Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

యూ ఆర్ మై డెస్టినీ - 8

ఫోర్ ఇయర్స్ బ్యాక్ ప్రియా లైఫ్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్  వల్ల తనకి క్రాకర్స్ సౌండ్ విన్నా ఏదైనా పేలుడు శబ్దం విన తాను పానిక్ అవుతుంది . ఆ టైంలో తను చాలా భయపడిపోతుంది  ఎవరిని కూడా తన దగ్గరికి రానివ్వదు. ఒంటరిగా ఉంటుంది , మరికొన్నిసార్లు తనని తాను హార్ట్ చేసుకుంటుంది , ఒక్కొక్కసారి అది తీవ్రంగా ఉన్నప్పుడు కళ్ళు తిరిగి పడిపోతుంది కూడా తాను లేవడానికి చాలా సమయం పడుతుంది ఒక్కొక్కసారి అది ఒక రోజు లేదా రెండు రోజులు అయినా కావచ్చు.

ప్రియా నీ ఈ సమస్య నుంచి దూరం చేయడానికి జగదీశ్ చంద్ర చాలా హాస్పిటల్స్ కి తిరిగారు. ప్రియా తనకి తానుగా ఆ భయాన్ని అధికమిస్తే గాని వాళ్ళు ఏమి చేయలేము అని చెప్పారు. ఆ పానిక్ ఎటాక్ కి తాత్కాలిక విముక్తి కోసం టాబ్లెట్స్ ప్రిస్క్రైబ్  చేశారు.

ప్రియా ఈ సమస్య గురించి తన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఈ ఐదుగురికి తెలుసు . ప్రియా ఇలా అవ్వడానికి గల కారణం తెలిసిన వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితి .

వాళ్లు ఎప్పుడూ ప్రియా గురించి ఆలోచిస్తూ ఆ టాబ్లెట్ ఎప్పుడు వాళ్ల దగ్గరే ఉంచుకుంటారు, ప్రియ నీ కూడా ఎప్పుడు ఒంటరిగా వదలరు. 

తన ఫ్రెండ్స్ అందరిలో నితిన్ ఎక్కువగా ప్రియా తోనే ఉంటాడు ప్రియ ఎప్పుడు పానిక్ అటాక్ అయినా సరే వెంటనే టాబ్లెట్ తీసి ప్రియా కి వేస్తూ ఉంటాడు, లేదంటే నాయిస్ స్టాపింగ్ హెడ్ఫోన్స్ ( అవి పెట్టుకుంటే  ఏ వాయిస్ కూడా మనకి వినిపించదు) వెంటనే ప్రియా చెవులకు పెడతాడు తను పానిక్ అవ్వకుండా.

ప్రియా కి ఉన్న ఈ సమస్య గురించి ప్రేమ్ కి కూడా తెలుసు అక్షయ ద్వారా. 

జగదీశ్ చంద్ర ప్రియ రూమ్ నీ ఎలా డిజైన్ చేయించారు అంటే బయట సాంగ్స్ ప్రియా రూమ్లోకి రాకుండా ఉండేలాగా తలుపులన్నీ వేస్తే బయట ఎంత పెద్ద సౌండ్ వచ్చినా ప్రియా కి వినిపించదు.

అందుకే ఆ సౌండ్స్ రాగానే తన ఫ్రెండ్స్ అందరూ కూడా ఫస్ట్ డోర్స్ అన్ని క్లోజ్ చేయడానికి వెళ్లారు. 

ప్రియా ఎప్పుడూ ఆ సౌండ్స్ విన్న తన గతం గుర్తుకు వచ్చి ఒక మూలగా వెళ్లి భయపడిపోతూ కూర్చుంటుంది. 
కానీ ఈరోజు మాత్రం అన్నిటికీ భిన్నంగా జరుగుతుంది ప్రేమ్ వల్ల.

ప్రియా ఇంతక ముందులాగా కాకుండా ప్రేమ్ ని హగ్ చేసుకుని చాలా నార్మల్ గా ఉండడం చూస్తున్న తన ఫ్రెండ్స్ అందరూ కూడా ఆశ్చర్యపోయారు.

