Read Truth - 23 by Rajani in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

నిజం - 23

సాగర్ : అసలు అంత మంచి ఫ్యామిలీ మీద పగ పెట్టుకున్న వాళ్ళు ఎవరో తెలీటం లేదు రా బావ.

విజయ్ : అవును బావ , కానీ ఇప్పుడు వీళ్ళు ఉన్న పరిస్థితి లో ఎంక్వైరీ చేయలేం , కొంచెం టైం తీసుకొని మళ్ళీ ట్రై చేయాలి తెలుసుకోవటానికి ,

ఈ లోగా ఆ పీటర్ గురించి ఏమయినా తెలుస్తుంది ఏమో చూడాలి . అన్నట్టు ఇక్కడ అంతా సెట్ అయింది కదా ఎప్పుడు వెళుతున్నావ్ హైదరాబాద్ కి.

సాగర్ : లేదురా కొన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోం చేద్దామనుకున్న , so కొన్ని రోజులు వూళ్ళో నే వుంటా. అందరినీ చాలా మిస్ అయినట్టు గా వుంది .

విజయ్ : మా చెల్లి గంగ ని మిస్ అయ్యానని చెప్పరా డైరెక్ట్ గా.

సాగర్ : మళ్ళీ స్టార్ట్ చేసావా , ఇంతకీ నీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ ఉంది , ఏం చేస్తుంటుంది , చెప్పు🙂

విజయ్ : నా లైఫ్ లో అంత కలరింగ్ లేదులేరా బావ , పోలీస్ ట్రైనింగ్ అంటే తెలుసు గా ఎలా వుంటుందో , ఇంకా ఇక్కడి కొచ్చాక ఆ శరభయ్య తో గడిపిందే ఎక్కువ .😒

సాగర్ : 😆

విజయ్ : కానీ వూళ్ళో ఒక అమ్మాయిని చూసారా , తనే ఇప్పుడు నా హార్ట్ లో వుంది . ☺️

గుండెల మీద చెయ్యి పెట్టుకుని కలల్లో తేలిపోతున్నాడు .

సాగర్ : ఎవర్రా ఆ అమ్మాయి .

విజయ్ : ఇంతవరకు నేను ఆ అమ్మాయి తో సరిగా మాట్లాడ లేదు , తర్వాత చెప్తాలేరా😒

సాగర్ : అలా డిసప్పాయింట్ కాకు రా , నీకు ఏ హెల్ప్ కావాలన్నా చేస్తా , ఆ అమ్మాయి త్వరలోనే నీ లవ్ ని ఆక్సెప్ట్ చేస్తుంది చూస్తూ ఉండు . 🙂

విజయ్ : నీ కోపరేషన్ ఉంటే చాలు బావ , నీ చెల్లి ని త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటా ☺️

సాగర్ : 🤔

విజయ్ : అదేరా నా కాబోయే భార్య నీకు చెల్లే కదా అయ్యేది.

సాగర్ : ఓ అవును కదా , నీ పెళ్లి దగ్గరుండి చేయించే భాద్యత నాది నువ్విక ధైర్యం గా ఉండు.

విజయ్ : థాంక్స్ రా.

ఈ లోగా సంపత్ ని చూడడానికి అక్కడికి వచ్చారు విద్య , గంగ .

విద్య : గంగా ముందు నువ్వు వెళ్ళి బాబుని చూసిరా .

గంగ సరే అని బాబు రూం లోకి వెళ్ళింది .

డాక్టర్ వన్ బై వన్ వెళ్ళమన్నారని చెప్పారు కాబట్టి గంగ ఒక్కటే ముందు లోపలికి వెళ్ళింది.

ఈ లోగా సాగర్ ఫోన్ రింగ్ అవడం తో సాగర్ కూడా పక్కకు వెళ్ళాడు

అక్కడ విజయ్ , విజ్జి మాత్రమే ఉన్నారు .

విజయ్ : హౌ ఆర్ యూ mrs. విజయ్

విజ్జి : 🤦

విజయ్ : ఓహ్ sorry ms , కాబోయే mrs విజయ్ కదా మర్చిపోయాను .

విజ్జి : ఆ రోజు మీరే విజయ్ అని తెలీక అన్నాను , ఇంకా నన్ను టీస్ చేయటం ఆపండి .😡

విజయ్ : మీ నాన్న గారు , అన్నయ్య నాతో చాలా క్లోజ్ గా వుంటారు , మీరెందుకు అలా నన్ను చూస్తేనే కోపంగా ఉంటారు , మంచిగా మాట్లాడొచ్చు కదా ప్లీస్ .😒

విజ్జి : మీకు నాకు ఎలాంటి పరిచయం లేదు , so మీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు .🙎

విజయ్ : ఇంత తిక్క పిల్లేంటి రా బాబు .(గొణుక్కుంటూ)

విజ్జి : what ఏమన్నారు.

