Read Truth - 27 by Rajani in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

నిజం - 27

అరే , ఇంక స్టార్ట్ అవుదాం మళ్ళీ లేట్ నైట్ అయితే డ్రైవింగ్ కష్టం అవుతుంది ఆ రూట్ లో అన్నాడు సాగర్.

ఓకె రా పదండి , సాగర్ కార్ కీస్ ఇవ్వు నేను డ్రైవ్ చేస్తాను అన్నాడు విజయ్.

మళ్ళీ వాళ్ల ప్రయాణం స్టార్ట్ చేసారు , చాలా సేపు సైలెంట్ గానే వున్నారు నలుగురూ .

మా బాబాయ్ నిజంగానే చెడ్డవాడా అసలు తాతయ్య ఆయన్ని ఇంటి నుండి ఎందుకు పంపించేసి వుంటారు, నాన్న ఏమో బాబాయ్ గురించి ఎప్పుడూ మంచిగానే చెప్పాడు అని మనసులో అనుకుంటూ వుంది గంగ.

సాగర్ : ఏంటి బావ ఇంకా ఆ పీటర్ గురించే ఆలోచిస్తూ ఉన్నావా , అలాంటి వాడికి శత్రువులకు కొదవ వుంటుందా చెప్పు , ఎవడో కాపు కాసి చంపేసి వుండొచ్చు .

విజయ్ : ఆ పీటర్ ని చివరిసారిగా చూసిన అతను , పీటర్ తో పాటు మరో వ్యక్తి ని కూడా చూసాడు , ఆ వ్యక్తి ఫేస్ మాత్రం ఎవరూ చూడలేదు , ఆ వ్యక్తి ముందు చనువుగా తాగుతూ కూర్చున్నాడు అంటే వాడు తెలిసిన వ్యక్తే అయి వుండాలి కదా , అంటే ఆ టైమ్ లో పీటర్ ని కావాలనే తాగించి మత్తు లో పడి వున్నప్పుడు గొంతు కోసి నీళ్ళల్లో పడేసి వుంటాడు , లేదంటే గొంతు కోసినప్పుడు అరిస్తే ఎవరికయినా వినపడేది కదా .

సాగర్ : అంటే చంపిన వాడికి పీటర్ కి ముందే పరిచయం వుంది అంటావ్ అంతేనా .

విజయ్ : అంతేకాదు ఆ పీటర్ ని ఇక్కడికి పంపిన వాళ్లకు మాత్రమే అతను ఇక్కడ వున్న సంగతి తెలిసే ఛాన్సెస్ ఎక్కువ .

సాగర్ : మన దగ్గర వున్న ఒకే క్లూ ఈ పీటర్ కాబట్టి వాడిని చంపేశారు , అంతేనా.

విజయ్ : అంతే కాదు మరొక విషయం , పీటర్ లాంటి కిల్లర్ ని ఇంత తేలిగ్గా చంపిన వాళ్ళు సంపత్ ని చంపడానికి ఆ శరభయ్య ను ఎందుకు వాడుకున్నారు, ఆ శరభయ్య గురించి ముందే అన్ని విషయాలు వాళ్ళకి ఎలా తెలుసు ఏదో లింక్ మిస్ అవుతున్నట్టు అనిపిస్తోంది .

సాగర్ : వూళ్ళో వున్న వాళ్ళలో వాడే తింగరోడు దొరికి వుంటాడు లేరా.

విజయ్ : లేదు రా ఆ శరభయ్య గురించి వాళ్ళు బాగా స్టడీ చేశారు ,నేను ఆ శరభయ్య వాళ్ల ఇంట్లో వెతికినప్పుడు అతని ఇంట్లో నేను బ్లాక్ మేజిక్ కి సంభందించిన బుక్స్ చూసాను , ఆ విషయం నేను శరభయ్య ని కోర్టు కి తీసుకెళ్లే దారి లో అడిగాను , అతనికి గత 5 ఏళ్లుగా ఇలాంటి బుక్స్ చదివే అలవాటు వుందని చెప్పాడు .

గంగ : ఇలాంటి బ్లాక్ మేజిక్ చేయాలనే పిచ్చి ఉండే వాళ్ళు కూడా ఉంటారా .

సాగర్ : వుంటారు గంగ , నా చిన్నప్పుడు ఒకసారి మా అమ్మమ్మ వాళ్ళ వూరిలో ఒకతను ఇలానే ఒక పిల్లాడిని చంపేసి ఒక గోనిసంచి లో మూట కట్టాడు , చివరిసారి గా ఆ పిల్లాడు అతనితో వున్న సంగతి తెలుసు కొని ఆ పిల్లాడి కుటుంబం వూరి జనం తో వెళ్లి వెతికే లోపే , వాడు బాబు పిల్లాడి బాడీ ని స్మశానం లో వేసి వస్తూ కనిపించాడు , అంతే కాదు వాడు పిచ్చి వాడిలా బిహేవ్ చేస్తూ కనిపించాడు , ఇదంతా మా అమ్మమ్మ పక్కన వాళ్ళతో చెబుతుంటే విన్నా.

