కళ్ళు తెరిచేసరికి చుట్టూ చీకటి దూరంగా మనవడి రూపం లీలగా కనిపించింది , కుర్చీలో నుండి లేచి నిదానంగా తన మనవడు కనిపించిన వైపు నడుస్తూ వెళ్ళాడు,  తాతయ్యా  హెల్ప్ తాతయ్య  హెల్ప్ అంటూ మనవడు అరుస్తూ కనిపిస్తున్నాడు , బాబు వస్తున్నా అంటూ హడావుడిగా పరిగెత్తాడు రామారావు, రామారావు అరుపులకు  లేచిన వీరయ్య  రామారావు ని చూసి  కంగారుగా వెళ్లి అయ్యా ,అయ్యా అంటూ రామారావు ని పట్టుకున్నాడు , రామారావు వీరయ్య ని  చూసి వీరయ్యా ,వీరయ్యా అడుగో సంపత్ బాబు, వెలిపోతున్నడు, వాడు అన్నం తినకుండా మారాం  చేసి  పరిగెడుతున్న ప్రతి సారీ    నువ్వే కదరా  పట్టుకుంటావు   వెళ్లి వాడిని తీసుకురా అన్నాడు  కంగారుగా , అయ్యా  అక్కడ ఎవరూ లేరు అయ్యా ,మీరు బాబు గురించే ఆలోచస్తున్నారు అందుకే అలా అనిపిస్తుంది ,రండయ్యా  అంటూ తీసుకొచ్చి కుర్చీలో కూర్చోపెట్టాడు వీరయ్య. బయట నుండి వచ్చిన అలికిడికి గంగ, విద్య అక్కడకు  వచ్చారు , వీరయ్య వాళ్లకు జరిగింది చెప్పి లోపలికి వెళ్లి  ఒక గ్లాస్ తో మంచినీళ్ళు తెచ్చి , అయ్యా కొంచం తాగండి అంటూ బలవంతం గా తాగించాడు.ముగ్గురు కలసి రామారావు ని లోపలికి తీసుకువెళ్ళారు. 
ఉదయం 6గంటలకు అయింది, ఊరి జనం అంతా రామారావు ఇంటి ముందు నిలబడ్డారు , విద్య కూడా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది,  పిల్లాడిని వెతకటానికి వెళ్లిన  మోహన్  ఇంకా మిగిలిన వాళ్ళ కోసం  అందరూ ఎదురు చూస్తున్నారు , అప్పుడే అక్కడకు చేరుకున్నారు మోహన్ వాళ్ళు , వాళ్ల కు పిల్లాడు దొరకలేదు , మోహన్ కి ఇంట్లోకి వెళ్ళే ధైర్యం  లేదు ,తను వెళ్ళేటప్పుడు  బాబును తీసుకొనే వస్తా అని తన భార్యకు మాట ఇచ్చి వెళ్ళాడు ,ఇప్పడు తనకి  మొహం ఎలా చూపించను ,తనని అసలు ఎలా సముదాయించాలి , ఈ వసయులో  తన తల్లి , తండ్రులు  మనవడు కనిపించకుండా పోతే ఎలా తట్టుకోగలరు , బాబు నవ్వులతో  సందడిగా ఉండే ఇల్లు  ఇప్పుడు బోసిగా ఉంది ఇంటిని అలా చూడటం తన వల్ల కాదు ,ఇలా తనలో తానే ఆలోచిస్తూ  బయటే నిల్చొని మధనపడుతూ ఉన్నాడు మోహన్.
మోహన్ ని గమనించిన గంగ తన అన్న పరిస్థితి అర్థం చేసుకొని  బయటకి వచ్చి  మోహన్ ని లోపలికి తీసుకు వెళ్ళింది, మోహన్ ని పట్టుకొని ఏడ్చేసింది గంగ. కాసేపటికి తేరుకుంది గంగ , ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్య  అని అడిగింది మోహన్ ని, తెలియడం లేదు రా  ఇందాక  రాఘవులు uncle ఫోన్ చేశారు కొత్త S.I వస్తున్నారట , ఆయన తో కలసి వూళ్ళో  enquiry  start  చేస్తామన్నారు అన్నాడు మోహన్ కళ్ళ నిండా నీళ్లతో , సరే అన్నయ్య  , వదిన గదిలో ఉంది నువ్వు వెళ్లి తన పక్కనుండు అని మోహన్ ని room లోకి పంపింది.
