Read Truth - 29 by Rajani in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
  • మనసిచ్చి చూడు - 5

                                    మనసిచ్చి చూడు - 05గౌతమ్ సడన్...

  • నిరుపమ - 5

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • ధర్మ- వీర - 6

    వీర :- "నీకు ఏప్పట్నుంచి తెల్సు?"ధర్మ :- "నాకు మొదటినుంచి తె...

  • అరె ఏమైందీ? - 18

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • మనసిచ్చి చూడు - 4

    మనసిచ్చి చూడు - 04హలో ఎవరు.... ️ అవతల మాట్లాడకపోయే సరికి ఎవర...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

నిజం - 29

సాగర్ : ఏంట్రా మేమంతా ఇక్కడ ఇంత మాట్లాడుతుంటే నువ్వు ఏం చెప్పవు , దేని గురించి అంతలా అలోచూస్తున్నావ్ .

విజయ్ : నాకు కొన్ని విషయాల్లో క్లారిటీ కావాలి ఆ తర్వాత చెప్తాను.

సాగర్ , గంగ , విద్య ఆశ్చర్యం గా చూసారు విజయ్ వైపు .

విజయ్ : గంగ మీ సర్ name ఏంటి?

గంగ : తమలపాకుల అన్నయ్య , కానీ ఎందుకు ఇప్పుడు ఇంటి పేరు ?

విజయ్ : అయితే మీ బాబాయ్ పూర్తి పేరు తమలపాకుల కృష్ణా రావు అంతే కదా .

గంగ : అవును అన్నయ్య , ఓ నువ్వు ఆధార్ కార్డ్ డేటా చెక్ చేయాలి అన్నావ్ దాని గురించే అడుగుతున్నావు కదా .

విజయ్ ఏమీ మాట్లాడలేదు . కాసేపు అంతా మౌనంగా ఉండిపోయారు .

విజయ్ తన ఫోన్ తీసుకొని డయల్ చేస్తూ అక్కడి నుండి కొంచెం దూరం వెళ్ళాడు.

విద్య : ఏమయింది అన్నయ్య ఎందుకు విజయ్ టెన్షన్ గా కనిపిస్తున్నాడు .

సాగర్ : morning నుండి బాగానే ఉన్నాడు , ఇప్పుడు సడెన్ గా ఏమయిందో నాకు కూడా తెలీదు .

గంగ : విజయ్ అన్నయ్య కొన్నాళ్ళు హైదరాబాద్ స్టేషన్ లో వర్క్ చేశాడు అని చెప్పావ్ కదా , అక్కడ కృష్ణా రావు అని ఎవరయినా తెలుసు ఏమో .

సాగర్ : అవును .

విద్య : కానీ అందులో మన దగ్గర దాచడానికి ఏముంది, మనకి ఆ విషయం డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా .

సాగర్ : తనకు క్లారిటీ వచ్చాక చెబుదాం అనుకొని వుండొచ్చు , పోలీస్ డిపార్ట్మెంట్ లో వీళ్ళ బాబాయ్ ఒక్కడే కృష్ణారావు ఉండడు కదా అందుకే వాళ్ల డిపార్ట్మెంట్ వాళ్లకు కాల్ చేసి డీటైల్స్ తీసుకుంటున్నాడు ఏమో .

విద్య : దానికోసం సీక్రెట్ గా అంత దూరం వెళ్లి మాట్లాడాలా నాకెందుకో విజయ్ మన దగ్గర ఏదో దాస్తున్నాడు అనిపిస్తుంది .

గంగ : ఎందుకే మా అన్నయ్య మీద ఎప్పుడూ డౌట్ పడతావ్ .

విద్య : లేదు గంగా ఇందాక తాతయ్య గారు మాట్లాడేటప్పుడు విజయ్ ఫేస్ లో ఏదో చేంజ్ కనిపించింది , విడిగా వచ్చాక ఏదయినా మనతో చెప్తాడులే అనుకుంటే ఇలా మనల్ని తప్పించుకొని దూరంగా వెళ్లి మాట్లాడుతున్నాడు ఏమనుకోవాలి చెప్పు .

గంగ : నువ్వు మా విజయ్ అన్నయ్య ని కొంచం అతిగా అబ్జర్వ్ చేస్తున్నావ్ అనుకోవాలి .