విజయ్ : నాతో పరిచయం లేదు కదా , ఇంకా నేను ఏమనుకున్టే మీకెందుకు .

సాగర్ వాళ్ల దగ్గరకు వచ్చాడు .

సాగర్ : అరే నాకు ఒక అర్జంట్ మీటింగ్ వుంది 1hour లో ఇంటికి వెళ్ళాలి , laptop కూడా ఇంట్లోనే వుంది , మనం వెళదాం అందరికీ చెప్పి.

విజయ్ : ok రా నేను కూడా స్టేషన్ కి వెళ్ళాలి.

సాగర్ : విజ్జి నువ్వు కూడా వస్తావా.

విద్య : లేదు అన్నయ్య నేను , గంగ ఇక్కడే స్వప్న అక్కకి తోడుగా వుంటాం . మోహన్ బావ సంపత్ దగ్గర వుండాలి కదా. మీతో పాటు ఆంటీ, uncle ని తీసుకు వెళ్ళండి వాళ్ళిద్దరూ నైట్ టైం హాస్పిటల్ లో వుండలేరు .

సంపత్ రూం లో నుండి బయటకు వచ్చింది గంగ తనకు వెళుతున్న సంగతి చెప్పి అక్కడినుండి వెళ్ళిపోయారు విజయ్ , సాగర్ .

విజయ్ మాత్రం వెళ్ళే ముందు వరకు విజ్జి నే చూస్తూ వున్నాడు , అతను అలా చూడటం గమనించింది గంగ.

గంగ : ఎంటే సంగతి మా విజయ్ అన్నయ్య అలానే చూస్తున్నాడు నిన్ను .

విద్య : అయితే ఏంటి మన కాలేజ్ లో కూడా చాలా మంది చూస్తారు నన్ను , వాళ్లందరినీ పట్టించుకో లేను కదా.

గంగ : ఏంటి , వాళ్ళు మా విజయ్ అన్నయ్య ఒక్కటే నా నీకు .

విద్య : మరి మీ అన్నయ్య లో ఏంటి అంత స్పెషల్ .

గంగ : నువ్వలానే వుండు , ఇంకెవరైనా విజయ్ అన్నయ్య ని మంచి చేసుకొని ఎగరేసుకు పోతారు అప్పుడు అర్ధం అవుతుంది నీకు .

నిజమే వాడు అసలే అందం గా ఉంటాడు , ఇంకెవరైనా వాడి వెనకాల పడితే ఎలా🤔 అనుకొని , ఛా నేనేంటి ఇలా ఆలోచిస్తున్నా 🤦 అని మనసులో అనుకుంది విద్య .

విద్య : ఇంక మీ అన్న భజన ఆపవే , వినలేక చస్తున్నా 😒

గంగ : విజయ్ అన్నయ్య పక్కన లేనప్పుడు ఎంత మంచి వాడో కదా అని పొగుడుతావు , ఇప్పుడు కలిస్తే నేమో మొహం తిప్పుకున్నావు .

ఆ రోజు గుడిలో కూడా నువ్వు ప్రదిక్షణాలు చేస్తూ అన్నయ్య ని చూస్తూ వున్న సంగతి నాకు తెలుసు, నేను నీ బెస్ట్ ఫ్రెండ్ ని ఆ మాత్రం కనిపెట్టలేనా మర్యాదగా ఒప్పుకో .😌

విద్య : ఏమోనే నాకేం తెలీడం లేదు , ఈ సిటీ వాళ్ళను నమ్మలేం , అంత handsome గా ఉన్నాడు ఇంతవరకు గర్ల్ ఫ్రెండ్ లేదంటే ఎలా నమ్మాలి , చూద్దాం కొన్నాళ్ళు అబ్జర్వ్ చేశాక ఆలోచిస్తా .🙄

గంగ : అవును ఒక్క సారిగా తీసుకునే డెసిషన్ కాదు ఇది , కానీ విజయ్ అన్నయ్య నిన్ను చూసేటప్పుడు తన కళ్ళల్లో తెలుస్తుంది నీ మీద ఎంత ప్రేమ ఉందో , పాపం కనీసం కొంచెం మంచిగా అన్నా మాట్లాడవే మా అన్నయ్య తో .

