గాయత్రి ఇంకా సునంద గారు ప్రియా రూమ్ వైపు వస్తూ ఉంటారు గాయత్రీ గారి చేతిలో ఫ్రూట్ బౌల్ పట్టుకొని ఉంటారు , అది అక్షయ కోసం .
లోపల జరుగుతుంది చూసిన వారి ఇద్దరి మొహాల్లో ఆనందం విచ్చుకుంటుంది . ఎందుకంటే అక్కడ అక్షయ బెడ్ మీద కూర్చుని ఉంటే ప్రియా ఇంకా శైలు , అక్షయ బేబీ బంప్ తో ఏదో మాట్లాడుతూ ముసి ముసిగా నవ్వుకుంటూ ఉన్నారు . ప్రియ , అక్షయ కడుపులో అన్న బేబీస్ తో ఏదో మాట్లాడుతూ మధ్య మధ్యలో అక్షయ కి ఫ్రూట్ తినిపిస్తుంది.
ప్రియా అక్షయ విషయంలో చాలా కేరింగ్ గా ఉంటుంది అక్షయ ప్రెగ్నెంట అని తెలిసినప్పటినుంచి తన మీద ఎక్కువగా కేర్ ప్రియా నే తీసుకుంటుంది అక్షయ డైట్ ప్లాన్స్ అన్ని కూడా రాసి వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి ఇచ్చి ఉంటుంది, ఎప్పటికప్పుడు తన డైట్ ప్లాన్ ఎలా ఉంటుందో , అక్షయ హెల్త్ ఎలా ఉంటుందో , తన పొట్టలో పెరుగుతున్న బేబీస్ హెల్త్ ఎలా ఉంటుందో అన్ని కూడా తెలుసుకుంటూనే ఉంటుంది.
గాయత్రి గారు ప్రియా వైపు ప్రేమగా చూస్తూ "ఇన్నాళ్లుగా ప్రియ నా పక్కనే ఉన్న , తనలో నా తమ్ముడు ఇంకా నాన్నగారి పోలికలు కనిపిస్తూ తను నా మేనకోడలు అని తెలుసుకోలేకపోయాను మీది ఎంత విచిత్రమైందో కదా" అని అంటారు.
" అవును వదిన నీతో నాకు ఇంతకుముందు పరిచయం అయినా సరే నువ్వే నా వదిన అని నేను తెలుసుకోలేకపోయాను భలే గమ్మత్తుగా ఉంది కాదు" అని అంటారు సునంద గారు.
గాయత్రి గారు నవ్వుతూ ప్రియా డ్రెస్ వైపు చూసి "అవును నిజమే ఆరోజు మనిద్దరం కలిసి ఆ కపుల్ డ్రెస్సెస్ తీసుకున్నప్పుడు మనం ఊహించలేదు మన పిల్లలు నిజం గానే కపుల్స్ అవుతారు అని, అందులోనూ ఈరోజు మన పిల్లలు ఇద్దరు కూడా అదే డ్రెస్ వేసుకున్నారు ఇద్దరు కూడా ఆ కపుల్ డ్రెస్సెస్ లో ఎంత చూడముచ్చటగా ఉన్నారో కదా " అని నవ్వుతారు ఆరోజు గుర్తుతెచ్చుకుంటూ.
ఒక వారం క్రితం గాయత్రి గారు షాపింగ్ కి వెళ్ళినప్పుడు అదే షాపింగ్ మాల్ కి సునంద గారు కూడా వస్తారు. వారి ఇద్దరికీ కూడా అక్కడ ఉన్న కపుల్ డ్రెస్సెస్ నచ్చుతాయి .
ముందుగా గాయత్రి గారు అక్కడ ఉన్న జెన్స్ డ్రస్ ప్రేమ్ కి చాలా బాగుంటుంది అని వెళ్లి ఆ డ్రెస్ అడిగితే వాళ్ళు విడిగా ఇవ్వలేము తీసుకుంటే సెట్ గా తీసుకోవాలి అని అంటారు సో గాయత్రి గారు అది వదిలేసి పక్కన ఇంకొక దాని కోసం వెతుకుతూ ఉంటారు .
