Read Truth - 16 by Rajani in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
  • మనసిచ్చి చూడు - 5

                                    మనసిచ్చి చూడు - 05గౌతమ్ సడన్...

  • నిరుపమ - 5

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • ధర్మ- వీర - 6

    వీర :- "నీకు ఏప్పట్నుంచి తెల్సు?"ధర్మ :- "నాకు మొదటినుంచి తె...

  • అరె ఏమైందీ? - 18

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • మనసిచ్చి చూడు - 4

    మనసిచ్చి చూడు - 04హలో ఎవరు.... ️ అవతల మాట్లాడకపోయే సరికి ఎవర...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

నిజం - 16

విజయ్ మొహం లో కోపం గమనించిన రాఘవులు ఏమయింది sir అంత కోపం ఉన్నారు అని అడిగాడు , అసలు ఆ శరభయ్య నిజం చెప్తున్నాడా లేదంటే కావాలని దొంగ ఏడుపులు ఏడుస్తూ అబద్దం చెప్తున్నాడా తెలీడం లేదు రాఘవులు గారు , వాడు చెప్పే మరిడయ్య అనే వాడు ఉన్నాడో లేడో అర్జెంట్ గా తెలుసుకోవాలి , ముందు వాడు చెప్పేది విని తరువాత ఏం చేయాలో ఆలోచించండి sir , అది విన్నాక ఏదన్నా క్లారిటీ వస్తుంది ఏమో చూడొచ్చు అన్నాడు రాఘవులు, అవును హాస్పిటల్ లో బాబు మీద మర్డర్ అటెంప్ట్ కూడా జరిగింది అంటే ఏదో జరుగుతుంది అని ఒక నిమిషం ఆలోచించి మీరు ఒక పని చేయండి రాఘవులు గారు బాబు మిస్ అయిన ముందు రోజు ఈ వూరిలో ఎవరయినా ఒక హిజ్రా ని చూసారా ఎంక్వైరీ చేయండి, మీరు ఒక వైపు వెళ్ళి , మరో రెండు areas కి మరో ఇద్దరు కానిస్టేబుల్స్ ని పంపండి , వాడు వచ్చుంటే వూరిలో ఒక్కడైనా చూసి ఉండాలి కదా , ముందు వూరి బస్ స్టాప్ ముందు ఉన్న టీ కొట్టు లో కనుక్కోండి , విషయం తెలీగానే నాకు inform చేయండి అని ఒక టీ తాగి మళ్ళీ శరభయ్య దగ్గరికి వెళ్ళాడు విజయ్ , శరభయ్య ని చూడగానే కొట్టాలన్నంత కోపం వచ్చింది శరభయ్య కి , కానీ తను ఏం చెప్తాడో చూసి మొత్తం విన్నాక అప్పుడు ఏం చేయాలో చూద్దాం అనుకొని శరభయ్య చెప్పు మిగిలిన స్టోరీ అన్నాడు , స్టోరీ నా అన్నాడు శరభయ్య అర్థం కానట్టు , అదే ఆరోజు తర్వాత ఏం జరిగిందో చెప్పు అన్నాడు విజయ్, స్టోరీ కాదు sir నిజంగా జరిగింది , అప్పటి వరకు నేను నిధి కి ఆశ పడి అదంతా చేసింది నిజమే , కానీ అప్పటి నుండి చేసింది మాత్రం ప్రాణ భయం తోనే అని చెప్తూ గజ గజ వణికి పోతున్నాడు దేనికి శరభయ్య భయపడు తున్నాడో విజయ్ అర్థం కాలేదు , నువ్వు ఏం చెప్తున్నావో సరిగా అర్థం అయ్యేటట్లు చెప్పు శరభయ్య అడిగాడు విజయ్ , చెప్తాను sir అంటూ మళ్ళీ చెప్పటం మొదలు పెట్టాడు శరభయ్య ఆ రోజు మరిడయ్య వెళ్ళిపోయాక రాత్రి ఇంట్లో ఒక్కడినే ఉన్నాను , మరిడయ్య బొమ్మను పెట్టి పూజ చేసిన గది లో నుండీ ఏవో వింత శబ్దాలు రావడం మొదలు అయ్యాయి , ఏంటో చూద్దాం అని ఆ గది లోపలికి వెళ్ళాను అని చెప్తుంటే ఆపి ఆ గది తాళాలు మరిడయ్య దగ్గర