Read Truth - 24 by Rajani in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
  • మనసిచ్చి చూడు - 5

                                    మనసిచ్చి చూడు - 05గౌతమ్ సడన్...

  • నిరుపమ - 5

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • ధర్మ- వీర - 6

    వీర :- "నీకు ఏప్పట్నుంచి తెల్సు?"ధర్మ :- "నాకు మొదటినుంచి తె...

  • అరె ఏమైందీ? - 18

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • మనసిచ్చి చూడు - 4

    మనసిచ్చి చూడు - 04హలో ఎవరు.... ️ అవతల మాట్లాడకపోయే సరికి ఎవర...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

నిజం - 24

After one weak :

హాస్పిటల్ నుండి బాబుని , స్వప్న ని కూడా డిశ్చార్జ్ చేశారు . కానీ సంపత్ కి గాయం ఇంకా తగ్గలేదు , కొన్ని రోజులు బెడ్ మీదే ఉంచి జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పారు డాక్టర్ .

11 వ రోజు పాపను ఉయ్యాలలో వేసే ఫంక్షన్ గ్రాండ్ గా ఏర్పాటు చేశారు వాళ్ల మామిడి తోటలో .

మామిడి చెట్ల మధ్యలో వుయ్యాల ఎరుపు, పసుపు బంతి పూలతో చక్కగా అలంకరించారు . వుయ్యాలలో పాపని పడుకోబెట్టడానికి చిలక పచ్చ రంగు పట్టు చీర వేశారు . తెల్లటి మేని ఛాయ లో వున్న పాప ఎర్రటి పట్టులంగా లో మెరిసి పోతుంది .

వుయ్యాల చూట్టూ వేసిన కుర్చీల్లో వూరి జనమంతా కూర్చున్నారు . ఎంతో సందడి గా ఉంది ఆ ప్రాంతం .

ఈ లోగా అక్కడికి చేరుకున్నారు మన హీరోలు ఇద్దరూ సాగర్ , విజయ్ .

వాళ్ళిద్దరినీ చూసిన రామారావు గారు , ఏంటయ్యా ఇంత లేట్ గాన వచ్చేది అన్నారు చనువుగా .

నేనయితే ఈ రోజు లీవ్ uncle , ఈ సాగర్ కోసం వెళితే ఆడ పిల్ల లాగా ఇంతసేపు రెడీ అయ్యాడు అన్నాడు విజయ్ నవ్వుతూ.🙂

ఆ మాటలకు రామారావు గారి తో పాటు పక్కనే వున్న వాళ్ళు కూడా నవ్వేశారు .😃

నైట్ వర్క్ చేసి పడుకునే సరికి లేట్ అయింది uncle , అందుకే కొంచెం లేట్ గా లేచాను అన్నాడు సాగర్ అమాయకంగా.🥺

పర్లేదు బాబు ,పూజ జరుగుతోంది మీరిద్దరూ కూడా వెళ్ళి పూజ లో కూర్చోండి , నేను ఇప్పుడే వస్తా అన్నారు రామారావు గారు .

భోజనాలు అయ్యాక కాసేపటికి చాలా మంది అక్కడి నుండి వెళ్ళిపోయారు .

శాంతమ్మ ని , స్వప్నను పిల్లల్ని ఇంట్లో దించి వచ్చాడు మోహన్ వాళ్ల కు రెస్ట్ కావాలని .

రామారావు గారు, మోహన్, విజయ్ , సాగర్ ఒక మామిడి చెట్టు కింద కూర్చుని మాట్లాడుకున్టున్నారు.

రామారావు : మీ ఇద్దరి వల్లే మేము ఈ రోజు ఇంత సంతోషంగా వేడుక జరుపుకున్నాం బాబు.

విజయ్ : మీ రిలేటివ్స్ చాలా మంది ఈ వూళ్ళో నే వున్నట్టున్నారు కదా uncle.

రామారావు : అవును బాబు , కానీ ఇప్పటి జనరేషన్ చాలామంది ఉద్యోగరీత్యా సిటీల్లో , ఫారిన్ లో సెటిలయ్యారు . మా బాబాయ్ , పిన్ని గోదావరి జిల్లాలో వున్నారు , వాళ్ల పిల్లలు ఫారిన్ లో వున్నారు , సంవత్సరానికి ఒక్కసారైనా వచ్చి వాళ్ళతో గడిపి వెళతారు .

మా బాబాయ్ కొంచం నీరసం గా ఉందని రాలేదు , లేదన్టే ఇప్పుడు ఖచ్చితం గా వచ్చేవాళ్ళు.