అదే టైంలో సునంద గారు కూడా ఆ గర్ల్ దాస్ కోసం అడిగితే సేల్స్ గర్ల్ విడిగా ఇవ్వడానికి కుదరదు అని కళాకండిగా చెప్పేస్తుంది.
సునంద గారు ఎంత డబ్బులు ఖర్చయినా పర్వాలేదు అడ్రస్ కొనడానికి ట్రై చేస్తుంది కానీ ఆ సేల్స్ గర్ల్ దానికి ఒప్పుకోదు , ఎందుకంటే అది వల్ల నియమాలకి విరుద్ధం అని . సునంద గారు డల్ అయిపోతూ మిగతా డ్రెస్సెస్ ఏమైనా బాగుంటాయేమో అని మిగతా డ్రెస్ కోసం వెతుకుతూ ఉంటారు. కానీ ఆవిడకి అవి ఏమీ నచ్చవు ఆవిడ మనసంతా కూడా ఆ కపుల్ డ్రెస్ మీదే ఉంటుంది.
అలా షాపింగ్ చేస్తున్న సునంద గారి దగ్గరికి గాయత్రి గారు వస్తారు.
" మీకు ఆ డ్రెస్ చాలా నచ్చింది కదూ ?" అని అడుగుతారు.
సునంద గారు " అవునండి చాలా బాగుంది మా పాప కోసం తీసుకుందాం అనుకున్నాను కానీ వాళ్ళు వీడిగా ఇవ్వను అంటున్నారు " అని చెప్తారు.
" మీరు ఒప్పుకుంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది" అని అంటారు గాయత్రి గారు.
సునంద గారు " ఏమిటది ?" అని అడుగుతారు.
" నాకు కూడా ఆ బాయ్ డ్రెస్ చాలా బాగా నచ్చింది మా చిన్న కొడుకుకి తీసుకుందాం అని అనుకున్నాను కానీ వాళ్లు తీసుకుంటే కపుల్డ్ గానే తీసుకోవాలి అని అంటున్నారు ఎలాగో మీకు ఆ గర్ల్ డ్రెస్ నచ్చింది కాబట్టి ,మనం ఇద్దరం కలిసి ఆ డ్రెస్సెస్ కలిసి కొందాము మీరు గర్ల్ డస్ తీసుకోండి నేను బాయ్ డ్రెస్ తీసుకుంటాను " అని చెప్తారు గాయత్రి గారు.
సునంద గారికి కూడా ఆ ఐడియా బాగా నచ్చి "సరేనండీ" అని అంటుంది ఆనందంగా.
గాయత్రి ఆ సేల్స్ గర్ల్ దగ్గరికి వెళ్లి వాళ్ళు ఆ డ్రెస్సెస్ తీసుకుంటాము అని అడుగుతారు.
సేల్స్ గర్ల్ వాళ్ళిద్దరిని ఒకసారి చూసి " సారీ మేడం ఇది కపుల్ డ్రెస్సెస్ అంటే కపుల్స్ కి మాత్రమే ఇస్తాము, ఇలా మీరు కొనుక్కొని విడివిడిగా ఆ డ్రెస్సెస్ విడదీస్తాము అంటే ఆ డ్రెస్ కి ఉన్న విలువ పోతుంది మేడం , సారీ మేము అలా ఇవ్వలేము " అని అంటుంది.
సునంద గారు వెంటనే మాట్లాడుతూ " అయ్యో ఎవరు చెప్పారండి మేము విడదీస్తున్నామని యాక్చువల్లీ వీళ్ళ బాబుకి మా పాపకి ఎంగేజ్మెంట్ అని అనుకుంటున్నాము త్వరలో అందుకనే తీసుకుందాం అని అనుకుంటున్నాం అనుకోకుండా ఇలా కలిసామండి " అని అప్పటికప్పుడు అబద్ధం ఆడేస్తారు.
