Read Truth - 22 by Rajani in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

నిజం - 22

సంపత్ వున్న రూం బయట సాగర్ , విజయ్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి డాక్టర్ వచ్చారు సంపత్ ని చెక్ చేయడానికి , డాక్టర్ అతని వెనుక నర్స్ సంపత్ రూం లోకి వెళ్ళారు , 2 నిమిషాలకి నర్స్ హడావుడిగా బయటకు వచ్చింది .

నర్స్ : sir బాబు కి స్పృహ వచ్చింది .

సాగర్ , విజయ్ ఇద్దరూ ఆనందం గా బాబు రూం లోకి వెళ్ళారు.

సంపత్ చిన్నగా కళ్ళు తెరిచి చూస్తున్నాడు , కానీ ఏమీ మాట్లాడటం లేదు.

లోపలికి వెళ్ళిన విజయ్ , సాగర్ లను చూపించి వీళ్ళను గుర్తు పట్టావా అన్నారు .

సంపత్ ఇద్దరినీ మార్చి , మార్చి చూసాడు.

నేనెవరో బాబుకు తెలీదు డాక్టర్ అన్నాడు విజయ్ .

సాగర్ ని చూస్తూ ఈ uncle ఎవరు మామయ్య అన్నాడు విజయ్ ని ఉద్దేశించి.

ఇతను విజయ్ నా ఫ్రెండ్ , ఈ uncle వల్లే నువ్వు సేఫ్ గా ఉన్నావ్ అని చెప్పాడు సాగర్.

అలాగా , థాంక్స్ విజయ్ uncle అన్నాడు సంపత్ నవ్వుతూ .విజయ్ కూడా నవ్వాడు సంపత్ ని చూసి.

డాక్టర్ నేను బాబు ఫ్యామిలీ మెంబెర్స్ ని తీసుకువస్తాను అన్నాడు సాగర్ డాక్టర్ ని చూసి,

కానీ one by one వచ్చి చూడమని చెప్పండి , బాబుని అప్పుడే ఎక్కువ మాట్లాడిన్చకండి బాబుకు ఎక్కువ స్ట్రెస్ ఇవ్వవద్దు అన్నారు డాక్టర్ .

విజయ్ వైపు తిరిగి నువ్వు బాబు దగ్గర ఉండు , నేను మోహన్ వాళ్ళని పంపిస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సాగర్.

మోహన్ వాళ్ళ దగ్గరికి వెళ్లాడు సాగర్ , అప్పుడే నర్స్ బయటకు తీసుకు వచ్చిన పాప ని సంతోషం గా ఒకరి తర్వాత ఒకరు తీసుకొని ఎత్తుకుంటూ ఉన్నారు అందరూ .

సాగర్ ని చూసిన మోహన్ రా సాగర్ పాపని ఎత్తుకుందువు అని తన చేతిలో ని పాపని సాగర్ చేతిలో పెట్టాడు మోహన్ .

మొదటి సారిగా అలా అప్పుడే పుట్టిన బిడ్డను ఎత్తుకునే సరికి సాగర్ ఒళ్లంతా ఒక రకమైన ఆనందం తో పులకించింది అతనికి తెలీకుండానే తన కళ్ళు ఆనందంతో చెమర్చాయి , వెంటనే తేరుకొని పాపని చూస్తూ నీ అన్నకి నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా నీ కోసమే కోమా లో నుండి కూడా బయటకు వచ్చేసాడు అని తలెత్తి అందరి వైపు చూసాడు సాగర్.

సాగర్ నిజం చెప్తున్నావా అన్నాడు మోహన్ సాగర్ భుజాలు పట్టుకొని ఆనందం గా ,

ఇప్పుడే సంపత్ తో మాట్లాడి వస్తున్నా డాక్టర్ రూం లోకి ఒకరి తర్వాత ఒకరు వెళ్ళమన్నారు , బాబుని ఎక్కువ మాట్లాడించ వద్దని చెప్పారు అన్నాడు సాగర్ .

నేను , విద్య వదిన దగ్గర వుంటాం నువ్వు అమ్మా , నాన్న లను తీసుకొని వెళ్లి రా అన్నయ్య , మీరు వచ్చాక మేము వెళ్లి బాబుని చూస్తాం అంది గంగ .

సాగర్ నువ్వు చెల్లి వాళ్లకు తోడుగా వుండు, అని చెప్పి తన అమ్మ , నాన్న లను వెంటబెట్టుకుని బాబుని చూడ డానికి వెళ్ళాడు మోహన్ .

ఒక నాలుగు రోజులు బాబుని అబ్జర్వేషన్ లో ఉంచాలని , 4 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు డాక్టర్.

ఒక గంట తర్వాత స్పృహ లోకి వచ్చింది స్వప్న .

నర్స్ బయటకు వచ్చి స్వప్న ని రూం కి షిఫ్ట్ చేస్తున్నామని చెప్పింది .

