Truth - 14 books and stories free download online pdf in Telugu

నిజం - 14

పెరట్లో వెతుకుతున్న విజయ్ కి కనిపించిన బూడిద కుప్ప ని గమనిస్తుంటే రాఘవులు అక్కడికి వచ్చాడు , sir ఆ శరభయ్య కొట్టు సరుగులో ఈ తాళం చెవి కనిపించింది , చెక్ చేసి చూసాను ఇది ఆ పిల్లాడిని దాచిన గది తాళం చెవి sir అన్నాడు రాఘవులు , విజయ్ ఆ తాళం ఇంకా తాళం చెవి చేతిలోకి తీసుకుని చూసాడు , ఈ తాళం చెవి మరిడయ్య దగ్గర ఉంది అన్నాడు కదా ఇప్పుడేంటి ఇక్కడ ఉంది ఒక వేళ శరభయ్య చెప్పింది అబద్ద మా అని ఆలోచన లో పడ్డాడు , రాఘవులు కింద ఉన్న బూడిదను అంతా ఒక పుల్లతో అటు ఇటు కదిపి sir ఇది చూస్తే ఒక మేక ను తగలబెట్టి నట్టున్నారు ,చూడండి ఈ కొమ్ములు , రాఘవులు పిలవడం తో అటు వైపు చూసిన విజయ్ ఏంటి మేకను కాల్చారా అని రాఘవులు చూపించిన వైపు చూసాడు విజయ్ , ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుంటూ రాఘవులు గారు ఇంట్లో అంతా వెతకండి ఏదయినా ఫోన్ నంబర్స్ లాంటివి ఎక్కడయినా చిన్న పేపర్ మీద రాసి ఉన్నా వడలధ్దు , అన్నాడు విజయ్ మొత్తం వెతికిన తర్వాత రాఘవులు ఒక చిన్న పుస్తకం తెచ్చి sir ఇది బహుశా ఆ శరభయ్య భార్య సుజాత పుస్తకం లా వుంది , తన తల్లి నంబర్ అనుకుంటా ఇది , అని ఒక ఫోన్ నంబర్ దాని పక్కన అమ్మ అని రాసి ఉన్న పేజీ ని చూపించాడు విజయ్ కి , సరే రాఘవులు గారు ఒక సారి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి , అలాగే అది సుజాత తల్లి నంబర్ అయితే ఒక సారి స్టేషన్ కి రమ్మని చెప్పండి అన్నాడు , కొంత సేపటి తరవాత ఇద్దరూ స్టేషన్ కి చేరుకున్నారు , విజయ్ రాఘవులు ని పిలిచి ఆ స్కెచ్ వేసే ఆర్టిస్టు ఎప్పుడు వస్తున్నారు అడిగాడు రాఘవులు ని , sir రేపు ఉదయం కి వస్తారు అన్నాడు రాఘవులు , అబ్బా ఎందుకు అండి అంత లేట్ అన్నాడు విజయ్ , sir అతను హైదరాబాద్ నుండి రావాలి రేపు వస్తానన్నాడు అన్నాడు రాఘవులు , చంద్రం ఒక టీ చెప్పు అన్నాడు విజయ్ ఆలోచిస్తూ , ఈ లోపు రాఘవులు ఫోన్ రింగ్ అయింది , రాఘవులు ఫోన్ తీసి స్టేషన్ బయటకు వచ్చి మాట్లాడాడు , మళ్ళీ లోపలికి వచ్చి sir సాగర్ ఫోన్ చేసాడు మీతో అర్జంట్ గా మాట్లాడాలి అంటున్నాడు, అని