సాగర్ ముందు గంగ అలా అనేసరికి విద్య మొహం కంద గడ్డలా ఎర్రగా అయ్యింది కోపంతో .

నీకు వాగుడు ఎక్కువ అయ్యింది అంది విద్య కోపంగా😠

సాగర్ : గంగ ఏదో సరదాగా అంది లేరా నువ్వు సీరియస్ గా తీసుకోకు .

గంగ ముసి ముసి గా నవ్వుకుంది విద్య మొహం చూసి.

విద్య : నువ్వు దానిని వెనుక వేసుకుని రాకు చూడు ఎలా నవ్వుతుందో.🥺

మా విజ్జి ఇలా అలిగితే ఎంత బుజ్జి గా వుందో అని నవ్వుతున్నా అని విజ్జి బుగ్గలు లాగుతూ అంది గంగ.

విజ్జి : బాగా మాటలు నేర్చావు , పాపం మా అన్నయ్య పెళ్లి అయ్యాక నిన్ను ఎలా భరిస్తాడో ఏమో.

నిన్నూ అంటూ విజ్జి చెవిని మెలి వేసింది గంగ .

విజ్జి గంగ ల అల్లరి చూసి నవ్వుకున్నాడు సాగర్ .

మరో వైపు వీళ్లకు దూరం గా వెళ్లిన విజయ్ రాఘవులు కి ఫోన్ చేసాడు .

విజయ్ : హెల్లో uncle .

రాఘవులు : చెప్పండి sir.

విజయ్ : నా ప్లేస్ లో అంతక ముందు అక్కడ చేసిన SI ఫోన్ నంబర్ కావాలి.

రాఘవులు : ఓ ఆయన పేరు నారాయణ రావు గారు , ఆయన నంబర్ నా దగ్గర వుంది మీకు ఇప్పుడే మెసేజ్ చేస్తాను.

విజయ్ : అతను ఎలాంటి వ్యక్తి , ఆయన్ని ఇక్కడి నుండి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారో మీకు తెలుసా .

రాఘవులు : ఆయన చాలా మంచి మనిషి sir, ఆయన పిల్లల పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి , ఆయన భార్య ఇక్కడ స్కూల్ లోనే టీచర్ గా చేసేవాళ్ళు ,అసలు రిటైర్డ్ అయిపోయాక ఇక్కడే సెటిల్ అవ్వాలని అనుకున్నారు.

ఏమయిందో తెలీదు సడెన్ గా ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చాయి , పాపం చాలా బాధ పడ్డారు ఇక్కడి నుండి వెళ్ళడానికి . ఇప్పుడు ఎందుకు sir ఆయన గురించి అడుగుతున్నారు ఏం జరిగింది , మళ్లీ ఏదయినా సమస్యా ?

విజయ్ : లేదు uncle , నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి అందుకే , నాకు ఆయన నంబర్ ఫార్వర్డ్ చేయండి .

రాఘవులు : ok sir, ఇప్పుడే పంపిస్తాను.

కాల్ కట్ చేయగానే మెసేజ్ వచ్చింది విజయ్ కి , రాఘవులు పంపిన నంబర్ కి కాల్ చేసాడు విజయ్ .

విజయ్ : హెల్లో sir నా పేరు విజయ్ , రాయవరం SI ని .

నారాయణ రావు : హా చెప్పండి , వాట్ కెన్ ఐ డు ఫర్ యు .

విజయ్ : ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకొక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి.

నారాయణ రావు : తప్పకుండా , నాకు తెలిసిన విషయం అయితే తప్పకుండా చెబుతా .

విజయ్ : మీకు సడెన్ గా ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఏదయినా రీసన్ వుందా .

నారాయణ రావు : అలాంటిది ఏమీ లేదు , ఇక్కడ గుంటూరు లో అర్జెంట్ రిక్వైర్మెంట్స్ వుంది అన్నారు, నిజానికి నాకు అక్కడి నుండి రావడం కూడా ఇష్టం లేదు, ఇంకొక 4 years లో రిటైర్డ్ అయిపోతాను , ఇంకా ఆ వూళ్ళో నే ప్రశాంతం గా వుండాలి అనుకున్నా , కానీ మన డిపార్ట్మెంట్ లో ఈ ట్రాన్స్ఫర్స్ మామూలే కదా.

విజయ్ : ok , థాంక్స్ sir బై.

