ప్రేమ్ ని బాల్కనీలో చూడగానే నితిన్ ఇంకా అరుణ్ కి చాలా కోపం వస్తుంది కోపంలో " నువ్వేం రా ఇక్కడ" అని ఇద్దరు ఒకేసారి అడుగుతారు.
ప్రేమ్ నీ అక్కడ చూడగానే ప్రియా 'అంటే నా గెస్ కరెక్టే అన్నమాట వీడు నేను పూజ మొదలు పెట్టినప్పుడు వచ్చి ఉంటాడు ' అని అనుకుంటుంది తన మనసులో.
ఎలాగో వాళ్ళందరూ చూసేసారు కదా ఇంకా దాక్కోవడం అనవసరం అనుకుని ప్రేమ్ ముందుకు వస్తూ " మీరు ఎందుకు వచ్చారో నేను అందుకే వచ్చాను " అని అంటాడు.
"అంటే?" అని అడుగుతాడు నితిన్.
" అంటే కంటే ఏమీ లేదు నా బంగారం" ప్రియా వైపు చూపిస్తూ " పొద్దున్నే ఫోన్ చేసి నాకు ఈ రోజు ఎంగేజ్మెంట్ అని చెప్పి బాంబ్ పేల్చింది అంట కదా అది వినినప్పటి నుంచి మా వదిన టెన్షన్ పడిపోయింది మా వదిన టెన్షన్ చూడలేక ఏం జరిగిందో కనుక్కుందామని ఇలా వచ్చాను" అని అన్నాడు ప్రేమ్.
ప్రేమ్ ప్రియ నీ తన బంగారం అని అనగానే ఒళ్ళు మండిపోయింది నితిన్ కి.
" ఒరేయ్ మాటరు జాగ్రత్తగా రానివ్వు" అన్నాడు నితిన్ సీరియస్ గా
ప్రేమ్ కొంచెం కన్ఫ్యూజ్ ఫేస్ పెడుతూ " ఇప్పుడు నేనేమన్నాను, మాటలు జాగ్రత్తగా రానివ్వ అంటున్నావు " అని అంతే సీరియస్ గా అడిగాడు.
నితిన్ కొంచెం కోపంగా " అది నీ బంగారం ఏంటి ?" అని అడిగాడు.
ప్రేమ్ నవ్వుతూ " ఓహో ...నీకు కోపం అందుకు వచ్చిందా మరి నా బంగారం ని నా బంగారం అనక ఇంకేం అనాలో" అని వెటకారంగా అన్నాడు.
" ఒరేయ్ నిన్ను.."నితిన్ కోపంతో ప్రేమ్ నీ కొట్టడానికి వెళుతుంటే అరుణ్ ఆపుతాడు.
నిఖిల్ " నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు?. నాకు తెలిసి నువ్వు రావడం మేము ఎవరం చూడలేదు " అని అడుగుతాడు.
ప్రియ రూమ్ లోకి రావాలి అంటే తన రూమ్ ఎంట్రెన్స్ డోర్ నుంచి రావాలి వేరే ఛాన్స్ లేదు కానీ ప్రేమ్ ఇక్కడికి ఎలా వచ్చాడో అర్థం కాలేదు
" అవును నువ్వు రావడం మేము ఎవరం చూడలేదు ఇంతకీ ఎంతసేపు అయింది రా నువ్వు వచ్చి " అని అడుగుతాడు కొంచెం కోపంగా నితిన్.
నితిన్ ఉద్దేశం ప్రకారం ' ప్రేమ్ ఎప్పుడో వచ్చి బాల్కనీ లో ధకోని ఉండుంటాడు, అంటే ప్రియా స్నానం చేస్తున్నప్పుడు గాని బట్టలు మార్చుకుంటున్నప్పుడు కానీ ఇక్కడే ఉండి ఉంటాడా ' ఆ ఆలోచనకి చాలా కోపం వచ్చింది నితిన్ కి.
