Read Truth - 15 by Rajani in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
  • ధర్మ- వీర - 6

    వీర :- "నీకు ఏప్పట్నుంచి తెల్సు?"ధర్మ :- "నాకు మొదటినుంచి తె...

  • అరె ఏమైందీ? - 18

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • మనసిచ్చి చూడు - 4

    మనసిచ్చి చూడు - 04హలో ఎవరు.... ️ అవతల మాట్లాడకపోయే సరికి ఎవర...

  • నిరుపమ - 4

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • అరె ఏమైందీ? - 17

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

నిజం - 15

Next day....

నీ దగ్గరకు వచ్చిన ప్రతి సారీ బుడ బుక్కల వాడి వేషం లోనే వచ్చేవాడా అడిగాడు విజయ్ , లేదు ఒకసారి బుడ బుక్కలివాడిలాగా ఒకసారి కోయ దొర లాగా , మరోసారి ఇంటిలో ఎలకల్ని పోగొడతా అని అరుచుకుంటూ , మరోసారి పిల్లలికి బుడగలు అమ్మేవాడిలా ఇలా రక రకాలుగా వచ్చేవాడు , అందుకే వాడు ప్రతి నెల వచ్చే సంగతి ఎవరికీ తెలీదు అన్నాడు శరభయ్య , మరి పిల్లాడు తప్పిపోయిన రోజు వూరికి కొత్త వాళ్ళు ఎవరూ రాలేదని చెప్తున్నారు కదా అందరూ అడిగాడు విజయ్ , కాసేపు చెప్పాలా వద్దా అనుకుంటూ తటపటాయించి sir నేను కావాలని ఏది చేయలేదు అని విజయ్ కాళ్ల మీద పడి ఏడవడం మొదలు పెట్టాడు శరభయ్య ,