అసలేం జరుగుతోంది అంటే నన్ను ఈ వూరికి కావాలనే పంపించారు అని తనతో తనే అనుకుంటూ ముందుకు నడుచుకుంటూ వెళ్ళాడు విజయ్ , అక్కడ ఒక చెరువు దాని నిండా అందమయిన తామర పూలు కనిపించాయి.

ఆ చెరువు ఒడ్డున నిలుచొని మరొక కాల్ చేయడానికి ఫోన్ తీశాడు .

ఇంతలో విజయ్ అని ఎవరో పిలిస్తే అటు చూసాడు , అక్కడ సాగర్ తన వైపు వస్తూ కనిపించాడు.

సాగర్ : మన కోసం ముంజలు కోసి తెచ్చారు , రా రా తిందాం .

విజయ్ : మరొక అర్జంట్ కాల్ మాట్లాడి వస్తారా .

సాగర్ : అబ్బా ఆ ఫోన్ ఎక్కడికి పోతుంది మాట్లాడుకోవచ్చు లే అందరూ నీ కోసం వెయిట్ చూస్తున్నాం రారా .

విజయ్ : అది కాదు రా జస్ట్ 5 మినిట్స్ , వచ్చేస్తా నువ్వెళ్లు.

సాగర్ : అప్పటి నుండి చూస్తున్నా వెళ్ళు, వెళ్ళు అంటున్నావ్ , నిజం గానే నువ్వు మా దగ్గర ఏమయినా దాస్తున్నావా , ఇందాక విజ్జి కూడా అంది నువ్వు ఏమైనా చెప్పకుండా దాస్తున్నావు ఏమో అని.

విజయ్ : అదేం లేదు రా , చెప్పాగా నాకు వున్న డౌట్స్ క్లియర్ కావాలి , అప్పుడే అసలు విషయం ఏంటి అని మీకు కూడా చెప్పగలను , నాకు కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్ , ఏదయినా మీ ముగ్గురి కే ముందుగా చెప్తాను సరేనా.

సాగర్ : సరేలే , అక్కడ విజ్జి , గంగ ఇద్దరూ నువ్వు వచ్చాకే తింటాం అని కూర్చున్నారు వాళ్ల కోసం అన్నా మాతో కాసేపు ఉండి ఆ తర్వాత నీ పని చేసుకో.

విజయ్ : నేను ఇప్పుడు రాకపోతే వదిలేటట్టు లేవుగా.

సాగర్ : ఇప్పుడు నిన్ను తీసుకెళ్లేక పోతే , ఆ మాత్రం నీ ఫ్రెండ్ ని తీసుకురాలేక పోయావా అని వాళ్ళిద్దరూ నాతో ఆడుకుంటారు రా బాబు , నువ్వు వచ్చి ఒక 5 నిమిషాలు వుండి వెళ్ళు చాలు నేను బ్రతికిపోతా.

విజయ్ : సర్లే పదా వెళదాం.

విజయ్ , సాగర్ ఇద్దరూ విజ్జి , గంగ వున్న చోటికి వచ్చారు .

గంగ : వాచ్చేసారా మీరిద్దరూ , బాబాయ్ ఇప్పుడు ముంజలు కొట్టి ఇవ్వండి తింటాం .

విజయ్ : నా గురించి వెయిట్ చేయడం దేనికి మీరు తినేయ వచ్చు కదా.

గంగ : అదేంటి అన్నయ్యా, నువ్వు రాకుండా మేము ఎలా తింటాం .

ఎందుకు గంగా నేనంటే అంత అభిమానం నీకు అనుకున్నాడు మనసులోనే విజయ్ .

భద్రం ముంజలు కొట్టి ఇస్తూ వుంటే నలుగురూ చుట్టూ కూర్చొని తినటం స్టార్ట్ చేసారు.

మొదటి నుండీ సిటీ లోనే పుట్టి పెరిగిన విజయ్ ఆ ముంజలు తినటం రాక అవస్త పడుతున్నాడు , అలా కాదు నేను చూపిస్తాను ఎలా తినాలో అని విజ్జి వెళ్లి విజయ్ పక్కన కూర్చొని తినడానికి హెల్ప్ చేసింది .

విద్య తనతో అలా క్లోజ్ గా వుండటం చాలా నచ్చింది విజయ్ కి కాసేపు తన ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయి సరదాగా టైం స్పెండ్ చేశాడు వాళ్ళతో.