విజ్జి : బాగుందే మా అన్నయ్య ప్రపోజ్ చేస్తే రిప్లై ఇవ్వడానికి ఎన్ని రోజులు తిప్పించుకున్నావ్ , ఇప్పుడు నీ అన్నయ్య మీద అంత జాలి చూపిస్తున్నావ్ .

అప్పుడే లీనియన్స్ ఇస్తే నా నెత్తిన కూర్చుంటాడు , అసలే పెద్ద వాగుడు కాయ . 😎

గంగ : అబ్బో చాలా చేస్తున్నావే 😲 .

విజ్జి : సర్లే మనం తర్వాత మాట్లాడుకుందాం ముందు నేను సంపత్ ని చూసి వస్తా వుండు. నర్స్ కూడా బయటకు వెళ్తుంది.

గంగ : అవును ఇదే కరెక్ట్ టైం , నువ్వెళ్ళి అన్నయ్య కు వీడియో కాల్ చేసి బాబును వదినకు చూపించు .

విజ్జి : నర్స్ వస్తుంటే వెంటనే చెప్పు.

గంగ : సరే .

మరో వైపు మోహన్ స్వప్న దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాడు .

స్వప్న : నాకు సంపత్ ని కలవాలని వుంది .

మోహన్ : ఇంకా 4 రోజులే కదా , వాడు ఇప్పుడు బాగున్నాడు , కొంచెం ఓపిక పట్టు , పాప అసలే త్వరగా డెలివరీ అయింది ఇప్పుడు పాపని చూసుకోవటం చాలా ముఖ్యం . పాపని కూడా 1వీక్ అబ్జర్వేషన్ లో ఉంచాలన్నారు కదా డాక్టర్ . నీ హెల్త్ కూడా అంత బాలేదు , నువ్వు బాగా రెస్ట్ తీసుకొని టైం కి తింటేనే నీకు పిల్లల్ని జాగ్రత్త గా చూడుకొనే ఓపిక వుంటుంది , అసలే నువ్విప్పుడు పాపకి పాలు కూడా ఇవ్వాలి , ఇదిగో ఇంకొంచం జూస్ తాగి టాబ్లెట్ వేసుకో.

స్వప్న : అబ్బా మళ్ళీ టాబ్లెట్ నా😞

వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వుండగా మోహన్ ఫోన్ రింగ్ అయింది , ఫోన్ తీసి చూసాడు మోహన్ , మన విద్య ఏంటి వీడియో కాల్ చేస్తుంది అంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు , వీడియో కాల్ లో అటు నుండి సంపత్ కనిపిస్తున్నాడు పక్కనుండి విద్య మాట్లాడుతోంది , బావ గారు స్వప్న అక్కని , పాప ని చూపించండి మన సంపత్ కి అంటోంది .

మోహన్ : ఇదిగో సంపత్ ని చూడాలి అన్నావు గా.

స్వప్న : కన్నా , బంగారం ఎలా వున్నావు రా.

సంపత్ : అమ్మా నువ్వు ఎలా ఉన్నావ్ , నువ్వు కూడా బెడ్ మీద ఉన్నావని అందుకే రాలేదని చెప్పింది గంగ అత్త , చెల్లి ఎక్కడ ఉంది , నాకు చెల్లిని చూపించు .

స్వప్న : ఇదిగో ఫోన్ మీ నాన్న కి ఇస్తున్నా , చెల్లిని చూపిస్తారు చూడు.

మోహన్ ఫోన్ పాప దగ్గరకు తీసుకెళ్ళి చూపించాడు. ఇదిగో నీ చిట్టి చెల్లి ఎలా వుంది అన్నాడు మోహన్ , ఓ ఎంత బుజ్జి గా ఉంది , అచ్చం అమ్మ లా ఉంది అందం గా అన్నాడు సంపత్ .

ఫోన్ మళ్ళీ స్వప్న కి ఇచ్చాడు , స్వప్న కి బాబుని చూసిన ఆనందం లో కన్నీళ్లు ఆగడం లేదు .

సంపత్ : అమ్మా నువ్వు ఏడవకు నేను బాగానే ఉన్నా. విద్య అక్క చెప్పింది 4 డేస్ లో ఇంటికి వెళ్లొచ్చు అని .

విద్య : స్వప్న అక్కా ఇంక సంపత్ రెస్ట్ తీసుకోవాలి , నర్స్ చూస్తే వూరుకోదు , నేను ఫోన్ పెట్టేస్తాను .

స్వప్న : చాలా థాంక్స్ విద్యా , సంపత్ ని చూసాక నాకు ప్రశాంతం గా ఉంది . బై కన్నా .

ఫోన్ పెట్టేసింది విద్య.