నితిన్ ఏం ఆలోచిస్తున్నాడో ప్రేమ్ కి అర్థమైంది.
ప్రేమ్ కొంచెం కోపంగా " నువ్వు అనుకున్నట్లు నేను మికనా ముందుగా ఏమీ రాలేదు అండ్ నువ్వు మనసులో అనుకుంటున్నట్లుగా నాకు అలాంటి బుద్ధులు కూడా ఏమీ లేవు, నేను వచ్చి..." ఏదో చెప్పేలోగా ప్రియా మాట్లాడుతూ.
" వాడు మీరు వచ్చిన తర్వాత వచ్చాడు అదే నేను పూజ మొదలు పెట్టినప్పుడు వచ్చాడు" అని చెప్తుంది ప్రియా ప్రేమ్ వైపు కొంచెం కోపంగా చూస్తూ.
" వాడు ఎప్పుడు వచ్చిన సంగతి నీకు ముందే తెలుసా? అంటే వాడి రావడం నువ్వు చూసావా? మరి వాడు వచ్చిన సంగతి మా ఎవరికి ఎందుకు చెప్పలేదు ?" అని అడుగుతాడు నితిన్ ప్రియా వైపు చూస్తూ.
’అంటే వీడి ఉద్దేశం ఏమిటి వాడు రావడం నేను చూశాను అనా ' అని తనలో అనుకొని
" వాడు రావడం నేనేమి చూడలేదు కాకపోతే వాడు వచ్చినట్టు నాకు తెలిసింది" అని అంటుంది ప్రియా కొంచెం అసహనంగా.
" ఏంటి? ప్రేమ్ వచ్చినట్లు నీకు తెలిసిందా ? అలా ఎలా తెలిసింది? చూడకుండా " అని అడుగుతుంది శైలు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ.
ఎందుకంటే వాళ్లు వచ్చేపాటికి ప్రియా కళ్ళు మూసుకొని పూజ మొదలుపెట్టింది. ప్రియా ఒక్కసారి పూజలో తన కళ్ళు మూసుకుంటే పూజ అయ్యేవరకు కూడా కళ్ళు తెరవదు అని శైలుకి బాగా తెలుసు. మరి ప్రేమ్ వచ్చిన సంగతి తనకి ఎలా తెలిసింది.
నితిన్ " ఏమంది వీడు దగ్గరలో ఉంటే దీని హార్ట్ బీట్ పెరుగుతుందిగా. దాన్ని బట్టి కనిపెట్టి ఉంటుంది " అని లైట్ గా గొనుగుతాడు.
నిఖిల్ చిన్నగా అన్న అది తనకి దగ్గరలో ఉన్న నితిన్ ఇంకా శైలు కి వినిపిస్తుంది.
నితిన్ అలా అనగానే పూజ అయిన తర్వాత ప్రియ తన హాట్ మీద చేయి వేసుకొని ఎవరి కోసమో వెతకడం అతనికి గుర్తుకు వస్తుంది. ' అంటే ప్రియా , ప్రేమ్ కోసం వెతికిందా అప్పుడు' అని అనుకుంటాడు.
నితిన్, నిఖిల్ వైపు కోపంగా చూస్తూ ."ఇప్పుడు ఆ విషయం ఇక్కడ అవసరమా ముందు వీడు ఇక్కడికి ఎలా వచ్చాడో అది కనుక్కో ఫస్ట్" అని అడుగుతాడు.
నిఖిల్ మాటలు వినగానే శైలుకి అక్షయ చెప్పింది గుర్తుకు వస్తుంది
" అంటే అక్షయ చెప్పింది నిజమే అన్నమాట, ఈ ప్రేమ్ నీకు దగ్గరలో ఉంటే నీ హార్ట్ బీట్ పెరుగుతుంది , దానిపట్టి ప్రేమ్ ఎప్పుడు వచ్చింది నీకు ముందే తెలిసింది కదా" అని అడుగుతుంది శైలు , ఏదో గొప్ప విషయం కనుక్కున్న దానిలాగా ప్రియ వైపు చూస్తూ.