గాయత్రి గారు కూడా " అవునండి నిజమే " అని అంటుంది.
" ఓ..అలా అయితే పర్వాలేదు మేడం నేను వెంటనే డ్రెస్ కి బిల్లు సెటిల్ చేసి ఇస్తాను" అని చెప్పి లోపలికి వెళ్తుంది.
సునంద గారు గాయత్రి గారు సక్సెస్ఫుల్గా ఆ డ్రెస్సెస్ తీసుకున్నందుకు చాలా సంతోషపడుతూ .
ఆ డ్రెస్సెస్ కి బిల్లు పే చేసి బయటికి వచ్చి ఒకరితో ఒకరు పరిచయం పెంచుకోవడానికి కాఫీ షాప్ కి వెళ్లి అక్కడ కొంచెం సేపు గడిపి తర్వాత ఎవరి ఇళ్ళకి వాళ్లు వెళ్లిపోతారు. వాళ్లు వాళ్ల పరిచయంలో వాళ్లు తమ పిల్లల గురించి తప్ప ఫ్యామిలీ గురించి మాట్లాడుకోరు.
గుమ్మం దగ్గర వినిపిస్తున్న నవ్వులకి అటువైపు చూస్తారు అక్షయ, ప్రియ ఇంకా శైలు.
ప్రియా గాయత్రి గారిని చూసి సంతోష పడిపోతూ "ఆంటీ... " అని ఆగి మళ్ళీ తనని తాను కరెక్ట్ చేసుకుంటూ " అత్తయ్య.. అక్కడే ఆగిపోయారే లోపలికి రండి " అని సంతోషంగా లోపలికి ఆహ్వానిస్తుంది.
గాయత్రి గారి లోపలికి వచ్చి ప్రియ నీ హాగ్ చేసుకుంటూ " నువ్వే నా మేనకోడలు అని తెలిసిన తర్వాత నాకు ఎంత సంతోషంగా అనిపించిందో తెలుసా ప్రియా, నిన్ను చూసిన ప్రతిసారి కూడా నీకు నాకు ఏదో ఒక కనెక్షన్ ఉంది అనిపించేది కానీ ఇలా నువ్వు నా తమ్ముడి కూతురివి అవుతావు అని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు " అని సంతోషంగా అంటారు.
" నేను కూడా అత్తయ్య మీరు మా మేనత్త అవుతారని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఇప్పుడు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది" అని అంటుంది , ప్రియ కి గాయత్రి గారు అంటే ఫస్ట్ నుంచి కూడా ఎంతో ఇష్టం , అప్పుడప్పుడు తాను వాళ్ళ ఫ్యామిలీ అయ్యుంటే బాగుండు అని ఎన్నోసార్లు అనుకునేది తన మనసులో , కానీ గాయత్రి గారు నిజంగా తన మేనత్త అవుతుంది అని తను ఎప్పుడు అనుకోలేదు.
గాయత్రి ప్రియా ని చూస్తూ " ఇప్పుడు ఎలా ఉంది తల్లి ఇందాకడ కొంచెం పానిక్ అయ్యావు కదా ఇప్పుడు అంతా బాగానే ఉందా" అని అడుగుతారు.
" చాలా బాగున్నాను అత్తయ్య " అని అంటుంది ప్రియ.
" నీ కొడుకు వల్లే వదిన ప్రియా ఈరోజు నార్మల్ గా ఉంది, నీ కొడుకు నిజంగా ఏదో మాయ చేశాడు , ప్రియా ని ఇట్టే కంట్రోల్ చేయగలిగాడు. నిజంగా అలా అయినా ప్రతిసారీ కూడా ప్రియా ని కంట్రోల్ చేయడం మా వల్ల అయ్యేది కాదు, కానీ ప్రేమ్ లో ఏదో మ్యాజిక్ ఉంది, ఇకపైన నాకు ప్రియా గురించి బెంగ లేదు" అని అంటారు సునంద గారు.