విజయ్ : అలాంటి వాళ్ళు తమకు వున్న ఈ ఇంట్రెస్ట్ ని వేరే వాళ్లకు అంత తేలిగ్గా తెలియ నివ్వరు. బాగా స్వార్దం , పేరాశ వున్న వాళ్ళకు సాధారణం గా ఇలాంటి మెంటాలిటీ ఉంటుంది .

సాగర్ : అంటే ఆ శరభయ్య వీక్నెస్ తెలుసుకునే వాళ్ళు ఇలా ప్లాన్ చేశారన్న మాట.

విజయ్ : అవును , శరభయ్య ను బాగా క్లోజ్ గా అబ్జర్వ్ చేశాక ఇలా ప్లాన్ చేసి ఉండాలి ,అలా చేయడానికి ఏదన్నా రీజన్ వుందా అని నాకు డౌట్ గా వుంది .

సాగర్ : శరభయ్య ని వాడుకోవటానికి కూడా వేరే రీజన్ వుంటే దానిని ఎలా కనిపెట్టాలి .

విజయ్ : ముందు ఈ కృష్ణారావు ఎలాంటి వాళ్లో తెలుసుకుని వూరికి రాగానే , శరభయ్య ఇంటికి వెళ్ళి వేరే ఏమయినా క్లూస్ దొరుకుతాయి ఏమో చూడాలి.

సాగర్ : ఆ కృష్ణారావు గారి ఫ్యామిలీ ని కనిపెట్టగలమా .

విజయ్ : తప్పకుండా, ఏ సిటీ లో వుంటున్నారో చిన్న ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఇంకా త్వరగా తెలుస్తుంది , ఆయన డీటైల్స్ ద్వారా ఆధార్ కార్డ్ లిస్ట్ లో సెర్చ్ చేపించాం అంటే ఎక్కడ వున్నారో తెలుసుకోవచ్చు.

గంగ : సంపత్ మర్డర్ అటెంప్ట్ వెనుక మా బాబాయ్ ఉండి వుంటాడా అన్నయ్య .

విజయ్ : ఏమో చెప్పలేం , ప్రస్తుతం ఆ ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారో తెలిస్తే , వాళ్ల గురించి అన్ని విషయాలు తెలుస్తాయి .

విద్య : వాళ్ల ఫ్యామిలీ మంచి వాళ్ళు అని తెలిస్తే మీ బాబాయ్ ని ఒప్పించి మన వూరికి తీడుకొద్దాం సరేనా .

గంగ : అవును విజ్జి అప్పుడు మా నాన్న కూడా సంతోషిస్తారు .

విజయ్ : అలానే జరగాలని కోరుకుందాం గంగ .

అప్పుడు అసలు నేరస్తుడు ఎవరా అని మొదటి నుండి వెతకాలి పాపం విజయ్ అనుకున్నాడు మనసులోనే సాగర్ .

గంగ వాళ్ల చిన తాత గారిది గోదావరి జిల్లాలో పచ్చటి చెట్లతో వున్న ఒక అందమయిన పల్లెటూరు తాటిపల్లి అనే గ్రామం .

ఆ వూరికి చేరుకునే సరికి రాత్రి 8 గంటలయింది విజయ్ వాళ్ళకి , వీళ్ళు వస్తున్నారని ముందే తెలుసు కాబట్టి వాళ్ల కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు గంగ వాళ్ల తాత, నానమ్మలు .

ఇంట్లోకి వెళ్ళగానే నలుగురినీ ఆప్యాయం గా రిసీవ్ చేసుకున్నారు గంగ వాళ్ల నానమ్మ , తాతయ్య లు .

తాతయ్య : ప్రయాణం బాగా జరిగిందా , దారిలో ఏమి ఇబ్బంది కలుగలేదు కదా .

గంగ : లేదు తాతయ్య ఉదయం త్వరగానే బయలు దేరాం కాబట్టి త్వరగానే వచ్చాం .

గంగ నానమ్మ : గంగా ఏవిటి సరిగా తినడం లేదా ఇలా చిక్కి పోయావు . విద్యా , సాగర్ బాగున్నారా , ఈ బాబు ఎవరూ నీతో చదువుతున్నాడా.

