Featured Books
  • Super Brain - 3

    డాక్టర్ కాసేపు నిశ్శబ్దంగా రఘువరన్ వైపు చూశాడు.ఆ తర్వాత స్వల...

  • తొలి పౌర్ణమి - 21

    పైకి లేచి విక్రమ్‌ వైపు నడవడం మొదలుపెట్టాను… ఒక్కో అడుగు భార...

  • రుధిరపు అడుగులలో - 18

    ఎసిపి రాణా ఏర్పాటు చేసిన అత్యంత ఆధునిక, మిలిటరీ స్థాయి హై-టె...

  • క్షుద్ర

    క్షుద్రఅధ్యాయం 1 — అగ్నిలో మొదలైన మేల్కొలుపుఅగ్నిపర్వతం గుండ...

  • సురేష్ (వీడొ పెద్ద ధూలేష్)

    మన జీవితంలో స్నేహితుల్లో కానీ... బంధువుల్లో కానీ...మనకి ఎప్ప...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

తొలి పౌర్ణమి - 21

పైకి లేచి విక్రమ్‌ వైపు నడవడం మొదలుపెట్టాను…
 ఒక్కో అడుగు భారంగా ముందుకు కదిలింది, కళ్ల ముందు అన్నీ మసకబారుతున్నాయి…
“విక్రమ్…” అనే మాట పెదవుల పైకి రావడం కష్టంగా మారింది. అడుగులు కొంచెం తడబడ్డాయి. 
నా శరీరం సహకరించట్లేదు…, మూడో అడుగు వెయ్యగానే పడిపోయాను.
“చాందినీ!” అంటూ శృతి పరుగెత్తుకొచ్చింది.
నా పక్కన మోకాళ్లపై కూర్చుంది.
అసలు ఏమైందే నీకు..
నా గొంతు బలహీనంగా…, “స్లీపింగ్ పిల్స్… తీసుకున్నా, శృతి…”
“నీకేమన్నా పిచ్చి పట్టిందా?!” అని అరిచింది శృతి.
కళ్లపై నల్లటి తెర కమ్ముకుంటూ, శ్వాస మందగించింది.
శృతి నా చేతిని పట్టుకొని,
“చాందినీ… ఏంటి పిచ్చిపని!” అని కన్నీళ్లు కార్చింది.
"శృతి… నాకు ఇప్పుడు చావాలని లేదు…” అన్నా..
నా కళ్ళల్లో నీళ్లు ఆగట్లేదు.., అంతే తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు..
                *******
కళ్ళు తెరవగానే హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా.., కానీ నా చుట్టూ ఎవరు లేరు, ఇదేదో ICU లా ఉంది..
నాకు తగిలించిన సెలైన్ ని నా చేతికున్న స్ట్రాంప్ నుంచి తొలగించా, నెమ్మదిగా బెడ్ దిగి బయట డోర్ తెరిచాను.., అక్కడ ఎవరు లేరు కొంపతీసి విక్రమ్ కి ఉన్న జబ్బు నాకొచ్చిందా, లేదా నేను చనిపోయానా, లేదా ఇలా కలగంటున్నానా అని మనసులో ఎన్నో అనుమానాలతో ముందుకు వెళ్తున్నా..
అలా ముందుకు వెళ్తూ నేనుంటున్న వార్డు డోర్ తీసా, నమ్మలేకపోతున్నా రమణ మామయ్య, సూర్య అంకుల్ ఇద్దరు పక్క పక్కన కూర్చొని మాట్లాడుకుంటున్నారు, వాళ్లే కాదు కుటుంబం మొత్తం అక్కడే ఉంది..
