపం తన లవ్ స్టోరీని సక్సెస్ చేసుకునే పనిలో ఉంటే , అమ్మేటి ఇలా వాడికి ఇంకో పెళ్లి సంబంధం చూస్తుంది , ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి ' అని తనలో తాను అనుకుంటాడు. 
డ్రైవ్ చేస్తూనే ప్రేమ్ ఫోన్ కి ట్రై చేస్తూ ఉంటాడు. 
కానీ ప్రేమ్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. 

'ఒరేయ్ ప్రేమ్ ఫోన్ ఆన్సర్ చేయరా ఇక్కడ కొంపలు అంటుకునే లాగా ఉన్నాయి ' అని అనుకుంటాడు ఆదిత్య తన మనసులో.

గురుదీప్ ఆదిత్యా వైపు చూసి " డ్రైవ్ చేస్తున్నప్పుడు ఫోన్ ఏంటి అది పక్కన పెట్టు"  అని గసురుకూన్టాడు.

ఆదికి ఏం చేయాలో అర్థం కాక సైలెంట్ అవుతాడు.

అక్షయ మెల్లగా మాట్లాడుతూ"  అత్తయ్య.."  అని పిలుస్తుంది. 

" ఆ చెప్పు తల్లి" .

" అత్తయ్య మీరు పెళ్లి సంబంధం అంటున్నారు కానీ ప్రేమ్ కి ప్రియా అంటే ఇష్టం కదా"  అని అడుగుతుంది.

" నాకు తెలుసు తల్లి  ప్రేమ్ కి ప్రియా అంటే ఇష్టం అని కానీ ప్రియా కి ప్రేమ్ అంటే ఇష్టం లేదు కదా , మొన్న నేను ప్రియా ని అడిగాను ,తను నాతో స్వయంగా చెప్పింది ప్రేమ్ ని నేను పెళ్లి చేసుకోలేను  అని , అలాంటప్పుడు తనని ఒత్తిడి చేయడం కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది , అందుకే ఈ సంబంధం చేద్దామా అనుకుంటున్నా , ఇందులో ఒక రకంగా నా స్వార్థం కూడా ఉంది అనుకో ,  ఒకవేళ మా తమ్ముడి కూతురికి ప్రేమ్ నచ్చితే ప్రేమ్ తో మాట్లాదాం అనుకుంటున్నాను" అని అంటుంది ఆవిడ. 

" కానీ అత్తయ్య..."   అక్షయ ఏదో చెబుతూ ఆగిపోయింది.

" చూడు తల్లి నాకు ప్రియా అంటే ఇష్టం లేదు అని నేను ఎప్పుడూ అనలేదు ప్రియా అంటే నాకు చాలా ఇష్టం తను నా కోడలిగా వస్తే నేను చాలా సంతోషిస్తాను, తనలాంటి అమ్మాయిని ఎవరు వద్దనుకోరు ,  కానీ తాను ప్రేమ్ నీ  చేసుకోవడానికి ఇష్టం చూపించట్లేదు కదా " అని అంటుంది ఆవిడ. 

అక్షయ ఆది వైపు బాధగా చూస్తుంది, ఆది ఏమి మాట్లాడద్దు అన్నట్లు సైగ చేస్తాడు.

పొద్దున్నే ఏమో ప్రియా ఫోన్ చేసి అలా చెప్పడం ఇప్పుడేమో ఇలా అత్తయ్య ప్రేమ్ కి ఇంకో సంబంధం చూశాను అనడంతో అక్షయ కి ఏం చేయాలో అర్థం కాలేదు.
తన బెస్ట్ ఫ్రెండ్ తన తోడికోడలుగా వస్తుంది అని అనుకుంది అది ఆశగానే మిగిలిపోయింది అక్షయకి. 

అది కార్డ్ ముందుకు  తీసుకువెళ్తూ " డాడ్ మీరు చెప్పిన ఏరియాకి వచ్చేసాము ఇక్కడి నుంచి ఎటు వెళ్ళాలి"  అని అడుగుతాడు.

అక్షయ చుట్టూ చూస్తూ " ఇక్కడికి వచ్చావ్ ఏంటి" అని అడుగుతుంది.