ప్రియా పానిక్ అటాక్ నుంచి ప్రేమ్ ప్రియ నీ త్వరగా నార్మల్ చేయగలిగాడు అది కూడా ఏ టాబ్లెట్ సహాయం లేకుండా.

ప్రేమ్ ప్రియ నీ అలా హాగ్ చేసుకోగానే , ప్రేమ్ గుండె చప్పుడు వింటున్న ప్రియా కి ఎందుకో కానీ తెలియని ధైర్యం వచ్చింది. ఆ హార్ట్ బీట్ ని అలా వింటూ ఉండాలి అనిపించింది తనకి. ఆ హార్ట్ బీట్ వింటూ చుట్టూ అన్న లోకాన్ని మరచిపోయింది.

....
జగదీష్ చంద్ర ఈవెంట్ మేనేజర్ కి ఇలా చేయకూడదు అని ముందుగానే చెప్పకపోవడం అతని పొరపాటు,  సో ఈవెంట్ మేనేజర్ కి తెలియక గాయత్రి గారు వచ్చిన సందర్భంగా అలా క్రాకర్స్ పేల్చాడు . అలా ఆ క్రాకర్స్ పేలడంతో జగదీష్ చంద్ర చాలా కంగారు పడిపోయాడు తన  కూతురికి ఎలా ఉందో అని కంగారుగా పైకి పరిగెత్తుకుంటూ వచ్చారు కానీ తీరా చూస్తే ప్రియా ప్రేమ్ సాన్నిహిత్యం లో  చాలా రిలాక్స్డ్ గా కనిపించింది.

ప్రియా ఇలా పానిక్ అయినా ప్రతిసారి కూడా ఎవరిని తన దగ్గరికి కూడా రానివ్వదు వాళ్ళ నాన్న ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళ నాన్నని దగ్గరికి కూడా రానిచ్చేది కాదు . కానీ ఇప్పుడు ప్రేమ్ కి చాలా దగ్గరగా ఉంది 

ప్రియ నీ హాగ్ చేసుకొని వెన్ను నిమురుతూ "  ఏమీ కాదు నేనున్నాను కదా"  అని ప్రేమ్ ప్రియా కి ధైర్యం చెపుతూ ఉంటే  ఆయనకి ఆశ్చర్యం ఇంకా సంతోషం వేసింది .

ప్రేమ్ ప్రియ నీ  కన్సోల్ చేయడం చూసిన ఆయన చాలా రిలాక్స్ అయ్యాడు.

' ఇన్నాళ్లుగా నేను ఎన్నో డాక్టర్స్ దగ్గరికి వెళ్లాను నా కూతురిని ఈ సమస్య నుంచి దూరం చేయడానికి ,  కానీ దాని సమస్యకు మార్గం కనపడలేదు , కానీ ప్రేమ్ తనని ఇట్టే నార్మల్ చేయగలిగాడు '  అని అనుకుంటాడు ఆయన .

సునంద,  ఊర్మిళ దేవి కూడా ప్రియా నార్మల్ గా ఉండడం చూసి రిలాక్స్ అయ్యారు,  కానీ ప్రియ  , ప్రేమ్ ని అలా హాగ్ చేసుకోవడం చూసి కొంచెం ఆశ్చర్యంగా కూడా అనిపించింది.

గాయత్రి  ఇంకా ఆదిత్య కూడా ప్రేమ్ ఇంకా ప్రియా అలా ఉండడం చూసి ఆశ్చర్యపోయారు ఏం జరిగిందో వాళ్ళకి అర్థం కాలేదు.

ఆదిత్య వాళ్ళిద్దరూ అలా క్లోజ్ గా ఉండడం చూసి చాలా సంతోషపడ్డాడు , వాళ్ళిద్దరూ కూడా సేమ్ కలర్ కపుల్ డ్రెస్సెస్ లో ఉండడం అతనికి కొంచెం ఆశ్చర్యం అనిపించింది. ఇలాంటి మూమెంట్స్ 
మెమొరబుల్ గా ఉండాలి అని వెంటనే అతని ఫోన్ తీసుకొని ఆ బ్యూటిఫుల్ పిక్చని తన ఫోన్లో క్యాప్చర్ చేశాడు.