 నేను రావడం చూసి అందరూ నా వైపు తిరిగారు, నన్ను తిడతారేమో అని కంగారుగా ఉంది, మా నాన్న నెమ్మదిగా నా దగ్గరికి లేచి వచ్చాడు, ఆయన కళ్ళలో నీళ్లు, వాటిని చూసి నాకు కన్నీళ్లు ఆగలేదు, ఆయన్ని గట్టిగా కౌగిలించుకొని ఏడ్చేసా..
 నన్ను సమాధాన పరుస్తూ నాన్న ఇలా అన్నాడు..
“విక్రమ్ ఎదురుచూస్తున్నాడు” వెళ్ళు తల్లి..
 నేను మిగతా వాళ్ళ వంక చూసా అందరి ముఖాల్లో ఒక చిరునవ్వు ..
వెంటనే అక్కడి నుంచి హాస్పిటల్ ఎంట్రెన్స్ వైపు పరిగెత్తా అక్కడ జయ శృతి ఇద్దరూ స్కూటీ దగ్గర నాకోసం ఎదురు చూస్తున్నారు..
నాకు విషయం అర్థమైంది.., శృతి దగ్గర స్కూటీ కీస్ తీసుకొని బయలుదేరా..
“విక్రమ్ ఎక్కడున్నాడో మేము ఇంకా చెప్పలేదు అన్నాడు”, జయ..
 నేను వెనక్కి తిరిగి చిన్నగా నవ్వుతూ “నాకు తెలుసు” అంటూ అక్కడి నుంచి బయలుదేరా..
అలా బయలుదేరిన స్కూటీ చెరువు వైపు వెళ్లే రహదారి మీద పరుగులు తీస్తోంది.. నెమ్మదిగా చీకటి అల్లుకుంది..
స్కూటీ చెరువు గట్టున ఆపేసి, అడుగులో అడుగు వేసుకుంటూ ఆ చెరువు వైపు కదిలాను..
సరిగ్గా చెరువు మధ్యలో ఒక వ్యక్తి ఒంటరిగా బోట్ లో నిలబడి ఉన్నాడు..
అక్కడే ఇంకో బోటు తీసుకొని బయలుదేరా..
అతని దగ్గరకు వెళ్లే కొద్ది గుండె వేగం పెరుగుతోంది..
నేను రావడం చూసి కూడా చూడనట్టుగా అటు తిరిగి నుంచున్నాడు ఎదవ సచ్చినోడు…, నా పడవ వెళ్ళి తన పడవను చిన్నగా ఢీకొంది.., అయినా నా వైపు చూడలేదు..
మెల్లగా తన పడవ లోనికి అడుగుపెట్టా ..., వెళ్లి అతనికి ఎదురుగా నిలబడ్డా…
విక్రమ్ నా వైపే చూస్తున్న విషయం నాకు స్పష్టంగా తెలుస్తోంది.., కానీ నేను తన వైపు చూడలేకపోతున్నా..
విక్రమ్ ఎలాగైనా నాకు కావాలి అని మనసులో అనుకుని గట్టిగా ఊపిరి పీల్చా, తల ఎత్తి తన కళ్ళలోకి చూసా, నేను తెచ్చుకున్న ధైర్యం మొత్తం మంచులా కరిగి నా కళ్ళలోంచి నీటిలా వస్తున్నాయి. 
నా గొంతుకు ఏడుపు తోడైంది.
“ విక్రమ్ అసలేం జరిగిందంటే.. ,మా నాన్న చస్తానని బెదిరించడం వల్లే నేను నీతో అలా ప్రవర్తించాల్సి వచ్చింది..
మొదటి సారి, ఆకాష్ నీ వల్లే చనిపోయాడు అని తెలిసినప్పుడు కోప్పడ్డా, అంతే కానీ నేను అసలు నిన్ను ఎప్పుడూ హంతకుడిలా చూడలేదు.., ఇప్పుడు కూడా నీతో మాట్లాడాలంటే చాలా గిల్టీ గా ఉంది, దీని కన్నా చనిపోవడమే నయం అనిపిస్తోంది,” అని అన్నా.
