స్టేషన్ కి వెళ్ళగానే విజయ్ శరభయ్య దగ్గరికి వెళ్ళాడు ,  ఒక  కుర్రాడు వచ్చి  sir టీ అని  విజయ్ కి  టీ ఇచ్చేసి వెళ్ళాడు ,  చెప్పు శరభయ్య తరువాత మరిడయ్య  ని ఎప్పుడు కలిసావు  అని అడిగాడు విజయ్ , ఈలోపు బయటి నుండి గోల గోల గా అరుపులు వినిపించాయి , ఒక కానిస్టేబుల్ విజయ్ దగ్గరకు వచ్చి sir వూరి జనం స్టేషన్ ముందు నిలబడి గోల చేస్తున్నారు అన్నాడు , ఉన్న సమస్య చాలదన్నట్టు ఈ కొత్త సమస్య ఏంట్రా బాబు అనుకుని , రాఘవులు గారు వాళ్ళ గోల ఏంటో చూడండి అన్నాడు విసుగ్గా విజయ్ ,  ఈ శరభయ్య బాబు ను  చంపడానికి చూసాడు అని తెలిసినట్టుంది   అందుకే వచ్చినట్టున్నారు  నేను వెళ్లి మాట్లాడతాను , అని చెప్పి బయటకు వెళ్లాడు రాఘవులు , విజయ్ శరభయ్య ను చూసి  చూసావుగా వాళ్ల కోపం నువ్వు నిజం చెప్పకుండా ఏదైనా దాచాలని చూస్తే నిన్ను వాళ్ల కే వదిలేస్తా  వాళ్ళు నిన్ను చంపిగాని వదలరు అన్నాడు , అప్పటికే  శరభయ్య  భయం తో బిక్కచచ్చాడు , మరోవైపు రాఘవులు వూరి జనానికి సర్ది చెప్పటానికి ప్రయత్నిస్తున్నాడు ,  ఆ గుంపు   లో నుండి              ఒకతను ముందుకి వచ్చి   వాడిని ప్రాణాలతో ఉంచడానికి  వీల్లేదు  ఇది వూరి సమస్య కాబట్టి వూరిలోనే తేల్చుకుంటాం , వాడిని వూరి మధ్యలో  ప్రణాలతో  తగలబెట్టాలి  వాడిని మాకు అప్పచెప్పండి  అన్నాడు గట్టిగా , అవును అవును అంటూ గట్టిగా అరిచారు మిగిలిన వాళ్ళు అతనికి వంత పాడుతూ , మీరు  చేసేది సమస్య తీర్చడం కాదు దానిని పెద్దది చేయటం అన్నాడు రాఘవులు , మీ పోలీస్ బుద్ది చూపించుకుంటున్నారు   రామారావు గారు  మీ పిల్లలను  ఆయన పిల్లలుగా చూసుకుంటారు కానీ మీరు మాత్రం ప్రమోషన్ కోసం వాడిని కోర్టు కి తీసుకుని వెళ్ళాలి  అనుకుంటున్నారు , వాడు జైల్ లో కొన్ని రోజులు ఉండి వచ్చి మళ్ళీ హాయిగా తిరుగుతాడు , మాకు మాత్రం రామారావు గారి కుటుంబం మీద అభిమానం ఉంది వాడిని చంపి  న్యాయం జరిగేటట్టు చూస్తాం అన్నాడు మరొకతను ముందుకు వచ్చి , చాల్లే ఆపండి మీ వాగుడు ఆ విజయ్ బాబు కూడా మీలాగే ఆవేశ పడుతూ కూర్చుంటే  సంపత్ బాబు ప్రాణాలతో వుండేవాడు కాదు , ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి ఆ శరభయ్య  ని మీరు చంపేస్తే అసలు నేరస్థుడు తప్పించుకుంటాడు , మీకు  నిజంగా అంత పౌరుషం ఉంటే శరభయ్య తో ఇదంతా చేపించిన వాడిని పట్టుకోండి  , కుదరక పోతే ఆ పని చేసే వాళ్ళకి కనీసం అడ్డం రాకుండా ఉండండి అని అంతే ఆవేశం గా అన్నాడు రాఘవులు . రాఘవులు మాటలకి అందరూ మౌనం గా ఉండిపోయారు , ఒకతను మాత్రం కొంచెం నిదానం గా అంటే  ఆ శరభయ్య వెనుక ఇంకె వరో ఉన్నారు అంటారా రాఘవులు  గారు అని అడిగాడు , అవును  , కానీ ఇప్పుడు  మేము ఏది బయటకు చెప్పలేం  సమయం వచ్చినప్పుడు మీకే అన్ని