ప్రియా ఏదో చెప్పేలోగా ప్రేమ్ మాట్లాడుతూ " అది హాట్ సిగ్నల్ సిస్టర్, మన హార్ట్ కి ఎంతో ఇష్టమైన వాళ్ళు మన దగ్గరలో ఉంటే హార్ట్ బీట్ అలాగే పెరుగుతుంది , ఇట్స్ లైక్ లవ్ లాంగ్వేజ్ " అని అంటాడు ప్రేమ్ ప్రియా వైపు చూస్తూ.
" అంటే ప్రియా నిన్ను లవ్ చేస్తుందా" అని అడుగుతుంది శైలు.
" నేను ఎవరిని లవ్ చేయట్లేదు అండ్ వీడిని అసలే చేయట్లేదు " అని వెంటనే చెప్తుంది ప్రియా.
" అవునా ...మరి నేను నీ దగ్గరలో ఉన్నప్పుడు నీ హార్ట్ బీట్ ఎందుకు పెరుగుతుంది " అని అడుగుతాడు ప్రేమ్ , ప్రియా వైపు చూస్తూ కళ్ళు ఎగరేస్తూ.
" నాకు తెలియదు"
" ఇంతకీ నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? అది చెప్పు ఫస్ట్, ఈ హార్ట్ బీట్ గురించి తర్వాత మాట్లాడుకుందాం" అని అడుగుతాడు అరుణ్ టాపిక్ డైవర్ట్ చేస్తూ.
" ఏముంది గోడ దూకి బాల్కనీ పైప్స్ పట్టుకొని పైకి వచ్చాను " అని అంటాడు ప్రేమ్. అది ఏమి పెద్ద విషయం కాదు అన్నట్లు.
శైలు ఆశ్చర్యంగా " ఏంటి సెవెన్ ఫీట్స్ గోడ జంప్ చేసావా , పైప్ సహాయంతో వచ్చావా " అని అంటూ బాల్కనీ బయటికి వెళ్లి కిందకు చూస్తుంది.
ప్రియ రూమ్ థర్డ్ ఫ్లోర్ లో ఉంటుంది దానికి అటాచ్డ్ గా ఉన్న పైప్స్ కూడా నిటారుగా జారు వారిగా ఉంటాయి . ప్రియ రూమ్ బాల్కనీ కింద సపోర్ట్ కూడా ఏమీ ఉండవు వాటి సపోర్ట్ తీసుకుని పైకి ఎక్కడానికి కూడా పైకి ఆ పైపుల సహాయంతో చేరుకోవడం అంటే చాలా కష్టమైన పని, ఎవరి వల్ల కూడా సాధ్యం కాదు. అందుకే ప్రేమ్ బాల్కనీ పైప్స్ నుంచి పైకి వచ్చాను అంటే ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు.
ప్రేమ్ షార్ట్ కూడా కొంచెం నలిగినట్టు కూడా ఏమీ కనిపించడం లేదు. అతను కష్టపడి పైకి వచ్చాడు అంటే అతని షర్ట్ మొత్తం నలిగిపోయి ఉండాలి కానీ అలా ఏమీ లేదు.
శైలే కొంచెం ఆశ్చర్యంగా " ప్రేమ్ మీరు ఇంతకుముందు మిలట్రీ లో గాని పనిచేశారా ఏంటి ? ఇలాంటి సాహస పనులు ఎక్కువగా మిలటరీ వాళ్ళు చేస్తారు అని విన్నాను , నిఖిల్ కి కూడా చేయడం వచ్చా" అని అంటుంది.
సెవెన్ ఫీట్స్ గోడ జంప్ చేయడం అంటే మామూలు విషయం కాదు.