నిజంగా ఇందాకడ అలా అయ్యేసరికి ప్రియా కి ఏమయిందో అని చాలా భయపడ్డారు సునంద గారు , తను స్వయంగా తన కూతురు పడుతున్న బాధని ఎన్నోసార్లు చూసింది తన కూతురిని నార్మల్ ఎలా చేయాలో తనకి అర్థం అయ్యేది కాదు , ఎంతో బాధపడేవారు , తన తల్లి ప్రేమ కూడా తన కూతురిని నార్మల్ చేయలేకపోయింది ఎన్నో డాక్టర్స్ దగ్గరికి వెళ్లారు కానీ పరిష్కారం మాత్రం దొరకలేదు .
కానీ తీరా లోపలికి వచ్చి చూస్తే ప్రియా చాలా ప్రశాంతంగా కనిపించింది , అదంతా ప్రేమ్ వల్ల అని చూసి ఇంకా సంతోషపడ్డారు, ప్రేమ్ వల్లే ప్రియా నార్మల్ అవుతుందని ఆవిడ గట్టిగా నమ్ముతున్నారు.
సునంద మాటలకి అక్షయ మాట్లాడుతూ " నిజమే ఆంటీ, నిజంగా మా మరిది ఏదో మాయ చేస్తాడు ప్రియా విషయంలో " అని నవ్వుతుంది.
ప్రియా వేటకారంగా "అవును నిజంగా మీ మరిది మాయలు చేస్తాడు కాబట్టి అతనిని బిజినెస్ మాన్ గా కాకుండా ఒక మంచి మెజీషియన్ గా చెయ్యమని చెప్పు వరల్డ్ ఫేమస్ మెజీషియన్ అవుతాడు" అని అంటుంది.
" నేను వరల్డ్ ఫేమస్ మెజీషియన్ అవుతానో లేదో నాకు తెలియదు గానీ వరల్డ్ ఫేమస్ లవర్ ని మాత్రం అవుతాను బంగారం " అని అంటూ లోపలికి వస్తాడు ప్రేమ్, అతని వెనకే ఆదిత్య ఇంకా నిఖిల్ కూడా.
ప్రేమ్ నీ చూడగానే కోపంతో మొహం తిప్పుకుంటుంది ప్రియా.
ప్రియా చాలా అంటే చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది, ప్రియ అందానికి మైమరచిపోయి తనని ప్రేమగా చూస్తూ ఉండిపోతాడు ప్రేమ్.
అక్కడ ఉన్న అందరూ కూడా ప్రేమ్ చూపులను గమనిస్తూ ఉంటారు.
ప్రేమ్ తననే అలా చూస్తూ ఉంటే ' వీడేంటి నన్ను తినేసేలాగా అలా చూస్తున్నాడు' అని అనుకుంటుంది ప్రియా
గాయత్రి గారు ప్రేమ్ నీ కదిలిస్తూ " ప్రేమ్ ఇలా వచి ప్రియా పక్కన నుంచో నాన్న మీ ఇద్దరిని ఒకసారి చూసుకో నీవు" అని అంటారు.
ప్రేమ్ వెంటనే వెళ్లి ప్రియా పక్కన నిలబడతాడు. ప్రేమ్ అలా తన పక్కన వచి ముల్లుచుండంతో ప్రేమ్ ని కోపంగా చూస్తుంది ప్రియా.
ప్రేమ్ " అలా చూడకు బంగారం ఇకపై అలవాటు చేసుకో , ఇక పైన నీ పక్కన నుంచునే ఛాన్స్ నాకు మాత్రమే " అని నవ్వుతూ అంటాడు.
ఆదిత్య అదే టైం కి తన ఫోన్ తీసుకొని " ఇటు చూడండి, స్మైల్ " అని అంటూ వాళ్ళిద్దరిని ఫొటోస్ తీస్తాడు.
