Read Truth - 30 by Rajani in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
  • మనసిచ్చి చూడు - 5

                                    మనసిచ్చి చూడు - 05గౌతమ్ సడన్...

  • నిరుపమ - 5

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • ధర్మ- వీర - 6

    వీర :- "నీకు ఏప్పట్నుంచి తెల్సు?"ధర్మ :- "నాకు మొదటినుంచి తె...

  • అరె ఏమైందీ? - 18

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • మనసిచ్చి చూడు - 4

    మనసిచ్చి చూడు - 04హలో ఎవరు.... ️ అవతల మాట్లాడకపోయే సరికి ఎవర...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

నిజం - 30

వాళ్ల దగ్గరికి వస్తూ కనిపించిన గంగ , సాగర్ లను చూస్తూ అచ్చం పార్వతీ, పరమేశ్వరులను చూస్తున్నట్టు వుంది అని మళ్లీ విజ్జి వంక చూసి అయ్యో ఏదో నోట్లోంచి అలా వచ్చేసింది ఏమీ అనుకోకండి అమ్మా అన్నాడు భద్రం.

విజ్జీ: పర్లేదు బాబాయ్ మాకు కూడా అలానే అనిపించింది కానీ మేము పైకి అనలేదు మీరు అన్నారు అంతే.

భద్రం : అంటే మన గంగమ్మ, ఇంకా సాగర్ బాబూ త్వరలో

అనిఅనే లోపు విజ్జి మాట్లాడుతూ అవును బాబాయ్ మీరు అనుకున్నది నిజమే కానీ అప్పుడే ఎవరితోను అనకండి బాబాయ్ ముందు మన గంగ చదువు పూర్తి కావాలి అంది .

భద్రం సరే అన్నట్టు నవ్వుతూ తల వూపాడు.

అక్కడకు వచ్చిన సాగర్ విజయ్ ని తట్టి ఏంట్రా అలా ఆలోచిస్తూ వున్నావు అన్నాడు . సాగర్ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చిన విజయ్ ఏం లేదురా ఈ వ్యూ ని ఎంజాయ్ చేస్తున్నారా అని, సరే నేనొక కాల్ చేసుకుని వస్తా అంటూ అక్కడి నుండీ లేచి వెళ్ళాడు.

చెరువు దగ్గరకి వెళ్లిన విజయ్ ఫోన్ రింగ్ చేసి హలో మామయ్య అన్నాడు గంభీరంగా అటు ఫోన్ లిఫ్ట్ చేసిన డీజీపీ ప్రసాద్ రావు నవ్వుతూ అబ్బా ఎన్ని రోజులయ్యింది నువ్వు మామయ్య అని పిలిచి ఎప్పుడు చూసినా డ్యూటీ లో వున్నా అంటూ సర్ అనే పిలుస్తావు అన్నాడు.

అసలే చికాకులో వున్న విజయ్ , ముందు నేను అడిగే వాటికి ఆన్సర్ చేయండి మామయ్య అన్నాడు గంభీరంగా .

ఏంట్రా ఏదో డిస్టర్బ్డ్ గా వున్నావ్ ఎన్టీ మాటర్ అన్నాడు సీరియస్ మూడ్ లోకి వచ్చేసి .

నన్ను ఈ వూరికి ట్రాన్స్ఫర్ చేయడానికి రీసన్ చెప్పండి మామయ్య అన్నాడు స్ట్రెయిట్ గా పాయింట్ కి వచ్చేసి.

అదేంటి మళ్లీ కొత్తగా అడుగుతున్నా వు ముందే చెప్పాగా అర్జెంట్ రిక్వైర్ మెంట్ అని అన్నాడు ప్రసాద్ రావు తడబడుతూ .

విజయ్ : మీ మాటల్లోనే అది అబద్దం అని తెలిసిపోతుంది ఇప్పుడైనా నిజం చెప్పండి .

ఒక నిట్టూర్పు వదిలి మాట్లాడటం మొదలు పెట్టాడు ప్రసాద్ రావు.

ప్రసాద్ రావు : నీకు విషయం ఎప్పటికైనా చెప్పాలి కానీ ఇంత త్వరగా చెప్పాల్సి వస్తుంది అనుకొలేదు.

ఇంతకీ అక్కడ పరిస్థితులు అంతా ఒకే నా నీకు ఏం ప్రాబ్లెమ్ లేదు కదా అన్నాడు ప్రసాద్ రావు కొంచెం కంగారు పడుతూ .

విజయ్ : లేదు మామయ్యా ఏం ప్రాబ్లెమ్ లేదు నా గురించి వర్రీ కావద్దు , మీరు చెప్పాల్సిన విషయం త్వరగా చెప్పండి.

ప్రసాద్ రావు : సర్లేరా విసుక్కోకు మీ అమ్మ నీ భాధ్యత నాకు అప్పజెప్పి వెళ్ళింది , నీ గురించి రోజూ ఫోన్ చేసి అడుగుతుంది ,అందుకే అంతలా అడుగుతున్నా. సరే ఇక విషయానికి వచ్చేస్తా విను అని చెప్పడం మొదలు పెట్టాడు .