నా చెంప ఛళ్లుమనిపించాడు.., విక్రమ్..
మళ్ళీ మౌనం..
నేను మళ్ళీ ఏదో చెప్పబోయా..
కాని…, నా పెదాలు కదలట్లేదు, తన శ్వాస నా లోనికి ప్రవహిస్తోంది
విక్రమ్ నాకు ముద్దు పెట్టేశాడు..
నేను మౌనంగా నిల్చుండిపోయా…
క్షమించు, నువ్వు కాసేపు మౌనంగా ఉండటానికి అలా చేశా, నువ్వు కామ్ గా ఉంటే నీతో కొంచెం మాట్లాడాలి…
“కిస్ చేసి క్షమించమని అడుగుతున్నాడు”, చూడండి..
“ఒకసారి నువ్వు కావాలనుకున్నప్పుడు, అది ఎలా ఉన్నా సరే నువ్వు కావాలి అంతే.. నిన్ను ఏ కారణం లేకుండా ప్రేమించా అలాంటిది నిన్ను వదిలేయడానికి కారణాలు వెతుక్కుంటా అని ఎలా అనుకున్నావు…”
నేను మౌనంగా అతని కళ్లలోకి చూస్తూ ఉండిపోయా..
“నేను నిన్ను పెళ్ళి చేసుకోవడం నీకిష్టమేనా..”, సూటిగా అడిగాడు
నేను అతన్ని గట్టిగా హత్తుకున్నా, అతనికి నా సమాధానం చెప్పకుండానే అర్థం అయ్యింది..
  **
నీటి మీద పరచుకున్న చంద్రకాంతి, 
వెండి వెలుగులా మారి పడవకు దారిని చూపిస్తోంది…
గాలిలో తేలియాడుతున్న పూలరేకులు,
అలల సవ్వడితో ఆటలాడుతూ, నీటి నడుమ నర్తిస్తున్నాయి.
చిన్న చేపలు గుంపులుగా తిరుగుతూ,
పైకి ఎగిరి ముత్యాల్లా చినుకులు చిందిస్తున్నాయి.
ఆ చినుకులు చేస్తున్న సున్నితమైన శబ్దాలు,
ఈ క్షణానికి పల్లవిలా మారి వినిపించాయి…
విక్రమ్ నా చెయ్యి పట్టుకున్న ఆ క్షణంలో,
నా హృదయ తాళాలు ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యాయి.
“చాందినీ… ఇకపై నువ్వే నా జీవితమంతా,”
అని అతని పెదవుల పైనుంచి జారిన ఆ మాటలు,
చంద్రకాంతిలో మృదువుగా తేలుతూ నా చెవిలో పలికాయి.
తర్వాత అతను తన జేబులోంచి తీసిన ఆ మంగళసూత్రం,
చంద్రకాంతిలో ముత్యంలా మెరిసింది.
అతని వేళ్లు మెల్లగా నా మెడను తాకిన క్షణంలో,
నా శరీరమంతా మధురమైన వణుకు పరిగెత్తింది.
ఆ తీగ నా మెడను చుట్టినప్పుడు,
చంద్రుని వెన్నెల నన్ను ప్రేమగా కౌగిలించుకున్నట్టు అనిపించింది.
అప్పుడే ఆకాశం నుంచి వెలువడిన తుంపర్లు,
అక్షంతలుగా మారి మమ్మల్ని ఆశీర్వదించాయి.
విక్రమ్… నన్ను తన హృదయంలో
శాశ్వతంగా ముద్ర వేసుకున్నట్టనిపించింది.
నేను ఇక ఒంటరిగా లేను…
నేను అతని దానిని — శాశ్వతంగా.
అలా నేను విక్రమ్ కౌగిలిలో ఒదిగి పోయా…
 చంద్రకాంతి కరిగిన వెన్నెలలో, ప్రేమ మనసుల్ని ఒకటిగా కట్టేసింది.