" ప్రేమ్ నువ్వేంటి రా ఇక్కడ " అని అంటున్న గాయత్రీ మాటలకు అటువైపు చూసి ,  వాళ్ళ అమ్మ అన్నయ్య , ప్రియా వాళ్ళ ఇంట్లో ఏం చేస్తున్నారో తెలియక ఆశ్చర్యపోయాడు.

' అయ్యబాబోయ్ అమ్మా ఏంటి ఇక్కడ ? , కొంపదీసి నేను ప్రియా వాళ్ళ ఇంటికి వస్తున్న సంగతి అన్నయ్య గాడు అమ్మకి  చెప్పేసాడా.  అమ్మని బురడీ  కొట్టించి ప్రియా వాళ్ళ ఇంటికి వచ్చినందుకు ఇప్పుడు అమ్మ వీళ్ళ అందరి ముందు చీపురు కట్ట తిరగేసి కొడితే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి  ' అని తనలో తాను అనుకుంటూ భయంగా గాయత్రీ వైపు చూశాడు.

పక్కనే ఉన్న ఆదిత్య వైపు కొంచెం కోపంగా  చూస్తూ ' ఒరేయ్ ద్రోహి నీ ప్రేమకి నేను నీకు ఎన్నిసార్లు హెల్ప్ చేసి ఉంటాను నువ్వు నన్ను ఎలా ఇరికిస్తావా , ఇంటికి వెళ్ళాక చెప్తారా నీ సంగతి 'అని ఆదిత్య ని బండ బూతులు తిట్టుకుంటాడు మనసులో. 

ఆదిత్య మాత్రం అవి ఏమీ పట్టనట్లు ప్రేమ్ ఇంకా ప్రియా లా ఫొటోస్ తీయడంలో మునిగి పోయాడు.

ప్రియా వాళ్ళ పేరెంట్స్ కూడా అక్కడే ఉండడం చూసి 
' కృష్ణయ్య ఏంటయ్యా ఇది , నువ్వు పువ్వు కింద పడేస్తే నాకు సపోర్ట్ గా ఉంటావేమో అని అనుకున్నాను కానీ ఇలా  జరిగిందేంటి' అని కృష్ణుడి బొమ్మ వైపు దీనంగా చూశాడు .

జగదీష్, ప్రేమ్ ని ఆశ్చర్యంగా చూస్తుంటే 'ఈయన ఏంటి నన్ను ఇలా చూస్తున్నాడు  , తన కూతురి గదిలోకి దొంగతనంగా వచ్చినందుకు,  ఇంకా ప్రియా ని ఇలా హాగ్ చేసుకున్నందుకు  , జగదీష్ అంకుల్  ఫ్యాక్షనిస్ట్ గా మారడు కదా , అసలే ఈయనకి కోపం ఎక్కువ అని,  కూతురు అంటే ప్రాణం అని విన్నాను .  ప్రియా కానీ తన ఫ్రెండ్స్ కానీ నా గురించి  ఒకటి నెగటివ్ గా చెప్పిన నా పని ఫినిష్ ' అని అనుకుంటూ. 

అప్పటికే జగదీష్ చంద్ర ఒక ఫ్యాక్షనిస్ట్ గా మారి చేతుల్లో  పెద్ద పెద్ద కత్తులతో ప్రేమ్ వైపు రావడం 
" ఒరేయ్ నా కూతురి గదిలోకి దొంగతనంగా రావడానికి నీకు ఎంత ధైర్యం,  నా కూతురిని హగ్ చేసుకుంటావా నువ్వు అయిపోయావు " అని అంటూ ప్రేమ్ ని ఆ కత్తులతో పొడవడం  నితిన్ ఒకపక్క ఈవిల్ స్మైల్ ఇస్తూ  జగదీష్ అంకుల్ కి "అంకుల్ ఆ కత్తితో కాదు ఈ కత్తితో పొడవండి "  అని ఇంకా పెద్ద కత్తి ఇవ్వడం  , గాయత్రీ గారు కూడా ప్రేమ్ కి సపోర్ట్ ఇవ్వకుండా ఆడపిల్ల గదిలోకి ఇలా దొంగతనంగా వస్తావా అని ఆవిడ కూడా చీపురు పట్టుకొని ప్రేమ్ ని కొట్టడం ఊహించకుంటాడు ప్రేమ్.