ఉన్నాయని చెప్పావు కదా ఇప్పుడు మరి గది ఓపెన్ చేశాను అంటున్నావు ఎలా అని అడిగాడు విజయ్, చెప్పాను కదా sir పిల్లాడిని గదిలో దాయాలి అని చెప్పాడు అని అప్పుడే తాళం చెవి తీసి నా చేతికిచ్చాడు చెప్పాడు శరభయ్య , ఇది ముందు ఎందుకు చెప్పలేదు అడిగాడు విజయ్ , sir కంగారులో మరచి పోయినట్టున్నా అన్నాడు శరభయ్య ,క్లియర్ చెప్పమని చెప్పా కదా చిన్న డీటైల్స్ కూడా మిస్ చేయకుండా సరిగా చెప్పు అన్నాడు విజయ్ గంభీరంగా, నేను ఆ గదిలోకి వెళ్ళగానే ఆ చప్పుడు ఎక్కువయ్యింది నాకు రక్తం కావాలి నీ రక్తం తాగేస్తా అంటూ కేకలు వినిపించాయి , భయం తో ఒక్క ఉదుటున బయటకు వచ్చేసి గదికి తాళం వేసేసా , అయినా ఆ అరుపులు మాత్రం తగ్గలేదు , ఒక్కడినే బిక్కు బిక్కు మని గది బయటే కూర్చుండిపోయాను కాసేపు , తెల్ల వారు జాము వరకు ఆ అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి అన్నాడు శరభయ్య ,మరి పక్కింటి వాళ్ళ కు ఎవరికీ ఆ శబ్దాలు వినిపించలేదా అడిగాడు విజయ్.మాది పెద్ద స్థలం కదా పైగా అటు ఇటు రెండు వైపులా ఖాళీ స్థలం ఉంది , మా ఇంటి నుండి వేరే వాళ్లకు శబ్దం వెళ్ళడం కష్టమే అన్నాడు శరభయ్య , నీకు అంత భయం అనిపిస్తే బయటకు వెళ్లి ఎవరినీ పిలవలేదు ఎందుకు అడిగాడు విజయ్ , అమ్మో ఇంకేమైనా ఉందా నా ఇంట్లో ఇలాంటి పూజలు జరిగాయి అని తెలిస్తే నన్ను తన్ని వూరి నుండి వెలి వేసేవాళ్లు , అందుకే ఇంట్లో ఉన్న ఆ రాక్షసి నుండి తప్పించుకోవటానికి. మరిడయ్య మాట వినడం తప్ప వేరే దారి దొరకలేదు అన్నాడు నిట్టూరిస్తూ శరభయ్య , మళ్ళీ మరిడయ్య నీ దగ్గరికి రాలేదు అని చెప్పావ్ కదా, మరి ఏం చేయాలి అని నీకెలా చెప్పాడు అని అడిగాడు విజయ్ , ఆ రోజు మధ్యాహ్నం నాకొక ఫోన్ కాల్ వచ్చింది తీసి మాట్లాడను అది మరిడయ్య గొంతు , నేను మరిడయ్య ని అన్నాడు ఫోన్ లో, నేను ఆశ్చర్య పోయాను , నా ఫోన్ నంబరు మరిడయ్య ఎప్పుడూ అడగలేదు నేను ఇవ్వలేదు , నా నంబరు నీకెలా తెలుసు అని అడిగాను , దానికి మరిడయ్య నవ్వి నీ గురించి అన్నీ తెలిసిన నాకు ఇది తెలుసుకోవడం లో కష్టం ఏముంది అన్నాడు , నన్ను ఈ వూబిలోకి దించి నందుకు ఒకవైపు వాడి మీద కోపంగా ఉంది , మరో పక్క దీని నుండి ఎలాగయినా తప్పించు కోవాలి అనే కంగారు ఉంది , అందుకే కిందటి రాత్రి జరిగింది అంతా ఆ మరిడయ్య కి చెప్పాను , అయితే నువ్వు ఈ పూజ ను ఆపమని చెప్పింది ఆ శక్తి వినేసింది , దానిని అనవసరం గా నువ్వే రెచ్చ గొట్టావు ఇప్పుడు దానిని శాంతింప చేయడానికి రెండు పూజలు చేయాలి అన్నాడు మరిడయ్య , నాకు భయం తో నోట మాట రాలేదు మరిడయ్య చెప్పేది వింటూ వున్నా ఫోన్ లో నుండి , అసలే ఇంట్లో ఒక్కడినే వున్నానేమో చాలా భయం వేసింది sir అని చెప్పాడు శరభయ్య , ఈ లోగా స్టేషన్ లో ఫోన్ రింగ్ అయింది ,ఒక కానిస్టేబుల్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి విజయ్ దగ్గరకు వచ్చాడు , ఎవరు ఫోన్ లో అని అడిగాడు విజయ్ , sir స్కెచ్ వేయడానికి ఆర్టిస్ట్ వస్తున్నారు ఒక 10 మినిట్స్ లో బస్ స్టాప్ కి చేరుకుంటాను అని చెప్పారు ఇప్పుడు బస్ లో ఉన్నారట , చెప్పాడు కానిస్టేబుల్ , ఓకే 10 మినిట్స్ లొ బస్ స్టాండ్ కి జీప్ తీసుకు వెళ్ళు, అతన్ని స్టేషన్ కి తీసుకురా అని చెప్పాడు విజయ్ . ఓకే sir అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు కానిస్టేబుల్ , ఈ లోగా విజయ్ ఫోన్ రింగ్ అయ్యింది ఫోన్ లో అటు నుండి రాఘవులు sir ఇక్కడ ఆ రోజు హిజ్రా ని ఎవరూ చూడలేదు అంటున్నారు , మరో విషయం మధ్యాహ్నం టైం లో ఈ బస్ స్టాప్ దగ్గర టీ కొట్టు మూసి ఉంటుంది , ఆ రోజు కూడా మూసే ఉందంట sir , అన్నాడు రాఘవులు , సరే రాఘవులు గారు స్కెచ్ ఆర్టిస్ట్ on the way ఉన్నారట , ఆ స్కెచ్ చూపించి ఎంక్వైరీ చేయొచ్చు మీరు స్టేషన్ కి వచ్చేయండి అని ఫోన్ పెట్టేసాడు విజయ్ , శరభయ్య నువ్వు చెప్పు త్వరగా అన్నాడు విజయ్ శరభయ్య ని చూసి, శరభయ్య చెప్పటం మొదలు పెట్టాడు మళ్ళీ , మరిడయ్య తను రాత్రికి స్మశానం లో పూజ చేయాలని ఈ లోపు నన్ను బాబుని గది లో దాచి పెట్టమని తను పూజ ముగుంచు కుని వస్తాను అని చెప్పాడు, ఆ మరిడయ్య వస్తాడని నమ్మకం తో పిల్లాడిని దాచి పెట్టాను అని చెప్పి మళ్ళీ ఏడవడం మొదలు పెట్టాడు శరభయ్య , విజయ్ కి ఓపిక నసిస్తోంది తల పట్టుకొని చికాకు పడుతు ముందు చెప్పి తరువాత ఏడువు అన్నాడు కోపంగా , విజయ్ అరుపుకి ఉలిక్కి పడి , మాట్లాడటం మొదలు పెట్టాడు శరభయ్య , ఆ రోజు సంపత్ ఒక్కడే ఇంటికి వెళుతున్నాడు వాడిని రోజు లాగానే పిలిచే సరికి వచ్చాడు కానీ ఆరోజు ఎవరూ చూడకుండా ఇంట్లోకి తీసుకెళ్ళి కూర్చోపెట్టి మరిడయ్య నాకిచ్చిన ప్రసాదం ఇచ్చాను , అది తినగానే పిల్లాడు సృహ తప్పాడు , వెంటనే వాడిని కట్టేసి గదిలో దాచాను అన్నాడు శరభయ్య , మ్ తర్వాత మొహం చిట్లించి చూస్తూ అన్నాడు విజయ్ , తర్వాత అని భయపడుతూ చెప్పాడు శరభయ్య , మరిడయ్య వస్తాడని ఎదురు చూస్తూ కూర్చున్నాను వూరి జనం చేస్తున్న గోల వినిపిస్తూనే ఉంది బయటి నుండి బాబు కనిపించటం లేదని తిరుగుతూ నే ఉన్నారు వూరంతా , ఆ టైమ్ లో మరిడయ్య వస్తే దొరికి పోతాడు ఎలా అని ఆలోచిస్తూ కూర్చున్నా , ఈ లోపు ఆ బొమ్మ నుండి మళ్ళీ గోల మొదలయ్యింది , ఏం చేయాలో అర్థం కాలేదు అని చెబుతుంటే మధ్యలో విజయ్ ఆపి ఆ మరిడయ్య నీకు ఫోన్ చేసిన నంబర్ కి నువ్వు తిరిగి కాల్ చేయలేదా అడిగాడు , దానికి శరభయ్య సమాధానం ఇస్తూ నాది ఏదో పాతకాలం లాండ్ లైన్ sir ఇన్ కమింగ్ కాల్స్ కనపడవు నేను మరిడయ్య ని నంబర్ అడిగితే అవసరం అయితే నేనే కాల్ చేస్తాను , నువ్వు పూజ మధ్యలో కాల్ చేస్తే నాకు ఇబ్బంది అవుతుంది , అది మన ఇద్దరి ప్రాణాలకు ప్రమాదం అని చెప్పాడు , అందుకే చేసేది ఏమి లేక అలానే ఉండిపోయాను అని చెప్పాడు శరభయ్య .