Read Veda - 16 by Eshwarchandra Rathnapalli in Telugu Fiction Stories | మాతృభారతి

Featured Books
  • వేద - 16

    మేనార్‌లోని ఆ పాత గోడలు నిశ్శబ్దంగా ఉన్నాయి, కానీ ఆ నిశ్శబ్ద...

  • సఖి... - 2

    సుధ గారు చూడు సఖి నువ్వు ఇలాగే మొహం మాడ్చుకొని ఉంటే..... మీ...

  • ధర్మ-X - 2

    ఆఫీసులోని ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ మోగుతున్న సైరన్ శబ్దం అద్...

  • అంతం కాదు - 76

    కొంతమంది రౌడీలు వచ్చి ఏంటి రౌడీ బేబీ అక్కడికి వస్తున్నావా ఇన...

  • వేద - 15

    ఆ రాత్రి మేనార్ ప్రధాన ద్వారం అంత వేగంగా, అంత బలంగా మోగేసరిక...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

వేద - 16

మేనార్‌లోని ఆ పాత గోడలు నిశ్శబ్దంగా ఉన్నాయి, కానీ ఆ నిశ్శబ్దంలో ఏదో తెలియని భారముంది. కొద్ది గంటల క్రితం జరిగిన విధ్వంసం తాలూకు ఆ గుర్తులు గదిలో ఇంకా అలానే ఉన్నాయి. గాలిలో పగిలిన మట్టి పాత్ర వాసన, ఆవిరైపోయిన నీటి తాలూకు తేమ ఇంకా మిగిలే ఉన్నాయి.

వేద తన గదిలో కిటికీ పక్కన మౌనంగా కూర్చుని ఉంది. కిటికీ బయట అమావాస్యకు దగ్గరగా ఉన్న ఆకాశం చీకటిని పూసుకున్నట్టు ఉంది. ఆమె అరచేతుల మీద ఉన్న ఎర్రటి కాలిన గాయాలు ఇంకా సెగలు పుడుతూనే ఉన్నాయి. ఆమె చేతిపై ఉన్న ఆ మంట కంటే, తన శక్తినే తాను అదుపు చేసుకోలేకపోయానన్న బాధ ఆమెను ఎక్కువగా దహిస్తోంది. 

అంతలో అర్జున్ నెమ్మదిగా వేద ఉన్న గదిలోకి, అతని చేతిలో ప్రథమ చికిత్స కిట్ తో పాటు వచ్చాడు. అతను, వేద పక్కన చాప మీద కూర్చుని, మౌనంగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. దానితో వేద ఒక్కసారిగా ఉలిక్కిపడి చెయ్యి వెనక్కి తీసుకోబోయింది. 

"వద్దు అర్జున్.. తాకవద్దు.. అది ఇంకా వేడిగానే ఉంది. తాకితే నీకు కూడా గాయమవుతుంది.." అంది వేద, తన చూపులను నేలకు పరిమితం చేస్తూ. 

కానీ అర్జున్ వేద మాటలను వినకుండా, మళ్ళీ ఆమె చేతిని పట్టుకుని, మెల్లగా మందు పూయడం మొదలుపెట్టాడు. "నాకు తెలుసు, గాయం అయినది నీకు, నొప్పి కూడా నీదే అని. నేను నీ నొప్పిని పంచుకోలేకపోవచ్చు కానీ, నీ బాధను పంచుకోలేకపోతే... మనం స్నేహితులం ఎలా అవుతాం వేద?" అని చాలా ప్రశాంతంగా అన్నాడు. 

అది విన్న వేద ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. అతని కళ్లలో భయం లేదు, అసహ్యం లేదు.. కేవలం ఒక రకమైన బాధ్యత, ఆత్మీయత ఉన్నాయి. 

అర్జున్ మాటలు విన్న వేద, "నన్ను చూసి అందరూ భయపడుతున్నారు.. ఈ శక్తిని చూసి నేనే అసహ్యించుకుంటున్నాను. కానీ ఇతను మాత్రం ఎందుకు ఇంకా నా పక్కనే తోడుగా ఉన్నాడు? తను వెతకాల్సిన నిజం దొరికినా కూడా నన్ను వదిలి వెళ్లడం లేదంటే.. దీని అర్థం ఏంటి?" అని తనలో తాను మాట్లాడుకుంది. 

అంతలో అర్జున్ ఆమె కళ్లలోకి నేరుగా చూస్తూ, "నువ్వు ఒంటరివి కావు వేద.." అని చెప్పాడు. "ఈ శక్తులు, ఈ బంధనాలు.. ఇవన్నీ నీకు ఒక శాపంలా అనిపించవచ్చు. కానీ వీటిని ఎదుర్కోవడంలో నేను నీకు తోడుంటాను. ఇది నా మాట." అని ఆమెకు ధైర్యం చెప్పాడు. 

