Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

తొలి పౌర్ణమి - 14

జయ బయటికెళ్లాడు.
చాందిని సడన్గా లేచి నా వైపు వచ్చింది. 
ఏంటి చాందిని ఏదన్నా డౌటా అని అడిగా. 
 నటించకు విక్రమ్, నువ్వు పొద్దున్నుంచి నన్ను చూస్తూనే ఉన్నావు అన్న విషయం నాకు తెలుసు.
నేను కాసేపు మౌనంగా ఉండి, “చాందిని, నన్ను పెళ్లి చేసుకుంటావా..” అని అడిగా.
“ఆరోజు శృతి అలా ఎందుకు అడిగిందో నాకు ఇప్పుడు అర్థమైంది”, అయినా మీకు ఉన్నట్టుండి ఎందుకిలా ప్రేమ పుట్టుకొస్తుంది.., మేము ఫ్రెషర్స్ అని నువ్వు అడ్వాంటేజ్ తీసుకుంటున్నావా..
నువ్వు ఎలా బడితే అలా మాట్లాడొద్దు, నువ్వు నాకు పరిచయమైనప్పటినుంచి ఎప్పుడైనా అలా బిహేవ్ చేశానా.., నేను టైమ్ పాస్ కి లవ్ అనట్లేదు, పెళ్లి చేసుకుందాం అంటున్నా..
నాకు ఈ ప్రేమ పెళ్లి అస్సలు ఇష్టం లేదు, నన్ను వదిలేయ్..
ఐతే ఇన్ని రోజులు మన మధ్య జరిగిందంతా ఏంటి, అంటూ తన కళ్ళలోకి కి సూటిగా చూసా..
మనమంతా ఒకే టీం ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి అని నువ్వే చెప్పావ్ గా, అందుకే కన్సర్న్ చూపించుంటా, అంతకు మించి ఏం లేదు అక్కడ, నేనైతే క్లారిటీ గా ఉన్నా..
“ఆ మాటకు గుండె బరువెక్కింది”, ఏంటి చాందిని, అసలేం ఆలోచించకుండానే ఇలా నిర్ణయాలు తీసుకుంటున్నావు..
ఇలాంటి విషయాల్లో నేనింతే విక్రమ్, లేదు ఇదిలాగే కొనసాగుతుందంటే చెప్పు, నేను జాబ్ వదిలేసి వెళ్ళిపోతా..
తను అన్న మాటలకి చాలా బాధేసింది, దీనమ్మ జీవితం, జీవితంలో ఒక్క అమ్మాయిని ఇష్టపడలేదు, చివరికి ఇష్టపడిన అమ్మాయి నేను తనని ఇబ్బంది పెడతానేమో అని భయపడి వెళ్ళిపోతానంటుంటే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు, అసలు లవ్ అంటే తనకు ఎందుకంత చిరాకు..
నేను మౌనంగా ఉండిపోయా, తను అక్కడినుంచి వెళ్ళిపోయింది..

రే నాన్న ఇక పడుకోరా ఆల్రెడీ 11 అవుతుంది ఇంకా ఎంతసేపు ఆ హెడ్ ఫోన్స్ పెట్టుకుంటావ్ అంటూ మందలించింది అమ్మ, హెడ్ ఫోన్స్ తీసేసి దుప్పటి కప్పుకున్నాడు.
ఆ కుర్రాడు చాలా కంగారు పడుతున్నాడు ఆ తరవాత నాన్న ఏం చేశాడు , అసలు ఈ కథలోకి అమ్మ ఎప్పుడు వస్తుంది, ఏవేవో థాట్స్ వాడిని ఆరోజు సరిగ్గా నిద్రపోనివ్వలేదు.
మరుసటి రోజు యధావిధిగా స్కూల్ కి వెళ్ళాడు, కానీ ఆ కథలో ఏమైందో అన్న కుతూహలం అతన్ని ఉండనివ్వట్లేదు, తనకు ఆరోగ్యం బాలేదని మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చేసాడు . 