నీకు తెలుసు కదా నేను మీ నాన్న కలిసే పోలీస్ ట్రైనింగ్ తీసుకున్నాం అని, కొన్ని రోజులకే మేం ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అయిపోయాం నా ద్వారానే నా చెల్లి ని కలుసుకున్నాడు , వాళ్ల స్నేహం ప్రేమగా మారింది , మా ఇంట్లో వాళ్లకు కూడా మీ నాన్న నచ్చడంతో వాళ్ళూ ఒప్పుకున్నారు.

ఒక రోజు మీ నాన్న వాళ్ల వూరు వెళుతూ మీ అమ్మని వాళ్ళ ఇంట్లో పరిచయం చేయొచ్చు అని వెంట తీసుకెళ్ళాడు . అక్కడ మీ తాతగారికి మీ నాన్న కి అయిన గొడవ వల్ల మీ నాన్న మళ్లీ తన వూరికి వెళ్ళలేదు , నేను మీ అమ్మ నచ్చ చెప్పడానికి చాలా ట్రై చేశాం కానీ మీ నాన్న పట్టుదల గురించి నీకు తెలుసు కదా , ఇక మీ అమ్మా నాన్న ల పెళ్లి మా ఫ్యామిలీ నే దగ్గరుండి చేయించాం. తర్వాత ఎవరి లైఫ్ లో వాళ్ళం బిజీ అయిపోయాం అని చెప్పి ఒక నిట్టూర్పు విడిచి మళ్లీ చెప్పడం మొదలు పెట్టాడు ప్రసాద్ రావు.

మీ నాన్న చనిపోయే ముందు నన్ను పిలిచి నిన్ను తన ఫ్యామిలీ కి దగ్గర చేయమని మాట తీసుకున్నాడు ,

కానీ మీ అమ్మ , ఆ వూళ్ళో పరిస్థితులు తెలీకుండా నిన్ను అక్కడికి పంపడానికి భయపడింది , అందుకే ముందు నీకు ఆ కుటుంబానికి కొంచెం పరిచయం అవుతుందని నీ దగ్గర విషయం దాచి నిన్నలా పంపించాను , అక్కడ పరిస్థితులు తెలుసుకొని నీకు విషయం నిదానంగా చెప్పొచ్చు అనుకున్నాను అంతే గానీ నీ దగ్గర ఏదీ దాచే ఉద్దేశం లేదురా అన్నాడు ప్రసాద్ రావు.

ఇదంతా విని మౌనంగా వుండిపోయాడు విజయ్ , తన తండ్రి జ్ఞాపకాలు కళ్ళ ముందు కనబడ్డాయి , తెలీకుండానే అతని కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

విజయ్ విజయ్ అంటూ పిలుస్తున్న ప్రసాద్ రావు పిలుపుతో ఈ లోకం లోకి వచ్చిన విజయ్ ఆ మామయ్య చెప్పండి అన్నాడు , విజయ్ మనసు అర్థం చేసుకున్న ప్రసాద్ రావు ఏరా నాన్న గుర్తుకు వచ్చాడా బాధ పడకురా వాడు ఏ లోకంలో వున్నా నిన్ను చూస్తూనే వుంటాడు నువ్వు బాధ పడితే వాడు చూడలేడు నీకు తెలుసు కదా అనగానే , విజయ్ కళ్ళు తుడుచుకొని తన గొంతు సవరించుకుంటూ ఇంతకీ నేను ఇప్పుడు ఏం చేయను మామయ్యా , నా గురించి ఆ ఫ్యామిలీ కి ఏమని చెప్పను , విషయం తెలీక ఆ ఫ్యామిలీ కి మా నాన్న శత్రువేమో అనుకొని అని చెప్తూ తల పట్టుకున్నాడు విజయ్ చిరాకు పడుతూ.

ప్రసాద్ రావు : నువ్వు ముందు కూల్ అవ్వు , కేస్ ని ఫ్రెష్ మైండ్ తో ఫస్ట్ నుండి స్టడీ చెయ్యి , ఇక నీ గురించి మంచి టైం చూసుకుని నీ పెదనాన్న కు నిజం చెప్పు అంతే.

చెయ్యాల్సింది అంతా చేసి ఎంత కూల్ గా చెప్తున్నాడు అని మైండ్ లోనే అనుకుని సరే మామయ్య నేను మళ్లీ కాల్ చేస్తాను అని ప్రసాద్ రావు రిప్లై కోసం చూడకుండానే ఫోన్ పెట్టేసాడు విజయ్.

ఇదంతా నువ్వు ఖచ్చితంగా హ్యాండిల్ చేయగలవని నాకు తెలుసు విజయ్ అని ఫోన్ వైపు చూస్తూ అనుకున్నాడు ప్రసాద్ రావు.