"నేను పెరిగింది ఇక్కడే తల్లి " అని అంటూ గాయత్రి గారు చుట్టూ చూస్తూ "  , ఇక్కడ చాలానే మార్పులు వచ్చాయి " అని అంటుంది 

" ఎందుకు మారవు,  ఇక్కడికి వచ్చి దాదాపు 27 సంవత్సరాల దాకా అవుతుంది అప్పుడు ఇప్పుడు ఒకేలాగా ఉంటాయా ఏంటి " అని అంటారు గురుదీప్.

" అత్తయ్య ప్రియా వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడే " అని చెప్తుంది అక్షయ. 

" ఓ అవునా.." అని అంటూ  గాయత్రి గారు చుట్టూ చూస్తూ ఉంటారు.

ఇంతలో అక్షయ ఒక ఇంటి వైపు వేలు చూపించబోతుంటే.

" అదిగో అదే మా ఇల్లు " అని చూపిస్తుంది గాయత్రీ గారు.

ఆవిడ చూపించిన ఇంటి వైపు చూసి అక్షయ ఇంకా ఆదిత్య షాక్ అవుతారు ఎందుకంటే అది ప్రియా వాళ్ళ ఇల్లు కాబట్టి. 

ప్రియ  వాళ్ళ ఇల్లు నిజంగానే చాలా అందంగా డెకరేట్ చేసి ఉంటుంది.

" నువ్వు వస్తున్నావ్ అని మీ తమ్ముడు ఏర్పాట్లు బాగానే చేశాడు"  అని అంటాడు గురుదీప్.

గాయత్రి ఇన్ని సంవత్సరాల తర్వాత తన ఇంటిని చూస్తూ ఎంతో ఆనంద పడిపోతుంది.

ఆదిత్య చూపు దగ్గరలో ఉన్న ప్రేమ్ కార్ వైపు పడుతుంది. 
' వీడు ఇక్కడే ఉన్నట్లు ఉన్నాడు'  అని తనలో తాను అనుకుంటాడు

ఇంతలో గురుదీప్ ప్రేమ్ కార్ దగ్గరలో చూసి " ప్రేమ్ మనకన్నా ముందే వచ్చి ఉన్నట్లున్నాడు. అయినా వీడేంటి కార్ నీ అంత దూరంలో పార్క్ చేశాడు, పదండి లోపలికి " అని అంటాడు.

ఆదిత్య ప్రియా వాళ్ళ ఇంట్లోకి వెళ్లడానికి కొంచెం హెసిటేట్ చేస్తూ " మామ్ ఈ అడ్రస్ కరెక్టేనా ఒకసారి చెక్ చేసుకో " అని అంటాడు.

" నా పుట్టినిల్లు నాకు తెలియదా " అని అంటుంది గాయత్రి వాళ్ళ ఇంటి పరిసరాలు చూస్తూ. 

ఆదిత్య కి ప్రియా ఇంట్లోకి కార్ పోనిస్తుంటే   కొంచెం కొంచెం గా అంత అర్థమవుతుంది . ' అంటే ఇప్పుడు వరకు మా అమ్మ చెప్పింది ప్రియా వాళ్ళ ఫ్యామిలీ గురించి , అంటే ప్రియా మా మామయ్య వాళ్ళ కూతురా,  వావ్ డెస్టినీ అంటే ఇదే కావచ్చు ఫ్రేమ్ నువ్వు చాలా లక్కీ రా ' అని అనుకుంటాడు.

ఎందుకైనా మంచిది కన్ఫామ్ చేసుకుందాం అని వాళ్ల మామ్ వైపు చూస్తూ " మా మీ తమ్ముడు పేరేంటి " అని అడుగుతాడు.

గాయత్రి సంతోషంగా " జగదీష్ చంద్ర మా తమ్ముడు పేరు , మా అమ్మ పేరు ఊర్మిళాదేవి " అని చెప్తుంది.

అక్షయ ఆ పేర్లు వినగానే ఎంతో సంతోష పడిపోతూ వాళ్ళ అత్తయ్య అని హాగ్ చేసుకుంటూ" అత్తయ్య ప్రియా ఎవరు కాదు జగదీష్ అంకుల్ వాళ్ళ కూతురు , మీ మేనకోడలు " అని అంటుంది.