తనని గట్టిగా హాగ్ చేసుకున్న ప్రియా వైఫ్ చూశాడు 'ఇది ఇప్పుడు నన్ను ఎలా దగ్గరికి రానిచ్చింది గాని , అసలే దినికి నేనంటే పీకలు వరకు ఉంది , అందులోనూ  దీనికి సపోర్ట్ ఆ నితిన్ గాడు , వీళ్లిద్దరూ కలిసి ఈరోజు నాకు స్వర్గానికి టికెట్ ఇవ్వరు కదా, ఎందుకైనా మంచిది ఇప్పుడే సరెండర్ అవడం బెటర్ ' అని తనలో తాను అనుకుంటూ ప్రియ  చూట్టు  ఉన్న  అతని చేతుల్ని తీసి దొంగ పోలీస్ కి సరెండర్ అవుతున్నట్లుగా చేతులు పైకి ఎత్తాడు.

ఆదిత్య ప్రేమ్ వైపు చూస్తూ ' వీడేంటి చేతులు ఇలా ఎత్తాడు దొంగ పోలీస్ కి సరెండర్ అవుతున్నట్లు , నచ్చిన అమ్మాయి అంత గట్టిగా పట్టుకుంటే దాన్ని పట్టుకోకుండా' అని అనుకోని 
వెంటనే గుర్తు వచ్చిన వాడిలాగా' అవును వీడికి అసలు నిజం తెలియదు కదా,  పోనీలే కొంచెంసేపు టెన్షన్ పడనిద్దాం' అని అనుకుంటూ ప్రేమ్ వైపు నవ్వుతూ చూస్తాడు. 

ప్రేమ్ ఆది వైపు చూస్తూ' వీడేంటి నన్ను చూసి నవ్వుతున్నాడు తమ్ముడికి హెల్ప్ చేయడం మానేసి . ఏదో తప్పు అయిపోయింది అంకుల్ మా తమ్ముడు చాలా మంచివాడు  అని జగదీష్ అంకుల్ని బతిమాలడం మానేసి . ఛీ ఇ టైమ్ లో మా వదిన ఉంటే బాగుండు నాకు సపోర్ట్ గా వచ్చేది , ఇంతకీ వదిన ఎక్కడుంది ' అని అనుకుంటాడు.

ప్రేమ్ తన చుట్టూ అన్నా చేతలు తీసిన ప్రియా మాత్రం ప్రేమ్ నీ గట్టిగా హాగ్ చేసుకునే ఉంది ,  అతని హార్ట్ బీట్ వింటూ.

ప్రియా ప్రేమ్ కి అంత దగ్గరగా ఉండడం చూసిన గాయత్రి , ఊర్మిళాదేవి, జగదీష్ చంద్ర ఇంకా సునంద కి చాలా సంతోషంగా ఉంటుంది.

శైలు ప్రియా దగ్గరికి వచ్చి " ప్రియా నీకేం కాలేదు కదా నార్మల్గానే అన్నావు కదా"  అని కాన్సన్ గా అడుగుతుంది.

ప్రియా ప్రేమ్ నీ ఇంకా అలాగే హాగ్ చేసుకొని " హ్మ్మ్" అని మాత్రమే చెప్తుంది. 

శైలు కొంచెం ఆశ్చర్యపోతూ ' ఏమైంది దీనికి ప్రేమ్ నీ అలా పట్టుకుని వదలట్లేదు ' అని అనుకుంటుంది.

శైలు కి వచ్చేనా డౌటే , నిఖిల్ ఇంకా అరుణ్ కి కూడా వస్తుంది.

ప్రేమ్ కి ఒక పక్క భయంగా ఉన్న ప్రియా అతని అలా గట్టిగా పట్టుకొని ఉండడం  అతనికి చాలా నచ్చింది.

నితిన్ కి మాత్రం వాళ్లని అలా క్లోజ్ గా చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది 'ఏమైంది ప్రియా కి , వాడిని అలా హాగ్ చేసుకొని వదలడం లేదు'  అని అనుకుంటాడు తనలో తాను.

