Read truth - 28 by Rajani in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
  • అరె ఏమైందీ? - 24

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

నిజం - 28

అందరూ టిఫిన్ చేయటం స్టార్ట్ చేశారు .

గంగ : మా చిన్న తాత నానమ్మ లది ఆ రోజుల్లోనే లవ్ మ్యారేజ్ తెలుసా .

సాగర్ : అవునా , అయితే మీ లవ్ స్టోరీ చెప్పండి తాత గారూ .

గంగ నానమ్మ : అదేం లేదు లే బాబు , ఇద్దరూ బావా మరదలుళ్ళం కదా చిన్నప్పటినుండి మాకు ఒకరి మీద ఒకరికి ఇష్టం కూడా వుంది , పెద్దవాళ్ళు పెళ్లి చేశారు అంతే.

గంగ తాతయ్య : అంతే ఏమీ కాదు , వీళ్ల నాన్న పెద్ద మొండి ఘటం నాకు వున్నది ఒక్కటే కూతురు , మాకు దగ్గరలో ఉండే వాళ్ల కి ఇచ్చి పెళ్లి చేస్తా అంత దూరం నా కూతురిని పంపను అని తెగేసి చెప్పాడు.

చేసేదేమీ లేక మా ఇంట్లో ఒప్పించి ఇల్లరికం వస్తాను అని చెప్తే గానీ వీళ్ల నాన్న పెళ్ళికి ఒప్పుకోలేదు.

విజయ్ : మీరు సూపర్ తాత గారు .

గంగ : మీ జనరేషన్ లోనే మీరు అందరినీ ఒప్పించారు మీ పెళ్లికి , మరి కృష్ణా రావు బాబాయ్ విషయం లో మీ అన్నయ్య ని ఎందుకు ఒప్పించ్ లేక పోయారు తాతయ్య.

గంగ అలా అడిగేసరికి ఏమీ మాట్లాడలేక పోయాడు గంగ తాతయ్య .

గంగ నానమ్మ : ఇప్పటికయినా నిజం చెప్పండి , రేపో మాపో మనం కూడా పోతాం , ఈ పిల్లలికి అయినా నిజం తెలియాలి కదా .

గంగ : కృష్ణా రావు బాబాయ్ ఎవరినో ప్రేమించి నందుకేగా ఆయన్ని ఇంట్లో నుండి పంపేశారు తాతయ్య.

గంగ తాతయ్య : లేదు గంగా మా అన్నయ్య అలాంటి వాడు కాదు .

గంగ : మరి ఎందుకు పంపించేశారు బాబాయ్ ని చెప్పండి తాతయ్య.

గంగ తాతయ్య : చెప్తాను తల్లి , దానికి ముందు నీకు మరో విషయం చెప్పాలి , ఒకప్పుడు రాయవరం నుండి మచలీపట్నం వెళ్ళడానికి ఇప్పటిలా బ్రిడ్జ్ లేదు తల్లి , మేము పట్నానికి వెళ్లాలంటే పడవ గానీ లాంచీ గానీ వేసుకుని వెళ్ళేవాళ్ళం .

రాయవరం లోనేమో ఒక్క డాక్టర్ కూడా లేదు , చిన్న చిన్న రోగాలోస్తే చూస్తే నాటు వైద్యుడు మాత్రమే అందుబాటులో వుండే వాడు .

జనాలు పడే అవస్థ లు చూసి మీ తాత ఒక నిర్ణయం తీసుకున్నారు , బయట నుండి ఈ వూరికి డాక్టర్ రావట్లేదు కాబట్టి తన కొడుకుని డాక్టర్ చేయాలి అనుకున్నారు .

మీ నాన్న కు మొదటి నుండీ వ్యవసాయం మీద నే ఎక్కువ ఆసక్తి , అందుకే మీ బాబాయ్ ని డాక్టర్ చేయాలి అని పై చదువులకి హైదరాబాద్ పంపారు .

మీ నాన్న పెళ్లి అయిన కొత్త లో ఒక రోజు మీ అమ్మ , నాన్న మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పండగకు వెళ్లారు.

నేను అప్పుడు మీ తాతయ్య దగ్గరికి వెళ్ళాను , అప్పుడే మీ బాబాయ్ కృష్ణారావు ఒక అమ్మాయిని తీసుకుని వచ్చాడు , తను ఆ అమ్మాయిని ప్రేమించాడు అని పెళ్లి చేయమని అడిగాడు , ముందు మీ తాత కి కోపం వచ్చింది , నేను సర్ది చెప్పటం తో సరే అన్నాడు.