చూడు చేయ్యాల్సినది అంతా చేసేసి ఇప్పుడు నాకు ఏ పాపం తెలీదు అంటే ఎవరూ నమ్మరు , నువ్వు ఆ మరిడయ్య గురించి ఏం దాచకుండా చెబితే వాడిని కూడా పెట్టుకోవచ్చు , లేదంటే వాడికి పడాల్సిన శిక్ష కూడా నీకే పడుతుంది బెదిరించినట్లు గా అన్నాడు విజయ్ , అమ్మో వద్దు sir చెప్తా అని చెప్పటం మొదలుపెట్టాడు , ఆ మరిడయ్య పిల్లాడిని దాచి పెట్టే ముందు రోజు వచ్చాడు , ఆ రోజు మాత్రం ఒక హిజ్రా వేషం లో వచ్చాడు , ఆరోజు సాయంత్రం వూరి నుండి వెళ్ళిపోయాడు కూడా అన్నాడు శరభయ్య , ఆ రోజు ఏం చేశాడు క్లియర్ గా చెప్పు అన్నాడు విజయ్ , ఆ రోజు అని గుర్తు తెచ్చుకున్టు చెప్పటం స్టార్ట్ చేసాడు శరభయ్య తరువాత రోజు అమావాస్య కాబట్టి అప్పటికే నా భార్య ని పుట్టింటికి పంపేసాను , మిట్ట మధ్యాహ్నం ఒక హిజ్రా వేషం లో వచ్చాడు మరిడయ్య , నేను ముందు గుర్తు పట్టలేదు ఎవరూ చూడకుండా కొట్టు లోపలికి వచ్చి తన అసలు గొంతు తో నేను మరి డయ్య ని అన్నాడు , అప్పుడు గుర్తు పట్టాను , ఈసారి ఎందుకు ముందు రోజే వచ్చేసావు అమావాస్య రేపు కదా అన్నాను , ముందు లోపలికి నడువు ఎవరయినా వస్తారు అని నన్ను లోపలికి తీసుకువెళ్ళాడు అప్పుడు మరిడయ్య ఇదే చివరి పూజ మనకు నిధి దొరికే సమయం దగ్గర లోనే ఉంది అందుకు ఈ రోజు నుండి అన్నీ సిద్ధం చేసుకోవాలి అందుకే వచ్చా అన్నాడు , సరే ఏం చేయాలి చెప్పు అన్నాను నేను , ఒక గంటలో బడి పిల్లలు వస్తారు కదా అన్నాడు అవును అన్నాను నేను , వాళ్లకు ఈ ప్రసాదం ఇవ్వు అని రెండు పొట్లాలు చూపించాడు ఏవిటి ఇది పిల్లల్ని ఏం చేస్తావు అన్నాను , దానికి మరిడయ్య భయపడకు ఎవరికీ ఏమీ కాదు కాకపోతే రేపు ఆ పాప స్కూల్ కి రాకుండా ఉంటుంది అంతే అన్నాడు , అప్పుడు రోజూ లాగానే ఆ పిల్లాడు ఒక్కడే ఉన్నా సరే అలవాటు ప్రకారం నీ దగ్గరికి ప్రసాదం కోసం వస్తాడు అన్నాడు మరిడయ్య , కానీ వాడు ఒక్కడే రావడం దేనికి ఏం చేస్తావు పిల్లాడిని, వాడికి ఏమయినా జరిగితే ఊరంతా వచ్చి నిన్ను రాళ్లతో కొట్టి చంపుతారు , నా మాట విను ఇదంతా మానేయమన్నాను , ఎవరికీ ఏ ప్రమాదం రాదు నేను చెప్పినట్టు చేస్తే అంతా సవ్యం గా జరుగుతుంది అన్నాడు మరిడయ్య, అసలు ఏం చెయ్యాలి అని అడిగాను నేను ముందు ఆ పిల్లలు వచ్చే టైం అయ్యింది నేను లోపల దాక్కుంటాను నువ్వు వాళ్ళకి ప్రసాదం ఇవ్వు అని నాకిచ్చిన పొట్లాలలో గులాబీ రంగు దానిలోది పాపకి పచ్చ రంగు కాగితంలో ఉన్నది బాబుకి ఇవ్వమని ఎలాంటి పొరపాటు చెయ్యొద్దని చెప్పి లోపలనే దాక్కున్నాడు , కాసేపటికి పిల్లలు రోడ్డు మీద వెళుతుంటే చిట్టిని , సంపత్ ని పిలిచి ప్రసాదం పెట్టాను , వాళ్ళు అది నోట్లో వేసుకుని వెళ్ళిపోయారు , నేను మరిడయ్య తో మాట్లాడడానికి కొట్టు మూసేసి ఇంట్లోకి వెళ్ళిపోయాను. అప్పుడు మరిడయ్య చెప్పిన మాటలకు నా తల తిరిగిపోయింది అని చెబుతున్నప్పుడు శరభయ్య మాటలు తడబడ్డాయి నుదుటి మీద చెమటలు పట్టేసాయి , మాట్లాడటం ఆపి sir కొచెం మంచి నీళ్ళు అన్నాడు తల పైకి ఎత్తి విజయ్ ని చూసి శరభయ్య , విజయ్ కానిస్టేబుల్ ను పిలిచి శరభయ్య కు వాటర్ ఇవ్వు అని చెప్పాడు , మంచి నీళ్ళు తాగిన శరభయ్య ను చూసి ఇంక చెప్పు తరువాత ఏమ్ జరిగిందో అన్నాడు విజయ్ , దీర్ఘంగా ఒక నిట్టూర్పు వదిలిన శరభయ్య తల వంచుకుని చెప్పడం మొదలు పెట్టాడు , అప్పటి వరకు మంచిగా మాట్లాడిన మరిడయ్య కొంచెం కటినంగా బెదిరిస్తూ మాట్లాడి నట్టు అనిపించింది ఆ రోజు అన్నాడు శరభయ్య , ఏం మాట్లాడాడు అడిగాడు విజయ్ , నేను ముందుగానే చెప్పాను కదా నీకు ఈ పూజ చాలా కష్టం అని అలాగే మధ్యలో ఆపకూడదని నువ్వు సరే అని ఒప్పుకున్నాకే కదా నేను ఇదంతా మొదలు పెట్టాను