ఫొటోస్ లో ప్రేమ్ ఫేస్ వెలిగిపోతూ ఉంటుంటే , ప్రియా మాత్రం ప్రేమ్ ని కోపంగా చూస్తూ ఉంటుంది.
ఆదిత్య ఫొటోస్ వైపు చూసి " ఓయ్ మరదల్ కొంచెం నవ్వమ్మా " అని అంటాడు.
ప్రేమ్ ప్రియా వైపు వంగి తనకు మాత్రమే వినపడేలా " ఇప్పుడు కానీ నువ్వు నవ్వలేదు అనుకో మన ఎంగేజ్మెంట్ అయిన టు డేస్ లో మన పెళ్లి ముహూర్తం పెట్టిచేస్తాను , అప్పుడు నీకు ఈ పెళ్లి ఆపడానికి వేరే ఛాన్స్ ఉండదు . ఒకవేళ నువ్వు ఇప్పుడు నవ్వావు అనుకో మన పెళ్లికి ఒక టు ,త్రీ మంత్స్ టైం అన్న అడుగుతాను అప్పుడు నువ్వు ఎన్ని ప్లాన్స్ అన్న వేసుకోవచ్చు ఏమంటావు, నవ్వుతావా? పెళ్లి చేసుకుంటావా? " అని కళ్ళు ఎగరేస్తాడు.
'వేస్ట్ ఫెలో ... వీడు ఇప్పుడు నన్ను బ్లాక్ మెయిల్ చేయడం కూడా మొదలుపెట్టాడు.. ఛి.. , ఇప్పుడు నవ్వితే కనీసం టూ త్రీ మంత్స్ అయినా గ్యాప్ దొరుకుతుంది ఈ గ్యాప్ లో ఏమైనా చేయొచ్చు, జస్ట్ స్మైలే కదా ప్రియా, కమాన్ స్మైల్ ప్రియ యూ కెన్ డు ఇట్' అని అనుకుంటూ స్మైల్ ఇస్తుంది.
ప్రియా నవ్వడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ సంతోషపడతారు ఎందుకంటే ప్రియా ని నవ్వించడం ఒక ప్రేమ్ వల్లే సాధ్యం అవుతుంది అని వాళ్ళందరికీ తెలుసు.
ఆదిత్య ఫాస్ట్ గా వాళ్ళు ఇద్దరినీ ఫిక్స్ తీస్తాడు.
ప్రియా స్మైల్ చేయడంతో నిఖిల్ కూడా వాళ్ళిద్దరి పిక్స్ తీస్తాడు.
సునంద వాళ్ళిద్దరిని చూసి " ఇద్దరు చూడముచ్చటగా భలే ఉన్నారు కదా వదిన, మనం ఆరోజు తీసుకున్న బట్టలు వీళ్ళిద్దరికీ సరిగ్గా సరిపోయాయి కాదు" అని అంటారు.
" అవును వీళ్ళిద్దరికీ ఈరోజు ఎవరి దిష్టి తగలకూడదు" అని అంటూ గాయత్రి గారు తన కాటుక తీసి ప్రియా ఇంకా ప్రేమ్ కి దిష్టి చుక్క పడుతుంది.
సునంద గారు కూడా తన కాటుక తీసి ఇద్దరికీ దిష్టి చుక్క పెడుతుంది.
ఆదిత్య మాట్లాడుతూ " మీ ఈ కాటుక ప్రోగ్రాములు అయిపోతే కిందకు వెళ్దామా పంతులుగారు ఆల్రెడీ వచ్చేసి ఉన్నారు, వీళ్ళ జాతకాలు చూడడానికి , త్వరగా పదండి , కింద అమ్మమ్మ , మామయ్య ఇంకా నాన్న ఎదురు చూస్తున్నారు" అని అంటాడు.