మీ తాత ఒప్పుకోవటం తో సంతోష పడిన మీ బాబాయ్ ఫ్రెష్ అవ్వడానికి లోపలికి వెళ్ళాడు .

ఆ అమ్మాయి వివరాలు అడుగుతూ నువ్వు కూడా డాక్టర్ చదువే చదువుతున్నావా అని అడిగారు మీ తాతగారు , లేదండి నేను డాక్టర్ ని కాదు మీరు నువ్వు కూడా అన్నారు ఇంకెవరు చదువుతున్నారు మీ ఇంట్లో డాక్టర్ అంది .

ఆ అమ్మాయి మాటలకు నేను , మీ తాత షాక్ అయ్యాం.

అదేంటి మా కృష్ణ హైదరాబాద్ లో డాక్టర్ చదువే కదా చదివేది అన్నారు మీ తాతయ్య.

దానికి ఆ అమ్మాయి నవ్వి uncle మీరు ఏదో పొరపాటు పడ్డారు ఆయన పోలీస్ ట్రైనింగ్ లో వున్నారు ఇప్పుడు అంది .

అంతే మీ తాతయ్య కు ఎక్కడ లేని కోపం ముంచుకు వచ్చింది , తనకు ఇంత నమ్మక ద్రోహం చేశాడా అని కోపం తో వూగి పోయాడు , ఆ కోపం లో ఈ గడప తొక్కావంటే నా శవాన్ని చూస్తావు బయటకు పొమ్మని కృష్ణ ని బయటకు గెంటేశారు మీ తాత .

నా కొడుకు డాక్టర్ అయి వస్తాడు అని చెప్పు కుని తిరిగే నేను ఇప్పుడు కొడుకు ఏం చదువుతున్నా డో కూడా తెలీని ఒక చేతకాని తండ్రిలా మిగిలి పోయానని బాధపడ్డాడు , ఈ విషయం అందరికీ తెలిస్తే తన పరువు పోతుందని ఎవరికీ చెప్పొద్దు అని మాట తీసుకున్నాడు. అందుకే ఇన్నాళ్లు ఈ నిజం మీ నాన్న కు కూడా చెప్పలేదు .

కానీ కృష్ణ మీద బెంగపెట్టుకుని మంచాన పడ్డాడు మీ తాత , కృష్ణ కుటుంబాన్ని మన కుటుంబం తో కలపాలన్నది వాడి చివరి కోరిక .

తన తమ్ముడిగా నేను వుండి కూడా వాడి కోరిక తీర్చలేక పోయా . హైదరాబాద్ ఎంత ఎంక్వైరీ చేసినా వాడిని కనిపెట్ట లేక పోయా .

గంగ : అయ్యో ఏడవకండి తాతయ్య , మీకు అనవసరం ఇదంతా గుర్తు చేసి ఏడిపించాను సారీ తాతయ్య .

గంగ తాతయ్య : లేదు తల్లి ఇపుడే నాకు కాస్త ప్రశాంతం గా వుంది , ఇన్నాళ్లు ఇదంతా నాలోనే పెట్టుకుని ఎంతో వేదన కి గురయ్యాను , ఇప్పుడు ఆ బరువంతా తగ్గినట్టు వుంది.

విజయ్ : నేను మీ కృష్ణారావు గారి ఫ్యామిలీ ని తప్పకుండా కనిపెడతా , మీరేం బాధ పడకండి తాతగారు .

గంగ నానమ్మ : మీరంతా వూరు చూడడానికి వచ్చారు , ఈ రెండు రోజులు సరదాగా వూరంతా తిరగండి , తరువాత మిగిలినవి చూడొచ్చు .

గంగ తాతయ్య : మన పాలేరు భద్రం వచ్చి మిమ్మల్ని తీసుకెళ్లి వూరంతా చూపిస్తాడు సరదాగా వెళ్ళిరండి .

గంగ : సరే తాత.

బయట నుండి అయ్యగారు అన్న పిలుపు వినిపించింది.

గంగ నానమ్మ : లక్ష్మీ మన భద్రం వచ్చినట్టు వున్నాడు, లోపలికి పిలిచి టిఫిన్ పెట్టు , పిల్లల్ని పొలానికి తీసుకెళతాడు .