సాగర్ : తను విజయ్ బామ్మా నా ఫ్రెండ్ , మన వూరికి SI గా వచ్చాడు .

నానమ్మ : ఓ మన వూరేన చాలా సంతోషం , అందరూ వెళ్లి కాస్త ఫ్రెష్ అయ్యి రండి , భోజనాలు చేద్దురు గానీ .

తాతయ్య : లక్ష్మీ వెళ్లి వాళ్ళ కి గదులు చూపించు .

లక్ష్మి ఆ ఇంటి పనిమనిషి ఆ పెద్దవాళ్ళు ఇద్దరికీ తోడుగా వాళ్ళ తోనే వుంటుంది .

అందరూ ఫ్రెష్ అయ్యి వచ్చి భోజనానికి కూర్చున్నారు .

ప్రయాణం చేయటం వల్ల బాగా అలసట గా వున్నారు నలుగురూ , త్వరగా భోజనాలు ముగించేసారు త్వరగా పడుకుందాం అని.

గంగ తాత గారు : వెళ్లి పడుకొండి బాగా అలసిపోయారు , రేపొద్దుట తీరిగ్గా మాట్లాడుకోవచ్చు .

నలుగురు గంగ నానమ్మ , తాతయ్య లకు గుడ్ నైట్ చెప్పి పడుకోవటానికి వెళ్లారు .

విజయ్ , సాగర్ ఒక గదిలో పడుకొంటే విద్య , గంగ మరో గదిలో పడుకున్నారు .

రేపు గంగ తాతగారి దగ్గర ఆ కృష్ణారావు గారి టాపిక్ ఎలా తీసుకురావాలి ఆయన గురించిన ఇన్ఫర్మేషన్ ఎలా కనక్కోవాలి అని ఆలోచిస్తూ పడుకున్నాడు విజయ్.

గంగ నానమ్మ , తాతయ్య లను మంచి చేసుకుంటే మా పెళ్లికి ఎలాంటి అడ్డు లేకుండా జరిగేటట్లు చూసుకుంటారు అని ఆలోచిస్తూ పడుకున్నాడు సాగర్.

విజయ్ అన్నయ్య వల్ల మా బాబాయ్ ఫ్యామిలీ మాకు దగ్గరైతే బాగుండు అనుకుంటూ పడుకుంది .

విజ్జి మాత్రం బెడ్ ఎక్కగానే నిద్రలోకి వెళ్ళిపోయింది .

Next day morning :

గంగ నానమ్మ పూజ గదిలో పూజ చేస్తూ వుంది , ఈలోగా అందరూ రెడీ అయ్యి అక్కడికి వచ్చారు , గంగ నానమ్మ దేవుడికి హారతి ఇస్తుంటే హారతి పాట పాడారు గంగ , విద్యా ఇద్దరూ కలసి .

అబ్బా ఎంత బాగా పాడింది నా అందాల రాక్షసి అని మనసులోనే మురిసిపోయాడు విజయ్.

పూజ ముగించు కొని అందరికీ హారతి , ప్రసాదం ఇచ్చింది గంగ నానమ్మ , ఎన్ని రోజులు తర్వాత మీ ఇద్దరి పాట విన్నాను తల్లి , టిఫిన్ చేశాక నాకొక మంచి భక్తి పాట వినిపించాలి సరేనా అంది గంగ నానమ్మ .

గంగ : ఓ తప్పకుండా పాడుతాం , చిన్నప్పుడు మాకు నేర్పించింది నువ్వేగా.

నానమ్మ : మీ ఇద్దరి గొంతు లోని మాధుర్యమే వేరు , నేను ఎంతమందికి నేర్పినా మీ అంత శ్రద్దగా నేర్చుకొని సాధన చేసిన పిల్లల్ని ఎక్కడా చూడలేదు సుమీ .

సుమీ ఎవరు అన్నాడు సాగర్ చెవి దగ్గర చిన్నగా విజయ్.

అది బామ్మ గారి వూత పదం అంతే అన్నాడు సాగర్ చిన్నగా విజయ్ కి మాత్రమే వినపడేటట్టు .

ఓ అలాగ అన్నాడు విజయ్ .

గంగ తాతయ్య : లక్షీ టిఫిన్ చేయడానికి అంతా రెడీ నా.

లక్షీ : అన్నీ టేబుల్ పైన సద్దేసాను బాబు గారు , అందరూ వస్తే వడ్డిన్చేస్తా .

నానమ్మ : లక్షీ నువ్వు కూడా వచ్చి హారతి , ప్రసాదం తీసుకో .

అందరూ డైనింగ్ టేబుల్ వద్ద కూర్చున్నారు టిఫిన్ చేయటానికి .