గాయత్రి గారు ఆ మాట వినగానే ఇంకా షాక్ అవుతారు" నిజంగానా . ప్రియా నా మేన కోడలా ,ఈ విషయం నాకు ముందే తెలిసి ఉంటే బాగుండు , మా తమ్ముడిని ఎప్పుడో కలిసే దానిని " అని ఎంతో సంతోషంగా చెప్తారు ఆవిడ.

ఆదిత్య లేట్ చెయ్యకుండా వెంటనే తన ఫోన్ తీసి ప్రేమ్ కి డయల్ చేస్తూ ఉంటాడు. బట్ ప్రేమ్ లిఫ్ట్ చేయడు.

గాయత్రి గారు సంతోషంగా కార్ దిగుతారు. అప్పుడే జగదీశ్ చంద్ర వాళ్ళ అక్కని చూసి సంతోషంగా వచ్చి వాళ్ళ అక్కని హాగ్ చేసుకొని చిన్న పిల్ల వాడిలాగా ఏడుస్తూ ఉంటాడు. 
" అక్క..."

" ఏంటి నాన్న ఇది ఇలా ఏడుస్తున్నావు " అని అంటుంది గాయత్రి గారు జగదీష్ చంద్ర వెన్న నిమురుతూ.
సునంద తన భర్త ఇలా చిన్న పిల్లాడిలా ఏడుస్తూ ఉంటే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది.

జగదీష్ చంద్ర తన కళ్ళు తుడుచుకుంటూ " అక్క ఇది నువ్వే కాదు ఇది నిజంగా నువ్వే కాదు"  అని అంటాడు సంతోషంగా.

" అవునా రా ఇది నిజంగా నేనే " అని అంటుంది గాయత్రి దేవి తన కంట్లో నుంచి కూడా నీరు కారుతూ అంటుంది సంతోషంతో.

ఊర్మిళాదేవి  కూడా అప్పుడే వస్తుంది " నందు " అని ప్రేమగా పిలుస్తుంది.

అమ్మ పిలుపు వినగానే గాయత్రీ కంట్లో నీరు

" అమ్మ " అంటూ గాయత్రీ దేవి చిన్న పిల్లలాగా ఊర్మిళాదేవిని పట్టుకొని ఏడ్చేస్తుంది.

అక్షయ ఇంతలో కార్ డికి నుంచి వీల్ చైర్ తీసుకొని వస్తుంది ఆదిత్య వెళ్లి వాళ్ళ నాన్నగారిని తీసుకొచ్చి వీల్ఛైర్ లో కూర్చో పెడతాడు.

" అమ్మమ్మ " అని  పిలుస్తాడు ఆదిత్య సంతోషంగా ఊర్మిళాదేవిని చూస్తూ.

ఆదిత్య ఇంకా అక్షయ నీ చూసి కొంచెం షాక్ అయి, ఆదిత్య వైపు చూపిస్తూ  " వీడు .." అని అనే లోగా గాయత్రి " వీడు నా పెద్ద కొడుకు అమ్మ "  అని చెప్తుంది.

ఆదిత్య ఊర్మిళాదేవికి బాగా తెలుసు అక్షయ భర్తగా. పెళ్లి అయిన తర్వాత అక్షయ ఆదిత్యతో కలిసి వీళ్ల ఇంటికి భోజనానికి కూడా వచ్చారు . 

ఊర్మిళాదేవి ప్రేమ్ ని గుర్తుతెచ్చుకుంటూ"  అంటే ప్రేమ్ ని ..." అని ఆగిపోతుంది. ఆవిడకి సంతోషంలో మాటలు రావడం లేదు. 

" ప్రేమ్ నా  రెండో కొడుకు , నీకు ఇద్దరు మనవళ్ళు అమ్మ " అని చెప్తుంది గాయత్రి.

ఊర్మిళాదేవి  సంతోషపడిపోతూ ' కృష్ణయ్య నువ్వు ఉన్నావయ్యా 'అని ఆనందపడుతుంది.

గురుదీప్ నీ చూసి జగదీశ్ చంద్ర వెళ్లి అతని హగ్ చేసుకుంటారు " ఎలా అన్నారు బావగారు " అని అడుగుతాడు.

" చాలా బాగున్నాను నువ్వెలా ఉన్నావు"  అని అడుగుతారు  ఆయన. 

ఇంతలో డెకరేషన్ వాళ్ళు క్రాకర్స్ కాలుస్తారు. 