జగదీష్, ప్రేమ్ వైపు చూస్తూ నవ్వుతూ నార్మల్ గా మాట్లాడుతూ " ప్రేమ్ నువ్వు ఎప్పుడు వచ్చావు బాబు " అని అడుగుతాడు.

జగదీష్ మెయిన్ డోర్ దగ్గరే ఉంటాడు వాళ్ళ అక్క కోసం , ప్రియా వాళ్ళ ఫ్రెండ్స్ రావడం చూసాడు కానీ ప్రేమ్ రావడం అతను చూడలేదు.

జగదీష్   నార్మల్ గా మాట్లాడటం చూసిన ప్రేమ్ కొంచెం రిలాక్స్ అవుతాడు.  ' ఏంటి అంకుల్ కి మా ఇద్దరినీ ఇలా చూస్తుంటే కోపం రావట్లేదా పైగా నవ్వుతున్నారు కూడా,  అసలేం జరుగుతుంది ఇక్కడ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏది కూడా జరగట్లేదు ఏంటి' అని కన్ఫ్యూజ్ అవుతాడు.

నితిన్ ప్రేమ్ ని ఎలాగైనా సరే ఇరికించాలి అని "అంకుల్ వీడు ప్రియా గదిలోకి గోడ దూకి దొంగతనం గా వచ్చాడు మెయిన్ డోర్ నుంచి కాకుండా " అని అంటాడు కొంచెం కోపంగా.

' ఓరి ఎదవ వీడు ఇరికించేసాడుగా నన్ను ' అని అనుకుంటూ భయంగా జగదీష్ వైపు చూస్తాడు ప్రేమ్.

గాయత్రీ గారికి తన చిన్న కొడుకు గురించి బాగా తెలుసు అండ్ ప్రేమ్ ప్రియ నీ లవ్ చేస్తున్న సంగతి కూడా ఆవిడకి బాగా తెలుసు , ఇక్కడ సిచువేషన్ బట్టి ఆవిడకి మొత్తం అర్థం అయింది అసలు ఏం జరిగి ఉంటుందో అనేది.

గాయత్రీ గారు జగదీష్ చెవిలో ఏదో చెప్తారు.
అది విన్న జగదీష్ గారు గాయత్రి మొహం చూసి ఏదో అర్థం అయినా వాళ్ళలాగా ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటారు. 
సునంద కొంచెం కుతూహలంతో " ఏం జరిగింది వదిన" అని గాయత్రీ ని అడుగుతారు.

గాయత్రీ గారు ఆవిడ చెవుల్లో కూడా ఏదో చెప్తారు సునంద గారు అర్ధమైనట్లు నవ్వుతూ ఊర్మిళ గారి చెవిలో కూడా ఏదో చెప్తారు.
ఆదిత్య ఆల్రెడీ అక్కడ జరిగింది ఊహించాడు.
వాళ్లు అందరూ ఒకరి చెవిలో ఒకరు ఏదో చెప్పుకుంటూ వాళ్ళని చూసి నవ్వుతూ ఉంటారు

వాళ్లు ఎందుకు నవ్వుతున్నారో ప్రేమ్ ఇంకా ప్రియా ఫ్రెండ్స్ కి ఏమీ అర్థం కాదు.

జగదీష్  నవ్వుతూ మాట్లాడుతూ " ఇకపైన గోడలు దూకాల్సిన అవసరం ఉండదులే ప్రేమ్ ,నువ్వు డైరెక్ట్ గా ప్రియా కదిలోకి రావచ్చు"  అని అంటారు.

ఆయన మాటలు ప్రేమ్ ఇంకా ప్రియా ఫ్రెండ్స్ కి ఏమి అర్థం కాదు అంతా కన్ఫ్యుస్ గా ఉంటుంది వాళ్లకి.

' ఈ విషయం చెప్తే జగదీష్ అంకుల్ ప్రేమ్ ని కొడతాడు , లేకపోతే పోలీసులకు అప్పచెప్పుతాడు అని అనుకుంటే ఇలా డైరెక్ట్ గా రావచ్చు అని పర్మిషన్ ఇస్తాడు ఏంటి?'  అని కన్ఫ్యూజ్ అవుతాడు నితిన్.

" డైరెక్ట్ గా రావడం ఏంటి ?" అని క్యూస్షన్ చేస్తాడు నితిన్.