గంగ , సాగర్ ఇద్దరూ లేచి చేతులు కడుక్కోవటం కోసం చెరువు దగ్గరకు వెళ్ళారు .

విజయ్ , విద్య , భద్రం ముగ్గురూ అక్కడే కూర్చొని ఉన్నారు.

విజయ్ : తినడానికి హెల్ప్ చేసినందుకు థాంక్స్ విద్య గారు.

విద్య : యు కెన్ కాల్ మీ విజ్జి.🙂

విజయ్ : నిజంగా.

విద్య : అవును, చూడండి ప్రతి జాబ్ లోనూ స్ట్రెస్ వుంటుంది , మీ ప్రొఫెషన్ లో ఇంకొంచెం ఎక్కువ స్ట్రెస్ వుంటుంది ఒప్పుకుంటాను , అలా అని అంతగా టెన్షన్ పడితే దాని ఎఫ్ఫెక్ట్ మీ హెల్త్ మీద పడుతుంది , healthy గా వుంటేనే కదా ఏదయినా సాధించగలం.

ఓహో నేనేదో టెన్షన్ లో ఉన్నానని జాలిపడి నాతో ఇంత మంచిగా వుందా , అనవసరం గా నేను ఏదో వూ హించుకున్నా అని మనసులోనే అనుకున్నాడు విజయ్.

విజయ్ : థాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ విజ్జి .

విద్య : ఇట్స్ ఓకే , నేను డాక్టర్ ని కదా ఇలా కౌన్సిలింగ్ ఇవ్వటం మాకు మామూలే కదా.

వార్నీ ఇంకా ఫైనల్ ఇయర్ కంప్లీట్ కానే లేదు ఏదో సీనియర్ డాక్టర్ లాగా మాట్లాడుతుంది చూడు మనసులో అనుకుని పైకి మాత్రం , ఇంతకీ ఇప్పటివరకు ఎంతమంది పేషన్ట్స్ కి కౌన్సిలింగ్ ఇచ్చారు డాక్టర్ అన్నాడు విద్య తో.

విద్య : అంటే ఏంటి నీ ఉద్దేశం ఫైనల్ ఇయర్ అవ్వకుండా నే కౌన్సిలింగ్ ఎలా ఇచ్చాను అనా , మాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం హాస్పిటల్ లో పేషన్ట్స్ కి కౌన్సిలింగ్ ఇప్పిస్తారు తెలుసా .

Infact నాతో మాట్లాడిన పేషన్ట్స్ మళ్ళీ నాతో మాట్లాడాలి అని కూడా అడుగుతారు అంట, అంతలా కౌన్సిలింగ్ ఇస్తా నేను .

విజ్జి మాటలకు నవ్వుకున్నాడు విజయ్.

విజ్జి : అంత ఎందుకు నువ్వే చూడు ఇందాక ఎంత టెన్షన్ పడుతూ వున్నావు , చూడు నాతో మాట్లాడాక ఎలా పీస్ ఫుల్ వుంది నీ ఫేస్.

నిజమే విజ్జి కానీ నేను నీ మిగిలిన పేషన్ట్స్ లాగా ఇంకొక సారి నీతో మాట్లాడితే చాలు అనుకోవటం లేదు విజ్జి , నువ్వు నాతో లైఫ్ లాంగ్ వుండాలి అనుకుంటున్నా , ఈ హ్యాపీనెస్ నాకు లైఫ్ లాంగ్ కావాలి అనిపిస్తోంది , నీతో వుంటే నాకు టైం కూడా తెలీదు అనుకున్నాడు మనసులో .

తన వైపే చూస్తూ వున్న విజయ్ మోహన్ పైన్ చిటిక వేసింది విజ్జి , ఈ లోకం లోకి వచ్చాడు విజయ్ , ఏంటి నా టాలెంట్ గురించి విని షాక్ అయ్యవా అంది విజ్జి.

భద్రం : గంగమ్మ , సాగర్ బాబు చెరువు దగ్గరకు వెళ్ళి ఇంత సేపు అయ్యింది ఇంకా రాలేదు , నేను చూసి వస్తా బాబు.

విజ్జి : మీరు కంగారు పడకండి బాబాయ్ అక్కడ చూడటానికి ప్లేస్ బాగుంది ఏమో ఫొటోస్ దిగుతుం డోచ్చు వచ్చేస్తారులే .