Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

యూ ఆర్ మై డెస్టినీ - 16

ప్రేమ్ ఈ రోజు ఎలాగైనా ప్రియా తో తనమీద అన్న ఫీలింగ్స్ బయట పెడదాము  అని అనుకుంటాడు , అందుకే ఆ స్టెప్  తీసుకున్నాడు కానీ, ప్రియా కళ్ళల్లో నీళ్లు చూసిన ప్రేమ్ కి బాధగా అనిపిస్తుంది , ఈ టైం కరెక్ట్ కాదేమో అని అనుకుంటాడు ,  తన కోపాన్ని తగ్గించుకొని ,  ప్రియా నీ బెడ్ మీద కూర్చోబెట్టి  తన మొహాన్ని  రెండు చేతుల్లోకి తీసుకుంటూ "ఏడవకు బంగారం నువ్వు ఏడుస్తే నేను చూడలేను రా,  ప్లీజ్ ఏడవద్దు " అని లాలనగా అంటూ తన కళ్ళు తుడుస్తాడు. 

ప్రియా కి ఇంకా ఇంతకుముందు జరిగిందే గుర్తుకు వస్తూ ఉంటుంది .  ప్రేమ్ తనకి ముద్దు పెడుతుంటే తను ఎందుకు కాదనలేదు అని , తనకి ఆ క్షణం ఏం జరిగిందో కూడా తనకి అర్థం కాలేదు,   ప్రేమ్ తన దగ్గరలో ఉన్నప్పుడు  ఏదో తెలియని ఫీలింగ్ . అతనికి దగ్గరగా ఉండాలనిపిస్తుంది,  అతనితో ఉంటే టైం తెలీదు తనకి . అతను చేసే అల్లరి అంటే ఇష్టం . అతని మొహం ఒకరోజు చూడకపోయినా ఎందుకో బాధగా అనిపిస్తుంది . ఒక్కొక్కసారి తనకి బాధగా అనిపించినప్పుడు ముందుగా గుర్తుకు వచ్చే మొహం ప్రేమ్ ది ,  అతని వాడిలో పడుకోవాలని , అతని హాగ్ చేసుకోవాలని, అతని హార్ట్ బీట్ వింటూ ఉండాలని అనిపిస్తూ ఉంటుంది .
కానీ ఈ ఆలోచనలు ,ఇవి అన్నీ కూడా తనకి నచ్చడం లేదు , ఇదంతా కూడా ప్రేమ అని అంటే ఒప్పుకోవడానికి తన మనసు అంగీకరించట్లేదు,  అందుకే కావాలని ఎప్పుడూ ప్రేమ్ ని దూరం పెడుతూ ఉంటుంది , ఎప్పుడు విసుక్కుంటూనే ఉంటుంది , అతనికి దూరంగా వెళ్లాలి అనుకుంటుంది కానీ తనకి తెలియకుండానే అతనికి దగ్గరవుతుంది. తన మనసు పడే సంఘర్షణ తనకి మాత్రమే తెలుసు.

ప్రేమ్ దగ్గరలో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని వచ్చి ప్రియా కి తాగమని ఇస్తాడు.

ప్రియా ఆ బాటిల్ ని దూరంగా నెడుతూ " నాకు వద్దు , ప్లీజ్ కొంచెం సేపు నన్ను ఒంటరిగా వదులుతావా " అని అంటుంది.

ప్రియా నీ అలా చూసిన ప్రేమ్ ఏమనుకున్నాడో ఏమో కొంచెం సేపు ఆలోచించి " లేదు బంగారం ఇప్పుడు మనం కిందకి వెళ్ళాలి అందరూ మన కోసం వెయిట్ చేస్తున్నారు , ఫస్ట్ నువ్వు ఈ వాటర్ తాగు " అని ఇస్తాడు.