స్వప్నను రూం కి తీసుకు వెళ్ళగానే సంపత్ కోమా నుండి బయటకు వచ్చాడని చెప్పాడు మోహన్.

నేను వెంటనే బాబు ని చూడాలి నన్ను వాడి దగ్గరకి తీసుకెళ్లండి అంటూ ఏడ్చేసింది స్వప్న .

మేడం మీరు ఇప్పుడు అలా స్ట్రెస్ తీసుకోకండి , మీ పాప కు పాలు ఇవ్వండి , అక్కడ ఆకలితో ఏడుస్తోంది అన్నది నర్స్ స్వప్న తో .

పాపని ఎత్తుకుని లోపలికి తీసుకొచ్చింది శాంతమ్మ , మన ఇంటి మహాలక్ష్మి రాగానే ఇంటిలో సంతోషం తెచ్చింది అని పాలు పట్టించడానికి స్వప్న కి పాపని ఇస్తూ అంది శాంతమ్మ .

స్వప్నను చూడ డానికి ఫ్యామిలీ అంతా స్వప్న రూం దగ్గరకు వచ్చారు .

మరో వైపు విజయ్ , సాగర్ ఇద్దరూ సంపత్ రూం బయట కూర్చొని వున్నారు .

విజయ్ సాగర్ వైపు తిరిగి అలానే చూస్తూ వున్నాడు.

సాగర్ : ఏంట్రా అలా చూస్తున్నావు .

విజయ్ : సంపత్ నిన్ను చూసి మామయ్య అన్నాడు కదా , అంటే మీ ఇద్దరి సంగతి ఇంట్లో అందరికి తెలుసా?

సాగర్ : అందరికీ తెలీదు కానీ స్వప్న అక్కకి

విజయ్ : స్వప్న గారికి తెలుసా😲

సాగర్ : అబ్బా పూర్తిగా చెప్పనివ్వరా , మోహన్ బావ కి కూడా తెలుసు .☺️

విజయ్ : ఏంటి మోహన్ కి తెలుసా 😲

సాగర్ : అబ్బా ప్రతిదానికీ అలా షాక్ అవ్వకురా , ఆంటీ కి uncle కి ఇంకా తెలీదు .

విజయ్ : అసలు ఇప్పుడు చెప్పు నీ లవ్ స్టోరీ గురించి పూర్తిగా .

సాగర్ : అరే ఏంట్రా హాస్పిటల్ ఇది .

విజయ్ : అబ్బా చా మేం సినిమా హాల్ అనుకున్నాం లే,

మర్యాదగా చెప్పు.

సాగర్ : నీకు తెలుసు కదా 10త్ వరకు నేను హైదరాబాద్ లో నే వున్నా , తరువాత నాన్న ఇక్కడికి తీసుకొచ్చేసారు .చెల్లి , గంగ ఇద్దరూ ఫ్రెండ్స్ , చెల్లే నన్ను గంగ కు పరిచయం చేసింది , చెల్లి తో పాటు ఇంటికి వస్తూ వుండేది గంగ మా పరిచయం నిదానంగా ప్రేమ గా మారింది.

నేను బాగా చదువుతాను అని వాళ్ల ఇంట్లో నా మీద అభిమానం ఉండేది , కానీ మా ప్రేమ గురించి తెలిస్తే ఒప్పుకుంటారో ,లేదో అన్న భయం ఉండేది .

గంగ మెడిసిన్ ఫస్ట్ year జాయిన్ అయిన తర్వాత ఒక సారి గంగ ని చూడటానికి తన కాలేజీ కి వెళ్ళాను , ఇద్దరం క్యాంటీన్ లో కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు మోహన్ వచ్చాడు .

అక్కడ సడన్ గా మోహన్ ని చూసే సరికి ఏం చెప్పాలో అర్థం కాలేదు నాకు , మా చెల్లి విజ్జి ని కలవడానికి అక్కడకు వచ్చానని అబద్దం చెప్పాను , కానీ మోహన్ తను వచ్చే ముందు విజ్జి ని వూళ్ళో చూశానని తను ఈరోజు కాలేజ్ కే రాలేదు అని అన్నాడు కోపంగా చూస్తూ , అప్పుడే గంగ చేతిలో నేను ఇచ్చిన గిఫ్ట్ కూడా చూసేసాడు మోహన్ .

ఇంక నాకు తప్పించుకోవడానికి వేరే దారి దొరక లేదు. గంగ అయితే భయం తో ఏడ్చేసింది , దీనిలో గంగ తప్పేం లేదు నేనే గంగ ను ఇష్టపడ్డాను అని ధైర్యం చేసి చెప్పేశా ,అప్పుడు గంగ లేదు అన్నయ్య నేను కలుద్దాం అంటేనే తను ఇక్కడి వరకు వచ్చాడు దీనిలో సాగర్ తప్పేమీ లేదు అని ఏడ్చేసింది .