" అవును పదండి కిందకి " అని గాయత్రి గారు సునంద గారు కూడా హడావిడి పెట్టడంతో అందరూ కిందకి నడుస్తారు. నిఖిల్ శైలు చేయి పట్టుకొని కిందకి వెళ్తాడు.
ప్రియా అక్షయ చేయి పట్టుకొని కిందకి వెళ్ళిబోతుంటే ఆదిత్య వచ్చి అక్షయ చేయి పట్టుకుంటాడు.
" బావగారు నేను తీసుకొస్తాను" అని ప్రియా అంటుంటే .
అక్షయ అడ్డుకుంటూ " నువ్వు పట్టుకోవాల్సింది నా చేతులు కాదు నీకు కాబోయే మీ శ్రీవారి చేతులు " అని ప్రియా అని ప్రేమ్ వైపు తోస్తుంది.
ప్రియా వెళ్లి ప్రేమ్ మీద పడుతుంది. ప్రయా నీ కింద పడిపోకుండా ప్రేమ్ గట్టిగా పట్టుకుంటాడు .
వారి ఇద్దరి చూపులు కలుసుకుంటాయి.
అక్షయ ఆదిత్య వైపు చూసి " మనం వెళ్దాం పదండి వాళ్ళు వస్తారు" అని అంటూ ఆదిత్య అని కిందకు తీసుకు వెళుతుంది.
ప్రేమ్ ని అంత దగ్గరగా చూసిన ప్రియా వెంటనే దూరం జరగబోతుంది కానీ తన జుట్టు ప్రేమ్ షర్ట్ బటన్స్ లో ఇరుక్కుంటుంది.
"ఆ ....నా జుట్టు ".
" ఒక నిమిషం బంగారం నేను తీస్తాను " అని అంటూ ప్రేమ్ తనకి సహాయం చేస్తాడు.
" ఏమి అక్కర్లేదు నేనే తీసుకోగలను" అని అంటూ తనే విడిపించుకుంటాకి ట్రై చేస్తుంది.
" నిజం చెప్పనా బంగారం ఈరోజు నువ్వు ఎంత ముద్దొస్తున్నావో, నిన్ను ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది కానీ ఏం చేస్తాం నువ్వు నాకు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు కదా, ఏం పర్లేదు పెళ్లయిన తర్వాత నిన్ను ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టను చూసుకో" అని అంటాడు.
" చ.... మన పెళ్లి జరిగినప్పుడు చూసుకుందాంలే గాని, ముందు ఆ పగటి కలలు కనడం ఆపేస్తే నీకే మంచిది" అని అంటుంది ప్రియా.
" ఒకవేళ మన పెళ్లి జరిగితే?" .
" జరగదు , జరగనివ్వను, నా కృష్ణయ్య నాకు తోడుగా ఉన్నాడు నేను అనుకున్నదే జరుగుతుంది" అని అంటుంది ప్రియా.
" ఒకవేళ నీ కృష్ణయ్య ఈసారి నాకు మద్దతుగా ఈ పెళ్లి జరిగేలాగా దీవిస్తే అప్పుడు ఏం చేస్తావు?" . అని అడుగుతాడు ప్రేమ్
" చూడు ప్రేమ్ , ప్రేమ లేని చోట పెళ్లి నిలవదు, ఒకవేళ నేను ఇచ్చిన మాట కోసమో , పెద్ద వాళ్ల కోసమో ఈ పెళ్లి చేసుకున్న, మనమిద్దరం సంతోషంగా ఉండలేము, నీ మీద నాకు ఫీలింగ్స్ లేవు, నీ మీద నాకు ప్రేమ లేదు, నువ్వు అనుకున్నట్లుగా నేను నిన్ను ప్రేమించలేను , ప్లీజ్ అర్థం చేసుకో " అని అడుగుతుంది తన హెయిర్ నీ సెట్ చేసుకుంటూ.