ప్రియా దాన్ని తీసుకోకపోవడంతో , " ఇదిగో ఇప్పుడు నువ్వు ఈ వాటర్ తాగలేదు అనుకో,  నా నోటితో నీ నోటికి అందిస్తాను ఏమంటావ్"  అని అంటూ కన్ను కొడతాడు.

ఆ మాట వినగానే ప్రియా కి కోపం వచ్చి ప్రేమ్ వైపు కోపంగా  చూసి తన పెదవులు తుడుచుకుంటుంది , ఇందాకడ ముద్దు గుర్తుతెచ్చుకుంటూ. 

ప్రేమ్ , ప్రియ యాక్షన్ కి లైట్ గా స్మైల్ ఇస్తూ  "నువ్వు ఇప్పుడు  ఎంత తుడుచుకున్నా లాభం  లేదు బంగారం , నీ ఫస్ట్ కిస్ ఆల్రెడీ నేను తీసేసుకున్నాను" అని అంటాడు. 

ప్రియా కి నిజంగా ఏం చేయాలో అసలు అర్థం కాదు,  నిజంగా ఇది తన ఫస్ట్ కిస్, ఇలా తాను ప్రేమ్ కి తన ఫస్ట్  కిస్ ఇస్తుందని ఎప్పుడూ ఊహించలేదు . ఏదైతే జరిగిపోయింది  అయితే తను మార్చలేదు ఇకపైన ఇలాంటివి జరగకుండా ఉండాలి అని గట్టిగా అనుకుంది. 

ప్రేమ్ , ప్రియా మనసులో మాట చదివినట్లుగా "నువ్వు ఎంత గట్టిగా అనుకున్న ఈరోజు నుంచి  మన పెళ్లి  దాకా నీకు రోజుకో ముద్దు ఇస్తాను చూసుకో , అండ్ ఆఫ్కోర్స్ మన పెళ్లయ్యాక కూడా ఇస్తాను అనుకో అది వేరే విషయం" అని ఛాలెంజింగ్ గా  అంటాడు నవ్వుతూ.

ప్రియా ప్రేమ్ చాలెంజ్ కి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేస్తోంది  ' ఏంటి రాజుకో ముద్దు పెడతాడా'   వెంటనే తేరుకుంటూ "  నేను చూస్తాను , అది ఎలా జరుగుతుండో " అని అంటుంది. 

" అయితే ఈ చాలెంజ్ కి ఓకేనా బంగారం"  అని అడుగుతాడు ప్రేమ్ సైడ్ స్మైల్ ఇస్తూ.

ప్రియా దానికి ఒప్పుకోకుండా "  నేను నీతో చాలెంజ్ చేస్తున్నాను , నీకు నువ్వుగా ఈ పెళ్లి వద్దు అని నీ నోటితో నువ్వే చెప్పేలాగ చేస్తాను ఇది నా చాలెంజ్ " అని అంటుంది.

" ఆది కలలో కూడా జరగదు బంగారం" అని అంటాడు ప్రేమ్.

" ఒకవేళ జరిగితే " అని కళ్ళు ఎగరేస్తుంది ప్రియా.

ప్రేమ్ ఏదో చెప్పేలోగా ఇంతలో తలుపు ఎవరో కొడతారు. వచ్చింది గోపి " చిన్నమ్మ గారు,  చిన్నయ్య గారు , పెద్దయ్య గారు మిమ్మల్ని కిందకి రమ్మని పిలిచారండి , పంతులుగారు మీ జాతకాలు చూస్తున్నారు అని చెప్పారు,  మిమ్మల్ని వెంటనే కిందకి రమ్మని అంటున్నారు" అని చెప్తాడు .

" మీరు వెళ్ళండి తాత మేము వస్తున్నాం"  అని అంటాడు ఫ్రేమ్.
గోపి ప్రేమ్ వైపు చూసి సిగ్గుపడుతూ కిందకి వెళ్ళిపోతాడు. కానీ ప్రేమ్ అది అంతగా గమనించడు. 