అర్జున్ ఇస్తున్న భరోసకు వేద కళ్లలో మొదటిసారి ఒక చిన్న మెరుపు కనబడింది. ఆమెలోని అభద్రత మధ్య ఒక చిన్న ఆశ పుట్టినట్టు అనిపించింది ఆమెకు. 

కొంతసేపటికి అర్ధరాత్రి దాటగా, మేనార్‌లోని అతిపెద్ద గ్రంథాలయం ఇప్పుడు ఒక మర్మమైన లోకంలా, ఎత్తైన అలమారలు, వేలకొద్దీ పాత పుస్తకాలు, తాళపత్రాలతో నిండి ఉంది. టేబుల్ మీద ఉన్న ఒకే ఒక దీపం వెలుతురులో అర్జున్ తన తండ్రి డైరీని, అక్కడ దొరికిన కొన్ని పాత పత్రాలను పక్కపక్కన పెట్టి చూస్తున్నాడు. 

దీన్ని గురుస్వామి ఒక మూల నిలబడి మౌనంగా గమనిస్తున్నారు. అర్జున్ ఒక పాత తాళపత్రంపై ఉన్న చిత్రాన్ని చూసి ఒక్కసారిగా స్తంభించినట్టుగా ఉండిపోయాడు. 

"గురుస్వామి గారూ.. ఇది చూడండి.." అన్న అర్జున్ గొంతులో వణుకు స్పష్టంగా కనబడింది. 

అతని తండ్రి డైరీలో పెన్సిల్‌తో గీసిన ఒక వింత గుర్తు, ఆ తాళపత్రంలో ఉన్న Cult of Chaos ముద్రతో అచ్చు గుద్దినట్టు సరిపోలింది. 

అది చూడగానే అర్జున్, "నాన్న కేవలం ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ మాత్రమే కాదు.. ఆయన ఏదో భారీ రహస్యాన్ని ఛేదించడానికి ఇక్కడి వరకు వచ్చినట్టున్నారు. ఆయన అదృశ్యం వెనుక ఏదో ఒక పెద్ద మిస్టరీ ఉన్నట్టు అనిపిస్తుంది!" అంటూ తనలో తానే అనుకున్నాడు. 

అర్జున్ మనసులోని మాటలను విన్నట్టు, "అవును అర్జున్.. నీ తండ్రి ఇక్కడికి వచ్చారు.." అని గురుస్వామి గంభీరంగా చెప్పారు. దానితో ఆయన కళ్లలో గతం తాలూకు నీడలు కదలాడాయి. 

"ఆయన మొదటి బంధనం గురించి శోధిస్తూ ఈ మేనార్‌ను సందర్శించారు. అప్పుడే ఆయనకు రుద్ర భైరవ గురించి, అతని వెనుక ఉన్న ఆ చీకటి సామ్రాజ్యం గురించి తెలిసింది. ఈ ముద్రలను కాపాడటానికి ఆయన తన ప్రాణాలను కూడా లెక్కచేయలేదు." అని అన్నారు గురుస్వామి. 

అది విన్న అర్జున్ చేతులు మునివేళ్లతో ఆ పేజీలను తడుముతూ, "అంటే.. నాన్నని చంపింది కూడా ఈ శక్తులేనా? రుద్ర భైరవ అందరికీ తెలిసినట్టు కేవలం ఒక కార్పొరేట్ టైటాన్ కాదు.. అతను మా కుటుంబాన్ని నాశనం చేసిన ఒక రాక్షసుడు." అని అన్నాడు. 

తన తండ్రికి సంబంధించిన విషయాన్ని తెలుసుకున్న అర్జున్ ముఖం ఇప్పుడు కఠినంగా మారింది. అంతవరకు అతనిలో ఉన్న లాజిక్, రీజనింగ్ స్థానంలో ఇప్పుడు ఒక నిశ్చయమైన ప్రతీకారం వచ్చి చేరింది. "అయితే నా పోరాటం ఇప్పుడు కేవలం నీ కోసం కాదు వేద.. ఇది మా నాన్న కోసం కూడా! ఆయన దేనికోసం ఐతే తన ప్రాణాలను పణంగా పెట్టాడో, దాన్ని తెలుసుకొని, మా నాన్న అసంపూర్ణంగా వదిలేసిన పనిని నేను పూర్తి చేస్తాను." అని తన మనసులో నిర్ధారించుకున్నాడు. 

ఆ తర్వాత అర్జున్ లైబ్రరీ నుంచి బయటకు వచ్చి హాలులో వేచి ఉన్న వేద దగ్గరకు వెళ్లగా, ఇద్దరూ ఎదురెదురుగా నిలబడ్డారు. చుట్టూ ఉన్న ఆ పురాతన శిల్పాలు వారి మౌనానికి సాక్ష్యంగా నిలిచాయి. 