ఊర్మిళ దేవి గారు నవ్వుతూ " ఎందుకంటే వాడు దానికి కాబోయే భర్త కాబట్టి " అని అంటారు.

ఆ మాట వినగానే అందరూ షాక్ అవుతారు. 

ప్రేమ్ కి ఆనందం , ఆశ్చర్యం , అలాగే కన్ఫ్యూషన్ అన్ని ఒకేసారి వస్తాయి , ఇలా సడన్గా ఎలా జరిగిందో అతనికి అర్థం కాదు.

" వాట్?  కాబోయే భర్త ? ప్రియా ఈ పెళ్లికి అసలు ఒప్పుకోదు " అని అంటాడు నితిన్.

ఊర్మిళాదేవి గారు గదిలోకి వస్తు ప్రేమ్ ఇంకా ప్రియా దగ్గరికి వెళ్లి ప్రియా చెవిలో " నీ బావని కౌగిలించుకుంది  చాల్లే కానీ వాడిని వదులు , కావాలంటే పెళ్లయ్యాక ఎంత సేపు కావాలంటే అంత సేపు కౌగిలించుకోవచ్చు " అని అంటారు నవ్వుతూ.

ఊర్మిళాదేవి గారి మాటలు తన చెవి దగ్గరగా వినిపించేసరికి  ప్రియా తన స్పృహలోకి వస్తుంది. 
"ఏంటి?"

వాళ్ల నాన్నమ్మ చెప్పింది తనకి సరిగ్గా వినిపించలేదు .
కన్ఫ్యుస్ గా అటు ఇటు చూస్తూ తనని తాను  చూసుకుంటే తన ఇంకా ప్రేమ్ కౌగిలిలో ఉండడం చూసి , ' నేనేంటి వీడిని ఇలా పట్టుకున్నాను ' అని అనుకోని.
వెంటనే ప్రేమ్ నీ  తనకు దూరంగా తోసేస్తుంది.

ప్రియా అలా తోసే గానే ప్రేమ్ రెండు అడుగులు వెనక్కి వేస్తాడు.
' దొంగ మొహం ఇప్పుడు దాకా గట్టిగా పట్టుకొని ఇప్పుడేమో చూడు ఎలా తోసేసిందో ' అని అనుకుంటాడు.

ప్రియా ప్రేమ్ గుండె చప్పుడు వింటూ చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు వినిపించుకోలేదు , ఊర్మిళాదేవి మాటలకి కొంచెం స్పృహలోకి వచ్చి చుట్టూ చూసింది.
అక్కడ ఆదిత్య ఇంకా గాయత్రి ఆంటీని చూసి ఆశ్చర్యపోతూ " ఆంటీ మీరే అంటే ఇక్కడ?"  అని అడిగింది.

ఊర్మిళ దేవి గారు ప్రియా రియాక్షన్ కి నవ్వుకుంటూ  "  ప్రియా ఆల్రెడీ ఈ పెళ్లికి ఒప్పుకుంది , తను పెళ్లి చేసుకుంటే వాళ్ల బావని చేసుకుంటాను అని , అదే నా కుతూరి కొడుకుని చేసుకుంటాను అని చెప్పింది, నా కూతురు ఎవరో కాదు ఇదిగో తానే నా కూతురు"  అని గాయత్రీ వైపు చూపిస్తుంది .

మళ్లీ ఊర్మిళాదేవి మాట్లాడుతూ " నా కూతురికి ఇద్దరు కొడుకులు ఒకడు ఆదిత్య ఇంకొకడు ప్రేమ్ " అని ఒకేసారి బాంబు పేలుస్తారు.

ప్రియా అండ్ తన ఫ్రెండ్స్ ఒకేసారి " వాట్?"  అని అరుస్తారు. 

ప్రేమ్ మాత్రం సంతోషంతో "వావ్ ..." అని గాల్లోకి ఎగురుతాడు. 

ప్రియా మాత్రం స్పృహ తప్పి పడిపోతుంది. 

కొనసాగుతుంది...

తప్పులు ఏమైనా ఉంటే క్షమించగలరు. 
నా స్టోరీ మీకు ఎలా అనిపించింది ? నచ్చిందా ? నచ్చలేదా?.