గోపి వెళ్ళగానే ప్రియా వైపు చూసి "  అలా ఎప్పటికీ జరగదులే గాని బంగారం. నిన్ను పెళ్లి చేసుకోవడం నా డెస్టినీ , అది ఎవరు ఆపలేరు, సో నన్ను పెళ్లి చేసుకోవడానికి మెంటల్ గా ప్రిపేర్ అయిపో,  అండ్ కొంచెం  ఈ వాటర్ తాగు,  లేదంటే ఇందాకడ చెప్పినట్లుగా నీకు వాటర్ తాగిస్తాను"  అని అంటాడు.

ప్రియా కోపంగా ఏమీ మాట్లాడకుండా  ప్రేమ్ ఇచ్చిన వాటర్ కాకుండా వేరే బాటిల్ లోని వాటర్ తీసుకుని తాగి కిందకు వెళ్తుంది,  తనకి ఎందుకో ప్రేమ్ వైపు చూడాలి అనిపించలేదు , బహుశా సిగ్గు తోనో లేదా కోపంతో కావచ్చు . ప్రియా ప్రేమ్ వైపు చూసి ఉంటే మందు జరిగే దాన్ని ఆపగలిగే దేమో.
ప్రియా అలా తనని చూడకుండా కిందకి వెళ్తుంటే ప్రేమ్ కూడా వెనకాలే నవ్వకుంటు నడుస్తాడు.

వాళ్ళ ఇద్దరూ అలా కలిసే కిందకి వస్తుంటే చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు .  వాళ్ల ఇద్దరినీ అలా చూస్తుంటే జగదీశ్ చంద్ర కి వాళ్ళిద్దరూ పెళ్లి బట్టలలో కిందకి నడుచుకుంటూ వస్తున్నట్లు కనిపిస్తుంది. తన కూతురి పెళ్లిచూసే క్షణం కోసం ఆయన చాలా ఎదురు చూశాడు ఇన్నాళ్ళకి అతని కళ నెరవేర బోతుంది. 

ఆదిత్య వారిద్దరిని చూసి " వావ్ ..మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్"  అని అంటాడు.

నిఖిల్ కూడా ఆదిత్య మాటలకి " అవును నిజంగా అలాగే ఉన్నారు కదూ " అని శైలు వైపు తిరిగి అంటాడు. శైలు అతని మాటలకి తల ఊపుతుంది అవును అన్నట్లు.

అక్షయ మాత్రం దీర్ఘంగా ప్రేమ్ వైపే చూస్తూ ఉండడం చూసిన ఆదిత్య " ఏంటే అలా చూస్తున్నావ్ మళ్ళీ ఈ చిట్టి బుర్రలో మళ్ళి ఏం మెదులుతుంది " అని అడుగుతాడు.

" ఏవండీ  ప్రేమ్ ఫేస్ లో ఏంటి నాకు ఏదో తేడా కనిపిస్తుంది " అని అడుగుతుంది. 

" ఏముంది ఈరోజు వాడి ఎంగేజ్మెంట్ కదా , అది కూడా వాడు ప్రేమించిన అమ్మాయితో , అందుకని వాడి ఫేస్ వెలిగిపోతుంది అంతే " అని అంటాడు ఆదిత్య.

" అది కాదండి ఒకసారి క్లియర్ గా గమనించండి"  అని అంటుంది అక్షయ.

అక్షయ మాటలు పక్కనే ఉన్న నిఖిల్ ఇంకా శైలు కూడా వింటారు వాళ్లు కూడా ఏం తేడా ఉందో అని ప్రేమ్ నీ చూస్తూ ఉంటారు.