అర్జున్ తన తండ్రి గురించి, ఆయనకు ఈ ద్వారపాలికా వంశంతో ఉన్న సంబంధం గురించి వేదకు వివరించాడు. "మన ఇద్దరి శత్రువు ఒక్కరే వేద. నిన్ను నాశనం చేయాలని చూస్తున్న ఆ శక్తులే నా కుటుంబాన్ని కూడా దూరం చేశాయి. ఇప్పుడు ఇది మనం ఒక్కటిగా పోరాడాల్సిన సమయం." అని అన్నాడు. 

అది విన్న వేద అతని వైపు విచిత్రంగా చూస్తుండగా, ఆమెలోని భయం ఇపుడు మెల్లగా కరిగిపోతోంది. "నువ్వు ఇంత రిస్క్ తీసుకోవడం అవసరమా అర్జున్? దీనివల్ల నీ ప్రాణాలు కూడా పోవచ్చు.." అంది వేద ఆందోళనగా. 

"అబద్ధంలో బతకడం కంటే, నిజం కోసం చావడంలోనే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది వేద. ఈ ప్రమాదకరమైన ప్రయాణాన్ని మనం కలిసి ఎదుర్కొందాం." 

అర్జున్ మాటల్లోని దృఢత్వాన్ని విన్న వేద, "అర్జున్ ఆశయం నాలో కొత్త ఆశను నింపుతోంది. ఇంతకాలం నా శక్తిని నేను అసహ్యించుకున్నాను. కానీ ఇప్పుడు.. నా శక్తిని నా కోసం కాకపోయినా, కనీసం ఇంకొకరి ప్రాణాలు కాపాడటానికైనా నేను నియంత్రించాలి. నేను ఓడిపోకూడదు!" అని తన మనసులో నిశ్చయించుకుంది. 

వేద అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత, అర్జున్ తన బ్యాగ్ తీసుకుని అందులో ఉన్న తన తండ్రి పాత వస్తువులను మళ్ళీ ఒక్కసారి బయటకు తీయగా, అతని మనసు ఏదో వెతుకుతున్నట్టు ఉంది. 

అందులో ఒక పాత, చిరిగిపోయిన లెదర్ పర్సు. అందులో అతని చిన్నప్పటి ఫోటో, దాని పక్కనే తండ్రి ఫోటో ఉంది. అర్జున్ ఆ ఫోటోను బయటకు తీస్తుండగా, ఫోటో వెనుక భాగంలో పెన్సిల్‌తో ఏదో గీసి ఉన్నట్లు గమనించాడు. 

వెంటనే అతను కిటికీ దగ్గరకు వెళ్లి, బయట నుండి వస్తున్న అరకొర వెలుతురులో ఆ గుర్తును నిశితంగా పరీక్షించాడు. 

అక్కడ కనిపించిన గుర్తును చూడగానే అర్జున్ ముఖచిత్రం మారిపోతూ, "ఇది అసాధ్యం.. ఇది ఆయన ఇక్కడ చూసి గీసిందా? లేక మొదటి నుండే ఆయనకు దీని గురించి తెలుసా..?" అని తన మనసులో ప్రశ్నించుకున్నాడు. 

అర్జున్ అనుమానంతో ఆ ఫోటోను వెలుతురులోకి తిప్పి తిప్పి చూడటంతో, అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఫోటో వెనుక భాగంలో వేద మెడలో ఉన్న శరభ ముద్ర గుర్తు అచ్చు గుద్దినట్లు అలాగే ఈ ఫోటో వెనుక పెన్సిల్‌తో గీసి ఉంది. 

దాని కింద తన తండ్రి చేతిరాతతో, "ద్వారపాలికను రక్షించాలి - అదే మన ప్రధాన లక్ష్యం." అని ఒకే ఒక్క వాక్యం రాసి ఉంది. 

అది చదవగానే అర్జున్ చేతులు భయంతో కూడిన ఆశ్చర్యంతో వణికిపోతుండగా, ఆ ఫోటో అతని చేతిలోనుండి కింద పడిపోయింది. అంటే.. తన తండ్రికి వేద గురించి, ముందే తెలుసా? అంటే అర్జున్ ఇక్కడికి రావడం యాదృచ్ఛికం కాదా? అని అనుకున్నాడు. 

అర్జున్ కేవలం ఒక ఇన్వెస్టిగేటర్ లాగా ఇక్కడికి రాలేదు.. కాలం అతన్ని తన గమ్యం వైపుగా తీసుకెళ్లడానికి ఇక్కడికి పంపబడ్డాడు.