లక్ష్మీ : సరే అమ్మా.

లోపలికి వచ్చాడు భద్రం .

గంగ తాతయ్య : ఇదిగో నా మనవరాలు గంగా తన స్నేహితులు వచ్చారు , మా అన్న గారి వూరి నుండి , నువ్వే దగ్గరుండి మన పొలాలు , వూరు అంతా తిప్పి చూపించాలి.

భద్రం : ఓ , మన గంగ పాప వచ్చిందా వూరి నుండి చాలా రోజులయింది అమ్మా నిన్ను చూసి .

గంగ : బాగున్నావా భద్రం బాబాయ్.

భద్రం : అమ్మగారు , అయ్య గారు వున్నారు కదా చూసుకోడానికి బాగున్నానమ్మ.

గంగ తాత : నిజానికి వాడే మమ్మల్ని చూసుకుంటాడు, మా పనులన్నీ వాడు ఈ లక్ష్మి దగ్గరుండి చూసుకుంటారు .

కాసేపటికి అందరూ భద్రం తెచ్చిన ఎడ్ల బండి లో ఎక్కి బయలు దేరి పొలానికి వెళ్లారు .

అందరూ పొలానికి చేరుకున్నాక బండి దిగారు .

గంగ : భద్రం బాబాయ్ మేము ఈ పొలాలు , తోటలు కాసేపు చూసి వస్తాం ఈలోపు వేరే ఏదయినా పని వుంటే చూసుకొని రండి .

భద్రం : సరే తల్లి జాగ్రత్తగా చూసుకోని వెళ్ళండి , ఏదయినా అవసరం అయితే ఒక కేక వేయండి దగ్గరలోనే వుంటా .

గంగ : సరే బాబాయ్ .

సాగర్ : అబ్బా భలే ఉంది ఇక్కడ సీనరి, ఆ మావిడి తోటలో కెళ్ళి ఫొటోస్ దిగుదాం పదండి 😃.

గంగ , విజయ్ , విద్య సీరియస్ 🤨 గా చూసారు సాగర్ వైపు .

సాగర్ : ఇక్కడ సీనరి చూసి మనం వచ్చిన పర్పస్ మర్చిపోయా సారీ , సరే విజయ్ నెక్స్ట్ ఏం చేద్దాం చెప్పు.

విజయ్ : నువ్వు అన్నట్టు ఆ మామిడి తోటలోకి వెళదాం, కానీ ఫొటోస్ కోసం కాదు , మాట్లాడుకోవటం కోసం .

గంగ : గుడ్ ఐడియా అన్నయ్య పదండి వెళదాం .

అబ్బో నేను చెప్పింది ఇదే కదా , మాట్లాడుకున్నాక ఎలాగో ఫొటోస్ దిగి ఇన్స్టా లో పెడతారు ఈ అమ్మాయిలు పైకి మాత్రం ఏది ఒప్పుకోరు అని మనసులోనే అనుకుంటూ వాళ్ళ వెనుకే వెళ్ళాడు సాగర్.

ఒక మామిడి చెట్టు కింద వున్న నులక మంచం మీద కూర్చున్నారు విద్య , గంగ . అక్కడే వున్న చెట్ల కొమ్మల మీద కూర్చున్నారు సాగర్ , విజయ్.

విద్య : గంగ బాబాయ్ ఒక పోలీస్ అని తాత గారు చెప్పారు కదా , పీటర్ ని చంపింది కూడా ఒక పోలీస్ అన్న డౌట్ కూడా వుంది , సో వాళ్ల బాబాయ్ కి దీనికి ఏదయినా సంబంధం వుందేమో కదా.

గంగ : అవును అన్నయ్య నాకు కూడా అదే డౌట్ గా వుంది.

సాగర్ : డౌట్ కాదు ఇదే ఫాక్ట్ . ఇంక మీ బాబాయ్ ఎక్కడున్నాడో కనిపెడితే ఇదంతా చేసింది మీ బాబాయ్ నా లేక వాళ్ల పిల్లలా అని తెలిసిపోతుంది .

గంగ : ఈ విషయం తెలిస్తే మా నాన్న చాలా బాధపడతారు .

విజయ్ మాత్రం వీళ్ల మాటలు వినిపించు కోకుండ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ తల వంచుకుని కూర్చున్నాడు