ఆలస్యం చేయకుండా కథ వినడం మొదలుపెట్టాడు. 
డెల్టా ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు.


ఆ వారంలో మిగిలిన మూడు రోజులు నేను ఆఫీస్ కి వెళ్ళలేదు, డాక్టర్ ఓబెరాయ్ ని కలవడానికి వెళ్ళాను.
 ఆ మూడు రోజులు ఆఫీసులో ఏం జరిగిందో వీకెండ్ మా ఇంటికి వచ్చినప్పుడు జయ నాతో చెప్పాడు.
***
“ వాళ్ళ ముగ్గురు యధావిధిగా ఆఫీసుకు వెళ్ళారు, శృతి మరియు చాందిని ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు. 
నాకు హెల్త్ ప్రాబ్లం వల్ల నేను ఈ వారం అంతా లీవ్ పెట్టానని ఆర్కిటెక్ తో చెప్పాడు జయ.
శృతి మాట్లాడుతూ, “ఏమైంది జయ విక్రమ్ కు ఏమన్నా సీరియస్ ఆ.”
అదేం ఏం లేదు శృతి అతనికి ఒక చిన్న థెరపీ ఉంది దానికోసం వెళ్ళాడు అంతే. 
చాందిని ఏం మాట్లాడలేదు.., జయ కూడా తనని కదిలించకుండా ఊరికే ఉన్నాడు.
ఒక రెండు రోజులు చూశాడు జయ, మూడో రోజు కూడా చాందిని ఏం మాట్లాడకపోయేసరికి. 
తనే కల్పించుకొని ఇలా అన్నాడట –
ఏంటి చాందిని ఇది, నచ్చకపోతే నచ్చలేదని చెప్పు, వాడేదో నిన్ను ఇబ్బందిపెడుతున్నట్లు ఆఫీస్ నుంచి వెళ్ళిపోతా అని ఎందుకన్నావ్, జాయిన్ అయిన ఫస్ట్ రోజు నుంచి ఇప్పటివరకు ఎప్పుడైనా మీతో తప్పుగా ప్రవర్తించామా, వాడు ఇష్టపడిన విషయం డైరెక్ట్ గా చెప్పకుండా అలా తనతో అడిగించడం తప్పే, దానికోసం నువ్వు అంతలా బ్లేమ్ చేయాలా…..
ఒక్క మాట చెప్పు నీకు అసలు విక్రమ్ ఇష్టం లేకుండానే మొన్న జాతరకు వెళ్ళినప్పుడు అంత కేర్ తీసుకున్నావా. 
చాందిని మౌనంగా అక్కడినుంచి వెళ్ళిపోయిందట….”
   ***
జయ, ఎందుకురా అలా చేసావ్..
మరి ఇంకేం చెయ్యమంటావ్..
కొత్తగా పరిచయమైన వ్యక్తి వెళ్ళి సడెన్గా పెళ్లి చేసుకుంటా అంటే ఏ అమ్మాయి అయినా అలానే అంటుంది, తప్పు నాదే..
సరే, నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పాలి అలా ఎవరైనా మాట్లాడతారా..
వదిలేయ్ మావ…, ఎలా చెప్తే ఏం తన ఒపీనియన్ తెలిసిందిగా ఇక మన పని మనం చూసుకుందాం..
 ఆదివారం డాక్టర్ ఓబెరాయ్ నాకు కాల్ చేశాడు ఆయన చాందిని మరియు శృతిని మెట్రో లో కలిసానని, వాళ్లతో మాట్లాడానని చెప్పాడు.
         ******
మెట్రో వేగంగా కదులుతోంది..
“ముందిన నిల్ధాణ లాల్ బాగ్” అంటూ అనౌన్స్మెంట్ వచ్చింది. 
ఆ స్టేషన్లో ఒక ముసలాయన ఎక్కాడు…
చాందిని మరియు శృతిలకు కు ఎదురుగా కూర్చున్నాడు…, చాందిని ఏమో తన ముఖాన్ని చిరాగ్గా పెట్టుకుని కూర్చుంది..