ఫోన్ విజయ్ కి ఇచ్చాడు , విజయ్ ఫోన్ తీసుకొని హెల్లో సాగర్ చెప్పు ఎక్కడున్నావ్ అన్నాడు , అటు వైపు ఫోన్ లో సాగర్ , అరే బాబుని ఎవరో చంపడానికి ట్రై చేస్తున్నారు అన్నాడు సాగర్ , అసలు ఏం జరిగింది రా క్లియర్ గా చెప్పు అన్నాడు విజయ్ , కాసేపటి ముందు హాస్పిటల్ లో జరిగింది చెప్పటం మొదలు పెట్టాడు సాగర్ , మేము హాస్పిటల్ కి వచ్చేసరికి అరౌండ్ 10 ఓ క్లాక్ అయ్యింది , ఒక గంట తర్వాత వాళ్ల ఫ్రెండ్స్ దగ్గర నోట్స్ తెచ్చుకోవటం కోసం దగ్గరలో ఉన్న తమ కాలేజ్ కి వెళ్ళారు విద్య , గంగ ఇద్దరూ , నేను రూం బయట కూర్చుని పేపర్ చదువుతున్నాను , కాసేపటి తర్వాత నా ముందు నుండి ఒక డాక్టర్ లోపలికి వెళ్ళాడు అతను ఫేస్ కి మాస్క్ ఉండటం తో నాకు ఫేస్ కనిపించలేదు , ఎందుకో పక్కకు వెళ్లిన నర్స్ అప్పుడే వచ్చి లోపల బాబు దగ్గరకు వెళ్ళింది , వెంటనే బయటకు వచ్చి ఎవరు బాబుకున్న ఆక్సిజన్ మాస్క్ తీసింది అని గట్టిగా అరిచింది , ఇంతకు ముందు డాక్టర్ గారే కదా లోపలికి వెళ్లారు , ఇంకెవరు వెళ్ళలేదని చెప్పాను , దానికి ఆ నర్స్ నేను ఇప్పుడు డాక్టర్ గారి దగ్గర నుండే వస్తున్నా , ఆయన తన రూం లూనే ఉన్నారు , మీరు వచ్చే ముందే బాబు ని చెక్ చేసి వెళ్ళారు అని చెప్పింది , నేను బయటకు వెళ్లి చూసేసరికి ఎవరూ కనిపించలేదు , అని జరిగింది గబ , గబా చెప్పేసి ఆపాడు సాగర్ , మరిప్పుడు బాబు ఎలా ఉన్నాడు అడిగాడు విజయ్ , నర్స్ టైం కి వచ్చింది కాబట్టి బాబు సేఫ్ రా కాని నా అశ్రద్ద వల్లే ఇదంతా జరిగింది సారీ రా అన్నాడు సాగర్ , వాడెవడో బాగా అబ్జర్వ్ చేసి ప్లాన్డ్ గా చేసాడు నువ్వు ఈ విషయం ఎవరితో నూ చెప్పకు అనవసరం గా panic అవుతారు , నర్స్ ని కూడా ఎవరితో చెప్పొద్దు అని చెప్పు , నేను అక్కడ దగ్గరలో వున్న స్టేషన్ నుండి ఇద్దరు కానిస్టేబుల్స్ ని పంపి అక్కడ సెక్యూరిటీ గా ఉండే ఏర్పాటు చేస్తా , నువ్వు వెంటనే వెళ్లి హాస్పిటల్ సీసీ ఫుటేజ్ చెక్ చెయ్యి వాడి ఫేస్ ఎక్కడయినా కనిపిస్తుందేమో చూసి నాకు చెప్పు అన్నాడు విజయ్, సరే రా నువ్వు చెప్పినట్టే చేస్తా రేపు మార్నింగ్ వచ్చి నిన్ను కలుస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసాడు సాగర్.