విజయ్ : అంటే మీ నాన్న గారికి మీరు ఒక్కరే నా uncle, మీకు బ్రదర్స్ గానీ సిస్టర్స్ గానీ లేరా .

విజయ్ అలా అడగ గానే ఇంక మౌనం గా అయిపోయారు రామారావు గారు , సడెన్ గా ఆయన కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

విజయ్ : sorry uncle మిమ్మల్ని బాధ పెట్టి నట్టు ఉన్నాను , ఈ ఫంక్షన్ లో స్వప్న గారి ఫ్యామిలీ మీ ఫ్యామిలీ తప్ప అందరూ దూరపు చుట్టాలు లానే అనిపించారు , మీకు తోడ బుట్టిన వాళ్ళు ఎవరూ లేరా అని అలా అడిగేశాను అంతే.

రామారావు : లేదు బాబు నువ్వు అడిగిన దానిలో తప్పేమీ లేదు , కానీ నా తమ్ముడు గుర్తు వచ్చే సరికి ఇలా కళ్ళల్లో నీళ్ళు వచ్చేశాయి.

మోహన్ : ఈయన మాత్రం వాళ్ల తమ్ముడు గుర్తు వచ్చి నప్పుడల్లా ఇలా అప్సెట్ అవుతారు , వాళ్ల తమ్ముడికి కూడా ఈయన మీద ప్రేమ ఉంటే ఒక్కసారయినా రావాలిగా .

రామారావు : వాడిని ఏమీ అనకు , వాడికి మా నాన్న లాగే కోపం , పౌరుషం ఎక్కువ అందుకే , నాన్న ఇంట్లో నుండి పంపించేశారు అనే కోపం తో వాడు మళ్ళీ రాలేదు .

విజయ్ : ఆయన ఫోటో ఏమయినా వుందా sir మీ దగ్గర .

రామారావు : లేదు విజయ్ , వాడి మీద కోపం తో నాన్న అన్నీ బయట పడేశారు , కోపం లో ఆయన అలా చేసేశారు కానీ తర్వాత వాడు వస్తాడని చాలా ఎదురుచూశారు , చివరికి వాడి మీద బెంగ తోనే కన్ను మూశారు .

విజయ్ : అయితే ఇప్పుడు మీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడో మీకు తెలీదన్నమాట .

రామారావు గారు తల అడ్డంగా వూపారు తెలీదన్నట్టు.

విజయ్ : అసలు గొడవ ఎందుకు అయ్యింది uncle , మీ నాన్న గారికి మీ తమ్ముడికి.

రామారావు : అది నా పెళ్లయిన కొత్తలో , పండగకి నేను శాంత వాళ్ల పుట్టింటికి కి వెళ్ళాం , అప్పుడే తమ్ముడు తను ప్రేమించిన అమ్మాయిని తీసుకుని ఇంటికి వచ్చాడు , దాని గురించే గొడవ అయ్యి నాన్న గారు వాళ్ళని ఇంట్లో నుండి పంపేశారు అని బాబాయ్ నాకు చెప్పారు.

విజయ్ : ఆ రోజు మీ బాబాయ్ అక్కడే వున్నారా.

రామారావు : అవును , ఎవరు ఎంత చెప్పినా నాన్న వినలేదంట , ఆ రోజు నేను ఉండి వుంటే ఏదో ఒకటి చేసే వాడిని . వాడి కుటుంబాన్ని మళ్ళీ మాతో కలపాలని మా నాన్న గారి చివరి కోరిక , దానిని నెరవేర్చలేనేమో విజయ్ .

విజయ్ : నేను వెళ్లి ఒకసారి మీ బాబాయ్ గారిని కలుస్తా uncle , ఆరోజు ఏం జరిగిందో తెలిస్తే మనకు మీ తమ్ముడి గురించి ఏమయినా తెలుస్తుంది ఏమో .

రామారావు : నువ్వు నిజం గా నా తమ్ముడిని కనిపెట్టగలవా బాబు.

విజయ్ : గట్టిగా ట్రై చేస్తే తప్పకుండా కనిపెట్టవచ్చు uncle.

రామారావు : ఇప్పుడు స్వప్న కి తోడుగా మోహన్ వుండాలి కాబట్టి గంగని తీసుకెళ్ళు నీతో , బాబాయ్ ఆరోగ్యం అసలే బాగోలేదు అందుకే ఇక్కడ జరిగినవి ఏమి ఆయనకు చెప్పొద్దు .

సాగర్ : నేను కూడా వస్తాలేరా నీతో .