మాటిమాటికి చాందిని వంక చూస్తూ ‘ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ‘ రేలంగి మావయ్య లాగా నవ్వుతున్నాడు..
చాందిని ఏం మాట్లాడకుండా ఊరికే కూర్చుంది. 
మరుసటి స్టేషన్లో వాళ్ల పక్కన ఉన్న ప్యాసింజర్ దిగేస్తే ఆయన వచ్చి చాందిని పక్కన కూర్చున్నాడు.
 మళ్లీ అదే నవ్వు..,
ఇదంతా గమనించిన శృతి మాట్లాడుతూ, ఎవరయ్యా నువ్వు మమ్మల్ని చూసి నవ్వుతున్నావ్, నీకు మాకు ఏమైనా పరిచయం ఉందా.. అని అడిగింది
“నవ్వడానికి పరిచయం ఎందుకండీ” అంటూ మళ్ళీ నవ్వాడు.
ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు..
 కంగారు పడకండి మీరు నాకు తెలుసు అన్నాడు ఆయన..
మేము మీకు ఎలా తెలుసు అని అడిగింది చాందిని..
 నీ పక్కన ఉన్న అమ్మాయి తెలియదు కానీ నువ్వు తెలుసు అన్నాడాయన..
మిమ్మల్ని ఎప్పుడూ చూసినట్టు గుర్తు లేదు, అంది చాందిని.
విక్రమ్ చెప్పాడు..
అబ్బా… అసలు విక్రమ్ కు మీకు ఏంటి సంబంధం, అడిగింది శృతి…
నేను అతని ట్రీట్ చేస్తున్న డాక్టర్ నీ..
“ఓ.. సారి డాక్టర్, విక్రమ్ కు ఏమయ్యింది”. 
అతనికి “పోస్ట్ ట్రోమాటిక్ స్ట్రెస్ డిసార్డర్” అని ఒక వ్యాధి ఉంది, దాని వలన చిన్నప్పటి నుంచి అతనికి మనశ్శాంతి లేదు , అతడు చేసిన పొరపాటు అతన్ని వెంటాడుతూనే ఉంది,ఒక్కోసారి లేనిది ఉన్నట్టు ఊహించుకొని భయపడుతుంటాడు..
మరి ఇప్పుడెలా ఉన్నాడు ..
ఇప్పుడు బాగానే ఉన్నాడు, కానీ నీకో విషయం చెప్పాలి..
“ఏంటి డాక్టర్” అడిగింది చాందిని..
ఇన్నాళ్ళ ట్రీట్‌మెంట్లో అతను పాజిటివ్గా చెప్పిన విషయం ఏదన్నా ఉందంటే అది నీ పరిచయం మాత్రమే చాందిని, అతను నీ గురించి చెప్పేటప్పుడు అతని ముఖంలో వచ్చే సంతోషం నేను ఇంకెప్పుడూ అతనిలో చూడలేదు, తన మనసులో నిన్ను చాలా గొప్పగా భావిస్తున్నాడు, అతనికి పూర్తిగా నయం కావడానికి నువ్వు చాలా అవసరం.
నువ్వు అతని ఇష్టపడకపోయినా పర్లేదు, అట్లీస్ట్ అతన్ని మాములుగా చూస్తే చాలు..
      ******
డాక్టర్ అసలు ఇవన్నీ తనతో ఎందుకు చెప్పారు..
“ఏం కాదులే విక్రమ్ బి పాజిటివ్”, అంటూ ఫోన్ పెట్టేశాడు డాక్టర్.
 ఆరోజు సోమవారం , నాకు ఆఫీసుకు వెళ్లడానికి చాలా భయంగా ఉంది, జయ పొద్దున్నే ఇంటికి వచ్చాడు. 
నేను ఎంత వద్దన్నా బతిమాలి మరి ఆఫీస్ కి తీసుకెళ్లాడు జయ.
ఇద్దరం కలిసి క్యాబిన్ దగ్గరకు వెళ్ళాము కానీ నాకు లోనికి వెళ్లడానికి మనసు అంగీకరించలేదు. 