ఆదిత్య కూడా ప్రేమ్ ఫేస్ వైపు అలా చూస్తూ ఉండగా , అతని చూపు ప్రేమ్ పెదవులపై నిలుస్తుంది , ఎందుకంటే ప్రేమ్ పెదవులు ఎర్రగా కనిపిస్తాయి  , అవి లిప్స్టిక్ మార్క్స్ అని అర్థం అవ్వగానే అతని కళ్ళు పెద్దవి అవుతాయి . వెంటనే ఆదిత్య ప్రియా లిప్స్ వైపు చూస్తాడు , ప్రియా లిప్ షేడ్ కొంచెం డల్ అయినట్టు అనిపిస్తుంది.

ఆదిత్య మనసులో ' ప్రేమ్ నిన్ను నేను తక్కువ అంచనా వేశాను రా ,  నిశ్చితార్థం ఇంకా అవకుండానే అప్పుడే ముద్దుల వరకు వెళ్ళిపోయావా , హ్మ్మ్ , పర్వాలేదు నైస్ ప్రోగ్రెస్ ' అని అనుకుంటాడు.

అక్షయ కి ఏదో అర్థం అయినట్లు ఎక్సైట్  అవుతూ "ప్రియా .. మీ ఇద్దరు " అని ఏదో అనబోతుంటే వెంటనే ఆదిత్య అక్షయ నోరు మూసేస్తాడు. ఎందుకంటే అక్షయ నోట్లో ఏది ఆగదని అతనికి బాగా తెలుసు అందులోను చుట్టూ పెద్దవారు ఉన్నారు అని అలా నోరు మూసేస్తాడు.

శైలు కూడా ఏదో అర్థం అయినట్లు కళ్ళు పెద్దవి చేసి నిఖిల్ వైపు చూసి "  ప్రియ ఇంకా ప్రేమ్ .." అని ఏదో అనబోతుంటే  నిఖిల్ కూడా శైలు నోరు మూసేస్తాడు.

"ఉష్.." అని ఆదిత్య ,అక్షయ తో, నిఖిల్, శైలు తో అంటారు మాట్లాడద్దు అన్నట్లు.

ఇంతలో ప్రేమ్ ఇంకా ప్రియా కిందకి వస్తారు ఆదిత్య అక్షయ నోరు ముయ్యటం నిఖిల్ ఏమో శైలు నోరు ముయ్యటం చూసి "  ఏమైంది మీకు వాళ్ళ నోరుళ్ళు ఎందుకు ముస్తునారు"  అని అయోమయంగా అడుగుతుంది.

ఆదిత్య అక్షయ చెవిలో " నోరుమూయ్ చుట్టూ పెద్దవాడు అందరూ  ఉన్నారు,  వీళ్ళతో మనం తర్వాత డీల్ చేద్దాం"  అని  ప్రియా ఇంకా ఫ్రేమ్ వైపు చూస్తూ అంటాడు.
అక్షయ సరే అంటూ తలకాయ ఊపడంతో తన నోటి మీద ఉన్న చేతిని తీసేస్తాడు ఆదిత్య.

' స్వీటీ నా మరిది అంటే ఇష్టం లేదు,  ఇష్టం లేదు అంటూనే వాడికి ముద్దులు కూడా పెడుతున్నావే నువ్వు , నీ పని ఇప్పుడు కాదే తర్వాత చెప్తాను ఉండు '  అని తన మనసులో అనకంటూ ప్రియా వైపు కొంచెం సీరియస్ గా చూస్తుంది. 

సడన్గా అక్షయ ప్రియా నీ ఎందుకలా చేస్తుందో ప్రియా కి అర్థం కాదు ' ఏమైంది దీనికి నన్ను అలా చూస్తుంది'  అని ఆలోచిస్తుంది

" పెద్దవాళ్ళు ఉన్నారు సైలెంట్ గా ఉండు"  అని అంటాడు నిఖిల్,  శైలు వైపు చూసి. శైలు అర్థమైనట్లు తలకాయ ఊపాడంతో తన చేయని తీస్తాడు.