తెలుస్తాయి , మాకు సాయం చేయాల్సింది పోయి మీరే అడ్డు తగిలితే ఎలా అన్నాడు రాఘవులు , సరే రాఘవులు గారు   మాకు నిజం   తెలీక   ఇలా  చేశాం , మళ్ళీ ఇలాంటి పొరపాటు చెయ్యం , అని అక్కడి నుండి వెళ్ళిపోయారు , రాఘవులు వెనక్కి తిరిగి చూసే సరికి నవ్వు మొహం తో అలానే చూస్తూ ఉన్నాడు కానిస్టేబుల్ చంద్రం  , ఏంట్రా అలా చూస్తున్నావు అన్నాడు రాఘవులు  , మీరు ఎలా అయిన సీనియర్ కదా బలే హ్యాండిల్ చేశారు, వాళ్ళు కన్విన్స్ అవుతారనుకొలేదు నేను అన్నాడు చంద్రం , ఎప్పుడు తగ్గి మాట్లాడా లో , ఎప్పుడు ఆవేశం గా మాట్లాడాలో ముందు , ముందు నీకే తెలుస్తుంది అని చంద్రం తో అని  స్టేషన్  లోపలికి వెళ్ళాడు రాఘవులు .   టీ తాగటం పూర్తి చేసి , శరభయ్య తో  మాట్లాడటం మొదలు పెట్టాడు విజయ్ , చెప్పు శరభయ్య వూరి జనం వెళ్ళిపోయారు , ఇంక నోరు తెరచి జరిగింది క్లియర్ గా చెప్పు  అన్నాడు , విజయ్ వైపు చూస్తూ ఆ మరిడయ్య    వెళ్ళే  ముందు  మళ్ళీ అమావాస్య కు వస్తానని , ఇంట్లో మూడో మనిషి లేకుండా చూడమని చెప్పాడు , ఇదంతా నిన్ననే చెప్పావ్  తరువాత ఏమయిందో చెప్పు అన్నాడు విజయ్ , వీడే కదా మళ్ళీ ఎప్పుడు కలిశాడు మరిడయ్య అని అడిగాడు ఇప్పుడు చెప్తుంటే ఇలా అరుస్తున్నాడు అని మనసులో అనుకున్నాడు , పైకి మాత్రం అదే sir చెప్తున్నా  తరువాత వచ్చిన అమావావస్య కి మా ఆవిడను పుట్టింటికి పంపిచా , అమావాస్య రోజు మరిడయ్య   వచ్చాడు ,    బయట వాళ్ళు చూడకుండా  వాడిని ఇంట్లో దాచా , అర్ధరాత్రి అయ్యాక బావి దగ్గర ఏవేవో పూజలు చేశాడు ,  బావి ముందు ఒక ముగ్గు గీసి దానిలో వాడు తెచ్చిన బొమ్మ ఒకటి పెట్టాడు  , ఏవేవో మంత్రాలు చదివి   వాడి సంచి లో నుండి ఒక కోడి ని తీసి నా కళ్ల ముందే దాని మెడ కోసి  దాని రక్తం   ఆ బొమ్మ మీద పోశాడు ,  ఒక నాలుగు  గంటల తర్వాత పూజ ఆపాడు నా వైపు చూసి  నీ ఇంట్లో ఒక గదిలో ఈ బొమ్మను పెట్టాలి ఆ గదిలోకి ఎవరూ వెళ్లకూడదని చెప్పాడు సరే అని ఒక గది ని చూపించాను , ఆ గదిలో ముగ్గు వేసి మధ్యలో ఆ బొమ్మను పెట్టి ముగ్గు చుట్టు నిమ్మకాయలు పెట్టాడు తరువాత మళ్ళీ ఒక గంట పూజ లేవో చేశాడు ఆ బొమ్మ కి , మళ్ళీ ఒక గంట జ్ఞానం చేస్తున్నట్టు  కళ్ళు మూసుకుని కూర్చున్నాడు , ఇదంతా అయ్యేసరికి తెల్లవారు జాము అయ్యింది , మరిడయ్య గది బయటకు వచ్చి తన సంచి లో నుండి ఒక తాళం తీసి ఆ గదికి వేసాడు , తాళం చెవి కూడా తన దగ్గరే పెట్టుకున్నాడు , ఆ బావి లో శక్తి ని ఈ బొమ్మ లో ప్రతిష్టించా అని దానిని వశం చేకుంటే నిధి దొరుకుతుంది అన్నాడు , దానికి ఇంకా సమయం పడుతుందని ఆ శక్తి శాంతించే వరకు దానికి ఇలా పూజలు చేయాలి అని ఆ పూజలు ప్రతి అమావాస్య కి చేయాలి అని చెప్పాడు , తరువాత రోజు ఎవరూ చూడకుండా ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయాడు , నా భార్య రాక ముందే ఆ బావి దగ్గర శుభ్రం చేశాను అని చెప్పటం ఆపి sir కొంచెం నీళ్ళు  అని అడిగాడు భయపడుతూనే , పక్కన ఉన్న కానిస్టేబుల్ ని చూసి నీళ్ళు తెచ్చి ఇవ్వు అన్నట్టు సైగ చేసాడు , బయట నుండి సెల్ లోకి వచ్చిన రాఘవరావు  sir  , క్లూస్ టీమ్ వచ్చారు శరభయ్య ఇంట్లో ఫింగర్ ప్రింట్స్ తీసుకోవాలి అన్నారు కదా అన్నాడు విజయ్ తో, సరే  రాఘవయ్య గారు జీప్ తీయండి మనం కూడా వెళదాం అన్నాడు విజయ్ .
రాఘవులు , విజయ్ శరభయ్య ఇంటికి చేరుకున్నారు , ముందు సారి అక్కడకు వెళ్ళినప్పుడు ఇల్లు అంతా  వెతక టానికి వీలు పడలేదు బాబుని తీసుకొని వెళ్ళి పోయాడు  , ఆ బాబుని చూసిన పరిసరాలు కూడా పూర్తిగా చూడలేదు , ఇప్పుడు అంతా వెతికి ఏవయినా క్లూస్ దొరుకుతాయేమో  అని వెతుకుతున్నాడు , అంతే కాదు శరభయ్య చెప్పేది నిజమో కాదో కూడా తెలీదు , లేని ఒక పాత్ర ను స్రుష్టిస్తున్నాడా లేదా నిజమే చెప్తున్నాడో  తెలీదు , అందుకే ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకుంటే తెలుస్తుంది అనుకున్నాడు , ఆ రూం లో బ్లడ్  samples ఇంకా ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేస్తున్నారు  క్లూస్ టీం , ఇంకొక డౌట్ కూడా ఉంది విజయ్ కి అసలు ఆ శరభయ్య భార్య ది హత్య , లేదంటే ఆత్మ హత్య అని, ఇంట్లో ఒక పక్క ఖాళీగా పడి ఉన్న కిరసనాయిలు డబ్బా మీద కూడా ఫింగర్ ప్రింట్స్ తీసుకొమ్మని చెప్పాడు విజయ్ క్లూస్ టీమ్ కి,  మొత్తం వెతుకుతూ పెరట్లో కి వెళ్ళాడు విజయ్ , పెరట్లో ఆకులు వూడ్చిన చెత్త కుప్పగా పోసి ఉంది విజయ్ అటు ఇటు చూసి కింద నుండి ఒక కర్ర పుల్ల చేత్తో తీసుకుని కుప్పలా పడి వున్న ఆకులను అటు ఇటు కదిపాడు , కర్రకు ఏదో గట్టిగా తగిలినట్టు  అనిపించింది,  పైన ఉన్న ఆకుల్ని జరిపి గ్లౌస్ వేసుకున్న చేతితో అక్కడ వున్న వస్తువుని చేతిలోకి తీసుకున్నాడు , అది ఒక   చిన్న   ఇనుప రాడ్   కొబ్బరికాయ పగల కొట్టడానికి  ఉపయోగించే రాడ్ అది,   దానికి కొంచెం బ్లడ్ అంటుకొని కనిపించింది పిల్లాడిని దీనితోనే  కొట్టారని  అనుకొని దానిని క్లూస్ టీమ్ కి ఇచ్చాడు దాని మీద ఫింగర్ ప్రింట్స్ ఎవరివో తెలిస్తే  పిల్లాడిని ఎవరు కొట్టరో ఖచ్చితంగా తెలుస్తుంది అనుకున్నాడు , ఇంకా ఏమయినా ఆధారాలు దొరుకుతాఏమో అని ఆ చుట్టు పక్కల వెతుకుతున్నాడు విజయ్ పెద్దగా  ఉన్న ఆ పెరటి లో ఒక మూలగా బావి కనిపించింది  , ఓ ఈ బావి గురించే కదా వాడు చెప్పింది అనుకొని ఆ బావి దగ్గరకు వెళ్ళి చుట్టు పక్కల   వెతకటం మొదలు పెట్టాడు  బావికి కొంచెం దూరం లో మరో చెత్త కుప్ప లాగ కనిపించింది కానీ అది ఇందాక చూసినట్టు ఆకుల తో లేదు , కొంచెం దగ్గరకు వెళ్లి చూస్తే అది ఒక బూడిద కుప్ప లాగా ఉంది .