గంగ : విజ్జి ని కూడా తీసుకుని వెళతా నాన్న , ఫ్రెండ్స్ కి వూరు చూపించ డానికి వచ్చానని చెబుతా నానమ్మ , తాతయ్య లతో .

రామారావు : సరే మన కార్ తీసుకెళ్ళండి .

మోహన్ : నాన్న మిమ్మల్ని ఇంట్లో దింపుతాను , విశ్రాంతి తీసుకుందురు గానీ.

రామారావు : మన ఆటో మస్తాన్ వున్నాడు లేరా వాడితో వెళ్ళిపోతా , నువ్వు ఇక్కడ పని అంతా చూసుకుని రా .

విజయ్ ఎప్పుడు బయలు దేరుతారు మీరంతా వూరికి.

విజయ్ : నేనయితే రేపే అనుకుంటున్నా , మీకు కూడా ఓకే కదా .

సాగర్ : నాకు ok రా .

గంగ : మా ఇద్దరికీ కూడా ok అన్నయ్య, మీరు టైం చెబితే మేం రెడీగా వుంటాం .

రామారావు : సరే అయితే నేను బాబాయ్ కి ఫోన్ చేసి మీరంతా వస్తున్నారని చెబుతా .

ఇదంతా ఇన్వెస్టిగేషన్ లో భాగం అని సాగర్ కి క్లారిటీ వుంది.

రామారావు గారు వెళ్ళిపోగానే సాగర్ , విజయ్ ఒకరి నొకరు చూసుకొని తల వూపుకున్నారు , ఏదో క్లూ దొరక బోతోంది అన్నట్టు గా .

వాళ్లిద్దరూ తల తిప్పి చూసేసరికి మోహన్ వాళ్ల వైపే సీరియస్ గా చూస్తూ వున్నాడు.

మోహన్ : అసలు ఏం జరుగుతోంది ఇక్కడ , మా నాన్న లాగా నేను కూడా నువ్వు చెప్పేది నమ్మాను అనుకున్నావా .

విజయ్ : నీ దగ్గర దాచాలి అనుకోవట్లేదు మోహన్ , నిజానికి ఈ విషయాలు మాట్లాడటానికే ఆరోజు మీ ఇంటికి వచ్చాం నేను సాగర్, కానీ అప్పుడే స్వప్న గారికి పైన్స్ రావడం తో హాస్పిటల్ కి తీసుకొచ్చాం .

మీరు వున్న ఆ పరిస్థితి లో ఏమీ మాట్లాడలేక పోయాను , అందుకే ఈ రోజు ఇలా అడిగాను .

మోహన్ : కానీ ఎందుకు ఇదంతా.

విజయ్ : నీకు ఆ రోజే చెప్పాను శరభయ్య వెనుక ఎవరో వుండి ఇదంతా చేపించారు అని , అది ఎవరో కనిపెట్టాలి . బాబు హాస్పిటల్ లో వుండగా కూడా బాబుని చంపడానికి చూసారు . కానీ అప్పుడు శరభయ్య నా ఎదురుగానే వున్నాడు , దీని వెనుక ఉన్నది ఎవరు తెలియాలంటే అసలు మీ ఫ్యామిలీ కి శత్రువులు ఎవరు వున్నారో కనుక్కోవాలి , అందుకే ఇదంతా .

మోహన్ : నిజమా అయితే నా ఫ్యామిలీ కి ఇంకా ప్రమాదం వుందా .

విజయ్ : ఏమో చెప్పలేం , కానీ నువ్వు భయపడ వలసిన అవసరం లేదు , మీ ఇంటి దగ్గర మఫ్టీలో పోలీసుల్ని వుంచాను . మేము వూరి నుండి వచ్చేవరకు నువ్వు కూడా ఎక్కడికీ వెళ్లకు .

మోహన్ : సరే విజయ్ నువ్వు చెప్పినట్టే చేస్తా , నువ్వు త్వరగా అది ఎవరో కనిపెట్టు.

గంగ, విజ్జి ఆశ్చర్యం గా అలానే చూస్తూ ఉన్నారు .

విజయ్ : ఏంటి అలా చూస్తున్నారు , ఈ విషయం ఎవరికీ చెప్పకండి , ఇంట్లో తెలిస్తే అనవసరం గా పానిక్ అవుతారు , మనం వెతుకుతున్న వాళ్ల కు తెలిస్తే ఎలర్ట్ అవుతారు , అందుకే బయట ఎక్కడా ఈ విషయం డిస్కస్ చేయకండి .