అన్నాడు మరిడయ్య గర్జిస్తున్నట్టు , వాడి కళ్ళు చింత నిప్పులు లాగా ఎర్రగా మారాయి , అతన్ని అలా చూసేసరికి నాకు నోట మాట రాలేదు , భయంతో గుటకలు మింగుతూ నోరెత్తకుండా అలానే కళ్ళప్ప జెప్పి వాడు చెప్పేది వింటూ కూర్చున్నాను , అప్పుడు మరిడయ్య నాకు దగ్గరగా వచ్చి నా మొహం లోకి చూస్తూ చూడు శరభయ్యా నీకు ఆ శక్తి గురించి ముందే చెప్పాను దానిని శాంతింప చేయటం ఎంత కష్ట మని , ఇప్పుడు అది కోరింది చేయక పోతే దానిని నా వశం చేసుకోలేను అప్పుడు అది పూజ చేసిన నన్ను , ఆ పూజలో కూర్చున్న నిన్ను బలి తీసుకుంటుంది అన్నాడు , నేను భయం తోనే దానికి ఏం కావాలి ఇప్పుడు అని అడిగాను , దానికి మరిడయ్య పుష్యమి నక్షత్రం లో పుట్టిన ఒక బాలుడి రక్తం తో దానిని శాంతింప చెయ్యొచ్చు మన అదృష్టం కొద్దీ మనకు ఆ బాలుడు మీ వూరి లోనే దొరికాడు , లేదంటే అలాంటి పిల్లవాడిని వెతికి తేవటానికి చాలా కష్ట పడాల్సి వచ్చేది అన్నాడు , మరి ఇదంతా ముందే ఎందుకు చెప్పలేదు , పిల్లలికి ప్రసాదం ఇవ్వాలి వాళ్ళ జన్మ నక్షత్రం కనుక్కోవాలి అని చెబితే సరిపోయిందా , ఇలా పిల్లాడి రక్తం కావాలి అని ఇప్పుడా నువ్వు చెప్పేది అని అడిగాను ఆ మరిదయ్యని , ముందే చెబితే మీ భయం తో అందరికీ అనుమానం వచ్చేటట్టు చేసేవాడివి , అయినా భయపడాల్సిన పని లేదు బాబు కి వచ్చిన ప్రాణ భయం లేదు నేను చూసుకుంటాను అన్నాడు , నా చేతిలో ఒక పొట్లం ఇచ్చి రేపు ఆ పిల్లాడిని పిలిచి ఈ ప్రసాదం ఇవ్వు , తర్వాత వాడిని ఆ పూజ గదిలో దాచిపెట్టి ఉంచు మిగిలింది నేను చూసుకుంటా , ఈ రాత్రికి నేను స్మశానంలో చేయాల్సిన పూజ వుంది , నేను అవసరం అయితే ఫోన్ చేస్తా , ఫోన్ నీ దగ్గరే పెట్టుకో అన్నాడు , నేను మాట్లాడేది కూడా పట్టించు కోకుండ అక్కడి నుండి వెళ్లి పోయాడు , అదే నేను మరిడయ్య చివరిసారిగా చూడటం అని చెప్పటం ఆపాడు శరభయ్య , విజయ్ ఆశ్చర్య పోతూ వాట్ అదే చివరిసారి చూడటమా మరి తరవాత ఏం జరిగింది పిల్లాడిని నువ్వే ఎందుకు చంపాలనుకున్నావు , అసలు నీ భార్య చనిపోవటానికి కారణం ఏమిటి? అసలు ఆరోజు ఏం జరిగింది నిజం చెప్పు అన్నాడు కోపంగా , ఈలోగా పోలీస్ స్టేషన్ లో ఫోన్ రింగ్ అయింది , రాఘవులు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి విజయ్ ను పిలిచాడు , sir ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్స్ గురించి మీతో మాట్లాడాలి అంటా అని ఫోన్ విజయ్ కి ఇచ్చాడు, ఫోన్ తీసుకొని హెల్లో SI విజయ్ హియర్ అన్నాడు విజయ్ , హెల్లో sir my name is వినాయక్ ఫ్రమ్ ఫోరెన్సిక్ ల్యాబ్ అన్నాడు ఫోన్ లో మరో వైపు నుండి ఒకతను ,yes చెప్పండి వినాయక్ గారు మీ కాల్ గురించే చూస్తున్నా అన్నాడు విజయ్ , sir మీరడిగినట్టే అన్నిటి మీదా ఫింగర్ ప్రింట్స్ చెక్ చేశాం, స్టేషన్ లో మా వాళ్ళు ఆ శరభయ్య దగ్గర తీసుకున్న ఫింగర్ ప్రింట్స్ తో మాచ్ చేసి చూశాం , ఆ రూం లో అన్నిటి మీదా శరభయ్య ఫింగర్ ప్రింట్స్ మాత్రమే ఉన్నాయి , మీరడిగిన విధం గా ఇంకా ఏ క్లూస్ దొరక లేదు , ఆ కిరోసిన్ డబ్బా మీద మాత్రం శరభయ్య ఫింగర్ ప్రింట్స్ తో పాటు మరొక ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి , అవి చనిపోయిన తన భార్యవి అయి ఉండవచ్చు , మరొక విషయం sir , ఐరన్ రాడ్ మీద ఉన్న బ్లడ్ samples , రూం లో ఉన్న బ్లడ్ samples అన్నీ బాబువే ఉన్నాయి , అండ్ one more thing ఆ rod పైన ఉన్న ఫింగర్ ప్రింట్స్ కూడా శరభయ్య వే , అని చెప్పటం ముగించాడు వినాయక్ , సరే అని ఫోన్ పెట్టేసాడు విజయ్ ,అప్పటికే కోపం తో తన మొహం ఎర్రబడింది , పక్కనున్న రాఘవులు విజయ్ మొహం లో expressions మారడం గమనించాడు .