ఆఖరి పేజీ అయిపోయింది…
 ఆకాష్ కళ్ళలో నీళ్లు, ఇంత గొప్పగా వీళ్ళు ఒకరినొకరు ఎలా అర్థం చేసుకున్నారు.. అని మనసులో అనుకున్నాడు..
ఇంతలో డెల్టా తన చేతిలో ఒక లెటర్ పట్టుకుని వచ్చాడు
ఆ లెటర్ ఓపెన్ చెయ్యగానే వాళ్ళ అమ్మ హ్యాండ్ రైటింగ్.
…..
 ఆకాష్..
 ఈపాటికి నీకు నేనే చాందిని అని తెలిసే ఉంటుంది…
ఒక మంచి రచయిత కావాలంటే నువ్వు తెలుసుకుంటున్న విషయాలు నీకు ఆసక్తిగా అనిపించాలి…
నువ్వు కోరుకున్న ఆ ఎక్సైట్మెంట్ తెప్పించడానికి నీతో ఒక చిన్న అబద్ధం ఆడాను..
నన్ను క్షమించు..
…..
దాన్ని చదివిన తర్వాత ఆకాష్ కి ఏదో తెలియని అసంతృప్తి మేడ మీదకు వెళ్ళిపోయాడు.
“మనం ఎప్పుడైనా ఫూల్ అయినప్పుడు ఎదోలా అనిపిస్తుంది, కానీ మనకు నచ్చిన వాళ్ళు చేసినప్పుడు ఒక అందమైన జ్ఞాపంగా మారుతుంది”
ఈ ప్రేమకథ నేను ప్రపంచానికి పరిచయం చెయ్యాలి, అని మనసులో గట్టిగా అనుకున్నాడు..
కాసేపటి తర్వాత ఏదో గుర్తుకొచ్చినట్టు అనిపించింది మెట్లు దిగుతూ కిందకు వచ్చాడు…
అక్కడ నాన్న ఒడిలో అమ్మ పడుకుంది…
“విక్రమ్, ఈ డిజిటల్ కాలంలో ఎవరైనా రచయిత అవ్వాలనుకుంటారా.., నాకు ఆకాష్ భవిష్యత్తు గురించి కొంచెం బెంగగా ఉంది..”, అంది అమ్మ.
పిచ్చి మహా, లైఫ్ లో మనం ఏది అనుకుంటే అది చేయాలి అలా లేనప్పుడు ఇక జీవితం ఎందుకు..
‘ నేను ఒకటి నమ్ముతా మనం లైఫ్ లో హ్యాపీగా ఉండాలంటే “మనకు నచ్చిన పని చేయాలి లేదా నచ్చిన మనిషితో బ్రతకాలి” ఈ రెండు లేనప్పుడు ఇక బ్రతకడం ఎందుకు…’
వాడు ఆకాష్, తను నా కొడుకు కాదు తను నా ఫ్రెండ్, లైఫ్ లో తనకి ఏది ఇష్టమైతే దాన్ని చేస్తాడు, చూద్దాం ఈ ప్రయాణం ఎక్కడికి దారి తీస్తుందో.., అమ్మ, నాన్నను కౌగిలించుకుంది.
ఈ మాటలు విన్న ఆకాష్ కు ఏదో తెలియని అనుభూతి, వాళ్ళ అమ్మ నాన్నలను డిస్టర్బ్ చేయకుండా తను చాలా కష్టపడి ఆన్లైన్ లో కొన్న ఒక బుక్కు పెన్ను తీసుకొని మేడ మీదకి వెళ్ళాడు..
డెల్టా వచ్చి అతని పక్కన కూర్చున్నాడు..
ఆకాష్..
చెప్పు డెల్టా..
 అసలు ఈ కథలో నీకేం అర్థమయ్యింది, విక్రమ్ చాందినీ ని మార్చాడా లేదా చాందిని విక్రమ్ ని మార్చిందా..
విక్రమ్ పొరబాటు వల్ల ఆకాష్ చనిపోయాడు అందు వల్ల అటు విక్రమ్ ఇటు చాందిని ఇద్దరు నిశ్శబ్దంలో బతికారు. విక్రమ్, చాందిని వల్ల మారి, తనని కూడా మార్చాడు, వాళ్ళిద్దరి మధ్య ఎన్ని అడ్డంకులు వచ్చినా విధి వాళ్ళిద్దరినీ ఒకచోట కలిపి విడదీయలేని ప్రేమగా మార్చింది.
వా… నీ ఆలోచన బాగుంది అయితే మీ నాన్న కథని ప్రపంచానికి  పరిచయం చేస్తే ఇంకా బాగుంటుంది అని చెబుతాడు డెల్టా.
అలాగే తప్పకుండా.  ఇదిగో మొదలు పెడుతున్న అంటూ చేతిలోకి కలం తీసుకోవడంతో ,  ఇంకెందుకు ఆలస్యం మొదలు పెట్టు అంటూ ఎదురుగా ఉన్న ఉయ్యాలలో కూర్చుంటాడు డెల్టా. 