నిఖిల్ చెయ్యి తీసిన వెంటనే నిఖిల్ చెవులు కొరికేస్తుంది శైలు " ముద్దు పెట్టుకుంటే పెట్టుకున్నారు కానీ  , ఇలా కిందకు వచ్చే మందు కొంచెం చూసుకొని వస్తే అయిపోతుంది కదా , అటు చూడు ప్రేమ్ లిప్స్ మీద  ప్రియ లిప్స్టిక్ మార్కె ఎలా ఉన్నాయో ఇప్పుడు పెద్దవాళ్ళు గమనిస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి , ముందు ఏదో ఒకటి చెయ్ ప్రియా ని సేవ్ చేయరా " అని అంటుంది.

" వాళ్లు అలా కిందకి వచ్చేస్తే ఇప్పుడు నన్నేం చేయమంటా ? నేనేం చేయలేను నువ్వే ఏదో ఒకటి చెయ్ " అని అంటాడు నిఖిల్.

ప్రియా కి ఇష్టం లేకుండా ప్రేమ్ గనక తనని ముట్టుకుంటే ప్రియా ఈపాటికి గోల గోల చేసేది తన ఫ్రెండ్స్ అందరికీ కూడా మెసేజ్ చేసేది కానీ అలా ఏం జరగలేదు ,  ప్రియా ప్రేమ్ ఇద్దరు ప్రశాంతంగా కలిసి కిందకు వచ్చారు దీన్నిబట్టి చూస్తే , ప్రియా కూడా ప్రేమ్ ని ఇష్టపడుతుంది అని నిఖిల్ అనుకున్నాడు . వాళ్లందరూ కిందకి వచ్చిన తర్వాత వీరిద్దరి మధ్యలో ఏం జరిగిందో నిఖిల్ కి ఐడియా లేదు ,  కానీ ప్రేమ్ పెదవుల పైన లిప్స్టిక్ మార్క్స్ చూస్తే వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో నిఖిల్  ఊహించగలిగాడు. 
ఇన్ఫాక్ట్ ప్రియా లైఫ్ లో ము ఆన్ అయినందుకు నిఖిల్ చాలా సంతోష పడుతున్నాడు.

పెద్దవాళ్లు అందరూ పిల్లలు ఇద్దరూ కిందకి రావడంతో ,  ఆత్రుతగా పంతులు గారు ఏమి చెప్తారు, వీళ్ళ ఇద్దరి జాతకాలు ఎలా ఉన్నాయి , ఆయన ఏ ముహూర్తం పెడతాడు అని పంతులుగారి వైపే చూస్తూ ఉంటారు వీళ్ళని పట్టించుకోకుండా.

పెద్దవాళ్ళ వీళ్ళని గమనించక ముందే ప్రేమ్ తన లిప్స్టిక్ మార్క్స్ ని తుడుచుకుంటే బెటర్ అని అనుకుంది శైలు అందుకే ప్రియా వైపు ప్రేమ్ వైపు చూసి చేతితో ఏదో సైగ చేయడం మొదలు పెట్టింది. 

శైలు తన చేతిని ప్రియా వైపు ప్రేమ్ వైపు మార్చి మార్చి పాయింట్ చేస్తూ ,  మళ్ళీ ఆ చేతిని శైలు లిప్స్ దగ్గర పెట్టుకుంటూ వాళ్ళకి సిగ్నల్స్ చేయడం మొదలుపెట్టింది ఆ లిప్స్టిక్ మార్క్స్ తోడుచుకోండి మీ ఇద్దరు అన్నట్లు.

శైలు ఏం చెప్పడానికి ట్రై చేస్తుందో ప్రియ ఇంకా ప్రేమ్ కి అర్థం కాదు.

అసలే అక్షయ తనని ఎందుకలా చూస్తుందో అర్థం కాని ప్రియా కి శైలు ఏం చెప్పడానికే ట్రై చేస్తుందో అర్థం కాక గట్టిగా మాట్లాడుతూ " ఏం జరిగిందే నా ఫేస్ కి ఏమన్నా అంటుకుందా ఏంటి? "  అని అడుగుతుంది. 