ప్రేమ్ ప్రియ నీ అమాంతం దగ్గరలో ఉన్న గోడకి అదిమి పెడతాడు , అలా జరిగిన సడన్ రియాక్షన్ కి ప్రియ కళ్ళు పెద్దవి అవుతాయి , ప్రేమ్ తన ఒక చేతితో ప్రియా రెండు చేతులను పట్టుకొని ప్రియ తల పైన గోడకి అదిమిపెట్టి గట్టిగా పట్టుకుంటాడు , ప్రేమ్ ఏం చేస్తున్నాడో అర్థం కాక అయోమయంగా చూస్తున్న ప్రియా కి ఆలోచించుకునే సమయం ఇవ్వకుండా ప్రేమ్ తన ఇంకొక చేయితో ప్రియా నడుముని ప్రెస్ చేస్తాడు.
ప్రేమ్ తనకి అంత దగ్గరగా వచ్చేసరికి ఇంకా అలా తన నడుముని పట్టుకొనేసరికి ప్రియా లో ఏదో తెలియని ఫీలింగ్ తన ఒళ్లంతా ఒక్కసారిగా జివ్వు మంటుంది " ప్రేమ్.." అని తనకు తెలియకుండానే తన నోట్లో నుంచి అతని పేరు బయటికి వస్తుంది మత్తుగా.
ప్రేమ్ తనకి ఇంకా దగ్గరికి జరుగుతూ తన పెదవులు అందుకోవడానికి దగ్గరికి వస్తాడు.
ప్రేమ్ ఏం చేయబోతున్నాడో ఊహించిన ప్రియ అప్రయత్నంగా తన కళ్ళు మూసుకుంటుంది.
ప్రేమ్ మాత్రం తన పెదవులకు ఒక ఇంచ్ దూరంలో ఆగి ప్రియా లో జరుగుతున్న మార్పులు గమనిస్తూ ఉన్నాడు.
ప్రేమ్ ఊపిరి తన మొహానికి వెచ్చగా తగులుతుండడంతో ప్రియా గుండె చప్పుడు కూడా వేగం పెరిగింది.
ప్రేమ్ ఇంకో నిమిషం ఆలస్యం చేయకుండా ప్రియా బుగ్గ మీద ముద్దు పెడతాడు.
ప్రియా ఏమి అనలేదు.
ప్రేమ్, ప్రియ ఇంకో బుగ్గ మీద కూడా ముద్దు పెట్టుకున్నాడు. తర్వాత నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. తన మెడ వంపుల్లో ముద్దు పెట్టుకున్నాడు, తన కనురెప్పల మీద, చెవుల మీద కూడా ముద్దులు పెట్టాడు , ఇలా ముద్దులు పెడుతున్న సమయంలో ప్రియ చేతులు కూడా వదిలేశాడు . ప్రియ, ప్రేమ్ ని నెట్టి వేయడం లాంటివి ఏమీ చేయలేదు.
ప్రేమ్ పెదవులు తనని అలా తాకుతుంటే ప్రియా లో ఏదో తెలియని ఫీలింగ్.
తన గుండె ఇంకా వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ చేసింది. అది ప్రేమ్ కూడా గమనించాడు.
మెల్లగా తన పెదవులు అందుకున్నాడు . ఇది ఇరువురికి తొలిముద్దు. ఆ ముద్దు, వారి మనసుల్లో శాశ్వతంగా ప్రతిధ్వనించే మాటలకంటే మిన్నైన భావన. ప్రేమకి ఆరంభమైన మొదటి పదం అది.
ప్రియ గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టు, శ్వాస తడబడినట్టు, లోపల నుంచి ఏదో తీపి వేదన కలగలిపిన భావన. ఆ ముద్దు… తడి గాలిలో తడబడిన తొలిచెంచపు వానబొట్టులా అనిపించింది.
ప్రియా తనకు తెలియకుండానే తన రెండు చేతులు ప్రేమ్ మెడ చుట్టూ వేసింది.