" శైలు నువ్వు ఆపవే" అని అంటూ." ఏదేమైనా ఇలా పరాయి అమ్మాయి గదిలోకి ఇలా దొంగతనంగా రావడం తప్పు అది ఎందుకైనా సరే , ముందు వీడికి నాలుగు తగిలిస్తే ఇంకెప్పుడు కూడా ప్రియా రూమ్ వైపు రావాలని కూడా ఆలోచన చేయడు" అని అంటాడు నితిన్ షర్ట్ చేతల మడత పెడుతూ ముందుకు వెళుతూ.
" చా...నవ్వు కొడితే కొట్టించుకుంటాను మరి , ఏది ఒకసారి నా మీద చేయి వేసి చూడు" అని అంటాడు ప్రేమ్.
ప్రేమ్ కి కూడా నితిన్ అంతగా నచ్చాడు కేవలం ప్రియ ఫ్రెండ్ అని అతన్ని టాలరేట్ చేస్తూ ఉంటాడు.
ప్రేమ సిక్స్ ఫీట్ టాల్ , కండలు తిరిగిన బాడీ , మహేష్ బాబు లాంటి అందం తో ఉంటాడు.
నితిన్ కూడా ఏమీ తక్కువ కాదు అనుకోండి.
బట్ నితిన్ ఇంకా ప్రేమ్ నీ కంపేర్ చేస్తే ప్రేమ్ ఇంకా అందంగా స్ట్రాంగ్ గా ఉంటాడు.
" ఒరేయ్ నువ్వు ఒక్క నిమిషం ఆగు" అని అంటాడు నిఖిల్ వాళ్లని ఆపుతూ.
" ఏంట్రా ఆగేది వాడు ఇలా ప్రియ రూమ్ లోకి రావడం కరెక్ట్ అంటావా " అని కోపంగా అంటాడు నితిన్.
అరుణ్ కూడా నితిన్ కి సపోర్ట్ చేస్తూ " అవునురా ఇది కరెక్ట్ కాదు అలా రావడం" అని అంటాడు.
" నేనేమీ పరాయి అమ్మాయి రూమ్లోకి రాలేదు. అండ్ నేను నా ఫ్యూచర్ వైఫ్ గదిలోకి వచ్చాను" అని అంటాడు ప్రేమ్.
' వాట్ ఫ్యూచర్ వైఫ్, వీడికి ఎలా చెప్తే అర్థమవుతుంది 'అని అనుకుంటుంది ప్రియా తన మనసులో
" ఏంటి ఫ్యూచర్ వైఫ్ ఆ ? బానే కలలు అంటున్నావ్ " అని వెటకారంగా నవ్వుతాడు నితిన్.
" నేనేమీ కలలు కనడం లేదు ఇది కచ్చితంగా జరిగి తీరుతుంది చూసుకో" అని చాలెంజ్ చేస్తాడు ప్రేమ్
" అది ఎలా జరుగుతుందో నేను చూస్తాను గా" అని అంటాడు నితిన్.
వీళ్ల డిస్కషన్ ని అడ్డుకుంటూ ప్రియా " ప్రేమ్ నీకు ఎన్నోసార్లు చెప్పాను నేను ఈ జన్మలో పెళ్లి చేసుకోను అని, సో నామీద హోప్స్ పెట్టుకోవద్దు , నీకు నచ్చిన అమ్మాయిని ఎవరైనా చూసి పెళ్లి చేసుకో" అని అంటుంది.
" నేను కూడా నీకు ఎన్నోసార్లు చెప్పాను, నాకు నచ్చిన అమ్మాయి అంటూ ఎవరైనా ఉంటే అది నువ్వు మాత్రమే అని , నా లైఫ్ లో వైఫ్ గా ఎవరైనా వస్తే అది కేవలం నువ్వు మాత్రమే వస్తావు అని కూడా" అని అంటాడు ప్రేమ్ చాలా సీరియస్ గా.
ఇంతలో బయట పెద్ద శబ్దం అవుతుంది.
ఎవరో క్రేకర్స్ కాలుస్తూ ఉంటారు బయట.
ఆ సౌండ్ కి ప్రియా పానిక్ అవుతూ తన చెవ్వలు ఇంకా కళ్ళు గట్టిగా మాసేస్తుంది
"".. ఆ......."