ఆ మాట వినగానే పెద్దవాళ్లు అందరూ  కూడా శైలు వైపు ఇంకా ప్రియా వైపు చూస్తారు. 
ప్రియా అలా మాట్లాడేసరికి తన నెత్తి కొట్టుకుంటుంది శైలు" చి చి ..దీని సేవ్ చేద్దాం అని నేను అనుకుంటే , దాని గోయ్య అదే తావుకుంది, ఇక  దీన్ని ఆ కృష్ణయ్య కాపాడాలి "అని అనుకుంటుంది.

ప్రియా తన మొహం తడుముకుంది,  ఏమైనా అంటుకుందా అన్నట్లు.

ఇంతలో అక్కడున్న పెద్ద వాళ్ళు అందరూ కూడా ప్రేమ్ లిప్స్ మీద ఉన్న లిప్స్టిక్ మార్క్స్ చూడనే చూస్తారు ఇంకా ప్రియ నీ. అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ  వారిలో వారు ముసి ముసిగా నవ్వుకుంటూ ఉంటారు.

గురుదీప్ గాయత్రి వైపు చూసి "  నీ చిన్న కొడుకు సామాన్యుడు కాదే " అని అంటాడు.
ఆయన మాటలకి " అన్ని మీ పోలికలే " అని అంటారు గాయత్రి గారు.

జగదీష్ చంద్ర ఇంకా సునంద కూడా తమ కూతురు , ప్రేమ్ ని ఇష్టపడుతుంది అని గమనించి చాలా సంతోషపడతారు.

ఊర్మిళాదేవి మాట్లాడుతూ "  మనవరాలా నీకు వాడు అంటే ఇష్టం ఉందని నాకు అర్థం అయింది , మరి ఇలా చూపించిన అక్కర్లేదు"  అని నవ్వుతారు , వెంటనే పంతులు గారి వైపు చూసి " పంతులు వెంటనే దగ్గరలో మంచి ముహూర్తం చూడవయ్యా ,  వీళ్ళు పెళ్లి కాకుండానే నా చేతిలో ముని మనవడిని పెట్టేలాగా ఉన్నారు"  అని అంటారు.
ఊర్మిళాదేవి మాటలకు అక్కడ ఉన్న పెద్దవాళ్ళు అంతా మసి మసిగా నవ్వుకుంటూ ఉంటారు

ఊర్మిళాదేవి మాటలు ప్రియా కి ఏమి అర్థం కావు " ఏమైంది దేనికి ఇలా మాట్లాడుతుంది"  అని అయోమయంగా చూస్తుంది.

వారు అలా నవ్వుకుంటుంటే ,ప్రేమ్ ఆదిత్య వైపు చూసి  ఏమయింది అన్నట్లు కళ్ళతో అడుగుతాడు.
ఆదిత్య ఒకసారి నీ ఫేస్ చూసుకో అన్నట్లు సైగ చేస్తాడు.

ప్రేమ్ తన పాకెట్ లో ఫోన్ బయటకి తీసి  , ఫ్రంట్ కామ్ ఓపెన్ చేస్తాడు. ప్రేమ్ తన ఫేస్ చూసుకునే లోపు, ప్రియ  ఆ ఫోన్ ప్రేమ్ చేతిలో నుంచి తీసుకొని తన ఫేస్ చూసుకుంటుంది ప్రేమ్ ఫోన్ లో .
  ప్రేమ్ ప్రియా చేసిన దానికి నవ్వుకుంటూ తను కూడా కొంచెం వంగి  ప్రియా తో పాటు తన ఫేస్ కూడా అందులో  చూసుకుంటాడు .
వాళ్ళిద్దరి పేస్ చూసుకోగానే ,  వాళ్ళ కళ్ళు పెద్దవి అవుతాయి.
ప్రేమ్ ఫేస్ లో  చిరునవ్వు వస్తె,  ప్రియా ఫేస్ లో మాత్రం టెన్షన్ కనిపిస్తుంది.