ఆ క్రాకర్స్ సౌండ్ వినగానే జగదీష్ చంద్ర , ఊర్మిళాదేవి, సునంద కంగారు పడిపోతారు జగదీష్ చంద్ర అలెర్ట్ అవుతూ " ఆపండి అవి వెంటనే.." అని వాళ్ళ మీద అరిచి ,ఉన్నఫలంగా పైకి పరిగెడతాడు.

ఆ సౌండ్ విన్న అక్షయ కూడా కంగారు పడుతూ ఆదిత్య చెయ్ పట్టుకొని " అది ప్రియా..
ప్రియా..."  అని కంగారు పడుతుంది.

జగదీష్ చంద్ర లోపలికి పరిగెత్తేసరికి గాయత్రీ కి ఏమి అర్థం కాదు" ఏం అయ్యింది..." అని అనేలోగా.
ఊర్మిళాదేవి కంగారు పడుతూ " వెంటనే ప్రియా దగ్గరికి వెళ్ళాలి . అది ఎలా ఉందో ఏంటో పదండి " అని కంగారు పెడుతుంది.

" అత్తయ్య గారు ఆయన వెళ్లారు మీరు కంగారు పడకండి " అని అంటుంది సునంద , ఆవిడ గొంతులో కూడా కంగారు తొంగి చూసింది. 

" వదిన , అన్నయ్య గారు మీరు లోపలికి రండి"  అని సునంద వాళ్ళని లోపలికి తీసుకు వెళుతుంది .

" అవును తల్లి లోపలికి రండి " అని ఊర్మిళాదేవి కూడా వాళ్ళని లోపలికి తీసుకు వెళుతుంది తన కంగారుని దాస్తూ. 

వీళ్లు ఇలా కంగారు పడడం చూసిన ఆదిత్య , గురుదీప్ ఇంకా గాయత్రి గారు ప్రియా కి ఏదో సమస్య అని అర్థం చేసుకుంటారు.

అక్షయ ఇంకా కంగారు పడడం చూసిన ఆదిత్య "అక్షయ కంగారు పడకు  నేను వెళ్లి చూస్తాను ప్రియా కి ఏమైందో నువ్వు రిలాక్స్ గా కూర్చో" అని చెప్తూ  అక్షయాన్ని  సోఫాలో కూర్చో పెడతారు. 

ఆదిత్య పైకి వెళ్లబోతుంటే , గాయత్రి , సునంద ఊర్మిళాదేవి కూడా అతని వెనకాలే వెళ్తారు.

అక్షయ కూడా వెళ్ళిబోతుంటే గురుదీప్ తనని ఆపుతూ " నువ్వు ఎలా కూర్చో తల్లి వాళ్ళు చూస్తారులే. నువ్వు కంగారు పడకు అసలే వట్టి మనిషివి కూడా కాదు"  అని చెప్తారు అయినా.

వాళ్లందరూ పైకి వెళ్లి చూసిన దృశ్యానికి షాక్ అవుతారు. 

.....
కొనసాగుతుంది....

పాపం మన ప్రియ పెళ్లి చేసుకోకూడదని బలంగా ఫిక్స్ అయింది , కానీ ఇప్పుడేమో ప్రేమ్ తన సొంత బావ అయ్యాడు . ప్రియ వాళ్ళ కుటుంబానికి మాట ఇచ్చిన ప్రకారం వాళ్ళ అత్త కొడుకుని  అదేనండోయ్ మన ప్రేమ్ ని చేసుకుంటుందా ?చేసుకోదా?. 
మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి. 

ప్రియా నే తన మరదలు అని తెలిస్తే ప్రేమ్ రియాక్షన్ ఏంటి . పెద్దవాళ్లు ఆల్రెడీ వీళ్ళ పెళ్లి ఫిక్స్ చేశారు అని తెలిస్తే ప్రేమ్ ఆనందం ఎలా ఉంటుంది.
ఇంతకీ మన ప్రియా రియాక్షన్ ఏంటో ప్రేమ్ తన బావ అని తెలిస్తే.
ఇవన్నీ తెలుసుకోవాలి అని ఉంది కదూ మరి ఇంకెందుకు ఆలస్యం నెక్స్ట్ ఎపిసోడ్ లో  చూసేద్దాం. అసలు ఏం జరుగుతుందో అని.


*****
తప్పులు ఏమైనా రాసి ఉంటే క్షమించగలరు.