మరో వైపు :
రాఘవులు రెడీ అవుతు క్లాక్ వైపు చూసాడు ,7 గంటలయింది ,కనకం బస్ వచ్చే టైం అయింది నేను బయలు దేరతాను అంటూ లాఠీ, cap తీసుకొని బయలుదేరాడు రాఘవులు , ఏవండీ అబ్బాయికి ఫోన్ చేశారా అడిగింది భార్య కనకం , నాకిప్పుడు టైం లేదు నువ్వే ఫోన్ చేసి విషయం చెప్పు వాడికి, వీలయినంత త్వరగా వూరికి రమ్మను అన్నాడు భార్య కనకం తో, సర్లే0డి  నేను ఫోన్ చేస్తా ,కానీ వాడు వచ్చి మాత్రం ఏం చేస్తాడు  మీరంతా ఉన్నారుగా  పైగా వాడికి శలవు దొరకొద్ద అంది నిదానంగా కనకం , ఎక్కడ  తన భర్త  తనను తప్పుగా అనుకుంటాడో అని భయపడుతూ ,  అందుకు రాఘవులు   చిన్నగా నిట్టూ రిస్తూ  , చూడు కనకం  మన అనుకున్న వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు పక్కన లేక పోయినా పర్లేదు కానీ బాధలో ఉన్నప్పుడు  తప్పకుండా పక్కన ఉండాలి, అసలు రామారావు గారి వల్లే కదా ఇప్పుడు ఆ సాఫ్టువేర్ job చేస్తున్నాడు సాగర్ , ఆయన సమయానికి సాయం చేయబట్టే కదా వాడు ఏ ఆటంకం లేకుండా చదువు పూర్తి చేశాడు , మనవాడు మోహన్ చాలా స్నేహంగా ఉంటారు కదా ఇలాంటి సమయం లో పక్కన ఉండాల్సిన భాధ్యత వాడికి ఉంటుంది కదా అన్నాడు రాఘవులు, అవునండీ నేనిదంతా ఆలోచించలేదు , మీరంతా వెతుకుతున్నారు కదా అనే అనుకున్నా  ,మీరు వెళ్ళిరండి నేను అబ్బాయికి ఫోన్ చేస్తాను అంది కనకం. సరే నాకు లేట్ అవుతుంది మరి వెళ్ళొస్తా  అని తన wrist watch చూసుకొని గబ,గబ అడుగులు బయటకు వేశాడు రాఘవులు.  రాఘవులు బస్టాండ్ కి వెళ్ళిన కాసేపటికి హైదరాబాద్ బస్ వచ్చింది . బస్ లో నుండి ఒక వ్యక్తి  దిగాడు తెల్లటి మేని ఛాయ, 6అడుగుల ఎత్తు, సిక్స్ ప్యాక్ బాడీ తో  అచ్చం సినిమా హీరో లా ఉన్నాడు ఆ వ్యక్తి , అతన్ని చూసిన రాఘవులు ఇతను చూస్తే హీరో లా ఉన్నాడు ,కొత్తగా  వచ్చిన S.I ఇతనా కాదా అని ఆలోచిస్తూనే  దగ్గరకు వెళ్ళి sir కొత్తగా వచ్చిన S.I  అంటూ వుండగానే,అతను నవ్వుతూ  హలో రాఘవులు గారు నేనే కొత్తగా వచ్చిన S.I ,  my name is vijay అని పరిచయం చేసుకున్నాడు విజయ్. హలో సర్ వెల్కమ్ టు రాయవరం ,ఇంతకీ నా పేరు ఎలా తెలుసు sir మీకు అడిగాడు రాఘవులు ఆశ్చర్యంగా . మీ డ్రెస్ మీద name plate పైన చూసి చెప్పా అన్నాడు నవ్వుతూ. పదండి sir క్వార్టర్స్ కి తీసుకెళతా ఫ్రెష్  అవుదురు గానీ అన్నాడు రాఘవులు జీప్ వైపు తీసుకెళుతు , రాఘవులు ని గమనిస్తున్న  విజయ్  , ఏంటి రాఘవులు గారు ఏదో టెన్షన్ ఉన్నట్టున్నారు , పల్లెల్లో ఈ టైం లో హడావుడిగా  వుంటారు కదా ఇక్కడ ఏంటి పెద్దగా  జనం కూడా లేరు అసలు ఏం జరిగింది అడిగాడు . మీరు చాలా తెలివైన వాళ్ళ లా ఉన్నారు , చెప్పకుండానే సమస్య ఉందని అర్థం చేసుకున్నారు , నేను గత పదేళ్లుగా ఇక్కడే ఉంటున్నా sir , ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే వూరు ఎప్పుడూ ఏ సమస్యా లేదు కానీ నిన్న సాయంత్రం నుండి ఈ వూరి సర్పంచ్ రామారావు గారి మనవడు కనిపించట్లేదు sir , వూరి జనం అంతా వెతికారు , మన కానిస్టేబుల్స్ కూడా వెతికారు ,కానీ ఏమీ తెలియలేదు , అంతా చాలా కంగారుగా ఉన్నారు sir, వూరి జనం కూడా రామారావు గారి ఇంటి దగ్గరే ఉన్నారు, ఇప్పుడు మీరే ఏదయినా చేయగలరు అనిపిస్తుంది ,మీరే ఏదయినా చేయాలి sir అన్నాడు రాఘవులు బాధగా,  అంతా విన్న విజయ్  , సరే రాఘవులు గారు నేను ఫ్రెష్ అయి రాగానే ఆ సర్పంచ్ గారి ఇంటికి వెళదాం ఈలోగా నాకు case details రెడీ చేసి ఇవ్వండి అన్నాడు విజయ్ , sir నేను డీటైల్స్ అన్నీ రెడీ చేసి ఈ ఫైల్ లో పెట్టాను బాబు ఫోటో కూడా ఈ ఫైల్ లోనే వుంది అన్నాడు రాఘవులు.