' హే రామ్ ఇలా జరిగింది ఏంటి ? వీడు నన్ను కిస్ చేస్తున్నప్పుడు నా లిప్స్టిక్ మార్క్స్ వాడికి అంటుకున్నట్లు ఉన్నాయి,  నేను చూసుకోలేదు , శైలు దిని గురించే చెప్పిందనుకుంటా,  నేనేమో గట్టిగా అరిచి చచ్చాను . ఇప్పుడు వీళ్ళందరూ చూసేసి ఉంటారు ,ఇప్పుడు మా గురించి ఏమనుకుంటారో ఏంటో వీళ్ళు . వీళ్ళకి ఇప్పుడు నేను ఏమని సమాధానం చెప్పాలి.  కృష్ణయ్య ఏంటయ్యా ఇది వీడిని నా నుంచి దూరం చేయాలి అని నేను ప్లాన్స్ చేస్తుంటే, ఇప్పుడేమో మమ్మల్ని ఇలా చూసి వీళ్ళందరికీ వేరే లాగా కన్వే అయ్యేటట్టు ఉంది , ఇప్పుడు ఈ ముసల్ది  మా ఇద్దరికీ పెళ్లి చేసేదాకా వదిలిపెట్టదు ..... ముందుగా లిప్స్టిక్ మార్క్స్ వెంటనే తుడిపేయాలి' అని తన మనసులో అనుకుంటుంది ప్రియా.

ప్రియా వెంటనే ప్రేమ్ వైపు చూస్తుంది, ప్రేమ్ మాత్రం ప్రియా నీ  చూసి నవుతు కన్ను కొడతాడు.
ప్రియ వెంటనే ఆ లిప్స్టిక్ మార్క్స్ తుడవడానికి ప్రేమ్ దగ్గరికి వెళ్ళబోతుంటే,  తను ఏం చేయబోతుందో మందగానే ఊహించిన ప్రేమ్ తనకి దొరక్కుండా వెనక్కి జరుగుతాడు.

అదే టైంలో నితిన్ ఇంకా అరుణ్ కూడా లోపలికి వస్తారు. 

ప్రియా వెంటనే వాళ్ళ డాడీ వైపు చూసి " దాడి... మీరు ...అనుకున్నట్లు కాదు .... ఐ కెన్ ఎక్స్ప్రెస్ ..
.....అది వేరే ......మీరు అనుకున్నట్లు కాదు ...
అది... ఆది..." అని తడబడుతూ ఏదో చెప్తుంది.

ప్రియా ఎందుకు అలా టెన్షన్ పడుతుందొ ఇంకా వాళ డాడీకి ఏమి ఎక్స్ప్లైన్ చేయడానికి ట్రై చేస్తుందో నితిన్ ఇంకా అరుణ్ కి అర్థం కాదు.
" ప్రియా ఎందుకు అలా టెన్షన్ పడుతుంది " అని అడిగిన అరుణ్  ప్రశ్నకి నిఖిల్ సమాధానం ఇస్తూ "ఏముంది ఈ ప్రేమ్ గాడు ఏదో చేసి ఉంటాడు"  అని కోపంగా అంటాడు.

ఊర్మిళాదేవి ప్రియా పడుతున్న టెన్షన్ కి నవ్వుతూ "మాకు తెలుసులేవే.. నువ్వు ఏమి ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు మీ బావ ముద్దొచ్చి ముద్దు పెట్టుకున్నావ్ అంతే కదా.  మాకేమి అభ్యంతరం లేదులే అంతగా టెన్షన్ పడకు , వాడు నీకు కాబోయే భార్తే కదా , అయినా ఈ కాలంలో ఇవన్నీ కామన్ అని నాకు తెలుసులే , అలా అని ముద్దుల వరకే సుమీ ముందుకు మాత్రం వెళ్ళకండి పెళ్లి అయ్యేవరకు , ఒక్కసారి ఆ మూడు ముడుళ్లు పడిపోయాయి అంటే మిమ్మల్ని ఎవరు ఆపరులే" అని నవ్వుతూ అంటారు.