ఫోన్ పెట్టేసిన విజయ్ అసలు వాడెవడు అనుకుంటూ మచలీపట్నం పోలీస్ స్టేషన్ కి కాల్ చేసి విషయం చెప్పి హాస్పిటల్ కు సెక్యూరిటీ గా కానిస్టేబుల్స్ పంపించాడు విజయ్ , శరభయ్య ఇక్కడే వున్నాడు అయినా సరే అక్కడ మర్డర్ అటెంప్ట్ జరిగింది అంటే జరిగేది ప్రతీది వాడు తెలుసుకుంటున్నాడు , ముందు ఈ మరిడయ్య గురించి తెలిస్తే గానీ మిగిలిన విషయాలు తెలీవు అనుకొని శరభయ్య దగ్గరికి వెళ్లాడు విజయ్ .

చెప్పు శరభయ్య నీ క్రిమినల్ పాట్నర్ గురించి అన్నాడు చైర్ లో కూర్చుంటూ , శరభయ్య అర్థం కానట్టు తెల్ల మొహం వేసుకుని చూసాడు, అదే ఆ మరిడయ్య గురించి అడుగుతున్నా అన్నాడు విజయ్ , చెప్పటం మొదలు పెట్టాడు శరభయ్య వాడు ప్రతి అమావాస్య కి వచ్చి అలానే పూజలు చేసేవాడు , మరి నీ భార్య గర్భవతి అన్నావు కదా దాని సంగతేంటి చెప్పు అన్నాడు విజయ్ , అది అది అని నసిగాడు శరభయ్య , ఏంటో సరిగా చెప్పు అని అరిచాడు విజయ్ , ఆ మరిడయ్యే చెప్పాడు , నిధి దొరికిన కొన్ని రోజులకు నీ భార్య కు మగబిడ్డ పుట్టబోతున్నాడు నీ ఆస్థికి , నిధికి వాడే వారసుడు అని దివ్య దృష్టి తో చూసి చెప్పాడు అన్నాడు శరభయ్య , వాడు అలా చెప్పగానే నువ్వు ఎలా నమ్మావు అన్నాడు విజయ్ , నా గురించి జరిగినవన్నీ చెప్పాడు అవి ఖచ్చితంగా చెప్పినవాడు ఇవి కూడా చెప్పగలడు కదా అన్నాడు శరభయ్య , నీ గురించి ఈ వూళ్ళో ఎవరిని అడిగినా చెప్తారు దానిలో వింత ఏముంది ,సరే తర్వాత ఏమయింది చెప్పు అన్నాడు విజయ్ , మళ్ళీ చెప్పటం మొదలు పెట్టాడు శరభయ్య మీకు చెప్పా కదా కోడిని బలి ఇచ్చాడని , అలాగే ఒకసారి మేక ను కూడా బలి ఇచ్చాడు , పూజ అయ్యాక మేకను ఇంటి వెనుక పెరట్లో తగల బెట్టాడు , ఆ రోజు పూజ అయ్యాక నేను చేయాల్సింది చేశాను ఇప్పుడు నువ్వు చేయాల్సిన పనులు ఉన్నాయి అన్నాడు ఆ మరిడయ్య , డబ్బులు అడుగుతాడు ఏమో అని పైసా కూడా ఇవ్వను అన్నాను నేను , దానికి మరిడయ్య నవ్వి నీ ముష్టి డబ్బు నాకేం అవసరం లేదు, నువ్వు పిలిచి నా చేతిలో లక్ష పెడతానని చెప్పినా నేను తీసుకోను , నాకు కోట్లు విలువచేసే నిధి దొరుకుతుంటే నీ డబ్బు నాకెందుకు అన్నాడు , కోట్ల విలువ చేసే నిధి అనగానే ఎందుకు , ఏమిటీ అని అడగకుండా చెప్పిందల్లా చేశాను అని పిచ్చి వాడిలా పైకి చూస్తూ చెప్తున్నాడు .సరే తర్వాత ఏం చెయ్యమన్నాడు నిన్ను అడిగాడు విజయ్. ఇటువైపు నుండి పిల్లలు బడికి వెళతారు కదా అన్నాడు , అవును అన్నాను 6 నుండి 7 యేళ్ళ మగ పిల్లల రాశి , నక్షత్రం కావాలి అన్నాడు , నాకు భయం వేసింది , చెప్తాను ముందు ఈ పని చెయ్యి తర్వాత చెప్తాను నాకు నిధి లో వాటా ఇవ్వడం మర్చిపోకు అన్నాడు నవ్వుతూ , మరిడయ్య మళ్లీ నిధి అనగానే కోట్ల విలువ చేసే నిధి అని అతను చెప్పిన మాటలు గుర్తు వచ్చాయి , దాంతో నాకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది సరే చేస్తాను అని చెప్పా , దగ్గర లోనే ఊరిలో జాతర ఉండటం తో అదే అదునుగా తీసుకుని పిల్లలని ప్రసాదం ఇచ్చే వంకతో పిలచి ప్రసాదం ఇచ్చి వాళ్ళను మాటల్లో పెట్టి వాళ్ల జన్మ నక్షత్రం అడిగే వాడిని , చిన్న పిల్లలు కాబట్టి ఇంట్లో అడిగి చెప్పేవాళ్ళు , అలానే ఆ సంపత్ ది కూడా చెప్పాడు ,

ఈ వివరాలను మరిడయ్య ఇంటికి వచ్చినప్పుడు ఇచ్చాను అని చెప్పాడు శరభయ్య , పిల్లలకు ప్రసాదం ఇవ్వడం నీ ఆలోచన లేదంటే ఆ మరిడయ్య చెప్పాడా అని అడిగాడు విజయ్ , అప్పుడు నేనే ఇచ్చాను , కానీ సంపత్ పేరు చూపించి ఈ పిల్లాడి కి రోజూ పిలిచి ప్రసాదం ఇవ్వు అన్నాడు , వాడితో పాటు ఒక పిల్ల కూడా వస్తుంది అని చెప్పా , సరే ఇద్దరికీ ప్రసాదం ఇవ్వు, ఏ ఈ మాత్రం కూడా చేయలేవా అని అడిగాడు మరిడయ్య అని చెప్పటం ఆపాడు శరభయ్య.