ప్రియా ఆ ముద్దుకి స్పందించడంతో ప్రేమ్ ఆ ముద్దు ని ఇంకాసేపు కొనసాగించాడు.
ప్రేమ్ తనని వదలగానే ప్రియా ప్రేమ్ గుండెల. మీద వాలిపోయి అతని గుండె చప్పుడు వింటూ గట్టిగా శ్వాస తీసుకుంటుంది.
ప్రేమ్ ప్రియా చుట్టూ చేతులు వేసి తనని ఇంకాస్త దగ్గరికి తీసుకుంటూ , " నామీద ప్రేమ ఉండి కూడా నామీద ప్రేమ లేదని ఎలా చెప్పగలుగుతున్నావే " అని అడుగుతాడు.
సడన్ గా ప్రేమ్ మాటలకు ప్రియా మొహం మీద ఎవరో బకెట్ నీళ్లతో తన మొహం మీద కొట్టినట్లు అనిపిస్తుంది.
ప్రియా తను ఇప్పుడు ఏం చేసిందో గుర్తుతెచ్చుకొని ఫ్రేమ్ ని తనకి దూరంగా నెట్టేస్తూ " దూరంగా ఉండు నాకు ప్లీజ్ " అని తన మొహాన్ని రెండు చేతుల్లో దాచుకొని ఏడవడం స్టార్ట్ చేస్తుంది.
తనని అలా దూరంగా నెట్టేయడం తో కోపం వచ్చిన ప్రేమ్, ప్రియా రెండు చేతులు తన మొహం మీద నుంచి తీసి తన భుజాలు గట్టిగా పట్టుకొని తన కళ్ళల్లోకి చూస్తూ " ఎందుకే నీకు నువ్వు అబద్ధం చెప్పుకుంటావు, నేనంటే నీకు ఇష్టం ఉంది, కానీ ఒప్పుకోవు , నామీద ఫీలింగ్స్ లేవు అన్నావు కానీ నేను నీ దగ్గరికి వస్తుంటే నీకు ఫీలింగ్స్ వస్తున్నాయి , నేను నిన్ను ముద్దు పెట్టుకుంటున్నప్పుడు నేను నీ చేతుల్ని వదిలేసాను, నామీద ఫీలింగ్స్ లేకపోతే అప్పుడే నన్ను నెట్టేసే దానివి కానీ అలా చేయలేదు. నేను నిన్ను ముద్దు పెట్టుకున్నంత సేపు బాగానే ఉన్నావు అండ్ ఆ ముద్దు కూడా నువ్వు ఇష్టపూర్వకంగానే స్వీకరించావు. ఇప్పుడు ఏమైంది నీకు , ఆ... నామీద ఫీలింగ్స్ లేవు పెళ్లి చేసుకోలేను అని అన్నావు మరి ఇదేంటిది? , నా మీద ప్రేమ లేదు అన్నావు ప్రేమ లేకుండానే నేను నీకు ముద్దు పెడుతుంటే పెట్టించుకున్నావా , నా మీద ఇష్టం లేని అమ్మాయిని బలవంతం చేసే అబ్బాయిని కాదు నేను, నామీద నీకు అంతులేని ఇష్టం ఉంది కానీ ఎందుకే నన్ను దూరం పెడుతున్నావ్" అని గట్టిగా అంటాడు.
....
కొనసాగుతుంది...
****
తప్పులు ఏమైనా రాసి ఉంటే క్షమించగలరు.
ఇప్పుడు మన ప్రియ ఏం చేస్తుంది అంటారు? . ప్రేమ్ మీద ఉన్న తన ఫీలింగ్స్ ఒప్పుకుంటుందంటారా? . లేకపోతే మళ్లీ తన మొండితనంతో ప్రేమ్ ని దూరం పెడుతుంది అంటారా ఈసారి ప్రేమ్ ఊరుకుంటాడా?.
మీరేం అనుకుంటున్నారు కామెంట్ చేయండి చూద్దాం.