ఆ మాటలు వినగానే నితిన్ గుండె పగిలినట్టు అవుతుంది వెంటనే ప్రేమ్ వైపు చూస్తాడు, ప్రేమ్ లిప్స్ పైన లిప్స్టిక్ మార్కెట్ చూస్తే, అతని మనసు బాధగా మారిపోతుంది, ఒకేసారి ప్రేమ్ ని చంపేయాలి అన్నంత కోపం ఇంకా ప్రియా తనకి దూరం అవుతుందేమో అన్న బాధ కలుగుతుంది.

ఊర్మిళాదేవి మాటలకు ప్రేమ్ సిగ్గుపడితే ప్రియా మాత్రం కళ్ళు పెద్దవి చేసి మరి చూస్తుంది .' ఏంటిది ముద్దులు పెట్టుకోమని అంత ఓపెన్ గా చెప్పేస్తుంది, వీడికి ఆ ఛాన్స్ ఇస్తే ఏమైనా ఉందా, అసలే వీడు ఇందాకడ చాలెంజ్ చేసి చచ్చాడు నాతో '  అని అనుకుంటుంది.

ప్రేమ్ ప్రియా వైపు వంగి తనకు మాత్రమే వినిపించేలా " బంగారం ముద్దులకి ఆల్రెడీ పర్మిషన్ వచ్చేసింది , మరి ట్రై చేద్దామా రోజుకో రకంగా"  అని అంటూ కన్ను కొడతాడు.

ఇంతలో పంతులుగారు మాట్లాడుతూ " అమ్మ వీళ్ళ ఇద్దరి జాతకాలు విడివిడిగా చూస్తే చాలా బాగా ఉన్నాయి. కానీ కలిపి చూస్తేనే అంతగా బాగోలేదు వీళ్ళి ఇద్దరికీ పెళ్లి చేస్తే ఇంట్లో ఉన్న పెద్దవారు కి మరణ గండం "  అని అంటాడు.

ఆ మాట వినగానే ఇప్పటివరకు ఉన్న అందరి మొహాల్లో ఆనందం మాయమైపోతుంది , ఈ పెళ్లి ఆపాలి అనుకున్న ప్రియా కి కూడా ఆ మాటలు ఎందుకో అంతగా నచ్చలేదు. అప్రయత్నంగా ప్రేమ్ వైపు బాధగా చూస్తుంది,  తనకి తెలియకుండానే ప్రియా కంట్లో నుంచి నీరు. తన కంట్లో నీరు చూడగానే ప్రేమ్ కి ఏదో గెలిచాను అన్న ఫీలింగ్. ప్రేమ్ ప్రియా భుజం మీద చేయి వేసి నేను ఉన్నాను నేను చేసుకుంటాను అన్నట్లు కళ్ళు ఆర్పుతాడు. 

వీళ్ళ అందరికీ భిన్నంగా పంతులు గారి మాటల వినగానే నితిన్ మొహంలో ఆనందం తొంగి చూసింది . అరుణ్ కూడా చాలా సంతోషపడ్డాడు.

కొనసాగుతుంది........

****
ఇంతకీ వీళ్ళ పెళ్లి జరుగుతుందా? ఇప్పుడు ప్రేమ్ ఏం చేయబోతున్నాడు ?  ప్రియా ప్రేమ్ మీద ఉన్న తన ప్రేమని ఒప్పుకుంటుందా? 
మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి చూద్దాం. 

తప్పులు ఏమైనా రాసి ఉంటే క్షమించగలరు.