ఆ క్రాకర్స్ సౌండ్ వినగానే శైలు, నితిన్ , నిఖిల్ అండ్ అరుణ్ వెంటనే అలర్ట్ అవుతూ డోర్స్ అన్ని క్లోజ్ చేయడానికి పరిగెడతారు.
ప్రేమ్ మాత్రం ప్రియా దగ్గరికి పరిగెడుతూ వానికి పోతున్న ప్రియా నీ వెంటనే గట్టిగా తన గుండెకి హత్తుకుంటాడు
" ఏం కాదు... ఏం కాదు ..
నేను ఉన్నాను కదా" అని అంటూ ప్రియా వెన్న నిమురుతూ ఉంటాడు.
ప్రేమ్ గుండెచప్పుడు ప్రియా కి వినిపించడంతో ప్రేమ్ ని మరి కాస్త గట్టిగా హత్తుకుంటూ" ప్లీజ్ నన్ను వదలద్దు నన్ను వదిలి వెళ్ళద్దు" అని అంటూ ఉంటుంది.
" నేను నీ దగ్గరే ఉన్నాను కదా ...నిన్ను వదిలి ఎప్పుడు వెళ్ళను " అని అంటాడు ప్రేమ్ ప్రియా నీ ఇంకాస్త గట్టిగా హత్తుకుంటూ.
తన ఫ్రెండ్స్ అందరూ తలుపులు వేసి ప్రియా వైపు చూసి షాక్ అవుతారు.
ప్రియా ప్రేమ్ ని గట్టిగా హత్తుకొని కనిపిస్తుంది.
ఆశ్చర్యంగా వాళ్ళిద్దరిని చూస్తూ అలా ఉండిపోతారు.
ప్రియా ప్రేమ్ అలా దగ్గరగా ఉండడం చూసి నితిన్ తట్టుకోలేక పోతాడు.
" ప్రేమ్ ప్లేస్ ఎక్కడికి వెళ్లదు, నాతోనే ఉండు, ఎక్కడికి వెళ్లొద్దు, నాకు భయంగా ఉంది " అని ప్రియా అంటూ ఉంటుంది.
నితిన్ ప్రియా దగ్గరికి వచ్చేవాడు అల్లా ఆ మాటలు విని అక్కడే ఆగిపోతాడు.
" నేను నీతోనే ఉంటాను బంగారం , నేను ఎక్కడికి వెళ్ళను , భయపడకు " అని అంటాడు ప్రేమ్.
ప్రియా ప్రేమ్ గుండె చప్పుడు వింటూ అలాగే ఉండిపోతుంది.
ప్రేమ్ కి అంత దగ్గరగా ఉంటే తనకి ఎందుకో రిలాక్స్డ్ గా , ధైర్యంగా అనిపించింది.
ఇంతలో తలుపులు తెరుచుకుంటాయి.
కంగారు పడుతున్న ఊర్మిళాదేవి , జగదీష్ చంద్ర , సునంద కనిపిస్తారు.
ప్రేమ్ ఇంకా ప్రియా దగ్గరగా ఉండడం చూసి ఆశ్చర్యపోతారు.
వాళ్ల వెనకాలే మరో ఇద్దరు కూడా వస్తారు.
వచ్చింది గాయత్రి ఇంకా ఆదిత్య.
" ప్రేమ్ .." అన్న గాయత్రి పిలుపుకి అటువైపు చూస్తాడు.
వాళ్ల అన్నయ్య ఇంకా అమ్మని అక్కడ చూసి ప్రేమ్ ఆశ్చర్యపోతాడు.
" మా నువ్వేంటి ఇక్కడ "
"చిన్నోడా నువ్వేంటి ఇక్కడ "
గాయత్రి గారు ఇంకా ప్రేమ్ ఒకేసారి అంటారు
కొనసాగుతుంది....
*****
తప్పులు ఏమైనా రాసి ఉంటే క్షమించగలరు.