డెల్టా  ! అని అతను పిలిచేసరికి చూస్తాడు డెల్టా. 
నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా.
చెప్పు అంటూ చూస్తాడు  డెల్టా.

ఈ కథ మనకు ఒక విషయం చెబుతుంది అంటూ తన చేతిలో ఉన్న కలమును అలా తిప్పుతూ హుషారుగా చూసేసరికి " సరే ఏం అర్థం అవుతుందో ఒకసారి చెప్పవా" అని చూస్తాడు డెల్టా. 

"జీవితంలో తప్పు చేయడం చాలా సహజం కానీ అది సరిదిద్దకోవడం చాలా కష్టమైన పని . అయినా మనిషి చేసిన తప్పు అతని జీవితాన్ని నిర్ణయించదు; ఆ తప్పు తర్వాత అతను ఎలా మారాడన్నదే అతని నిజమైన వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది. పశ్చాత్తాపం మనసును బాధపెట్టినా, నిజమైన ప్రేమ దానికి ఓదార్పు ఇస్తుంది. విక్రమ్‌–చాందినిల ప్రేమలో బాధ ఉంది, కన్నీళ్లు ఉన్నాయి, ఎదురుచూపులు ఉన్నాయి, చివరికి ఒకరినొకరు అర్థం చేసుకున్న అనుబంధం ఉంది. అందుకే ఇది కేవలం ఒక ప్రేమకథ కాదు; తప్పు, పశ్చాత్తాపం, మార్పు, క్షమ, ప్రేమ  కలగలసిన జీవితకథ. ఈ కథను చదివిన ప్రతి పాఠకుడి మనసులో వారి ప్రేమ ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుందని భావిస్తున్నాను.

అవును నువ్వు చెప్పేది నిజమే తప్పకుండా ఏ కథ చదివిన పాఠకులకు స్వచ్ఛమైన ప్రేమ ఎటువంటి వారినైనా ఒక మంచి పాట వైపు నడిపిస్తుందని తెలుసుకుంటారని నాకు నమ్మకం అనిపిస్తుంది .
నీ నమ్మకం అమ్మ కాకూడదని పాఠకులు తప్పకుండా నిజం చేస్తారని ఆశిస్తున్నాను. అన్న డెల్టా మాటలు విని చిరునవ్వు నవ్వుతాడు.

                        THE   END


ప్రియమైన పాఠకులకు, నేను రాసిన ఈ మొదటి కథ తప్పకుండా మీకు మీ మనసుకు నచ్చుతుందని ఆశిస్తూ ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే మీ సమీక్షలో మీ స్పందనని తెలియజేయగలరని ఆశిస్తున్నాను.
ఇట్లు 
జంజే