జయ డోర్ తీశాడు లోన వాళ్లిద్దరూ కూర్చున్నారు, కొట్లాడిన వాళ్ళిద్దరూ బానే మాట్లాడుకుంటున్నారు, నా వల్ల వాళ్ళిద్దరి స్నేహం చెడిపోయిందన్న బాధ కొంచెం తగ్గింది నాకు. 
ఇద్దరం లోనికి వెళ్లి కూర్చున్నాం, నేను ఒక్కసారి కూడా తన వైపు చూడలేదు. 
సడన్గా చాందిని మాట్లాడుతూ- జయ,శృతి మీరు కాసేపు బయటకు వెళ్తారా మేమిద్దరం కొంచెం మాట్లాడాలి అంది. 
జయ నా వంక చూసి భుజం తట్టి వెళ్ళిపోయాడు...
నేను మౌనంగానే ఉన్నాను, వాళ్ళిద్దరూ బయటికి వెళ్లిపోయారు ఎంత దూరం అంటే మా మాటలు వినిపించనంత దూరం.
 చాందిని కలుగజేసుకుంటూ,” ఐ యాం సారీ విక్రమ్” నేను నీతో అలా మాట్లాడి ఉండకూడదు, నేను మాట్లాడిన విధానం తప్పు ఒప్పుకుంటా, ఐ యాం రియల్లీ సారీ. 
ఎందుకు సారీ చెప్తున్నావ్ చాందిని, నువ్వు నీకు అనిపించింది చెప్పావు అంతే.
 అది కాదు విక్రమ్ అసలు నాకు విషయం ఏంటో తెలియదు కదా..
ఏ విషయం….
నీకు హెల్త్ ప్రాబ్లం ఉందని..
“ ఆ మాట వినగానే నాకు పిచ్చ కోపం వచ్చింది, తను నా మీద జాలి చూపిస్తుందని నాకు అర్థమైంది, ..తన కళ్ళలోకి సూటిగా చూసా”
సరే చాందినీ నాకో విషయం స్ట్రెయిట్ గా చెప్పు, ఇప్పుడు డాక్టర్ ఓబెరాయ్ నీతో మాట్లాడకుండా నా గురించి ఏం విషయాలు చెప్పకుండా ఉంటే నువ్వు అసలు నా దగ్గరకు వచ్చేదానివా..
అలా ఏం కాదు..
ఆసలెందుకు నా మీద జాలి చూపిస్తున్నావ్..
తను మౌనంగా ఉంది…
 నా లైఫ్ లో.. నా కుటుంబం తర్వాత నన్ను ఏ జాలి లేకుండా మాములుగా చూసే వ్యక్తి జయ ఒక్కడే అని నాకు అర్థమైంది, ఇక దీన్ని ఇంతటితో వదిలేయ్..
అది కాదు విక్రమ్, నేను లవ్ చెయ్యలేను, మనం మంచి ఫ్రెండ్స్ గా ఉందాం..
అయినా మీకు లైఫ్ లో ఎలాంటి సమస్యలు లేని వాళ్ళు కావాలి పెళ్లి చేసుకోవడానికి, మా లాంటి వాళ్ళు ఎందుకు,..వద్దులే చాందిని..
“విక్రమ్ ఒక్కసారి చెప్పేది విను” అంటూ ఏదో చెప్పబోయింది..నేను నవ్వుతూ తన వైపు చూసేసరికి ఆగిపోయింది,.. 
చాందినీ… నిన్ను ఏ రకంగా కూడా నేను డిస్టర్బ్ చేయదల్చుకోలేదు, బహుశా నిన్ను ప్రేమించినందుకో ఏమో నా వల్ల నీకు బాధ కలిగినా నేను యాక్సెప్ట్ చెయ్యలేను. ఈ ప్రాజెక్టులో మనం ఇండివిజువల్ గా పనిచేయడానికి వచ్చాం, సో మీకు మా మీద డిపెండ్ అయ్యే అవసరం లేదు, ఒక వేళ ఏదన్నా సమస్య వస్తే జయ ఉన్నాడు..