అయితే సాగర్ ని కలిసే తొందరలో లంచ్ బాక్స్ కూడా మర్చిపోయి వచ్చేసావు అంతేనా అన్నాడు మోహన్ తన చేతిలో లంచ్ బాక్స్ గంగ చేతిలో పెట్టి.

నువ్వు లంచ్ చేసి క్లాస్ కి వేళ్ళూ అని గంగ తో అన్నాడు మోహన్ .

నువ్వు లంచ్ చేసావా అన్నయ్య అని అడిగింది మోహన్ ని.

లేదు పని వుండి పట్నం వచ్చా అది పూర్తి చేసుకొని వచ్చేసరికి ఈ టైం అయింది , నాకు లేట్ అవ్వబట్టే మీ ఇద్దరూ దొరికారు అన్నాడు మోహన్.

నేను , గంగ తల దించుకొని నిల్చున్నాం .

సరేలే నీకు లేట్ అవుతుంది లంచ్ చేయి , నేను సాగర్ బయట హోటల్ కి వెళ్లి లంచ్ చేస్తాం అని గంగ తో చెప్పి నన్ను ఒక హోటల్ కి తీసుకెళ్ళాడు మోహన్ .

విజయ్ : హోటల్ కి తీసుకెళ్ళింది తినడానికే నా నీకు క్లాస్ తీసుకోవడం కోసమా .

సాగర్ : తింటూ మాట్లాడుకోవటం కోసం.

విజయ్ : అబ్బో 😏 , ఇంతకీ ఏం వార్నింగ్ ఇచ్చాడు మోహన్ తన చెల్లిని చూస్తే కళ్ళు పీకేస్తాను అన్నాడా , మాట్లాడితే తల లేపేస్తా అన్నాడా , ఏం అన్నాడు .

సాగర్ : ఏరా నువ్వు పోలీస్ వైతే మాత్రం ప్రతి దానిలోనూ క్రైం మాత్రమే కనిపిస్తుందా , అందరూ ఒకేలా ఉండరు , కొందరు మోహన్ లా కూడా వుంటారు.

విజయ్ : సరేలే గొప్పలు తర్వాత , ముందు ఏమయిందో చెప్పు.

సాగర్ : ఏముందీ స్ట్రయిట్ గా పాయింట్ కి వచ్చేశాడు, ఎప్పటి నుండి జరుగుతుంది ఇదంతా అన్నాడు డైరెక్ట్ గా, నాకు ఎప్పటి నుంచో గంగ అంటే ఇష్టమని , 1year బ్యాక్ తనకి ప్రపోజ్ చేశానని చెప్పేశాను .

కానీ ఇప్పుడు అర్థం అవుతోంది తప్పు చేశానని ,మీ వైపు చూడాలంటే నే గిల్టీ గా వుంది , మీరు నాకు అంత హెల్ప్ చేస్తే నేను మిమ్మల్ని ఇలా మోసం చేశాను , ఇంకెప్పుడు గంగ ని కలవను అని చెప్పాను.

తనకు నాకంటే మంచి పొజిషన్లో ఉన్న అబ్బాయిని , ఆస్తిపరుడిని ఇచ్చి పెళ్లి చేయటం కరెక్ట్ , నేను గంగకి సరిపోను అన్నాను .

విజయ్ : బాగుంది రా చేయ్యాల్సింది అంతా చేసి తర్వాత ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఒకటా .😀

సాగర్ :👿

విజయ్ : సరేలే ఏడవకు ఇంక ఏమి అనను చెప్పు.🤫

సాగర్ : సరే నోరు అలానే మూసుకొని విను ,

అవును నిజమే మేము తలుచుకుంటే నీకంటే పొజిషన్ లో ఇంకా ఆస్తి లో బెటర్ గా ఉండే వాడిని తీసుకు రాగలం , కానీ నీ కంటే గుణం లో బెటర్ గా ఉండేవాడిని మాత్రం తీసుకు రాలేం . దాని కంటే ముఖ్యం గా నా చెల్లి మనసులో వున్న వాడిని ఎక్కడ తీసుకొస్తాం చెప్పు అన్నాడు మోహన్ నాతో.

కానీ గంగ ఇంకా చిన్నది దాని చదువు పూర్తి కావాలి , తన చదువయ్యాక నేనే ఇంట్లో మాట్లాడి మీ పెళ్లి జరిపిస్తా, అప్పటి వరకు మీరిద్దరూ విడిగా కలవటం లాంటివి చెయ్యొద్దు , ఆడ పిల్ల గురించి నలుగురూ మాట్లాడుకోవటం మంచిది కాదు అన్నాడు మోహన్.

అంతే ఆనందంగా మోహన్ కి థాంక్స్ చెప్పా , గంగ ని విడిగా కలవను అని మాట ఇచ్చా .స్వప్న అక్కకి కూడా మా విషయం తెలుసు , తమ్ముడు తమ్ముడు అని ఎంతో అభిమానం చూపిస్తుంది .

చాలా మంచి ఫ్యామిలీ రా వాళ్ళది అన్నాడు సాగర్.