ఇది చెప్పిన వెంటనే లేచి బయటికి నడిచా, ఏదో గుర్తొచ్చినట్టు అనిపించి వెనక్కి తిరిగా..
చూడు, నాకున్న పొజిషన్ నీ అడ్వాంటేజ్ గా తీసుకొని నిన్ను ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదనే అనుకుంటున్నా, ఒకవేళ చేసి ఉంటే ఐ యాం రియల్లీ సారీ, ఒకవేళ ఎప్పుడైనా అలా చేసినట్టు నీకు అనిపిస్తే చెప్పు నేనే వెళ్ళిపోతా...
తను ఏం మాట్లాడలేదు, నేను టీ తాగడానికి వెళ్ళిపోయా.
నా మనసులో ఉన్నదంతా చెప్పేసరికి నాకు హాయిగా అనిపించింది.
 ఆ తర్వాత రోజులు గడుస్తున్నాయి, నేను తనతో మాట్లాడడం కంప్లీట్ గా మానేసా, చెప్పాలంటే తనని చూడటమే మానేసా, “ఇంతకుముందు తనను చూసిన ప్రతిసారి నాకు ఎక్సైట్మెంట్ వచ్చేది, కానీ ఇప్పుడు తనని కోల్పోతాను అన్న బాధ కలుగుతోంది “, అందుకే చూడటం మానేసా.
తను మాత్రం నా వంక అప్పుడప్పుడు చూస్తుందని జయ చెప్తుండేవాడు. 
ఒక రోజు నేను జయ మా ఇంటి మేడ మీద కూర్చున్నాం. 
విక్రమ్ ఏంట్రా నువ్వు చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తున్నావ్, చాందిని నీతో మాట్లాడాలి అని ఎన్నిసార్లు నీ వైపు చూసినా తన వంక కనీసం చూడట్లేదు అసలు ఏమైంది. అసలు నిజంగానే తనని ప్రేమించావా లేదా…..
ఎందుకు మాట్లాడాలి రా.. ఆయన ఎవరో చెప్తే నా మీద జాలి పడి మాట్లాడుతోంది..
ఒరే అసలు విషయం నువ్వు డైరెక్ట్ గా చెప్పుంటే బాగుండు..
రేయ్ ఆ చెత్త ఐడియా నువ్వే వేసి! మళ్ళీ అలా చేస్తే బాగుండు ఇలా చేస్తే బాగుండు అన్నావు అనుకో డిప్ప పగులుతుంది.
 అయ్యిందేదో అయిపోయింది, ఇప్పుడు అన్నింటినీ సరిచేయాలి రా.
వద్దురా బాబు.. నాకు ఏ అమ్మాయి వద్దు, దీన్ని ఇంతటితో వదిలేయ్.
ఒరేయ్ పిచ్చోడా నువ్వు ఎన్ని మాట్లాడినా, నీ కళ్ళలో నీళ్ళు చెబుతున్నాయి.
అవును నిజంగానే నా కళ్ళలో నీళ్ళు, జయని గట్టిగా కౌగిలించుకున్నాను.
“ జయ.. తనతో మాట్లాడాలని నాకు ఉంది. కానీ ఇంకోసారి తను నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను ఏమైపోతానో అని భయంగా ఉంది, అందుకే తనతో మాట్లాడలేకపోతున్నాను” అంటూ ఏడ్చేశాను. 
ఈ ప్రశ్నకు జయ దగ్గర కూడా సమాధానం లేదు ఎందుకంటే చాందిని మనసులో ఏముందో ఎవరికీ తెలియదు కాబట్టి.
 మరుసటి రోజు ఆఫీసులో ఎవరికివాళ్ళు పని చేసుకుంటున్నాం..
జయ గాడు లీవ్ లో ఉన్నాడు, చాందిని డిప్లొయ్ చేసిన వాటిలో ఏదో ఇష్యూ వచ్చింది.. 
చాందిని మరియు శృతి దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు..
ఇంతలో సోహమ్ లోనికి వచ్చాడు.